నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్పీఎఫ్లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.
మిత్రులారా!ప్రతి ఏడాది జనవరి 25వ తేదీ కోసం వేచి చూస్తానని డెహ్రాడూన్‌కు చెందిన వత్సల్ గారు రాశారు. ఆ రోజు పద్మ అవార్డుల ప్రకటన రావడంతో పాటు 25వ తేదీ సాయంత్రమే జనవరి 26వ తేదీ ఉత్సవాల కోసం తన ఉత్సాహాన్ని పెంచుతుందని వత్సల్ తన అభిప్రాయం తెలిపారు. అట్టడుగు స్థాయిలో తమ అంకితభావం, సేవాభావంతో విజయం సాధించిన వారికి పీపుల్స్ పద్మ అవార్డుల ప్రదానంపై పలువురు తమ భావాలను పంచుకున్నారు. ఆదివాసీ సమాజంతోనూ ఆదివాసీ జీవితాల తోనూ ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈసారి పద్మ అవార్డుల్లో మంచి ప్రాతినిధ్యం లభించింది. ఆదివాసీల జీవితం నగరాల సందడికి విభిన్నంగా ఉంటుంది. వారి సవాళ్లు కూడా వేరు. అయినప్పటికీ ఆదివాసీ సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయిఆదివాసీ సముదాయాలకు సంబంధించిన విషయాలను పరిరక్షించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదేవిధంగాటోటో, హో, కుయి, కువి, మాండ మొదలైన ఆదివాసీ భాషలపై కృషి చేసిన ఎందరో మహానుభావులు పద్మ అవార్డులు అందుకున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. ధనిరామ్ టోటోగారు, జనుమ్ సింగ్ సోయ్గారు, బి. రామకృష్ణారెడ్డిగారు- ఈ పేర్లు ఇప్పుడు దేశం మొత్తం సుపరిచితమయ్యాయి. సిద్ధి, జారవా, ఒంగే వంటి ఆదివాసీ సమాజాలతో కలిసి పనిచేస్తున్న వారిని కూడా ఈసారి సత్కరించారు. వారిలో హీరాబాయి లోబీ గారు, రతన్ చంద్ర కార్ గారు, ఈశ్వర్ చంద్ర వర్మగారు ఉన్నారు. గిరిజన సమాజాలు మన భూమి, మన వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయి. దేశాభివృద్ధి, సమాజ అభివృద్ధిలో వారి సహకారం చాలా ముఖ్యమైంది. తమ కోసం పనిచేసిన వ్యక్తులను సన్మానించడం కొత్త తరానికి కూడా స్ఫూర్తినిస్తుంది.నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దారితప్పిన యువకులకు సరైన మార్గాన్ని చూపిన వారి కృషికి కూడా పద్మ అవార్డులు లభించాయి. ఇందుకు గాను కంకేర్‌లో శిల్పాలను చెక్కిన అజయ్ కుమార్ మాండవి గారు, గడ్చిరోలిలోని ప్రసిద్ధ ఝడిపట్టి రంగభూమికి సంబంధించిన పరశురామ్ కోమాజీ ఖుణే కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలో తమ సంస్కృతి పరిరక్షణలో పాలుపంచుకుంటున్న రామ్‌కుయి వాంగ్‌బే నియుమే, బిక్రమ్ బహదూర్ జమాతియా, కర్మ వాంగ్చులను కూడా సత్కరించారు.
మిత్రులారా!ఈసారి పద్మ అవార్డులతో సత్కరించిన వారిలో సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు! సంగీతంలో ప్రతి ఒక్కరి ఇష్టాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సంగీతం ఒక భాగం. ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో మన సంప్రదాయ సంగీత వాయిద్యాలైన సంతూర్, బంహుం, ద్వితారా వంటి వాటి మాధుర్యాన్ని వ్యాప్తి చేయడంలో నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు.గులామ్ మహ్మద్ జాజ్, మోవా సు-పోంగ్, రి-సింగ్‌బోర్ కుర్కా-లాంగ్, ముని-వెంకటప్ప, మంగళ్ కాంతి రాయ్ వంటి వారి పేర్లు నలుదిశలా చర్చనీయాంశాలయ్యాయి.
మిత్రులారా!చాలా మంది పద్మ అవార్డు గ్రహీతలు మన మధ్య ఉన్న స్నేహితులు. వారు ఎల్లప్పుడూ దేశాన్ని సర్వోత్తమంగా ఉంచారు. దేశానికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాలను అంకితం చేశారు. వారుసేవాభావంతో తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతిఫలం ఆశించలేదు. తమ పనికి లక్ష్యంగా ఉన్నవారి ముఖాల్లో సంతృప్తి వారికి అతిపెద్ద అవార్డు.అటువంటి అంకితభావం ఉన్న వ్యక్తులను సత్కరించడం ద్వారా మన దేశ ప్రజల గౌరవం పెరిగింది. నేను ఇక్కడ పద్మ అవార్డు గ్రహీతలందరి పేర్లను చెప్పలేకపోవచ్చు. అయితే ఈ పద్మ అవార్డు గ్రహీతల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాల గురించి వివరంగా తెలుసుకోవాలని, ఇతరులకు కూడా తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి చర్చిస్తున్నప్పుడునేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ప్రస్తావిస్తాను. కొన్ని వారాల క్రితం నాకు లభించిన ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ పుస్తకం పేరు ‘ఇండియా- ద మదర్ ఆఫ్ డెమొక్రసీ’. ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా భావించడం భారతీయులమైన మనం గర్వించే విషయం. ప్రజాస్వామ్యం మన నరనరాల్లో ఉంది. మన సంస్కృతిలో ఉంది. శతాబ్దాలుగా మన కార్యకలాపాల్లో అంతర్భాగంగా ఉంది. స్వభావరీత్యా మనది ప్రజాస్వామిక సమాజం. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ భిక్షువుల సంఘాన్ని భారత పార్లమెంటుతో పోల్చారు. ప్రతిపాదనలు, నిర్ణయాలు, సమావేశ నిర్వహణకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య, ఓటింగ్, ఓట్ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థగా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థల నుండి ప్రేరణ పొందాడని బాబాసాహెబ్ అభిప్రాయం.
చిన్నదైనా ప్రసిద్ధి చెందిన ఉతిర్మేరూర్ అనే ఒక ఊరు తమిళనాడులోఉంది. అక్కడ 1100-1200 సంవత్సరాల క్రితం నాటి శాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ శాసనం మినీ రాజ్యాంగం లాంటిది. గ్రామసభను ఎలా నిర్వహించాలి, సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణ 12వ శతాబ్దపు బసవేశ్వర స్వామి అనుభవ మండపం. ఇక్కడ స్వేచ్చాయుత వాదోపవాదాలను, చర్చలను ప్రోత్సహించారు. ఇది మాగ్నా కార్టా కంటే పూర్వమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరంగల్‌లోని కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి ఉద్యమం పశ్చిమ భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచింది.సిక్కు మతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఒక వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో చేర్చారు. గురునానక్ దేవ్ జీ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. మధ్య భారతదేశంలోని ఒరాన్, ముండా తెగలలో సమాజ నిర్వహణపై, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ పుస్తకంలో చక్కటి సమాచారం ఉంది.శతాబ్దాలుగా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలా ప్రవహిస్తోందో ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొనే భారతదేశ వాసులుగా మనం నిరంతరం ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి. చర్చించాలి. ప్రపంచానికి తెలియజేయాలి. ఇది దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!యోగా దినోత్సవానికి, వివిధ రకాల చిరు ముతక ధాన్యాలకు మధ్య పోలిక ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే, ఈ పోలిక ఏమిటి అని మీరు ఆలోచిస్తారు? ఈ రెండింటికీ చాలా పోలికలు ఉన్నాయని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి... భారతదేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటినీఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.రెండవది- యోగా ఆరోగ్యానికి సంబంధించింది. చిరుధాన్యాలు కూడా ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక మూడో విషయం ఏమిటంటే - రెండు ప్రచారాలలో ప్రజల భాగస్వామ్యం కారణంగా విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొనడం ద్వారా యోగా, ఫిట్నెస్లను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టే పెద్ద ఎత్తున చిరుధాన్యాలను కూడా దైనందిన జీవితంలో చేర్చుకుంటున్నారు.ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ మార్పు ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఒకవైపు సంప్రదాయబద్ధంగా చిరుధాన్యాలనుపండించే చిన్నకారు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు రైతు ఉత్పత్తి సంఘాలతో పాటు పారిశ్రామికవేత్తలు చిరుధాన్యాలను మార్కెట్ చేయడానికి, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన కె.వి. రామ సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల విషయంలో కృషి చేసేందుకు మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అమ్మ చేతితో చేసిన చిరుధాన్యాల రుచి చూసి ఆయన తన గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు వాటిని సులభంగా అందుబాటులో ఉంచుతారు. మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని కెనాడ్ గ్రామానికి చెందిన షర్మిలా ఓస్వాల్ గత 20 ఏళ్లుగా చిరుధాన్యాల ఉత్పత్తిలో తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. ఆమె రైతులకు నేర్పుగా వ్యవసాయం చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె కృషి వల్ల చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ని సందర్శించే అవకాశం మీకు లభిస్తేమీరు అక్కడి మిల్లెట్స్ కేఫ్‌ను తప్పక సందర్శించాలి. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ మిల్లెట్స్ కేఫ్‌లో చీలా, దోశ, మోమోస్, పిజ్జా, మంచూరియా వంటివి బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి.
నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగవచ్చా? మీరు ఎంటర్ ప్రెన్యూర్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ మీరు Milletpreneursఅనే పదం విన్నారా? ఈ రోజుల్లో ఒడిశాకు చెందిన మిల్లెట్‌ప్రెన్యూర్లు వెలుగులోకి వస్తున్నారు. ఆదివాసీ జిల్లా సుందర్‌గఢ్ కు చెందిన సుమారు 1500 మంది మహిళల స్వయం సహాయక బృందానికి ఒడిశా మిల్లెట్స్ మిషన్‌తో అనుబంధం ఉంది.ఇక్కడ మహిళలు చిరుధాన్యాల నుండి కుకీలు, రసగుల్లా, గులాబ్ జామూన్, కేక్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నారు. మార్కెట్లో వీరికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా మహిళల ఆదాయం కూడా పెరుగుతోంది.
కర్నాటకలోని కలబుర్గిలో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ పర్యవేక్షణలో అలంద్ భూతాయి మిల్లెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గత సంవత్సరం పని ప్రారంభించింది. ఇక్కడి ఖాక్రా, బిస్కెట్లు, లడ్డూలను ప్రజలు ఇష్టపడుతున్నారు. కర్నాటకలోని బీదర్ జిల్లాలో హుల్సూర్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన మహిళలు చిరుధాన్యాలను పండించడంతోపాటు వాటి పిండిని కూడా తయారు చేసుకుంటున్నారు.దీంతో వారి సంపాదన కూడా బాగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సందీప్ శర్మ గారికి ప్రాకృతిక వ్యవసాయంతో అనుబంధం ఉంది. ఆయనకు చెందిన రైతు ఉత్పత్తి సంస్థలో 12 రాష్ట్రాలకు చెందిన రైతులు చేరారు. బిలాస్‌పూర్‌కి చెందిన ఈ ఎఫ్పిఓ 8 రకాల చిరుధాన్యాల పిండిని, వాటితో వంటలను తయారు చేస్తోంది.
మిత్రులారా! ఈ రోజు జి-20 శిఖరాగ్ర సమావేశాలు భారతదేశంలోని ప్రతి మూలలో నిరంతరం జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి మూలలో జి-20శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగినా చిరుధాన్యాలతో చేసిన పుష్టికరమైన, రుచికరమైన వంటకాలు చేరుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.మార్కెట్లో తయారు చేసిన ఖిచ్డీ, పోహా, ఖీర్, రోటీ, రాగులతో చేసిన పాయసం, పూరీ , దోస వంటి వంటకాలు కూడా ఈ సమావేశాలు జరిగేచోట లభిస్తున్నాయి. ఆరోగ్య పానీయాలు, తృణధాన్యాలు,చిరుధాన్యాలతో తయారు చేసిన నూడుల్స్ అన్ని జి20 వేదికలలోని చిరుధాన్యాల ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లు కూడా వీటి ప్రజాదరణను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.దేశం చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచంలో చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ మన చిన్న రైతులకు బలం చేకూర్చబోతున్నాయని మీరు ఊహించవచ్చు. ఈ రోజు చిరుధాన్యాలతో తయారు చేయడం ప్రారంభించిన వివిధ రకాల కొత్త తినుబండారాలను యువతరం ఇష్టపడటం కూడా నాకు ఆనందంగా ఉంది.అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని ఇంత అద్భుతంగా ప్రారంభించినందుకు, దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నందుకు 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎవరైనా టూరిస్ట్ హబ్ గోవా గురించి మాట్లాడితే మీ మనసులో ఏం గుర్తొస్తుంది? గోవా పేరు వినగానే ముందుగా అందమైన తీరప్రాంతం, బీచులు, ఇష్టమైన ఆహార పదార్థాలు గుర్తుకు రావడం సహజం. అయితే ఈ నెలలో గోవాలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు 'మన్ కీ బాత్'లో నేను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.గోవాలో జరిగిన ఈ కార్యక్రమం పర్పుల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పనాజీలో జరిగింది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇదొక ప్రత్యేక ప్రయత్నం. పర్పుల్ ఫెస్ట్ ఎంత గొప్ప సందర్భమనే విషయాన్ని అందులో 50 వేల మందికి పైగా సోదర సోదరీమణులు పాల్గొన్నారనే వాస్తవాన్ని బట్టి మీరందరూ ఊహించవచ్చు.ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇప్పుడు 'మీరామార్ బీచ్'లో తిరగడాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలిగినందుకు పులకించిపోయారు. నిజానికి 'మీరామార్ బీచ్' దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు గోవాలో అందుబాటులో ఉండే బీచ్‌లలో ఒకటిగా మారింది. క్రికెట్ టోర్నమెంట్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, మారథాన్ పోటీలతో పాటుబధిర-అంధుల సమ్మేళనం కూడా ఇక్కడ జరిగింది. ప్రత్యేకమైన బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్‌తో పాటుఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దివ్యాంగ సోదర సోదరీమణులు, పిల్లలు పూర్తిస్థాయిలో ఆనందించేలా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. దేశంలోని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా ఉండడం పర్పుల్ ఫెస్ట్ లోని ఒక ప్రత్యేక విషయం. దివ్యాంగులు ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులను ప్రదర్శించారు. దివ్యాంగుల సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.పర్పుల్ ఫెస్ట్‌ని విజయవంతం చేసినందుకుఅందులో పాల్గొన్నవారందరికీ నా అభినందనలు. దీన్ని నిర్వహిచేందుకు పగలూ రాత్రీ ఏకం చేసిన వాలంటీర్లను కూడా నేను అభినందిస్తున్నాను. యాక్సెసబుల్ ఇండియా దృక్కోణాన్ని సాకారం చేయడంలో ఇటువంటి ప్రచారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!మీకు ఆనందం, గర్వం కలిగించడంతో పాటు మనసుకు సంతోషం కలిగించే విషయంపై ఇప్పుడు 'మన్ కీ బాత్'లోనేను మాట్లాడతాను. దాంతో మీ హృదయం ఆనందభరితం అవుతుంది. దేశంలోని పురాతన వైజ్ఞానిక సంస్థల్లో ఒకటైన బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISc-అద్భుతమైన ఉదాహరణను అందిస్తోంది.ఈ సంస్థ స్థాపన వెనుకఇద్దరు గొప్ప వ్యక్తులు- జంషెడ్జీ టాటా, స్వామి వివేకానందల ప్రేరణను 'మన్ కీ బాత్'లోనేను ఇంతకుముందు చర్చించాను. గత ఏడాది 2022లో ఈ సంస్థ పేరు మీద మొత్తం 145 పేటెంట్లు ఉండడం మీకు, నాకు ఆనందం, గర్వం కలిగించే విషయం. అంటే దీని అర్థం - ప్రతి ఐదు రోజులకు రెండు పేటెంట్లు. ఈ రికార్డు అద్భుతమైంది.ఈ విజయం సాధించిన IISc బృందాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. మిత్రులారా!ఈరోజు భారతదేశం ర్యాంకింగ్ పేటెంట్ ఫైలింగ్‌లో 7వ స్థానంలో, ట్రేడ్‌మార్క్‌లలో 5వ స్థానంలో ఉంది. పేటెంట్ల గురించి మాత్రమే మాట్లాడితేగత ఐదేళ్లలో సుమారు 50 శాతం పెరుగుదల ఉంది.గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కూడాభారతదేశం ర్యాంకింగ్ అద్భుతంగా మెరుగుపడింది. ఇప్పుడు అది 40వ స్థానానికి చేరుకుంది. 2015 లోగ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.భారతదేశంలో గత 11 సంవత్సరాలలో మొదటిసారిగాదేశీయ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ కంటే ఎక్కువగా కనిపించింది. ఇది భారతదేశంలో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.
మిత్రులారా! 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విజ్ఞానం అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. మన ఆవిష్కర్తలు, వారి పేటెంట్ల బలంతో భారతదేశం టెకేడ్ కల ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. దీంతోమనందరం ప్రపంచ స్థాయి సాంకేతికతను, మన దేశంలో తయారైన ఉత్పత్తుల నుండి పూర్తిగా లాభం పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! తెలంగాణకు చెందిన ఇంజనీరు విజయ్ గారి పోస్టునునేను నమో యాప్ లో చూశాను. ఇందులో విజయ్ గారు ఈ-వేస్ట్ గురించి రాశారు. దీని గురించి 'మన్ కీ బాత్'లో చర్చించమని విజయ్ గారు అభ్యర్థించారు. ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమంలో 'వేస్ట్ టు వెల్త్' అంటే 'చెత్త నుండి బంగారం’ గురించి మాట్లాడుకున్నాం. రండి- ఈ రోజుదీనికి సంబంధించిన ఈ-వేస్ట్ గురించి చర్చిద్దాం.
మిత్రులారా!ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలు సర్వసాధారణమైపోయాయి. దేశవ్యాప్తంగా వారి సంఖ్య బిలియన్లలో ఉంటుంది. నేటి ఆధునిక ఉపకరణాలు కూడా భవిష్యత్తులో ఇ-వేస్ట్‌గా మారుతాయి. ఎవరైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పాత పరికరాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని సరైన రీతిలో విసర్జించామా లేదా అనేది గుర్తుంచుకోవడం అవసరం. ఇ-వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతేఅది మన పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది.కానీజాగ్రత్తగా చేస్తే పునరుపయోగం- రీసైకిల్, రీయూజ్ -వర్తుల ఆర్థిక వ్యవస్థలో గొప్ప శక్తిగా మారుతుంది. ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను పారేస్తున్నామని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ వ్యర్థాల పరిమాణం ఎంత ఉంటుందో ఊహించగలరా? మానవజాతి చరిత్రలో నిర్మించిన అన్ని వాణిజ్య విమానాల బరువును కలిపినా, విడుదలవుతున్న ఈ-వ్యర్థాల పరిమాణానికి సమానం కాదు. ప్రతి సెకనుకు 800 ల్యాప్‌టాప్‌లను వదిలివేయడం జరుగుతోంది. ఈ-వ్యర్థాల నుండి వివిధ ప్రక్రియల ద్వారా సుమారు 17 రకాల విలువైన లోహాలు వెలికితీయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో బంగారం, వెండి, రాగి, నికెల్ ఉన్నాయి. కాబట్టి ఈ-వ్యర్థాలను ఉపయోగించడం చెత్త నుండి బంగారం' కంటే తక్కువేమీ కాదు.నేడు ఈ దిశగా వినూత్నమైన పనులు చేస్తున్న స్టార్టప్‌లకు కొదవలేదు. దాదాపు 500 ఈ-వేస్ట్ రీసైక్లర్లు ఈ రంగానికి అనుబంధంగా ఉన్నారు. అనేక మంది కొత్త వ్యవస్థాపకులు కూడా దీనితో అనుసంధానమయ్యారు. ఈ రంగం వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కూడా కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఈ-పరిసర అటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుండి విలువైన లోహాలను వేరు చేయడానికి ఇది స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అదేవిధంగాముంబాయిలో పనిచేస్తున్న ఇకోరీకో- మొబైల్ యాప్ ద్వారా ఈ-వ్యర్థాలను సేకరించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన అటెరో రీసైక్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అనేక పేటెంట్లను పొందింది. ఇది తన సొంత ఇ-వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీని సిద్ధం చేయడం ద్వారా చాలా పేరు సంపాదించింది.భోపాల్‌లో మొబైల్ యాప్, వెబ్సైట్ 'కబాడీవాలా' ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతున్నాయి. అయితేఅటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన షరతు కూడా ఉంది. అది E-వేస్ట్‌ను పారవేసే సురక్షితమైన ఉపయోగకరమైన పద్ధతుల గురించి ప్రజలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఏటా 15-17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ఈ-వేస్ట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా!నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు , జీవవైవిధ్య పరిరక్షణ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ దిశలో భారతదేశం చేస్తున్న నిర్దిష్ట ప్రయత్నాల గురించి మనం నిరంతరం మాట్లాడుతున్నాం. భారతదేశం చిత్తడి నేలల కోసం చేసిన కృషిని తెలుసుకుంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు. చిత్తడి నేలలు అంటే ఏమిటని కొంతమంది శ్రోతలు ఆలోచిస్తుండవచ్చు. చిత్తడి నేలలు భూమిలో ఏడాది పొడవునా నీరు పేరుకుపోయే ప్రదేశాలు. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మన భూమి ఉనికికి చిత్తడి నేలలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అనేక పక్షులు, జంతువులు వాటిపై ఆధారపడి ఉంటాయి.జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఈ నేలలు వరద నియంత్రణకు, భూగర్భ జలాల రీఛార్జ్‌కు కూడా ఉపయోగపడతాయి. రామ్సర్ సైట్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రాంతమని మీలో చాలా మందికి తెలిసి ఉండాలి. చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నా అవి అనేక ప్రమాణాలను నెరవేర్చినప్పుడు మాత్రమే వాటిని రామ్సర్ సైట్లుగా ప్రకటిస్తారు.రామ్సర్ సైట్లలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ నీటి పక్షులు ఉండాలి. స్థానిక చేప జాతులు పెద్ద సంఖ్యలో ఉండటం ముఖ్యం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యవేడుకల అమృత మహోత్సవాల సందర్భంగా రామ్సర్ సైట్లకు సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 75కి పెరిగింది. 2014 కి ముందు దేశంలో 26 రామ్సర్ సైట్లు మాత్రమే ఉండేవి. ఇందుకుగానుఈ జీవవైవిధ్యాన్ని కాపాడిన స్థానిక సమాజం అభినందనలకు పాత్రమైంది.ఇది మన ప్రాచీన సంస్కృతికి, ప్రకృతికి అనుగుణంగా జీవించే సంప్రదాయానికి కూడా గౌరవమే. భారతదేశంలోని ఈ చిత్తడి నేలలు మన సహజ సామర్థ్యానికి ఉదాహరణ. ఒడిశాలోని చిల్కా సరస్సు 40 కంటే ఎక్కువ నీటి పక్షుల జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది. కైబుల్-లమ్జా, లోక్టాక్ చిత్తడి జింకలకు ఒకవిధంగా సహజ నివాసంగా పరిగణిస్తారు.తమిళనాడులోని వేడంథాంగల్‌ను 2022లో రామ్‌సర్‌గా ప్రకటించారు. ఇక్కడ పక్షి జనాభాను సంరక్షించిన ఘనత మొత్తం సమీపంలోని రైతులకే చెందుతుంది. కాశ్మీర్‌లోని పంజాథ నాగ్ సమాజం వార్షిక ఫల వికాస ఉత్సవం సందర్భంగా ఒక రోజు ప్రత్యేకంగా గ్రామంలోని నీటి వనరులను శుభ్రపరుస్తుంది. ప్రపంచంలోని చాలా రామ్సర్ సైట్లకు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది.మణిపూర్ కు చెందిన లోక్టాక్, పవిత్ర సరస్సు రేణుకతో అక్కడి సంస్కృతికి గాఢమైన సంబంధం ఉంది. అదేవిధంగాసాంభార్ కూడా దుర్గామాత అవతారమైన శాకంభరి దేవికి సంబంధించింది. భారతదేశంలోని ఈ చిత్తడి నేలల విస్తరణ రామ్సర్ సైట్ల చుట్టూ నివసించే ప్రజల వల్ల సాధ్యమైంది. అలాంటి వారందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. 'మన్ కీ బాత్' శ్రోతల తరపునవారికి శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి మన దేశంలో- ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో - తీవ్రమైన చలికాలం ఉంది. ఈ చలికాలంలోపర్వతాల మీద మంచు కురుస్తుంది. అలాంటి కొన్ని చిత్రాలు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాయి. అవి యావత్ దేశ హృదయాలను దోచుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో ఇష్టపడుతున్నారు.హిమపాతం కారణంగామన కాశ్మీర్ లోయ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా అందంగా మారింది. బనిహాల్ నుండి బడ్గామ్ వరకు రైలు వెళ్తున్న వీడియోను కూడా ప్రజలు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. అందమైన హిమపాతం. నలువైపులా తెల్లటి దుప్పటి లాంటి మంచు. ఈ దృశ్యం అద్భుత కథలా ఉందని అంటున్నారు జనం. ఇవి ఏదో ఒక విదేశానికి చెందిన చిత్రాలు కావని, మన దేశంలోనే కాశ్మీర్‌కు సంబంధించినవని చాలామంది అంటున్నారు.
'స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?'అని సామాజిక మాధ్యమంలో ఒకరు రాశారు. ఇది ఖచ్చితంగా సరైంది. అందుకే కాశ్మీర్‌ను భూతల స్వర్గమని పిలుస్తారు. ఈ చిత్రాలను చూస్తుంటే మీకు కూడా కాశ్మీర్ పర్యటనకు వెళ్లాలని అనిపిస్తుంది. మీరు స్వయంగా వెళ్ళాలని, మీ సహచరులను కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.కాశ్మీర్లో మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలతో పాటుచూడవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకుకశ్మీర్‌లోని సయ్యదాబాద్‌లో శీతాకాల క్రీడోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల అంశం మంచు క్రికెట్! స్నో క్రికెట్ మరింత ఉత్తేజకరమైన క్రీడ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ భావన పూర్తిగా వాస్తవం. కాశ్మీరీ యువత మంచు మధ్య క్రికెట్‌ను మరింత అద్భుతంగా ఆడుతుంది. భారత క్రికెట్ బృందంలో ఆడే యువ క్రీడాకారుల కోసం కాశ్మీర్లో అన్వేషణ కూడా జరుగుతోంది. ఇది కూడా ఒక విధంగా ఖేలో ఇండియా ఉద్యమానికి పొడిగింపు. కాశ్మీర్లో క్రీడల పట్ల యువతలో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే కాలంలో ఇలాంటి యువకులు ఎందరో దేశానికి పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.మీరు వచ్చేసారి కాశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసినప్పుడుఇలాంటి ఉత్సవాలను సందర్శించడానికి సమయం కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ఈ అనుభవాలు మీ యాత్రను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కరి కృషితో, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారాగణతంత్రం పటిష్టంగా తయారవుతుంది. అలాంటి కర్తవ్య నిష్ఠా సేనానుల గంభీర స్వరమే మన 'మన్ కీ బాత్' కావడం నాకు సంతోషాన్నిస్తోంది. అలాంటి కర్తవ్య నిష్ఠా పరాయణత్వం ఉన్న వ్యక్తుల ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథలతో వచ్చేసారి మళ్ళీ కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు...
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్పీఎఫ్లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.
మిత్రులారా!ప్రతి ఏడాది జనవరి 25వ తేదీ కోసం వేచి చూస్తానని డెహ్రాడూన్‌కు చెందిన వత్సల్ గారు రాశారు. ఆ రోజు పద్మ అవార్డుల ప్రకటన రావడంతో పాటు 25వ తేదీ సాయంత్రమే జనవరి 26వ తేదీ ఉత్సవాల కోసం తన ఉత్సాహాన్ని పెంచుతుందని వత్సల్ తన అభిప్రాయం తెలిపారు. అట్టడుగు స్థాయిలో తమ అంకితభావం, సేవాభావంతో విజయం సాధించిన వారికి పీపుల్స్ పద్మ అవార్డుల ప్రదానంపై పలువురు తమ భావాలను పంచుకున్నారు. ఆదివాసీ సమాజంతోనూ ఆదివాసీ జీవితాల తోనూ ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈసారి పద్మ అవార్డుల్లో మంచి ప్రాతినిధ్యం లభించింది. ఆదివాసీల జీవితం నగరాల సందడికి విభిన్నంగా ఉంటుంది. వారి సవాళ్లు కూడా వేరు. అయినప్పటికీ ఆదివాసీ సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయిఆదివాసీ సముదాయాలకు సంబంధించిన విషయాలను పరిరక్షించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదేవిధంగాటోటో, హో, కుయి, కువి, మాండ మొదలైన ఆదివాసీ భాషలపై కృషి చేసిన ఎందరో మహానుభావులు పద్మ అవార్డులు అందుకున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. ధనిరామ్ టోటోగారు, జనుమ్ సింగ్ సోయ్గారు, బి. రామకృష్ణారెడ్డిగారు- ఈ పేర్లు ఇప్పుడు దేశం మొత్తం సుపరిచితమయ్యాయి. సిద్ధి, జారవా, ఒంగే వంటి ఆదివాసీ సమాజాలతో కలిసి పనిచేస్తున్న వారిని కూడా ఈసారి సత్కరించారు. వారిలో హీరాబాయి లోబీ గారు, రతన్ చంద్ర కార్ గారు, ఈశ్వర్ చంద్ర వర్మగారు ఉన్నారు. గిరిజన సమాజాలు మన భూమి, మన వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయి. దేశాభివృద్ధి, సమాజ అభివృద్ధిలో వారి సహకారం చాలా ముఖ్యమైంది. తమ కోసం పనిచేసిన వ్యక్తులను సన్మానించడం కొత్త తరానికి కూడా స్ఫూర్తినిస్తుంది.నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దారితప్పిన యువకులకు సరైన మార్గాన్ని చూపిన వారి కృషికి కూడా పద్మ అవార్డులు లభించాయి. ఇందుకు గాను కంకేర్‌లో శిల్పాలను చెక్కిన అజయ్ కుమార్ మాండవి గారు, గడ్చిరోలిలోని ప్రసిద్ధ ఝడిపట్టి రంగభూమికి సంబంధించిన పరశురామ్ కోమాజీ ఖుణే కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలో తమ సంస్కృతి పరిరక్షణలో పాలుపంచుకుంటున్న రామ్‌కుయి వాంగ్‌బే నియుమే, బిక్రమ్ బహదూర్ జమాతియా, కర్మ వాంగ్చులను కూడా సత్కరించారు.
మిత్రులారా!ఈసారి పద్మ అవార్డులతో సత్కరించిన వారిలో సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు! సంగీతంలో ప్రతి ఒక్కరి ఇష్టాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సంగీతం ఒక భాగం. ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో మన సంప్రదాయ సంగీత వాయిద్యాలైన సంతూర్, బంహుం, ద్వితారా వంటి వాటి మాధుర్యాన్ని వ్యాప్తి చేయడంలో నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు.గులామ్ మహ్మద్ జాజ్, మోవా సు-పోంగ్, రి-సింగ్‌బోర్ కుర్కా-లాంగ్, ముని-వెంకటప్ప, మంగళ్ కాంతి రాయ్ వంటి వారి పేర్లు నలుదిశలా చర్చనీయాంశాలయ్యాయి.
మిత్రులారా!చాలా మంది పద్మ అవార్డు గ్రహీతలు మన మధ్య ఉన్న స్నేహితులు. వారు ఎల్లప్పుడూ దేశాన్ని సర్వోత్తమంగా ఉంచారు. దేశానికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాలను అంకితం చేశారు. వారుసేవాభావంతో తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతిఫలం ఆశించలేదు. తమ పనికి లక్ష్యంగా ఉన్నవారి ముఖాల్లో సంతృప్తి వారికి అతిపెద్ద అవార్డు.అటువంటి అంకితభావం ఉన్న వ్యక్తులను సత్కరించడం ద్వారా మన దేశ ప్రజల గౌరవం పెరిగింది. నేను ఇక్కడ పద్మ అవార్డు గ్రహీతలందరి పేర్లను చెప్పలేకపోవచ్చు. అయితే ఈ పద్మ అవార్డు గ్రహీతల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాల గురించి వివరంగా తెలుసుకోవాలని, ఇతరులకు కూడా తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి చర్చిస్తున్నప్పుడునేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ప్రస్తావిస్తాను. కొన్ని వారాల క్రితం నాకు లభించిన ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ పుస్తకం పేరు ‘ఇండియా- ద మదర్ ఆఫ్ డెమొక్రసీ’. ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా భావించడం భారతీయులమైన మనం గర్వించే విషయం. ప్రజాస్వామ్యం మన నరనరాల్లో ఉంది. మన సంస్కృతిలో ఉంది. శతాబ్దాలుగా మన కార్యకలాపాల్లో అంతర్భాగంగా ఉంది. స్వభావరీత్యా మనది ప్రజాస్వామిక సమాజం. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ భిక్షువుల సంఘాన్ని భారత పార్లమెంటుతో పోల్చారు. ప్రతిపాదనలు, నిర్ణయాలు, సమావేశ నిర్వహణకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య, ఓటింగ్, ఓట్ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థగా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థల నుండి ప్రేరణ పొందాడని బాబాసాహెబ్ అభిప్రాయం.
చిన్నదైనా ప్రసిద్ధి చెందిన ఉతిర్మేరూర్ అనే ఒక ఊరు తమిళనాడులోఉంది. అక్కడ 1100-1200 సంవత్సరాల క్రితం నాటి శాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ శాసనం మినీ రాజ్యాంగం లాంటిది. గ్రామసభను ఎలా నిర్వహించాలి, సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణ 12వ శతాబ్దపు బసవేశ్వర స్వామి అనుభవ మండపం. ఇక్కడ స్వేచ్చాయుత వాదోపవాదాలను, చర్చలను ప్రోత్సహించారు. ఇది మాగ్నా కార్టా కంటే పూర్వమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరంగల్‌లోని కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి ఉద్యమం పశ్చిమ భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచింది.సిక్కు మతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఒక వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో చేర్చారు. గురునానక్ దేవ్ జీ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. మధ్య భారతదేశంలోని ఒరాన్, ముండా తెగలలో సమాజ నిర్వహణపై, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ పుస్తకంలో చక్కటి సమాచారం ఉంది.శతాబ్దాలుగా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలా ప్రవహిస్తోందో ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొనే భారతదేశ వాసులుగా మనం నిరంతరం ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి. చర్చించాలి. ప్రపంచానికి తెలియజేయాలి. ఇది దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!యోగా దినోత్సవానికి, వివిధ రకాల చిరు ముతక ధాన్యాలకు మధ్య పోలిక ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే, ఈ పోలిక ఏమిటి అని మీరు ఆలోచిస్తారు? ఈ రెండింటికీ చాలా పోలికలు ఉన్నాయని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి... భారతదేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటినీఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.రెండవది- యోగా ఆరోగ్యానికి సంబంధించింది. చిరుధాన్యాలు కూడా ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక మూడో విషయం ఏమిటంటే - రెండు ప్రచారాలలో ప్రజల భాగస్వామ్యం కారణంగా విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొనడం ద్వారా యోగా, ఫిట్నెస్లను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టే పెద్ద ఎత్తున చిరుధాన్యాలను కూడా దైనందిన జీవితంలో చేర్చుకుంటున్నారు.ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ మార్పు ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఒకవైపు సంప్రదాయబద్ధంగా చిరుధాన్యాలనుపండించే చిన్నకారు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు రైతు ఉత్పత్తి సంఘాలతో పాటు పారిశ్రామికవేత్తలు చిరుధాన్యాలను మార్కెట్ చేయడానికి, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన కె.వి. రామ సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల విషయంలో కృషి చేసేందుకు మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అమ్మ చేతితో చేసిన చిరుధాన్యాల రుచి చూసి ఆయన తన గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు వాటిని సులభంగా అందుబాటులో ఉంచుతారు. మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని కెనాడ్ గ్రామానికి చెందిన షర్మిలా ఓస్వాల్ గత 20 ఏళ్లుగా చిరుధాన్యాల ఉత్పత్తిలో తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. ఆమె రైతులకు నేర్పుగా వ్యవసాయం చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె కృషి వల్ల చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ని సందర్శించే అవకాశం మీకు లభిస్తేమీరు అక్కడి మిల్లెట్స్ కేఫ్‌ను తప్పక సందర్శించాలి. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ మిల్లెట్స్ కేఫ్‌లో చీలా, దోశ, మోమోస్, పిజ్జా, మంచూరియా వంటివి బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి.
నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగవచ్చా? మీరు ఎంటర్ ప్రెన్యూర్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ మీరు Milletpreneursఅనే పదం విన్నారా? ఈ రోజుల్లో ఒడిశాకు చెందిన మిల్లెట్‌ప్రెన్యూర్లు వెలుగులోకి వస్తున్నారు. ఆదివాసీ జిల్లా సుందర్‌గఢ్ కు చెందిన సుమారు 1500 మంది మహిళల స్వయం సహాయక బృందానికి ఒడిశా మిల్లెట్స్ మిషన్‌తో అనుబంధం ఉంది.ఇక్కడ మహిళలు చిరుధాన్యాల నుండి కుకీలు, రసగుల్లా, గులాబ్ జామూన్, కేక్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నారు. మార్కెట్లో వీరికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా మహిళల ఆదాయం కూడా పెరుగుతోంది.
కర్నాటకలోని కలబుర్గిలో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ పర్యవేక్షణలో అలంద్ భూతాయి మిల్లెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గత సంవత్సరం పని ప్రారంభించింది. ఇక్కడి ఖాక్రా, బిస్కెట్లు, లడ్డూలను ప్రజలు ఇష్టపడుతున్నారు. కర్నాటకలోని బీదర్ జిల్లాలో హుల్సూర్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన మహిళలు చిరుధాన్యాలను పండించడంతోపాటు వాటి పిండిని కూడా తయారు చేసుకుంటున్నారు.దీంతో వారి సంపాదన కూడా బాగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సందీప్ శర్మ గారికి ప్రాకృతిక వ్యవసాయంతో అనుబంధం ఉంది. ఆయనకు చెందిన రైతు ఉత్పత్తి సంస్థలో 12 రాష్ట్రాలకు చెందిన రైతులు చేరారు. బిలాస్‌పూర్‌కి చెందిన ఈ ఎఫ్పిఓ 8 రకాల చిరుధాన్యాల పిండిని, వాటితో వంటలను తయారు చేస్తోంది.
మిత్రులారా! ఈ రోజు జి-20 శిఖరాగ్ర సమావేశాలు భారతదేశంలోని ప్రతి మూలలో నిరంతరం జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి మూలలో జి-20శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగినా చిరుధాన్యాలతో చేసిన పుష్టికరమైన, రుచికరమైన వంటకాలు చేరుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.మార్కెట్లో తయారు చేసిన ఖిచ్డీ, పోహా, ఖీర్, రోటీ, రాగులతో చేసిన పాయసం, పూరీ , దోస వంటి వంటకాలు కూడా ఈ సమావేశాలు జరిగేచోట లభిస్తున్నాయి. ఆరోగ్య పానీయాలు, తృణధాన్యాలు,చిరుధాన్యాలతో తయారు చేసిన నూడుల్స్ అన్ని జి20 వేదికలలోని చిరుధాన్యాల ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లు కూడా వీటి ప్రజాదరణను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.దేశం చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచంలో చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ మన చిన్న రైతులకు బలం చేకూర్చబోతున్నాయని మీరు ఊహించవచ్చు. ఈ రోజు చిరుధాన్యాలతో తయారు చేయడం ప్రారంభించిన వివిధ రకాల కొత్త తినుబండారాలను యువతరం ఇష్టపడటం కూడా నాకు ఆనందంగా ఉంది.అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని ఇంత అద్భుతంగా ప్రారంభించినందుకు, దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నందుకు 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎవరైనా టూరిస్ట్ హబ్ గోవా గురించి మాట్లాడితే మీ మనసులో ఏం గుర్తొస్తుంది? గోవా పేరు వినగానే ముందుగా అందమైన తీరప్రాంతం, బీచులు, ఇష్టమైన ఆహార పదార్థాలు గుర్తుకు రావడం సహజం. అయితే ఈ నెలలో గోవాలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు 'మన్ కీ బాత్'లో నేను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.గోవాలో జరిగిన ఈ కార్యక్రమం పర్పుల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పనాజీలో జరిగింది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇదొక ప్రత్యేక ప్రయత్నం. పర్పుల్ ఫెస్ట్ ఎంత గొప్ప సందర్భమనే విషయాన్ని అందులో 50 వేల మందికి పైగా సోదర సోదరీమణులు పాల్గొన్నారనే వాస్తవాన్ని బట్టి మీరందరూ ఊహించవచ్చు.ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇప్పుడు 'మీరామార్ బీచ్'లో తిరగడాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలిగినందుకు పులకించిపోయారు. నిజానికి 'మీరామార్ బీచ్' దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు గోవాలో అందుబాటులో ఉండే బీచ్‌లలో ఒకటిగా మారింది. క్రికెట్ టోర్నమెంట్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, మారథాన్ పోటీలతో పాటుబధిర-అంధుల సమ్మేళనం కూడా ఇక్కడ జరిగింది. ప్రత్యేకమైన బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్‌తో పాటుఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దివ్యాంగ సోదర సోదరీమణులు, పిల్లలు పూర్తిస్థాయిలో ఆనందించేలా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. దేశంలోని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా ఉండడం పర్పుల్ ఫెస్ట్ లోని ఒక ప్రత్యేక విషయం. దివ్యాంగులు ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులను ప్రదర్శించారు. దివ్యాంగుల సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.పర్పుల్ ఫెస్ట్‌ని విజయవంతం చేసినందుకుఅందులో పాల్గొన్నవారందరికీ నా అభినందనలు. దీన్ని నిర్వహిచేందుకు పగలూ రాత్రీ ఏకం చేసిన వాలంటీర్లను కూడా నేను అభినందిస్తున్నాను. యాక్సెసబుల్ ఇండియా దృక్కోణాన్ని సాకారం చేయడంలో ఇటువంటి ప్రచారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!మీకు ఆనందం, గర్వం కలిగించడంతో పాటు మనసుకు సంతోషం కలిగించే విషయంపై ఇప్పుడు 'మన్ కీ బాత్'లోనేను మాట్లాడతాను. దాంతో మీ హృదయం ఆనందభరితం అవుతుంది. దేశంలోని పురాతన వైజ్ఞానిక సంస్థల్లో ఒకటైన బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISc-అద్భుతమైన ఉదాహరణను అందిస్తోంది.ఈ సంస్థ స్థాపన వెనుకఇద్దరు గొప్ప వ్యక్తులు- జంషెడ్జీ టాటా, స్వామి వివేకానందల ప్రేరణను 'మన్ కీ బాత్'లోనేను ఇంతకుముందు చర్చించాను. గత ఏడాది 2022లో ఈ సంస్థ పేరు మీద మొత్తం 145 పేటెంట్లు ఉండడం మీకు, నాకు ఆనందం, గర్వం కలిగించే విషయం. అంటే దీని అర్థం - ప్రతి ఐదు రోజులకు రెండు పేటెంట్లు. ఈ రికార్డు అద్భుతమైంది.ఈ విజయం సాధించిన IISc బృందాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. మిత్రులారా!ఈరోజు భారతదేశం ర్యాంకింగ్ పేటెంట్ ఫైలింగ్‌లో 7వ స్థానంలో, ట్రేడ్‌మార్క్‌లలో 5వ స్థానంలో ఉంది. పేటెంట్ల గురించి మాత్రమే మాట్లాడితేగత ఐదేళ్లలో సుమారు 50 శాతం పెరుగుదల ఉంది.గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కూడాభారతదేశం ర్యాంకింగ్ అద్భుతంగా మెరుగుపడింది. ఇప్పుడు అది 40వ స్థానానికి చేరుకుంది. 2015 లోగ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.భారతదేశంలో గత 11 సంవత్సరాలలో మొదటిసారిగాదేశీయ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ కంటే ఎక్కువగా కనిపించింది. ఇది భారతదేశంలో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.
మిత్రులారా! 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విజ్ఞానం అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. మన ఆవిష్కర్తలు, వారి పేటెంట్ల బలంతో భారతదేశం టెకేడ్ కల ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. దీంతోమనందరం ప్రపంచ స్థాయి సాంకేతికతను, మన దేశంలో తయారైన ఉత్పత్తుల నుండి పూర్తిగా లాభం పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! తెలంగాణకు చెందిన ఇంజనీరు విజయ్ గారి పోస్టునునేను నమో యాప్ లో చూశాను. ఇందులో విజయ్ గారు ఈ-వేస్ట్ గురించి రాశారు. దీని గురించి 'మన్ కీ బాత్'లో చర్చించమని విజయ్ గారు అభ్యర్థించారు. ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమంలో 'వేస్ట్ టు వెల్త్' అంటే 'చెత్త నుండి బంగారం’ గురించి మాట్లాడుకున్నాం. రండి- ఈ రోజుదీనికి సంబంధించిన ఈ-వేస్ట్ గురించి చర్చిద్దాం.
మిత్రులారా!ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలు సర్వసాధారణమైపోయాయి. దేశవ్యాప్తంగా వారి సంఖ్య బిలియన్లలో ఉంటుంది. నేటి ఆధునిక ఉపకరణాలు కూడా భవిష్యత్తులో ఇ-వేస్ట్‌గా మారుతాయి. ఎవరైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పాత పరికరాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని సరైన రీతిలో విసర్జించామా లేదా అనేది గుర్తుంచుకోవడం అవసరం. ఇ-వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతేఅది మన పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది.కానీజాగ్రత్తగా చేస్తే పునరుపయోగం- రీసైకిల్, రీయూజ్ -వర్తుల ఆర్థిక వ్యవస్థలో గొప్ప శక్తిగా మారుతుంది. ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను పారేస్తున్నామని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ వ్యర్థాల పరిమాణం ఎంత ఉంటుందో ఊహించగలరా? మానవజాతి చరిత్రలో నిర్మించిన అన్ని వాణిజ్య విమానాల బరువును కలిపినా, విడుదలవుతున్న ఈ-వ్యర్థాల పరిమాణానికి సమానం కాదు. ప్రతి సెకనుకు 800 ల్యాప్‌టాప్‌లను వదిలివేయడం జరుగుతోంది. ఈ-వ్యర్థాల నుండి వివిధ ప్రక్రియల ద్వారా సుమారు 17 రకాల విలువైన లోహాలు వెలికితీయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో బంగారం, వెండి, రాగి, నికెల్ ఉన్నాయి. కాబట్టి ఈ-వ్యర్థాలను ఉపయోగించడం చెత్త నుండి బంగారం' కంటే తక్కువేమీ కాదు.నేడు ఈ దిశగా వినూత్నమైన పనులు చేస్తున్న స్టార్టప్‌లకు కొదవలేదు. దాదాపు 500 ఈ-వేస్ట్ రీసైక్లర్లు ఈ రంగానికి అనుబంధంగా ఉన్నారు. అనేక మంది కొత్త వ్యవస్థాపకులు కూడా దీనితో అనుసంధానమయ్యారు. ఈ రంగం వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కూడా కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఈ-పరిసర అటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుండి విలువైన లోహాలను వేరు చేయడానికి ఇది స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అదేవిధంగాముంబాయిలో పనిచేస్తున్న ఇకోరీకో- మొబైల్ యాప్ ద్వారా ఈ-వ్యర్థాలను సేకరించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన అటెరో రీసైక్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అనేక పేటెంట్లను పొందింది. ఇది తన సొంత ఇ-వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీని సిద్ధం చేయడం ద్వారా చాలా పేరు సంపాదించింది.భోపాల్‌లో మొబైల్ యాప్, వెబ్సైట్ 'కబాడీవాలా' ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతున్నాయి. అయితేఅటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన షరతు కూడా ఉంది. అది E-వేస్ట్‌ను పారవేసే సురక్షితమైన ఉపయోగకరమైన పద్ధతుల గురించి ప్రజలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఏటా 15-17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ఈ-వేస్ట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా!నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు , జీవవైవిధ్య పరిరక్షణ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ దిశలో భారతదేశం చేస్తున్న నిర్దిష్ట ప్రయత్నాల గురించి మనం నిరంతరం మాట్లాడుతున్నాం. భారతదేశం చిత్తడి నేలల కోసం చేసిన కృషిని తెలుసుకుంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు. చిత్తడి నేలలు అంటే ఏమిటని కొంతమంది శ్రోతలు ఆలోచిస్తుండవచ్చు. చిత్తడి నేలలు భూమిలో ఏడాది పొడవునా నీరు పేరుకుపోయే ప్రదేశాలు. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మన భూమి ఉనికికి చిత్తడి నేలలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అనేక పక్షులు, జంతువులు వాటిపై ఆధారపడి ఉంటాయి.జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఈ నేలలు వరద నియంత్రణకు, భూగర్భ జలాల రీఛార్జ్‌కు కూడా ఉపయోగపడతాయి. రామ్సర్ సైట్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రాంతమని మీలో చాలా మందికి తెలిసి ఉండాలి. చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నా అవి అనేక ప్రమాణాలను నెరవేర్చినప్పుడు మాత్రమే వాటిని రామ్సర్ సైట్లుగా ప్రకటిస్తారు.రామ్సర్ సైట్లలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ నీటి పక్షులు ఉండాలి. స్థానిక చేప జాతులు పెద్ద సంఖ్యలో ఉండటం ముఖ్యం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యవేడుకల అమృత మహోత్సవాల సందర్భంగా రామ్సర్ సైట్లకు సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 75కి పెరిగింది. 2014 కి ముందు దేశంలో 26 రామ్సర్ సైట్లు మాత్రమే ఉండేవి. ఇందుకుగానుఈ జీవవైవిధ్యాన్ని కాపాడిన స్థానిక సమాజం అభినందనలకు పాత్రమైంది.ఇది మన ప్రాచీన సంస్కృతికి, ప్రకృతికి అనుగుణంగా జీవించే సంప్రదాయానికి కూడా గౌరవమే. భారతదేశంలోని ఈ చిత్తడి నేలలు మన సహజ సామర్థ్యానికి ఉదాహరణ. ఒడిశాలోని చిల్కా సరస్సు 40 కంటే ఎక్కువ నీటి పక్షుల జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది. కైబుల్-లమ్జా, లోక్టాక్ చిత్తడి జింకలకు ఒకవిధంగా సహజ నివాసంగా పరిగణిస్తారు.తమిళనాడులోని వేడంథాంగల్‌ను 2022లో రామ్‌సర్‌గా ప్రకటించారు. ఇక్కడ పక్షి జనాభాను సంరక్షించిన ఘనత మొత్తం సమీపంలోని రైతులకే చెందుతుంది. కాశ్మీర్‌లోని పంజాథ నాగ్ సమాజం వార్షిక ఫల వికాస ఉత్సవం సందర్భంగా ఒక రోజు ప్రత్యేకంగా గ్రామంలోని నీటి వనరులను శుభ్రపరుస్తుంది. ప్రపంచంలోని చాలా రామ్సర్ సైట్లకు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది.మణిపూర్ కు చెందిన లోక్టాక్, పవిత్ర సరస్సు రేణుకతో అక్కడి సంస్కృతికి గాఢమైన సంబంధం ఉంది. అదేవిధంగాసాంభార్ కూడా దుర్గామాత అవతారమైన శాకంభరి దేవికి సంబంధించింది. భారతదేశంలోని ఈ చిత్తడి నేలల విస్తరణ రామ్సర్ సైట్ల చుట్టూ నివసించే ప్రజల వల్ల సాధ్యమైంది. అలాంటి వారందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. 'మన్ కీ బాత్' శ్రోతల తరపునవారికి శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి మన దేశంలో- ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో - తీవ్రమైన చలికాలం ఉంది. ఈ చలికాలంలోపర్వతాల మీద మంచు కురుస్తుంది. అలాంటి కొన్ని చిత్రాలు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాయి. అవి యావత్ దేశ హృదయాలను దోచుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో ఇష్టపడుతున్నారు.హిమపాతం కారణంగామన కాశ్మీర్ లోయ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా అందంగా మారింది. బనిహాల్ నుండి బడ్గామ్ వరకు రైలు వెళ్తున్న వీడియోను కూడా ప్రజలు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. అందమైన హిమపాతం. నలువైపులా తెల్లటి దుప్పటి లాంటి మంచు. ఈ దృశ్యం అద్భుత కథలా ఉందని అంటున్నారు జనం. ఇవి ఏదో ఒక విదేశానికి చెందిన చిత్రాలు కావని, మన దేశంలోనే కాశ్మీర్‌కు సంబంధించినవని చాలామంది అంటున్నారు.
'స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?'అని సామాజిక మాధ్యమంలో ఒకరు రాశారు. ఇది ఖచ్చితంగా సరైంది. అందుకే కాశ్మీర్‌ను భూతల స్వర్గమని పిలుస్తారు. ఈ చిత్రాలను చూస్తుంటే మీకు కూడా కాశ్మీర్ పర్యటనకు వెళ్లాలని అనిపిస్తుంది. మీరు స్వయంగా వెళ్ళాలని, మీ సహచరులను కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.కాశ్మీర్లో మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలతో పాటుచూడవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకుకశ్మీర్‌లోని సయ్యదాబాద్‌లో శీతాకాల క్రీడోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల అంశం మంచు క్రికెట్! స్నో క్రికెట్ మరింత ఉత్తేజకరమైన క్రీడ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ భావన పూర్తిగా వాస్తవం. కాశ్మీరీ యువత మంచు మధ్య క్రికెట్‌ను మరింత అద్భుతంగా ఆడుతుంది. భారత క్రికెట్ బృందంలో ఆడే యువ క్రీడాకారుల కోసం కాశ్మీర్లో అన్వేషణ కూడా జరుగుతోంది. ఇది కూడా ఒక విధంగా ఖేలో ఇండియా ఉద్యమానికి పొడిగింపు. కాశ్మీర్లో క్రీడల పట్ల యువతలో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే కాలంలో ఇలాంటి యువకులు ఎందరో దేశానికి పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.మీరు వచ్చేసారి కాశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసినప్పుడుఇలాంటి ఉత్సవాలను సందర్శించడానికి సమయం కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ఈ అనుభవాలు మీ యాత్రను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కరి కృషితో, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారాగణతంత్రం పటిష్టంగా తయారవుతుంది. అలాంటి కర్తవ్య నిష్ఠా సేనానుల గంభీర స్వరమే మన 'మన్ కీ బాత్' కావడం నాకు సంతోషాన్నిస్తోంది. అలాంటి కర్తవ్య నిష్ఠా పరాయణత్వం ఉన్న వ్యక్తుల ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథలతో వచ్చేసారి మళ్ళీ కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు...
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు మనం 'మన్ కీ బాత్' తొంభై ఆరవఎపిసోడ్ లో కలుస్తున్నాం. 'మన్ కీ బాత్' తర్వాతి ఎపిసోడ్ 2023 సంవత్సరంలో మొదటి ఎపిసోడ్ అవుతుంది. మీరు పంపిన సందేశాలను పరిశీలిస్తున్నప్పుడు 2022పై మాట్లాడాలన్న మీ కోరిక తెలిసింది. గతం పరిశీలన ఎల్లప్పుడూ వర్తమాన, భవిష్యత్తు సన్నాహాలకు ప్రేరణనిస్తుంది. 2022లోదేశ ప్రజల సామర్థ్యం, సహకారం, సంకల్పం, విజయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వాటన్నిటినీ 'మన్ కీ బాత్'లో చేర్చడం కష్టం.2022 నిజానికి చాలా స్ఫూర్తిదాయకంగా, అనేక విధాలుగా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరానికి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలోనే అమృతోత్సవ కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సరం దేశం కొత్త ఊపందుకుంది. దేశప్రజలందరూ ఒకరికి మించి మరొకరు మంచి పనులు చేశారు. 2022లో సాధించిన విజయాలుప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక స్థానాన్నికల్పించాయి. 2022 అంటే భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను పొందడం.2022 అంటే ఎవరూ నమ్మలేని విధంగా దేశం 220 కోట్ల వాక్సిన్ల మైలు రాయిని అధిగమించి రికార్డు సాధించడం. 2022 అంటే భారతదేశం ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్ల మేజిక్ ఫిగర్‌ను దాటడం,2022 అంటే ప్రజలుఆత్మ నిర్భర్ భారత్ తీర్మానాన్ని స్వీకరించడం-జీవించి చూపించడం. 2022 అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను స్వాగతించడం. 2022 అంటే అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాలలో భారతదేశ కీర్తి. 2022 అంటే ప్రతి రంగంలో భారతదేశ విజయం. కామన్వెల్త్ క్రీడలైనా మన మహిళా హాకీ జట్టు విజయమైనా క్రీడా రంగంలో కూడా మన యువత అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరిచింది.
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా!జి-20 గ్రూప్‌కు అధ్యక్షత వహించే బాధ్యత కూడా ఈ ఏడాది భారతదేశానికి వచ్చింది. ఇంతకుముందు కూడా దీని గురించి వివరంగా చర్చించాను. 2023 సంవత్సరంలోమనం జి-20 ఉత్సాహాన్ని కొత్తశిఖరాలకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు క్రిస్మస్ పండుగను ప్రపంచమంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది యేసుక్రీస్తు జీవితం, బోధనలను గుర్తుంచుకునే సందర్భం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను.
మిత్రులారా!ఈరోజు గౌరవనీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పుట్టినరోజు కూడా. దేశానికి అసాధారణ నాయకత్వాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కోల్‌కతాకు చెందిన ఆస్థా గారి నుండి నాకు ఉత్తరం వచ్చింది.ఈ లేఖలో ఆమె తన ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తాను పీఎంమ్యూజియాన్ని సందర్శించానని ఆమె రాశారు. ఈ మ్యూజియంలోని అటల్ జీ గ్యాలరీ ఆమెకు బాగా నచ్చింది. అక్కడ అటల్ జీ చిత్రంతో తీసుకున్న ఫోటో ఆమెకుఎప్పుడూ గుర్తుండే జ్ఞాపకంగా మారింది.అటల్ జీ గ్యాలరీలోదేశానికి ఆయన చేసిన అమూల్యమైన కృషిని మనం చూడవచ్చు. మౌలిక సదుపాయాల రంగంలో గానీ విద్యారంగంలోగానీ విదేశాంగ విధానంలో గానీ - ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆయన కృషి చేశారు. నేను మరోసారి అటల్ జీకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
మిత్రులారా!రేపు డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అమరవీరులు సాహిబ్ జాదా జోరావర్ సింగ్ జీ, సాహిబ్ జాదా ఫతే సింగ్ జీ స్మృతిలో ఢిల్లీలో నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. సాహిబ్ జాదే, మాతా గుజ్రీల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
నా ప్రియమైన దేశవాసులారా!
“సత్యమ్ కిమ్ ప్రమాణం, ప్రత్యక్షమ్ కిమ్ ప్రమాణమ్” అంటారు.
అంటే సత్యానికి రుజువులు అవసరం లేదు. ప్రత్యక్షం గా కనబడేదానికి కూడా రుజువు అవసరం లేదు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం విషయానికి వస్తే రుజువు చాలా ముఖ్యమైన విషయం. శతాబ్దాలుగా భారతీయుల జీవితంలో భాగమైన యోగా, ఆయుర్వేదం వంటి మన శాస్త్రాల్లో సాక్ష్యాధార ఆధారిత పరిశోధన లేకపోవడం ఎప్పుడూ సవాలుగా ఉంది. ఫలితాలు కనిపిస్తాయి. కానీ రుజువులు కాదు.కానీ సాక్ష్యాధారిత వైద్య యుగంలోయోగా, ఆయుర్వేదం ఇప్పుడు ఆధునిక యుగపరీక్షల్లో విశ్వసనీయమైనవిగా నిలుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ గురించి మీరందరూ వినే ఉంటారు. పరిశోధన, పరికల్పన, క్యాన్సర్ కేర్లోఈ సంస్థ చాలా పేరు సంపాదించింది. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లకు యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఈ కేంద్రం చేసిన లోతైన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక బ్రెస్ట్ క్యాన్సర్ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన పరిశోధన ఫలితాలను అందించింది.ఈ ఫలితాలు ప్రపంచంలోని పెద్ద - పెద్ద నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటేయోగా ఫలితంగా రోగులు ఎలా ప్రయోజనం పొందారో టాటా మెమోరియల్ సెంటర్ సాక్ష్యాధారాలతో సహా తెలియజేసింది. ఈ కేంద్ర పరిశోధన ప్రకారంక్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పునరావృతమయ్యే అవకాశాలు, మరణాల ప్రమాదం 15 శాతం తగ్గాయి.పాశ్చాత్య పద్ధతుల కఠినమైన ప్రమాణాలతో భారతీయ సంప్రదాయ వైద్య ఫలితాల నిగ్గు తేల్చడం విషయంలో ఇది మొదటి ఉదాహరణ.అలాగేరొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో యోగా ఫలితాలను కనుగొన్న మొదటి అధ్యయనం ఇది. దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్యారిస్‌లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన అధ్యయన ఫలితాలను సమర్పించింది.
మిత్రులారా!నేటి యుగంలోభారతీయ వైద్య విధానాల్లోసాక్ష్యాధారాలు ఎక్కువైనకొద్దీ ప్రపంచం మొత్తంలో వాటికి అంతగా ఆదరణ పెరుగుతుంది. ఈ ఆలోచనతో ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక్కడమన సంప్రదాయ వైద్య విధానాలను ధృవీకరించడానికి సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ను ఆరేళ్ల కిందట స్థాపించారు. ఇందులో ఆధునిక పరిజ్ఞానాన్ని, పరిశోధనాపద్ధతులను ఉపయోగించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈ కేంద్రం ఇప్పటికే 20పత్రాలను ప్రచురించింది.అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక పత్రం మూర్ఛతో బాధపడుతున్న రోగులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. ఇదేవిధంగాన్యూరాలజీ జర్నల్ లో ప్రచురితమైన పత్రంలో మైగ్రేన్ బాధితులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇవే కాకుండా అనేక ఇతర వ్యాధుల బాధితులకు కూడా యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయి. గుండె జబ్బులు, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్, గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు మొదలైనవాటిపై ఈ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.
మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ లో పాల్గొనేందుకు గోవా వెళ్ళాను. ఇందులో 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొని 550కి పైగా శాస్త్రీయ పత్రాలను సమర్పించారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 215 కంపెనీలు ఇక్కడ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్‌పోలో లక్ష మందికి పైగా ప్రజలు ఆయుర్వేదానికి సంబంధించిన అనుభవాన్ని ఆస్వాదించారు.ఆయుర్వేద కాంగ్రెస్‌లో కూడాప్రపంచం నలుమూలల నుండి హాజరైన ఆయుర్వేద నిపుణులను సాక్ష్యాధారిత పరిశోధనలు నిర్వహించాల్సిందిగా కోరాను. కరోనా మహమ్మారి కాలంలో యోగా, ఆయుర్వేద శక్తిని మనమందరం చూస్తున్నాం. వీటికి సంబంధించిన సాక్ష్యాధారిత పరిశోధనలు చాలా ముఖ్యమైనవిగా నిరూపితమవుతాయి.యోగా, ఆయుర్వేదం, మన సంప్రదాయ వైద్య పద్ధతులకు సంబంధించిన అటువంటి ప్రయత్నాల గురించి మీకు ఏవైనా సమాచారం ఉంటేవాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక ప్రధాన సవాళ్లను మనం అధిగమించాం. మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, దేశప్రజల సంకల్పశక్తి వల్లే ఇది సాధ్యమైంది. మనం భారతదేశం నుండి మశూచి, పోలియో, 'గినియా వార్మ్' వంటి వ్యాధులను నిర్మూలించాం.
ఈ రోజునేను 'మన్ కీ బాత్' శ్రోతలకు మరో సవాలు గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ముగియబోతోంది. ఈ సవాలు-ఈ వ్యాధి - 'కాలాజార్'. ఈ వ్యాధి పరాన్నజీవి శాండ్ ఫ్లైఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 'కాలాజార్' వచ్చినప్పుడు నెలల తరబడి జ్వరం ఉంటుంది. రక్తహీనత కలుగుతుంది. శరీరం బలహీనపడటంతోపాటు బరువు కూడా తగ్గుతుంది.ఈ వ్యాధి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. కానీ అందరి కృషితో 'కాలాజార్' వ్యాధి నిర్మూలన ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నిర్మూలించబడుతోంది. కొద్దికాలం క్రితం వరకు'కాలాజార్' వ్యాప్తి 4 రాష్ట్రాల్లోని 50 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ వ్యాధి బీహార్, జార్ఖండ్‌లోని 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. బీహార్-జార్ఖండ్ ప్రజల సమర్థత, అవగాహన ఈ నాలుగు జిల్లాల నుండి కూడా 'కాలాజార్'ని నిర్మూలించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు దోహదపడతాయన్న విశ్వాసం నాకుంది. 'కాలాజార్' ప్రభావిత ప్రాంతాల ప్రజలు రెండు విషయాలను గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకటి - శాండ్ ఫ్లై లేదా ఇసుక ఈగ నియంత్రణ. రెండవది, వీలైనంత త్వరగా ఈ వ్యాధిని గుర్తించి పూర్తి చికిత్స అందించడం. 'కాలాజార్'చికిత్స సులభం. దీనికి ఉపయోగించే మందులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇసుక ఈగను చంపే మందులను పిచికారీ చేస్తూ ఉండండి. మన దేశం 'కాలాజార్'నుండి విముక్తి పొందినపుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సమష్టి కృషి- సబ్ కా ప్రయాస్- భావనతో భారతదేశం 2025 నాటికి టి. బి. నుండి కూడా విముక్తి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో టీబీ విముక్త భారత ప్రచారాన్ని ప్రారంభించినప్పుడువేలాది మంది ప్రజలుటి.బి. రోగులను ఆదుకునేందుకు ముందుకు రావడాన్ని మీరు చూసి ఉంటారు. ఈ వ్యక్తులుక్షయరహిత ప్రచార మిత్రులు కావడంతో టీబీ రోగులను ఆదుకుంటున్నారు. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రజల సేవ, భాగస్వామ్యం ఉన్న ఈ శక్తి ప్రతి కష్టమైన లక్ష్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే ప్రదర్శితమవుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన సంస్కృతీ సంప్రదాయాలకు గంగామాతతో అవినాభావ సంబంధం ఉంది. గంగాజలం మన జీవన విధానంలో అంతర్భాగంగా ఉంది.
నమామి గంగే తవ్ పాద పంకజం,
సుర అసురై: వందిత దివ్య రూపం|
భుక్తిం చ ముక్తిం చ దదాసి నిత్యం,
భావ అనుసరేణ్ సదా నరాణాం ||
అని మన గ్రంథాలలో పేర్కొన్నారు.
అంటే-“ఓ గంగామాతా! భక్తులకు వారి ఇష్టానుసారం ప్రాపంచిక సుఖాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు. అందరూ నీ పవిత్ర పాదాలను పూజిస్తారు. నేను కూడా నీ పవిత్ర పాదాలకు నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో శతాబ్దాల పాటు ప్రవహిస్తున్న గంగమ్మను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి ముందున్న పెద్ద బాధ్యత. ఈ లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం 'నమామి గంగే అభియాన్' ప్రారంభించాం. ఈ చొరవ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మనందరికీ గర్వకారణం.పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం విషయంలో ప్రపంచంలోని మొదటి పది కార్యక్రమాలలో 'నమామి గంగే' మిషన్‌ను ఐక్యరాజ్యసమితి చేర్చింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 160 కార్యక్రమాలలో 'నమామి గంగే'కి ఈ గౌరవం లభించడం మరింత సంతోషకరమైన విషయం.
మిత్రులారా! 'నమామి గంగే' ప్రచారంలో అతిపెద్ద శక్తి ప్రజల నిరంతర భాగస్వామ్యం. 'నమామి గంగే' ప్రచారంలో గంగా ప్రహరీలకు, గంగా దూతలకు ప్రాముఖ్యత కల్పించారు. మొక్కలు నాటడం, ఘాట్లను శుభ్రపరచడం, గంగా హారతి, వీధి నాటకాలు, పెయింటింగ్‌లు వేయడం, కవితల ద్వారా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచారం వల్ల జీవవైవిధ్యంలో కూడా చాలా అభివృద్ధి కనిపిస్తోంది.వివిధ జాతుల హిల్సా చేపలు, గంగా డాల్ఫిన్ , తాబేళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గంగ పర్యావరణ వ్యవస్థ పరిశుభ్రంగా ఉండటంతోఇతర జీవనోపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన 'జల జీవనోపాధి నమూనా' గురించి చర్చించాలనుకుంటున్నాను.ఈ పర్యాటక ఆధారిత బోట్ సఫారీలను26 ప్రదేశాలలో ప్రారంభించారు. సహజంగానే 'నమామి గంగే' మిషన్ పరిధి, దాని విస్తృతినదిని శుభ్రపరచడం కంటే అధికంగా పెరిగింది. ఇది మన సంకల్ప శక్తికి , అవిశ్రాంత ప్రయత్నాలకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచానికి కొత్త మార్గాన్ని కూడా చూపబోతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన సంకల్ప శక్తి బలంగా ఉన్నప్పుడుఅతి పెద్ద సవాలు కూడా సులభం అవుతుంది. సిక్కింలోని థేగు గ్రామానికి చెందిన సంగే షెర్పా గారు దీనికి ఉదాహరణగా నిలిచారు. గత 14 సంవత్సరాలుగా 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పర్యావరణ పరిరక్షణ పనిలో ఆయనఅ నిమగ్నమై ఉన్నారు. సంగే గారు సాంస్కృతిక, పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న సోమ్గో సరస్సును శుభ్రంగా ఉంచే పనిని చేపట్టారు.తన అలుపెరగని కృషితోఆయన ఈ హిమానీనద సరస్సు రంగురూపులను మార్చారు. ఈ పరిశుభ్రత ప్రచారాన్ని 2008లో సంగే షెర్పా గారు ప్రారంభించినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అనతికాలంలోనే ఈ మహత్తర కార్యానికి యువకులు, గ్రామస్థులతో పాటు పంచాయతీ నుండి కూడా పూర్తి మద్దతు లభించడం ప్రారంభమైంది. ఈరోజుమీరు సోమ్గోసరస్సును చూడటానికి వెళితేఅక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెత్త డబ్బాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కోసం పంపుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వారికి గుడ్డతో చేసిన చెత్త సంచులను కూడా అందజేస్తున్నారు.ఇప్పుడు ఈ పరిశుభ్రమైన సరస్సును చూడటానికి ప్రతి ఏటా సుమారు 5 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సోమ్గో సరస్సును పరిరక్షించడానికి చేసిన ఈ ప్రత్యేకమైన కృషికి సంగే షెర్పాను అనేక సంస్థలు గౌరవించాయి. ఇటువంటి ప్రయత్నాల కారణంగాసిక్కిం భారతదేశంలోని పరిశుభ్రమైన రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. సంగే షెర్పా గారు, ఆయన సహచరులతో పాటుదేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గొప్ప ప్రయత్నాల్లో నిమగ్నమైన ప్రజలను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా! 'స్వచ్ఛ భారత్ మిషన్' నేడు ప్రతి భారతీయుని మనస్సులో స్థిరపడినందుకునేను సంతోషిస్తున్నాను. 2014వ సంవత్సరంలో ఈ ప్రజాఉద్యమం ప్రారంభమైనప్పటి నుండిదీన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రజల నుండి అనేక విశిష్ట ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు సమాజంలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి.ఈ నిరంతర ప్రయత్నాల ఫలితాలు చాలా ఉన్నాయి. చెత్తను తొలగించడం వల్ల, అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల కార్యాలయాలలో చాలా స్థలంఖాళీ అవుతుంది. కొత్త స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇంతకు ముందు స్థలాభావం వల్ల దూరప్రాంతాల్లో కార్యాలయాలు అద్దెకు తీసుకోవాల్సి వచ్చేది. ఈ రోజుల్లోఈ శుభ్రత కారణంగాచాలా స్థలం అందుబాటులోకి వచ్చి ఇప్పుడు, అన్ని కార్యాలయాలు ఒకే చోటికి వచ్చే అవకాశం ఏర్పడింది. గతంలోసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, షిల్లాంగ్ లతో పాటు అనేక ఇతర నగరాల్లోని తన కార్యాలయాలలో చాలా కృషి చేసింది. ఆ కారణంగానే నేడు పూర్తిగా కొత్తగా వినియోగించుకునే రెండు- మూడు అంతస్తులు వారికి అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిశుభ్రత కారణంగావనరులను ఉత్తమంగా వినియోగించుకోవడంలో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నాం. ఈ ప్రచారం సమాజంతో పాటు గ్రామాలు, నగరాలు, కార్యాలయాల్లో కూడా అన్ని విధాలుగా దేశానికి ఉపయోగపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో మన కళలు, సంస్కృతి పై కొత్త అవగాహన వస్తోంది. కొత్త చైతన్యం జాగృతమవుతోంది. 'మన్ కీ బాత్'లో ఇలాంటి ఉదాహరణలను తరచుగా చర్చిస్తాం. కళ, సాహిత్యం, సంస్కృతి సమాజానికి సమష్టి మూలధనం అయినట్లే, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మొత్తం సమాజంపై ఉంది.అలాంటి విజయవంతమైన ప్రయత్నం లక్షద్వీప్‌లో జరుగుతోంది. కల్పేని ద్వీపంలో ఒక క్లబ్ ఉంది –కూమేల్ బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్. ఈ క్లబ్ స్థానిక సంస్కృతి, సంప్రదాయ కళలను కాపాడుకోవడానికి యువతకు స్ఫూర్తినిస్తుంది. ఇక్కడ యువత స్థానిక కళలైన కోల్కలి, పరీచాక్లి, కిలిప్పాట్ట్, సంప్రదాయ గీతాల్లో శిక్షణ పొందుతున్నారు.అంటే పాత వారసత్వాన్ని కొత్త తరం చేతుల్లో భద్రపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిత్రులారా! దేశంలోనే కాదు-విదేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల దుబాయ్ నుంచి అక్కడి కలరి క్లబ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసిందని వార్తలు వచ్చాయి. దుబాయ్ క్లబ్ రికార్డ్ సృష్టించిందని, దీనికి భారతదేశంతో సంబంధం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. వాస్తవానికిఈ రికార్డు భారతదేశంలోని పురాతన యుద్ధ కళ కలరిపయట్టుకు సంబంధించింది. ఏకకాలంలో ఎక్కువ మంది వ్యక్తులు కలరిని ప్రదర్శించినందుకు ఈ రికార్డు నమోదైంది. దుబాయ్ లోని కలరి క్లబ్, దుబాయ్ పోలీసులతో కలిసి దీనికి ప్రణాళిక రూపొందించి, అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో నాలుగేళ్ల పిల్లల నుంచి అరవయ్యేళ్ల వృద్ధుల వరకు కలరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వివిధ తరాలు ప్రాచీన సంప్రదాయాన్నిపూర్తి అంకితభావంతోఎలా ముందుకు తీసుకెళ్తున్నాయో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.
మిత్రులారా!కర్ణాటకలోని గడక్ జిల్లాలో నివసించే 'క్వేమశ్రీ' గారి గురించి కూడా'మన్ కీ బాత్' శ్రోతలకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. దక్షిణాదిలో కర్ణాటక కళ-సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యంలో 'క్వేమశ్రీ'గత 25 సంవత్సరాలుగా నిరంతరం నిమగ్నమై ఉన్నారు. వారి తపస్సు ఎంత గొప్పదో మీరు ఊహించుకోవచ్చు.అంతకుముందు క్వేమశ్రీ గారికి హోటల్ మేనేజ్మెంట్ వృత్తితో సంబంధం కలిగి ఉంది. కానీ సంస్కృతీ సంప్రదాయాలతో లోతైన అనుబంధం ఉండడంతో దాన్ని తన లక్ష్యంగా చేసుకున్నారు. ‘కళా చేతన’ పేరుతో ఓ వేదికను రూపొందించారు.ఈ వేదికకర్ణాటకతో పాటు దేశ విదేశాల కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులోస్థానిక కళను, సంస్కృతిని ప్రోత్సహించడానికి అనేక వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మిత్రులారా!తమ కళ, సంస్కృతి పట్ల దేశప్రజల ఈ ఉత్సాహం 'మన వారసత్వం పట్ల గర్వం' అనే భావానికి నిదర్శనం. మన దేశంలోప్రతి మూలలో చెల్లాచెదురుగా అలాంటి వర్ణమయమైన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. వాటిని అలంకరించడానికి, భద్రపరచడానికి మనం నిరంతరం కృషి చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని అనేక ప్రాంతాల్లో వెదురుతో చాలా అందమైన, ఉపయోగకరమైన వస్తువులు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న వెదురుపనివారు, కళాకారులుఉన్నారు. వెదురుకు సంబంధించిన బ్రిటిష్ కాలంనాటి చట్టాలను మార్చినప్పటి నుండిదానికి భారీ మార్కెట్ అభివృద్ధి చెందింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ వంటి ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు వెదురుతో ఎన్నో అందమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.వెదురుతో చేసిన పెట్టెలు, కుర్చీలు, టీపాట్‌లు, బుట్టలు, ట్రేలు మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతే కాదు- ఈ వ్యక్తులు వెదురు గడ్డితో అందమైన బట్టలు, అలంకరణ వస్తువులు కూడా చేస్తారు. దీనివల్ల ఆదివాసీ మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. వారి నైపుణ్యానికి కూడా గుర్తింపు లభిస్తోంది.
మిత్రులారా!కర్నాటకకు చెందిన ఓ జంట తమలపాకుతో తయారు చేసిన అనేక ప్రత్యేకమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పంపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ దంపతులు - శ్రీ సురేష్ గారు, ఆయన భార్య శ్రీమతి మైథిలి గారు. వారు తమలపాకు పీచుతో ట్రేలు, ప్లేట్లు, హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి మొదలుకొని అనేక అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.ఈ పీచుతో చేసిన చెప్పులను కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. వారి ఉత్పత్తులను లండన్, ఐరోపాలోని ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇది అందరూ ఇష్టపడుతున్నమన సహజ వనరులు, సంప్రదాయ నైపుణ్యాల నాణ్యత. ఈ సంప్రదాయ జ్ఞానంలోప్రపంచం స్థిరమైన భవిష్యత్తు వైపు చూస్తోంది. మనం కూడా ఈ దిశగా మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.మనమే అలాంటి స్వదేశీ, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇతరులకు కూడా బహుమతిగా ఇవ్వాలి. ఇది మన గుర్తింపును దృఢపరుస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజల భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు మనం 'మన్ కీ బాత్'లో అపూర్వమైన మైలురాయి వందవ ఎపిసోడ్ వైపు నెమ్మదిగా కదులుతున్నాం. నాకు చాలా మంది దేశప్రజల నుండి లేఖలు వచ్చాయి. అందులో వారు వందవ ఎపిసోడ్ గురించి చాలా ఉత్సుకతను వ్యక్తం చేశారు. వందవ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడాలి, దాన్ని ఎలా ప్రత్యేకంగా రూపొందించాలనే దానిపై మీరు మీ సూచనలను పంపితే నేను సంతోషపడతాను. తర్వాతిసారి మనం 2023 సంవత్సరంలో కలుద్దాం. 2023 సంవత్సరానికి మీకు శుభాకాంక్షలు.ఈ సంవత్సరం కూడా దేశానికి ప్రత్యేకం కావాలని, దేశం కొత్త శిఖరాలను తాకాలని కోరుకుందాం. అందరం కలిసి ఒక తీర్మానం చేయాలి. అలాగే దాన్ని సాకారం చేయాలి. ఈ సమయంలో చాలా మంది సెలవుల మూడ్‌లో ఉన్నారు.మీరు ఈ పండుగలను చాలా ఆనందించండి. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా పెరుగుతోందని మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలపై మరింత దృష్టి పెట్టాలి. మనం జాగ్రత్తగా ఉంటేసురక్షితంగా కూడా ఉంటాం. మన ఆనందానికి ఎటువంటి ఆటంకం ఉండదు. దీంతో మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు.చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం... మీ అందరికీ మరోసారి 'మన్ కీ బాత్'లోకి స్వాగతం. ఈ కార్యక్రమం 95వ ఎపిసోడ్. 'మన్ కీ బాత్' వందో సంచిక వైపు మనం వేగంగా దూసుకుపోతున్నాం. 130 కోట్ల మంది దేశప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యమం. ప్రతి ఎపిసోడ్‌కు ముందుగ్రామాలు, నగరాల నుండి వచ్చే చాలా ఉత్తరాలను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాలు వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.
మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది.చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు.దేశం సాధించిన ఈ విజయం నుండి పొందిన ఆనందంతో ఆయన తన స్వహస్తాలతో జి-20 లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి ఇష్టంతో అందులో నిమగ్నమై ఉన్నారు.
మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందాను. ఈ లోగోను పోటీ ద్వారా ఎంపిక చేశారు. హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్ గారి లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు.పూణే నుండి సుబ్బారావు చిల్లరా గారు, కోల్‌కతా నుండి తుషార్ జగ్మోహన్ గారు పంపిన సందేశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. జి-20 మొదలుకుని భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.
మిత్రులారా!జి-20 దేశాలకు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో నాలుగింట మూడు వంతులు, ప్రపంచ జిడిపిలో 85%భాగస్వామ్యం ఉంది. మీరు ఊహించవచ్చు- 3 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తిమంత మైన సమూహానికిఅధ్యక్షత వహించబోతోంది. భారతదేశానికి, ప్రతి భారతీయుడికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది! స్వతంత్ర భారత అమృతోత్సవ కాలంలో భారతదేశానికి ఈ బాధ్యత లభించినందువల్ల ఇది మరింత ప్రత్యేకమైంది. మిత్రులారా!జి-20 అధ్యక్ష పదవి మనకు గొప్ప అవకాశంగా వచ్చింది. మనం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. విశ్వ కళ్యాణంపై-ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలి. శాంతి కావచ్చు. ఐక్యత కావచ్చు. పర్యావరణం నుండి మొదలుకుని సున్నితమైన విషయాలు కావచ్చు. సుస్థిర అభివృద్ధి కావచ్చు. ఏ విషయమైనా సరే.. వీటికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం దగ్గర పరిష్కారాలున్నాయి. ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు అనే అంశంతో వసుధైక కుటుంబ భావన మన నిబద్ధతను తెలియజేస్తుంది.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు
సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు
సర్వేషాం మంగళం భవతు
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
- అని మనం ఎప్పుడూ చెప్తాం.
అంటే “అందరూ క్షేమంగా ఉండాలి. అందరికీ శాంతి లభించాలి. అందరికీ పూర్ణత్వం సిద్ధించాలి. అందరికీ శుభం కలగాలి” అని. రానున్న రోజుల్లో జి-20కి సంబంధించిన అనేక కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఈ సమయంలోప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మీ రాష్ట్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మీరు ఇక్కడి సంస్కృతిలోని విభిన్నమైన, విలక్షణమైన రంగులను ప్రపంచానికి అందిస్తారన్న నమ్మకం నాకుంది. జి-20 సమావేశాలకు వచ్చేవారు ఇప్పుడు ప్రతినిధులుగా వచ్చినప్పటికీ వారు భవిష్యత్తులో పర్యాటకులనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. హరిప్రసాద్ గారిలాగా అందరూ ఏదో ఒకరకంగా జి-20తో అనుసంధానం కావాలని మీ అందరినీ- ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను. జి-20 భారతీయ లోగోను చాలా ఆకర్షణీయంగా, కొత్త సొగసుతో తయారు చేసి బట్టలపై ముద్రించవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ తమ ప్రదేశాల్లో జి-20కి సంబంధించిన చర్చలకు, పోటీలకు అవకాశాలను కల్పించాలని కూడా నేను కోరుతున్నాను. మీరు జి20 డాట్ ఇన్ వెబ్సైట్ చూస్తే మీ ఆసక్తికి అనుగుణంగా చాలా విషయాలు కనిపిస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!నవంబర్ 18న అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించడాన్ని యావద్దేశం చూసింది. ఆ రోజునభారతదేశంలోని ప్రైవేట్ రంగం రూపొందించి, సిద్ధం చేసిన తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ పేరు 'విక్రమ్-ఎస్'. స్వదేశీ స్పేస్ స్టార్ట్-అప్ తో రూపొందించిన ఈ మొదటి రాకెట్ శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ఎగిరినవెంటనే ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకున్నాడు.మిత్రులారా! 'విక్రమ్-ఎస్' రాకెట్ ను అనేక ఫీచర్లతో అమర్చారు. ఇది ఇతర రాకెట్ల కంటే తేలికైంది. చవకైంది. దీని అభివృద్ధి వ్యయం అంతరిక్ష యాత్రలో పాల్గొన్న ఇతర దేశాల ఖర్చు కంటే చాలా తక్కువ. తక్కువ ఖర్చుతోప్రపంచ స్థాయి నాణ్యత. అంతరిక్ష సాంకేతికతలో ఇప్పుడు ఇది భారతదేశానికి గుర్తింపుగా మారింది.ఈ రాకెట్ తయారీలో మరో ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ రాకెట్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి 'విక్రమ్-ఎస్' లాంచ్ మిషన్కి పెట్టిన పేరు 'ప్రారంభ్' సరిగ్గా సరిపోతుంది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ప్రారంభం.దేశంలో విశ్వాసంతో నిండిన కొత్త శకానికి ఇది నాంది. చేతితోకాగితపు విమానాలను నడిపే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే విమానాలను తయారుచేసి, ఎగురవేయగలరని మీరు ఊహించవచ్చు.ఒకప్పుడు చంద్రుడు, నక్షత్రాలను చూస్తూ ఆకాశంలో ఆకారాలు గీసే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే రాకెట్లు తయారు చేసే అవకాశం పొందుతున్నారని మీరు ఊహించవచ్చు.అంతరిక్షరంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించిన తర్వాత యువత కలలు కూడా సాకారమవుతున్నాయి. రాకెట్లను తయారు చేస్తున్నఈ యువత ఆకాశం కూడా హద్దు కాదంటోంది.
మిత్రులారా!భారతదేశం అంతరిక్ష రంగంలో తన విజయాన్ని తన పొరుగు దేశాలతో కూడా పంచుకుంటుంది. భారతదేశం, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని నిన్ననే భారతదేశం ప్రయోగించింది. భూటాన్ సహజ వనరుల నిర్వహణలో సహాయపడే విధంగా ఈ ఉపగ్రహం చాలా చక్కటి స్పష్టత ఉన్న చిత్రాలను పంపుతుంది. ఈ ఉపగ్రహ ప్రయోగం భారత్-భూటాన్ దేశాల మధ్య దృఢ సంబంధాలకు అద్దం పడుతోంది.
మిత్రులారా!గత కొన్ని 'మన్ కీ బాత్' ఎపిసోడ్లలో మనం అంతరిక్షం, సాంకేతికత, ఆవిష్కరణల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మీరు గమనించి ఉంటారు. దీనికి రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఒకటి మన యువత ఈ రంగంలో అద్భుతంగా పనిచేస్తోంది. యువకులు భారీస్థాయిలో ఆలోచిస్తున్నారు. భారీస్థాయిలో సాధిస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విజయాలతో వారు సంతృప్తి చెందడం లేదు. రెండవది-ఆవిష్కరణ, విలువ సృజనల ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో యువకులు ఇతర యువ సహచరులను, స్టార్ట్-అప్‌లను కూడా ప్రోత్సహిస్తున్నారు.
మిత్రులారా!టెక్నాలజీకి సంబంధించిన ఆవిష్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడుమనం డ్రోన్లను ఎలా మరచిపోగలం? డ్రోన్ల రంగంలో భారత్ కూడా వేగంగా దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో డ్రోన్ల ద్వారా ఆపిల్లను ఎలా రవాణా చేశారో చూశాం. కిన్నౌర్ హిమాచల్‌లోని మారుమూల జిల్లా. ఈ సీజన్లో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది.ఇంత ఎక్కువ హిమపాతంతోకిన్నౌర్ కు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో వారాల తరబడి అనుసంధానం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలోఅక్కడి నుండి యాపిల్స్ రవాణా కూడా అంతే కష్టం. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ సహాయంతోహిమాచల్‌లోని రుచికరమైన కిన్నౌరి యాపిల్స్ ప్రజలకు మరింత త్వరగా చేరువకానున్నాయి. దీని వల్ల మన రైతు సోదర సోదరీమణుల ఖర్చు తగ్గుతుంది. యాపిల్స్ సమయానికి మార్కెట్‌కు చేరుతాయి. యాపిల్స్ వృధా తగ్గుతుంది.
మిత్రులారా! గతంలో ఊహకు కూడా వీలు కాని విషయాలను ఈ రోజు మన దేశవాసులు తమ ఆవిష్కరణలతో సాధ్యం చేస్తున్నారు. ఇది చూస్తే ఎవరు మాత్రం సంతోషించకుండా ఉంటారు? ఇటీవలి సంవత్సరాల్లోమన దేశం చాలా విజయాలు సాధించింది. భారతీయులు- ముఖ్యంగా మన యువతరం- ఇంతటితో ఆగబోదని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ప్రియమైన దేశప్రజలారా! నేను మీ కోసం ఒక చిన్న క్లిప్ వినిపించబోతున్నాను.
##(పాట)##
మీరందరూ ఈ పాటను ఎప్పుడో ఒకసారి విని ఉంటారు. ఇది బాపుకి ఇష్టమైన పాట. ఈ పాట పాడిన గాయకులు గ్రీస్ దేశస్థులని నేను చెబితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! ఈ విషయం కూడా మీరు గర్వించేలా చేస్తుంది. ఈ పాటను గ్రీస్ గాయకుడు ‘కాన్ స్టాంటినోస్ కలైట్జిస్’ పాడారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన దీన్ని పాడారు. కానీ ఈ రోజు నేను వేరే కారణాల వల్ల ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఆయనకు భారతదేశంపై,భారతీయ సంగీతంపై గొప్ప అభిరుచి ఉంది. ఆయనకు భారతదేశంపై ఎంతో ప్రేమ. గత 42 సంవత్సరాలలో ఆయన దాదాపు ప్రతి ఏటా భారతదేశానికి వచ్చారు. భారతీయ సంగీత మూలాలు, వివిధ భారతీయ సంగీత వ్యవస్థలు, వివిధ రకాల రాగాలు, తాళాలు, రసాలతో పాటు వివిధ ఘరానాల గురించి ఆయనఅధ్యయనం చేశారు. భారతీయ సంగీతానికి చెందిన అనేక మంది గొప్ప వ్యక్తుల సేవలను అధ్యయనం చేశారు. భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలకు సంబంధించిన విభిన్న అంశాలను కూడా నిశితంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఈ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో చాలా అందంగా పొందుపరిచారు. ఇండియన్ మ్యూజిక్ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో దాదాపు 760 చిత్రాలు ఉన్నాయి.ఈ ఛాయాచిత్రాల్లో చాలా వరకు ఆయనే తీశారు. ఇతర దేశాల్లో భారతీయ సంస్కృతిపై ఇటువంటి ఉత్సాహం,ఆకర్షణ నిజంగా సంతోషాన్నిస్తుంది.
మిత్రులారా!కొన్ని వారాల క్రితం మనం గర్వించదగ్గ మరో వార్త కూడా వచ్చింది. గత 8 సంవత్సరాల్లో భారతదేశం నుండి సంగీత వాయిద్యాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగిందని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఎలక్ట్రికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగుమతి 60 రెట్లు పెరిగింది.భారతీయ సంస్కృతికి, సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోందని దీన్నిబట్టి తెలుస్తోంది. అమెరికా సంయుక్తరాష్ట్రాలు, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే మొదలైన అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ సంగీత వాయిద్యాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. సంగీతం, నృత్యం, కళల విషయంలో గొప్ప వారసత్వ సంపదను మన దేశం కలిగి ఉండటం మనందరి అదృష్టం.
మిత్రులారా! 'నీతి శతకం' కారణంగా ఆ శతక కర్త, గొప్ప కవి భర్తృహరి మనందరికీ తెలుసు. కళ, సంగీతం, సాహిత్యం పట్ల మనకున్న అనుబంధమే మానవత్వానికి నిజమైన గుర్తింపు అని ఆయన ఒక శ్లోకంలో చెప్పారు. నిజానికిమన సంస్కృతి దాన్ని మానవత్వానికి మించి దైవత్వానికి తీసుకువెళుతుంది. వేదాలలోసామవేదాన్ని మన విభిన్న సంగీతాలకు మూలంగా పేర్కొంటారు. సరస్వతీ మాత వీణ అయినా, భగవాన్ శ్రీకృష్ణుడి వేణువు అయినా, భోలేనాథుడి ఢమరు అయినామన దేవతలు కూడా సంగీతానికి భిన్నంగా ఉండరు. భారతీయులమైన మనం ప్రతిదానిలో సంగీతాన్ని అన్వేషిస్తాం. నది గలగలలైనా, వాన చినుకుల టపటప చప్పుడు అయినా, పక్షుల కిలకిలారావాలైనా, గాలి ప్రతిధ్వనులైనా మన నాగరికతలో సంగీతం ప్రతిచోటా ఉంటుంది.ఈ సంగీతం శరీరాన్ని సేద తీర్చడమే కాకుండా మనసును కూడా ఆహ్లాదపరుస్తుంది. సంగీతం మన సమాజాన్ని కూడా అనుసంధానిస్తుంది. భాంగ్రా, లావణి లలో ఉత్సాహం, ఆనందం ఉంటేరవీంద్ర సంగీతం మన ఆత్మను ఉల్లాసపరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు విభిన్నసంగీత సంప్రదాయాలున్నాయి. ఒకరితో కలిసి ఉండేందుకు, ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ఇవి మనకు స్ఫూర్తినిస్తాయి.మిత్రులారా!మన సంగీత రూపాలు మన సంస్కృతిని సుసంపన్నం చేయడమే కాకుండా ప్రపంచ సంగీతంపై చెరగని ముద్ర వేశాయి. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచంలోని నలుమూలలకు వ్యాపించింది. మీకు మరో ఆడియో క్లిప్ వినిపిస్తాను.
##(పాట)##
ఇంటికి సమీపంలోని ఏదో గుడిలో భజన కీర్తనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వరం భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ అమెరికా దేశమైన గయానా నుండి మీకు చేరింది. 19వ,20వ శతాబ్దాలలో ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు గయానాకు వెళ్ళారు.ఇక్కడి నుంచి భారత దేశంలోని అనేక సంప్రదాయాలను కూడా తీసుకెళ్లారు. ఉదాహరణకు-మనం భారతదేశంలో హోలీని జరుపుకుంటున్నప్పుడుగయానాలో కూడా హోలీ రంగులు పలకరిస్తాయి. హోలీ రంగులు ఉన్నచోట ఫగ్వా సంగీతం కూడా ఉంటుంది. గయానాలోని ఫగ్వాలో రాముడితో, శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న పెళ్ళి పాటలు పాడే ప్రత్యేక సంప్రదాయం ఉంది.ఈ పాటలను చౌతాల్ అంటారు. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న అదే రకమైన రాగంలోనే తారాస్థాయిలో వాటిని పాడతారు. ఇది మాత్రమే కాదు-చౌతాల్ పోటీ కూడా గయానాలో జరుగుతుంది. అదేవిధంగాచాలా మంది భారతీయులు-ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుండిప్రజలు ఫిజీకి కూడావెళ్లారు. వారు సంప్రదాయ భజనలు, కీర్తనలు పాడేవారు. వాటిలో ప్రధానంగా రామచరితమానస్ పద్య పాదాలు ఉండేవి.వారు ఫిజీలో భజనలు, కీర్తనలకు సంబంధించిన అనేక సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేశారు. నేటికీ రామాయణ మండలి పేరుతో ఫిజీలో రెండు వేలకు పైగా భజన-కీర్తన మండళ్లు ఉన్నాయి. నేడు ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో వాటిని చూడవచ్చు. నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. మీరు ప్రపంచం మొత్తం మీద చూస్తేభారతీయ సంగీత ప్రియుల జాబితా చాలా పెద్దది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశం ప్రపంచంలోని పురాతన సంప్రదాయాలలో ఒకటైనందుకు మనమందరం ఎప్పుడూ గర్విస్తాం. అందువల్ల, మన సంప్రదాయాలను,సంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడుకోవడం; వాటిని ప్రోత్సహించడం, సాధ్యమైనంతవరకు ముందుకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత.మన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు చెందిన కొందరు మిత్రులు అలాంటి ప్రశంసనీయమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలతో పంచుకోవాలని అనుకున్నాను.
మిత్రులారా!నాగాలాండ్‌లోని నాగా సమాజ జీవనశైలి, వారి కళ, సంస్కృతి, సంగీతంఅందరినీ ఆకర్షిస్తాయి. ఇవి మన దేశ అద్భుతమైన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. నాగాలాండ్ ప్రజల జీవితం, వారి నైపుణ్యాలు కూడా సుస్థిర జీవన శైలికి చాలా ముఖ్యమైనవి.ఈ సంప్రదాయాలను, నైపుణ్యాలను కాపాడడంతో పాటు వాటిని తర్వాతి తరానికి అందించేందుకు అక్కడి ప్రజలు 'లిడి-క్రో-యు' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. మెల్లమెల్లగా అదృశ్యమవుతున్న నాగా సంస్కృతిలోని విశేషాలను పునరుద్ధరించేందుకు 'లిడి-క్రో-యు' సంస్థ కృషి చేస్తోంది. ఉదాహరణకునాగా జానపద సంగీతం సుసంపన్నమైంది.ఈ సంస్థ నాగా మ్యూజిక్ ఆల్బమ్స్ ఆవిష్కరించే పనిని ప్రారంభించింది. ఇప్పటి వరకు అలాంటి మూడు ఆల్బమ్‌లు విడుదలయ్యాయి. వారు జానపద సంగీతం, జానపద నృత్యానికి సంబంధించిన కార్యశాలలను కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించి యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు-సంప్రదాయ నాగాలాండ్ శైలిలో దుస్తుల తయారీ, టైలరింగ్, నేయడంలో కూడా యువతశిక్షణ పొందుతోంది. ఈశాన్యరాష్ట్రాల్లో వెదురుతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు.కొత్త తరానికి చెందిన యువతకు కూడా వెదురు ఉత్పత్తులను తయారు చేయడం నేర్పుతున్నారు. దీంతో ఈ యువత వారి సంస్కృతితో ముడిపడి ఉండటమే కాకుండావారికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. నాగా జానపదసంస్కృతి గురించి మరింత ఎక్కువ మందికి తెలియజేసేందుకులిడి-క్రో-యుసంస్థ కృషి చేస్తోంది.
మిత్రులారా!మీ ప్రాంతంలో కూడా అలాంటి సాంస్కృతిక శైలులు, సంప్రదాయాలు ఉంటాయి. మీరు కూడా మీ ప్రాంతాల్లో అలాంటి కృషి చేయవచ్చు. ఎక్కడైనా ఇలాంటి అద్వితీయ ప్రయత్నాల గురించి మీకు తెలిస్తేఆ సమాచారాన్ని నాతో కూడా పంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!
‘విద్యాధనం సర్వధనప్రధానమ్’ అని లోకోక్తి.
అంటే ఎవరైనా విద్యను దానం చేస్తుంటేఅతను సమాజ హితం కోసం అతిపెద్ద పని చేస్తున్నట్టు. విద్యారంగంలో వెలిగించే చిన్న దీపం కూడా మొత్తం సమాజానికి వెలుగునిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు జరగడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 70-80 కిలోమీటర్ల దూరంలోని హర్దోయ్ ప్రాంతంలో బన్సా ఒక గ్రామం. విద్యలో వెలుగులు నింపే పనిలో నిమగ్నమైన ఈ గ్రామానికి చెందిన జతిన్ లలిత్ సింగ్ గురించి నాకు సమాచారం వచ్చింది. జతిన్ గారు రెండేళ్లకిందట ఇక్కడ సామాజిక గ్రంథాలయాన్ని, వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ కేంద్రంలో హిందీ, ఆంగ్ల సాహిత్యం, కంప్యూటర్, లా అంశాలతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షలసన్నద్ధతకు సంబంధించిన 3000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీలోపిల్లల ఇష్టాయిష్టాలకు కూడా పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఉన్న కామిక్స్ పుస్తకాలను, విద్యాసంబంధమైన బొమ్మలను పిల్లలు చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు ఆటలతో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. చదువులు ఆఫ్‌లైన్ అయినా ఆన్లైన్ అయినాదాదాపు 40 మంది వాలంటీర్లు ఈ కేంద్రంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో తీరికలేకుండా ఉన్నారు.ఈ గ్రంథాలయానికి ప్రతిరోజు 80 మంది విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు.
మిత్రులారా!జార్ఖండ్‌కు చెందిన సంజయ్ కశ్యప్ గారు కూడా పేద పిల్లల కలలకు కొత్త రెక్కలు ఇస్తున్నారు. తన విద్యార్థి జీవితంలోసంజయ్ గారు మంచి పుస్తకాల కొరతను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు లేకపోవడం కారణంగాతమ ప్రాంత పిల్లల భవిష్యత్తు అంధకారం కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మిషన్ కారణంగాఈ రోజు ఆయన జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లలకు 'లైబ్రరీ మ్యాన్' అయ్యాడు.సంజయ్ గారు తన ఉద్యోగ ప్రారంభంలో తన స్వస్థలంలో మొదటి లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కడికి బదిలీ అయినా పేదలు, గిరిజనుల పిల్లల చదువుల కోసం లైబ్రరీని ప్రారంభించే లక్ష్యంతో పనిచేశారు. ఇలా చేస్తూనే జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లల కోసం లైబ్రరీలను ప్రారంభించారు. గ్రంథాలయాన్ని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నేడు సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. సంజయ్ గారు అయినా జతిన్ గారు అయినా...వారి ఇలాంటి అనేక ప్రయత్నాలకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!పరిశోధన, ఆవిష్కరణలతో పాటు అత్యాధునిక సాంకేతికత, పరికరాల సహాయంతో వైద్య విజ్ఞాన ప్రపంచం చాలా పురోగతి సాధించింది. అయితే కొన్ని వ్యాధులు నేటికీ మనకు పెద్ద సవాలుగా ఉన్నాయి. అటువంటి వ్యాధుల్లో ఒకటి కండరాల క్షీణత!ఇది ఏ వయస్సులోనైనా సంభవించే జన్యుపరమైన వ్యాధి. ఇందులో కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగి తన దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి రోగుల చికిత్స, సంరక్షణకు గొప్ప సేవాభావం అవసరం.హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో మనకు అలాంటి కేంద్రం ఉంది. ఇది కండరాల బలహీనత రోగులకు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ కేంద్రం పేరు 'మానవ్ మందిర్'. దీన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ నిర్వహిస్తోంది. ‘మానవ్ మందిర్’ దాని పేరుకు తగ్గట్టుగానే మానవ సేవకు అద్భుతమైన ఉదాహరణ. మూడు-నాలుగేళ్ల క్రితమే ఇక్కడ రోగులకు ఓపీడీ, అడ్మిషన్ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ్ మందిర్‌లో దాదాపు 50 మంది రోగులకు పడకల సౌకర్యం కూడా ఉంది. ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ, హైడ్రోథెరపీలతో పాటు యోగా-ప్రాణాయామం సహాయంతో కూడా వ్యాధులకు చికిత్స చేస్తారు.మిత్రులారా!అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాల ద్వారాఈ కేంద్రం రోగుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించిన సవాళ్లలో ఒకటి దాని గురించి అవగాహన లేకపోవడం. అందుకేఈ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా రోగులకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది. అత్యంత స్ఫూర్తినిచ్చే విషయం ఏమిటంటే ఈ వ్యాధితో బాధపడేవారే ఈ సంస్థ నిర్వహణలో ప్రధానంగా భాగస్వాములు కావడం. సామాజిక కార్యకర్త ఊర్మిళ బల్దీ గారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అధ్యక్షురాలు సోదరి సంజనా గోయల్ గారు, ఈ సంస్థ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన విపుల్ గోయల్ గారు ఈ సంస్థ నిర్వహణలో చాలా ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. మానవ్ మందిర్‌ను ఆసుపత్రిగా, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రోగులకు ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది. ఈ దిశలో ప్రయత్నిస్తున్న అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కండర క్షీణతతో బాధపడుతున్నవారందరికీమంచి జరగాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!నేటి 'మన్ కీ బాత్'లో మనం చర్చించుకున్న దేశవాసుల సృజనాత్మక, సామాజిక కార్యక్రమాలు దేశ సమర్థతకు, ఉత్సాహానికి ఉదాహరణలు. ఈ రోజు ప్రతి దేశవాసీ దేశం కోసం ఏదో ఒక రంగంలోప్రతి స్థాయిలో విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. జి-20 లాంటి అంతర్జాతీయ అంశంలో మన నేత సహచరుడు ఒకరు తన బాధ్యతను అర్థం చేసుకుని దానిని నెరవేర్చేందుకు ముందుకు రావడాన్ని ఈరోజు జరిగిన చర్చలోనే చూశాం.అదేవిధంగా కొందరు పర్యావరణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నీటి కోసం పనిచేస్తున్నారు. చాలా మంది విద్య, వైద్యం, సైన్స్ టెక్నాలజీ నుండి సంస్కృతి-సంప్రదాయాల వరకు అసాధారణమైన కృషి చేస్తున్నారు.ఎందుకంటేఈ రోజు మనలోని ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటున్నాడు.దేశ పౌరులలో అటువంటి కర్తవ్య భావన వచ్చినప్పుడుదేశ బంగారు భవిష్యత్తు దానంతట అదే నిర్ణయమవుతుంది. దేశ బంగారు భవిష్యత్తులో మనకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది.
దేశప్రజల కృషికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీరు మీ సూచనలను, ఆలోచనలను తప్పకుండా పంపుతూ ఉండండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు!
నా ప్రియమైన దేశప్రజలారా!
నమస్కారం!
దేశంలోని అనేక ప్రాంతాల్లో సూర్యారాధన పండుగ 'ఛత్' ను జరుపుకుంటారు. 'ఛత్' పండుగలో భాగంగా లక్షలాది మంది భక్తులు తమ గ్రామాలకు, వారి ఇళ్లకు, వారి కుటుంబాల దగ్గరికి చేరుకున్నారు. ఛత్ మాత ప్రతి ఒక్కరికీ సమృద్ధిని,సంక్షేమాన్ని అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను.
మిత్రులారా!
మన సంస్కృతికి, మన విశ్వాసానికి, ప్రకృతికి ఎంత లోతైన సంబంధం ఉందో చెప్పేందుకు సూర్యారాధన సంప్రదాయమే నిదర్శనం. ఈ పూజ మన జీవితంలో సూర్యకాంతి ప్రాముఖ్యతను వివరిస్తుంది. దీంతో పాటు ఎత్తుపల్లాలు జీవితంలో అంతర్భాగమని సందేశం కూడా ఇస్తుంది. కాబట్టిప్రతి సందర్భంలోనూ మనం ఒకే వైఖరిని కలిగి ఉండాలి. ఛత్ మాత పూజలో వివిధ పండ్లు,తేకువా మిఠాయిలను సమర్పిస్తారు. ఈ వ్రతం ఏ కష్టమైన సాధన కంటే తక్కువేమీ కాదు. ఛత్ పూజలో మరో ప్రత్యేకత ఏమిటంటే పూజకు ఉపయోగించే వస్తువులను సమాజంలోని వివిధ వ్యక్తులు కలిసి తయారుచేస్తారు. ఇందులో వెదురుతో చేసిన బుట్ట లేదా సుప్లిని ఉపయోగిస్తారు. మట్టి దీపాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. దీని ద్వారాశనగలను పండించే రైతులు, పిండిని తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలకు సమాజంలో ప్రాముఖ్యత ఏర్పడింది. వారి సహకారం లేకుండా ఛత్ పూజలు పూర్తికావు. ఛత్ పండుగ మన జీవితంలో పరిశుభ్రత ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ఈ పండుగ సందర్భంగా రోడ్లు, నదులు, ఘాట్లు, వివిధ నీటి వనరులను సమాజ స్థాయిలో శుభ్రం చేస్తారు. ఛత్ పండుగ కూడా 'ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్'కి ఉదాహరణ. ఈరోజు బీహార్, పూర్వాంచల్ ప్రజలు దేశంలో ఏ మూలన ఉన్నా ఛత్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో, ముంబాయితో సహా మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఛత్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుజరాత్లో ఇంతకు ముందు ఛత్ పూజ పెద్దగా జరిగేది కాదని నాకు గుర్తుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాదాపు గుజరాత్ మొత్తంలో ఛత్ పూజ రంగులు కనిపించడం మొదలైంది. ఇది చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో విదేశాల నుంచి కూడా ఛత్ పూజకు సంబంధించిన ఎన్ని అందమైన చిత్రాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటేభారతదేశ గొప్ప వారసత్వం, మన విశ్వాసం, ప్రపంచంలోని ప్రతి మూలలో మన గుర్తింపును పెంచుతున్నాయి. ఈ గొప్ప పండుగలో పాల్గొనే ప్రతి విశ్వాసికి నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!
ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.
తమిళనాడులోని కాంచీపురంలో ఎఝిలన్ అనే రైతు ఉన్నారు. ఆయన 'పిఎం కుసుమ్ యోజన'ని సద్వినియోగం చేసుకున్నారు. తన పొలంలో పది అశ్వ సామర్థ్యాల సోలార్ పంప్‌సెట్‌ను అమర్చారు. ఇప్పుడు తమ పొలానికి కరెంటు కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. పొలంలో సాగునీటి కోసం ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సరఫరాపై కూడా ఆధారపడడం లేదు. అలాగే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కమల్జీ మీనా 'పి.ఎం. కుసుమ్ యోజన' నుండి లబ్ధి పొందారు. కమల్ గారు పొలంలో సోలార్ పంప్‌ను అమర్చారు. దాని కారణంగా ఆయన ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గితే ఆదాయం కూడా పెరుగుతుంది. కమల్ జీ సౌరశక్తి కారణంగా అనేక ఇతర చిన్న పరిశ్రమలకు కూడా విద్యుత్తు లభిస్తోంది. వారి ప్రాంతంలో చెక్క పని ఉంది. ఆవు పేడతో కూడా ఉత్పత్తులు తయారవుతున్నాయి. సోలార్ విద్యుత్తును వాటిలో కూడా వినియోగిస్తున్నారు. వారు 10-12 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అంటే కమల్ జీ ప్రారంభించిన కుసుమ్ యోజన పరిమళం ఎంతో మందికి చేరడం ప్రారంభమైంది.
మిత్రులారా!
మీరు ఒక నెలంతా కరెంటు వాడిన తర్వాత మీకు కరెంటు బిల్లు రావడం కాకుండామీకు అదనంగా ఆదాయం వస్తుందని మీరు ఊహించగలరా? సౌరశక్తి ఈ పని కూడా చేసింది. కొన్ని రోజుల క్రితంమీరు దేశంలోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామం - గుజరాత్‌లోని మోధేరా గురించి చాలా విన్నారు. మోధేరా సౌరగ్రామంలోని చాలా ఇళ్లలో సౌర శక్తి తో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.ఇప్పుడు అక్కడ చాలా ఇళ్లలో నెలాఖరులోగా కరెంటు బిల్లు రావడం లేదు. దానికి బదులుగా కరెంటుతో సంపాదన చెక్కు వస్తోంది. ఇలా జరగడం చూసి ఇప్పుడు దేశంలోని అనేక గ్రామాల ప్రజలు తమ గ్రామాన్ని కూడా సౌరగ్రామంగా మార్చాలని నాకు లేఖలు రాస్తున్నారు. అంటే భారతదేశంలో సౌర గ్రామాల నిర్మాణం పెద్ద ప్రజా ఉద్యమంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. దీని ప్రారంభాన్ని మోధేరా గ్రామ ప్రజలు ఇప్పటికే చేసి చూపించారు.
రండి.. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా మోధేరా ప్రజలను పరిచయం చేద్దాం. శ్రీమాన్ విపిన్‌భాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో ఉన్నారు.
ప్రధానమంత్రి గారు :- విపిన్ భాయ్ నమస్తే! చూడండి.. ఇప్పుడు దేశం మొత్తానికి మోధేరా ఆదర్శంగా నిలిచి చర్చలోకి వచ్చింది. మీ బంధువులు, పరిచయస్తులను మిమ్మల్ని వివరాలు అడిగినప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? ఏం లాభం కలిగింది?
విపిన్ గారు :- సార్ మమ్మల్ని ఎవరైనా అడిగితే ఇప్పుడు కరెంటు బిల్లు జీరోగా వస్తోందని చెప్తాం. ఒక్కోసారి ఇది 70 రూపాయలు వస్తోంది. మొత్తం మీద మా ఊరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
ప్రధానమంత్రి గారు :- అంటే ఒకరకంగా చెప్పాలంటే ఇంతకు ముందులాగా కరెంటు బిల్లు గురించిన ఆలోచన ఇప్పుడు లేదన్నమాట.
విపిన్ గారు :- అవును సార్. అది వాస్తవం సార్. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి టెన్షన్ లేదు. సార్ చేసిన పని బాగుందని అందరూ అనుకుంటున్నారు. వారంతా ఆనందంగా ఉన్నారు సార్. అందరూ సంతోషిస్తున్నారు.
ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మీరే స్వయంగా మీ ఇంట్లోనే కరెంటు ఫ్యాక్టరీకి యజమాని అయ్యారు. మీ స్వంత ఇంటి పైకప్పు మీద విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
విపిన్ జీ :- అవును సార్. నిజమే సార్.
ప్రధానమంత్రి గారు :- ఈ మార్పు గ్రామ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
విపిన్ గారు:- సార్.. ఊరి మొత్తం ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మాకున్న కరెంటు కష్టాలు తీరిపోయాయి. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సార్.
ప్రధానమంత్రి గారు:- అంటే కరెంటు బిల్లు కూడా పోయింది. సౌకర్యం పెరిగింది.
విపిన్ గారు:- మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉంది సార్. ఇక్కడ మొదలైన 3-డిషో తర్వాత మోధేరా గ్రామంలో నాలుగు చందమామలు వచ్చినట్టయింది సార్. అప్పుడు వచ్చిన సెక్రటరీ సార్...
ప్రధాని గారు :- అవును...
విపిన్ గారు :- అలా ఊరు ఫేమస్ అయింది సార్.
ప్రధానమంత్రి గారు :- అవును. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. ఆయన కోరిక అది. ఇంత గొప్ప పనిని అక్కడికి వెళ్లి స్వయంగా చూడాలని ఉందని ఆయన నన్ను కోరారు. విపిన్ సోదరా!మీకు, మీ గ్రామ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచం యావత్తూ మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలని, ఈ సౌరశక్తి ప్రచారం ఇంటింటా జరగాలని కోరుకుంటున్నాను.
విపిన్ గారు :- సరే సార్. ‘సౌరశక్తి ఉపయోగించుకోండి-మీ డబ్బు ఆదా చేసుకోండి’ అని అందరికీ చెప్తాం సార్. దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది సార్.
ప్రధానమంత్రి గారు :- అవును. దయచేసి ప్రజలకు వివరించండి. మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సోదరా!
విపిన్ గారు :- ధన్యవాదాలు సార్. థాంక్యూ సార్. మీతో మాట్లాడటం వల్ల నా జీవితం ధన్యమైంది.
ప్రధాన మంత్రి గారు :- విపిన్ భాయ్ గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మోధేరా గ్రామంలో వర్ష సోదరితో కూడా మాట్లాడదాం.
వర్షాబెన్ :- నమస్తే సార్!
ప్రధాన మంత్రి గారు :- నమస్తే-నమస్తే వర్షాబెన్. మీరు ఎలా ఉన్నారు?
వర్షాబెన్ :- మేం చాలా బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు ?
ప్రధాని గారు:- నేను చాలా బాగున్నాను.
వర్షాబెన్ :- మీతో మాట్లాడినందుకు మేం ధన్యులమయ్యాం సార్.
ప్రధాన మంత్రి గారు :- వర్షాబెన్..
వర్షాబెన్ :- అవును సార్
ప్రధానమంత్రి గారు:- మీరు మోధేరాలో ఉన్నారు. మీరు సైనిక కుటుంబానికి చెందినవారు కదా.
వర్షాబెన్ :- అవును సార్. మాది సైనిక కుటుంబం సార్. మాజీ సైనికుడి భార్యను మాట్లాడుతున్నాను సార్.
ప్రధానమంత్రి గారు:- మీకు భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్లే అవకాశం వచ్చింది?
వర్షాబెన్ :- నేను రాజస్థాన్‌కు వెళ్ళాను. గాంధీ నగర్‌కు వెళ్ళాను. జమ్మూలో కలిసి ఉండే అవకాశం వచ్చింది. అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి సార్.
ప్రధానమంత్రి గారు:- అవును. మీవారు సైన్యంలో ఉండడం వల్ల మీరు హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారు.
వర్షాబెన్ :- అవును సార్. అవును. నేను నేర్చుకున్నాను.
ప్రధానమంత్రి గారు :- మోధేరాలో వచ్చిన పెద్ద మార్పును చెప్పండి. మీరు ఈ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను పెట్టారు. ప్రజలు మొదట్లో ఏమి చెప్తుండేవారో అప్పుడు మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు ? ఏం జరుగుతుంది ? ఇలా విద్యుత్తు వస్తుందా? ఇవన్నీ మీ మనసులో మెదిలి ఉంటాయి. ఇప్పుడు మీ అనుభవం ఏంటి? దీని వల్ల ఏం లాభం కలిగింది?
వర్షాబెన్:- చాలా లాభం ఉంది. చాలా లాభమే వచ్చింది సార్. మీ వల్లే మా ఊళ్లో ప్రతిరోజు దీపావళి జరుపుకుంటారు. 24 గంటలు కరెంటు వస్తోంది. బిల్లు అస్సలే రావడం లేదు. మా ఇంట్లోకి అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు తెచ్చుకున్నాం సార్. మీ వల్లే అన్నీ వాడుతున్నాం సార్. బిల్లు అసలే రాకపోతే డబ్బు ఖర్చు ధ్యాసే లేకుండా వాడుకోవచ్చు కదా!
ప్రధానమంత్రి గారు :- ఇది నిజమే. మీరు కూడా కరెంటును ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
వర్షాబెన్ :- నిర్ణయించాం సార్. నిర్ణయించాం. ప్రస్తుతం మాకు ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ మనం ఫ్రీ మైండ్‌తో ఉపయోగించుకోవచ్చు. అన్నీ ఉన్నాయి.. వాషింగ్ మెషీన్, ఏసీ.. అన్నీ ఉపయోగించుకుంటున్నాం సార్.
ప్రధానమంత్రి గారు:- మరి ఊళ్లోని మిగతా ప్రజలు కూడా దీనివల్ల సంతోషంగా ఉన్నారా?
వర్షాబెన్ :- చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్.
ప్రధానమంత్రి గారు:- అక్కడ సూర్య దేవాలయంలో పని చేసేది మీ భర్తేనా? అక్కడ జరిగిన లైట్ షో ఎంతో పెద్ద ఈవెంట్ కావడంతో ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు.
వర్షా బెన్ :- ప్రపంచం నలుమూలల నుండి విదేశీయులు రావచ్చు కానీ మీరు మా ఊరుప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేశారు సార్.
ప్రధానమంత్రి గారు:- అయితే గుడిని చూసేందుకు చాలా మంది అతిథులు వస్తుండడంతో మీ భర్తకు ఇప్పుడు పని పెరిగి ఉండవచ్చు..
వర్షా బెన్ :- పని ఎంత పెరిగినా ఫర్వాలేదు సార్. మా వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్లండి.
ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మనమందరం కలిసి గ్రామాభివృద్ధి చేయాలి.
వర్షా బెన్ :- అవును. అవును సార్. మేం మీతో ఉన్నాం.
ప్రధానమంత్రి గారు:- నేను మోధేరా ప్రజలను అభినందిస్తున్నాను. ఎందుకంటే గ్రామం ఈ పథకాన్ని అంగీకరించింది. మన ఇంట్లో విద్యుత్తును తయారు చేయగలమని వారు విశ్వసించారు.
వర్షా బెన్ -: 24 గంటలు సార్! మా ఇంట్లో కరెంటు ఉంది. చాలా సంతోషంగా ఉంది.
ప్రధానమంత్రి గారు :- రండి! నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. కరెంటు బిల్లు ఆదావల్ల మిగిలిన డబ్బును పిల్లల అభ్యున్నతికి వినియోగించండి. మీ జీవితానికి ప్రయోజనం చేకూర్చేలా ఆ డబ్బును బాగా ఉపయోగించండి. నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. మోధేరా ప్రజలందరికీ నా నమస్కారాలు!
మిత్రులారా!
వర్షాబెన్, బిపిన్ భాయ్ చెప్పిన విషయాలు దేశం మొత్తానికి, గ్రామాలకు, నగరాలకు ప్రేరణ. మోధేరా అనుభవం దేశవ్యాప్తంగా పునరావృతమవుతుంది. సౌర శక్తి ఇప్పుడు డబ్బును ఆదా చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన మిత్రులు మంజూర్ అహ్మద్ లఢ్వాల్. కాశ్మీర్లో చలి ఎక్కువ కావడంతో కరెంటు ఖర్చు కూడా ఎక్కువే. ఈ కారణంగా మంజూర్ గారి కరెంటు బిల్లు కూడా 4 వేల రూపాయలకు పైగా వచ్చేది. కానీమంజూర్ గారి ఇంట్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన ఖర్చు సగానికి పైగా తగ్గింది. అదే విధంగా ఒడిషాకు చెందిన కున్ని దేవురి అనే అమ్మాయి తనతో పాటు ఇతర మహిళలకు కూడా సౌరశక్తిని ఉపాధి మాధ్యమంగా మారుస్తోంది. ఒడిషాలోని కేందుఝర్ జిల్లా కర్దాపాల్ గ్రామంలో కున్ని నివసిస్తున్నారు. సౌరశక్తితో నడిచే రీలింగ్ యంత్రంతో పట్టు వడకడంపై ఆదివాసీ మహిళలకు ఆమె శిక్షణ ఇస్తున్నారు. సోలార్ మెషీన్ ఫలితంగా ఈ ఆదివాసీ మహిళలకు కరెంటు బిల్లుల భారం లేకపోగా, ఆదాయాన్ని కూడాపొందుతున్నారు. ఇది సూర్య భగవానుడి సౌరశక్తి వరం. వరం, ప్రసాదం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుచేతమీరు ఇందులో చేరండి. ఇతరులను కూడా చేర్చండి.
నా ప్రియమైన దేశప్రజలారా!
ఇప్పటివరకు నేను మీతో సూర్యుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతరిక్షం వైపు మతోంది. అందుకు కారణం మన దేశం సోలార్ రంగంతో పాటు అంతరిక్ష రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. భారతదేశం సాధించిన విజయాలను చూసి ప్రపంచం మొత్తం నేడు ఆశ్చర్యపోతోంది. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలకు ఈ విషయం చెప్పి వారిని కూడా సంతోషపెట్టాలని అనుకున్నాను.
మిత్రులారా!కొద్దిరోజుల క్రితం భారతదేశం ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడాన్ని మీరు చూసిఉంటారు. దీపావళికి సరిగ్గా ఒక్కరోజు ముందు సాధించిన ఈ విజయం ఒక విధంగా మన యువత నుండి దేశానికి ప్రత్యేకమైన దీపావళి కానుక. ఈ ప్రయోగంతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. దీని సహాయంతోమారుమూల ప్రాంతాలు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానమవుతాయి. దేశం స్వావలంబన సాధించినప్పుడు కొత్త విజయ శిఖరాలకు చేరుకుంటుందని చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ. మీతో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడుభారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికతను ఇవ్వడాన్ని నిరాకరించిన పాత కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను.కానీ, భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా ఇప్పుడు దాని సహాయంతో ఏకకాలంలో పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో ఇప్పుడు ప్రపంచ వాణిజ్య విపణిలో భారతదేశం సుదృఢ స్థానం పొందింది. మనకు కొత్త అవకాశాల ద్వారాలు కూడా తెరుచుకున్నాయి.
మిత్రులారా!
‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే సంకల్పంతో నడుస్తున్న మన దేశం ప్రతి ఒక్కరి కృషితోనే తన లక్ష్యాలను చేరుకోగలదు.భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే ఉండేది. యువత కోసం, ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వడంతో ఇందులో విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి.భారతీయ పరిశ్రమలు,స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలను,కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయి. విశేషించి ఇన్-స్పేస్ సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ప్రభుత్వేతర సంస్థలు కూడా తమ పేలోడ్లు, ఉపగ్రహాలను IN-SPAce ద్వారా ప్రయోగించే సౌకర్యాన్ని పొందుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారతదేశంలోని ఈ భారీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని నేను స్టార్టప్‌లను, ఆవిష్కర్తలను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!
విద్యార్థులు, యువశక్తి, నాయకత్వ శక్తి విషయాలకు వస్తే మనలో పాతుకుపోయిన ఎన్నో మూస భావనలు, పాత విషయాలు గుర్తుకువస్తాయి. విద్యార్థి శక్తి విషయానికి వస్తే దాని పరిధిని విద్యార్థి సంఘం ఎన్నికలతో జోడించడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ విద్యార్థి శక్తి పరిధి చాలా పెద్దది. చాలా విస్తృతమైంది. భారతదేశాన్ని శక్తిమంతం చేయడానికి విద్యార్థి శక్తి ఆధారం. నేటి యువత భారతదేశాన్ని 2047 వరకు తీసుకువెళ్తుంది. భారతదేశం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడుఈ యువత శక్తి, వారి శ్రమ, వారి చెమట, వారి ప్రతిభ, భారతదేశాన్ని ఈ రోజు సంకల్పిస్తున్న ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. నేటి మన యువత దేశం కోసం పని చేస్తున్న తీరును, వారు దేశ నిర్మాణంలో చేరిన తీరును చూసి నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మన యువత హ్యాకథాన్లలో సమస్యలను పరిష్కరించే విధానం, రాత్రంతా మేల్కొని గంటల తరబడి శ్రమించే తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. దేశంలోని లక్షలాది మంది యువతగత సంవత్సరాల్లో నిర్వహించిన హ్యాకథాన్ లలో అనేక సవాళ్లను పరిష్కరించింది. దేశానికి కొత్త పరిష్కారాలను అందించింది.
మిత్రులారా!
మీకు గుర్తుండే ఉంటుంది- నేను ఎర్రకోట నుండి 'జై అనుసంధాన్' అని ఆహ్వానించాను. ఈ దశాబ్దాన్ని ‘టెకేడ్’ గా మార్చడం గురించి కూడా నేను మాట్లాడాను. దీన్ని చూడటం నాకు చాలా ఇష్టం. మన ఐ.ఐ.టి.ల విద్యార్థులు కూడా దీని స్ఫూర్తి ని తీసుకున్నారు.ఈ నెల-అక్టోబరు- 14-15 తేదీల్లో మొత్తం 23 ఐ.ఐ.టి.లు తమ ఆవిష్కరణలు,పరిశోధన ప్రాజెక్టులను ప్రదర్శించడానికి మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు 75కు పైగా అత్యుత్తమ ప్రాజెక్టులను ఈ మేళాలో ప్రదర్శించారు.ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమీకండక్టర్స్, ఫైవ్- జికమ్యూనికేషన్స్ ఇలా ఎన్నో ఇతివృత్తాలపై ఈ ప్రాజెక్ట్‌లను రూపొందించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఒకదాన్ని మించినవి మరొకటి అయినప్పటికీకొన్ని ప్రాజెక్టుల గురించి మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. ఉదాహరణకు ఐఐటి భువనేశ్వర్‌కు చెందిన ఒక బృందం నవజాత శిశువుల కోసం పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఇది నెలలు నిండకుండా జన్మించిన శిశువుల జీవితాలను రక్షించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, డ్రోన్ సాంకేతికత, ఫైవ్-జి - ఏదైనా కావచ్చు, మన విద్యార్థులు చాలా మంది వాటికి సంబంధించిన కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. స్థానిక భాషలను నేర్చుకునే విధానాన్ని సులభతరం చేసే బహుభాషా ప్రాజెక్టులో వివిధ ఐఐటిలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కొత్త జాతీయ విద్యా విధాన లక్ష్యాలను సాధించడంలో చాలా సహాయపడుతుంది. భారతదేశ స్వదేశీ ఫైవ్-జి టెస్ట్ బెడ్‌ను అభివృద్ధి చేయడంలో ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ ప్రముఖ పాత్ర పోషించాయని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప ప్రారంభం. రాబోయే కాలంలో ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలని నేను ఆశిస్తున్నాను. ఐఐటిలు, ఇతర సంస్థలు కూడా తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!
పర్యావరణం పట్ల సున్నితత్వం మన సమాజంలోని అణువణువులో ఇమిడి ఉంది. మన చుట్టూ మనం దాన్ని అనుభవించగలం. పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలను వెచ్చించే వారికి దేశంలో కొరత లేదు.
కర్ణాటకలోని బెంగుళూరులో నివసిస్తున్న సురేష్ కుమార్ గారి నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయనకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో గొప్ప అభిరుచి ఉంది. ఆయన ఇరవై ఏళ్ల క్రితం నగరంలోని సహకారనగర్‌లో ఒక అడవిని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వాటి అందాలు అందరి మనసులను దోచుకుంటున్నాయి. ఇది అక్కడ నివసించే ప్రజలకు కూడా గర్వకారణం. సురేష్ కుమార్ గారు అద్భుతమైన పని చేశారు. కన్నడ భాష , సంస్కృతులను పెంపొందించేందుకు సహకరనగర్లో బస్ షెల్టర్‌ను కూడా నిర్మించారు. కన్నడలో రాసిన ఇత్తడి పలకలను వందలాది మందికి బహూకరించారు. పర్యావరణం – సంస్కృతి రెండూ కలిసి వృద్ధి చెంది, వికసించాలంటే... ఇది ఎంత పెద్ద కార్యమో ఆలోచించండి.
మిత్రులారా!
ఈ రోజు ప్రజల్లో పర్యావరణ అనుకూల జీవన విధానం, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల గురించి గతంలో కంటే ఎక్కువ అవగాహన కనిపిస్తోంది. తమిళనాడు నుండి అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయత్నం గురించి తెలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. కోయంబత్తూరులోని అనైకట్టిలో ఆదివాసి మహిళల బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నం ఇది. ఈ మహిళలు ఎగుమతుల కోసం పది వేల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట టీ కప్పులను తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టెర్రకోట టీ కప్పుల తయారీ బాధ్యతను ఈ మహిళలే స్వయంగా తీసుకున్నారు. క్లే మిక్సింగ్ నుంచి ఫైనల్ ప్యాకేజింగ్ వరకు స్వయంగా చేశారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి ఎలాంటి ప్రశంసలు దక్కినా తక్కువే.
మిత్రులారా!
త్రిపురలోని కొన్ని గ్రామాలు కూడా చాలా మంచి పాఠాలు చెప్పాయి. మీరు బయో-విలేజ్ గురించి వినే ఉంటారు. కానీ త్రిపురలోని కొన్ని గ్రామాలు బయో-విలేజ్-2నిచ్చెనను అధిరోహించాయి. బయో-విలేజ్ 2 ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించాలో నొక్కి చెబుతుంది. ఇందులోవివిధ ఆలోచనల ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పూర్తి శ్రద్ధ పెడతారు. సౌరశక్తి, బయోగ్యాస్, తేనెటీగల పెంపకం,బయో ఫెర్టిలైజర్లపై పూర్తి దృష్టి పెడతారు. మొత్తమ్మీద చూస్తే వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి బయో-విలేజ్ 2మరింత బలం చేకూరుస్తుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొద్ది రోజుల కిందట భారతదేశంలోపర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితమైన మిషన్ లైఫ్ కూడా ప్రారంభమైంది. మిషన్ లైఫ్ సాధారణ సూత్రం పర్యావరణానికి హాని కలిగించని జీవనశైలినిప్రోత్సహించడం. మిషన్ లైఫ్ గురించి తెలుసుకుని, దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!
రేపు- అక్టోబర్ 31- జాతీయ ఐక్యతా దినోత్సవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభ సందర్భం. ఈ రోజున దేశంలోని ప్రతి మూలలో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తారు. ఈ పరుగు దేశంలో ఐక్యతా సూత్రాన్ని బలపరుస్తుంది. మన యువతకు స్ఫూర్తినిస్తుంది. కొద్ది రోజుల క్రితం మన జాతీయ క్రీడల సందర్భంగా కూడా అదే భావన కనిపించింది. 'జుడేగా ఇండియా తో జీతేగా ఇండియా' – అంటే ‘దేశం అనుసంధానమైతే విజయం సాధిస్తుంది’ అనే థీమ్తోజాతీయ క్రీడలు బలమైన ఐక్యతా సందేశాన్ని అందించాయి. భారతదేశ క్రీడా సంస్కృతిని కూడా ప్రోత్సహించాయి. భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో ఇవే అతిపెద్ద జాతీయ క్రీడలని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఇందులో 36 క్రీడలను చేర్చారు. వాటిలో 7 కొత్త పోటీలతో పాటు రెండు దేశీయ పోటీలు- యోగాసనాలు,మల్లాఖంబ్ కూడా చేర్చారు. స్వర్ణ పతకం గెలుచుకోవడంలో ముందంజలో ఉన్న మూడు జట్లు – సర్వీసెస్ టీమ్, మహారాష్ట్ర ,హర్యానా టీమ్. ఈ గేమ్‌లలో ఆరు జాతీయ రికార్డులను నెలకొల్పారు. సుమారు 60 జాతీయ క్రీడల రికార్డులను కూడా సృష్టించారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న, పతకాలు సాధించిన, కొత్త రికార్డులు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు. ఈ ఆటగాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా!
గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుజరాత్లో నవరాత్రుల సందర్భంగా జాతీయ క్రీడలు నిర్వహించడం మీరు చూశారు. ఈ సమయంలో గుజరాత్ మొత్తం నవరాత్రుల ఉత్సవాల్లో ఉండడం వల్ల ప్రజలు ఈ ఆటలను ఎలా ఆస్వాదించగలరని ఈ క్రీడల ప్రారంభానికి ముందు ఒకసారి నా మనస్సుకు అనిపించింది. ఇంత పెద్ద క్రీడోత్సవాల వ్యవస్థ- మరోవైపు నవరాత్రుల సందర్భంగా గర్బా మొదలైన వాటికి ఏర్పాట్లు. గుజరాత్ ఏకకాలంలో ఇవన్నీ ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ గుజరాత్ ప్రజలు తమ ఆతిథ్యంతో అతిథులందరినీ సంతోషపెట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా కళ, క్రీడలు,సంస్కృతుల సంగమం జరిగిన తీరు ఆనందాన్ని నింపింది. క్రీడాకారులు కూడా పగటిపూట ఆటలో పాల్గొని, సాయంత్రం గర్బా, దాండియా రంగుల్లో మునిగితేలారు. గుజరాతీ ఆహారంతో పాటు నవరాత్రులకు సంబంధించిన చాలా చిత్రాలను కూడా వారు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇవన్నీ చూడటం మా అందరికీ ఆనందదాయకం. ఇలాంటి ఆటలు భారతదేశంలోని విభిన్న సంస్కృతుల గురించి కూడా వెల్లడిస్తాయి. అవి 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కూడా బలోపేతం చేస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!
నవంబర్ నెలలో 15వ తేదీన మన దేశం ఆదివాసిల గౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది-భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివాసివారసత్వ, గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని దేశం గత సంవత్సరం ప్రారంభించింది.భగవాన్ బిర్సా ముండా తన స్వల్ప జీవితకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మందిని ఏకం చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసి సంస్కృతిపరి రక్షణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
మిత్రులారా!
భగవాన్ బిర్సా ముండా విషయానికి వస్తే.. ఆయన చిన్న జీవిత కాలం చూద్దాం. ఈ రోజు కూడా మనం ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. “ఈ భూమి మనది. మనమే దాని రక్షకులం” అని ఆయన చెప్పేవారు. ఈ వాక్యాల్లో మాతృభూమి పట్ల కర్తవ్యం కూడా ఉంది. పర్యావరణం పట్ల కర్తవ్య భావన కూడా ఉంది. మన ఆదివాసిసంస్కృతిని మరచిపోకూడదని, దానికి దూరంగా వెళ్లకూడదని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. నేటికీదేశంలోని ఆదివాసి సమాజాల నుండి మనం ప్రకృతి, పర్యావరణం మొదలుకుని చాలా విషయాల గురించి నేర్చుకోవచ్చు.
మిత్రులారా!
గత ఏడాది భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగారాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. సమయం దొరికినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించాలని యువతను నేను కోరుతున్నాను. నవంబర్ 1వ తేదీ అంటే ఎల్లుండి గుజరాత్-రాజస్థాన్ సరిహద్దుల్లోని మాన్‌గఢ్ లో ఉంటానని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, మన సుసంపన్నమైన ఆదివాసి వారసత్వంలో మాన్‌గఢ్ కు చాలా విశిష్ట స్థానం ఉంది. 1913నవంబర్ లో ఇక్కడ ఒక భయంకరమైన ఊచకోత జరిగింది. బ్రిటిష్ వారు స్థానిక ఆదివాసిలను దారుణంగా హత్య చేశారు. ఈ మారణకాండలో వెయ్యి మందికి పైగా ఆదివాసి ప్రాణాలు కోల్పోయారని చెప్తారు. ఈ గిరిజన ఉద్యమానికి గోవింద్ గురు జీ నాయకత్వం వహించారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ రోజు గోవింద్ గురు జీ తో సహా ఆ ఆదివాసి అమరవీరులందరూ ప్రదర్శించిన అసమానమైన ధైర్యానికి, పరాక్రమానికి నేను నమస్కరిస్తున్నాను. భగవాన్ బిర్సా ముండా, గోవింద్ గురు, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను ఈ అమృత కాలంలో మనం ఎంత నిష్ఠతో పాటిస్తామోమన దేశం అంతే ఉన్నతంగా ఉంటుంది. ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!
నవంబర్ 8వ తేదీన గురుపురబ్ ఉంది. మన విశ్వాసానికి గురునానక్ జీ ప్రకాశ్ పర్వ్ ఎంతో ముఖ్యమైంది. దాన్నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. గురునానక్ దేవ్ జీ తన జీవితాంతంమానవాళికి వెలుగునిచ్చారు. గత కొన్నేళ్లుగా గురువుల వెలుగులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్‌ను దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం మనకు లభించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం కూడా జరగడం అంతే ఆనందంగా ఉంది. కొద్దిరోజుల క్రితం హేమకుండ్ సాహిబ్ కోసం రోప్‌వేకి పునాది రాయి వేసే అవకాశం కూడా నాకు లభించింది. మనం మన గురువుల ఆలోచనల నుండి నిరంతరం నేర్చుకోవాలి. వారి పట్ల అంకితభావంతో ఉండాలి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కూడా. ఈ రోజు మనం పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానం చేస్తాం. సేవ,దానధర్మాలు చేస్తాం. ఈ పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లోచాలా రాష్ట్రాలు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కేరళలో పిరవి జరుపుకుంటారు. కర్ణాటకలో రాజ్యోత్సవాలు జరుపుకుంటారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా కూడా తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాలన్నింటిలో ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, సహకరించుకోవడం, కలిసి పనిచేయడం అనే స్ఫూర్తి ఎంత బలంగా ఉంటే దేశం అంత ముందుకు సాగుతుంది. ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న నమ్మకం నాకు ఉంది. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. 'మన్ కీ బాత్'లో మళ్ళీ కలిసే వరకు మీ నుండి సెలవు తీసుకునేందుకు నన్ను అనుమతించండి. నమస్కారం, ధన్యవాదాలు.
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.
మిత్రులారా, ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. ఈ టాస్క్ ఫోర్క్ చీతాలను మానిటర్ చేస్తుంది. ఇక్కడ పరిస్థితులతో అవి ఎంతగా కలిసిపోతాయో చూస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని కొన్ని నెలల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. మరి అప్పటిదాకా చీతాలను మనం చూడగలుగుతాం. కానీ అప్పటిదాకా నేను మీకందరికీ కొన్ని పనులు అప్పజెబుతున్నాను. దానికోసం మై గవర్నమెంట్ వేదికమీద ఓ కాంపిటీషన్ ను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో నేను అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను. చీతాలకోసం మనం ఓ పథకాన్ని నడుపుతున్నాం. మరి ఆ పథకానికి ఏ పేరు పెడితే బాగుంటుంది. మనం వాటికి పేరు పెట్టడం గురించి ఆలోచించగలుగుతామా, అసలు వాటిలో ప్రతి ఒక్కదాన్నీ ఏ పేరుతో పిలవాలని. నిజానికి ఆ నామకరణం సంప్రదాయబద్ధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాలతో ముడిపడి ఉన్నది ఏదైనా సరే మనల్ని సహజంగానే దానివైపుకి ఆకర్షిస్తుందికదా. అది మాత్రమే కాదు మీరింకో విషయం కూడా చెప్పాలి. అసలు మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని. మన ప్రాథమిక విధుల్లోకూడా రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్ అనే విషయం మీద కూడా శ్రద్ధ చూపించారు. నేను మీకందరికీ ఏం అప్పీల్ చేస్తున్నానంటే మీరందరూ ఈ కాంపిటీషన్ లో తప్పక భాగస్వాములు కావాలి. ఎవరికి తెలుసు బహుమానంగా చీతాని చూసే మొదటి అవకాశం మీకే రావొచ్చుకదా.
ప్రియమైన దేశవాసులారా, ఈ సెప్టెంబర్ 25కి దేశంలోని ప్రముఖ మానవతావాదులు, ఆలోచనాపరులు, భరతమాత ముద్దుబిడ్డ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటాం. ఏ దేశంలో అయినా సరే యువకులు వాళ్లకు లభించే గుర్తింపును, గౌరవాన్నీ చూసి గర్విస్తారో, వాళ్లని ప్రాథమికమైన ఆలోచనలు, ముందుచూపు అంతే స్థాయిలో ఆకర్షిస్తాయి. దీన్ దయాళ్ గారి ఆలోచనల్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆయన తన జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద ఉత్థాన పతనాల్ని చూశారు. అలాంటి ఆలోచనలకు, సంఘర్షణలకు ఆయన సాక్షిగా నిలిచారు.
అందుకే ఆయన సమసమాజ స్థాపన, అలాగే అంత్యోదయ లాంటి చక్కటి ఆలోచనల్ని దేశం ముందు ఉంచారు. అవి పూర్తిగా భారతీయ భావనలు. దీన్ దయాళ్ గారు చెప్పిన సమసమాజ స్థాపన అసలు ఎలాంటి ఆలోచనంటే అది ఆలోచనా ధార అనే పేరుతో ద్వంద్వానికి, దురాగ్రహానికి తావు లేకుండా చేసేది. ఆయన మనుషులందర్నీ సమానంగా చూసే భారతీయ దర్శనాన్ని మళ్లీ ప్రపంచం ముందుంచారు. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ఆత్మవత్ సర్వభూతేషు అన్నాయి. అంటే దానర్థం మనం జీవులన్నింటినీ మనతో సమానంగా చూడాలని. వాటిలో కూడా మనందరిలాగే వ్యవహరించాలని. ఆధునిక, సామాజిక అలాగే రాజనైతిక దృష్టికోణంలోకూడా భారతీయ దర్శనం ప్రపంచానికి ఎలా మార్గదర్శనం కాగలదో, దీన్ దయాళ్ గారు మనకి నేర్పించారు. ఓ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి హీనమైన భావన ఉండేదంటే, దాని నుంచి విముక్తి కల్పించి ఆయన మన అంతః చైతన్యాన్ని జాగృతం చేశారు. ఆయనేమనేవారంటే మనకి వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఎప్పటికి సార్థకమవుతుందంటే అది మన సంస్కృతికి, గుర్తింపుకు మారుపేరుగా ఉన్నప్పుడే. ఈ ఆలోచనల ఆధారంగా ఆయన దేశం అభివృద్ధి చెందడానికి ఓ విజన్ ని రూపొందించగలిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఏమనేవారంటే దేశ ప్రగతికి చిహ్నం, చిట్ట చివరి మెట్టుమీదున్న వ్యక్తే అవుతాడనేవారు.
స్వాతంత్ర్య అమృతోత్సవ కాలంలో మనం దీన్ దయాళ్ గారి గురించి ఎంతగా తెలుసుకోగలిగితే, ఆయన్ని చూసి ఎంత నేర్చుకోగలిగితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనందరికీ అంతగా ప్రేరణ లభిస్తుంది.
ప్రియమైన దేశవాసులారా, ఇవ్వాళ్టినుంచి మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 28వ తేదీన అమృత మహాత్సవాలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన రోజొస్తోంది. ఆ రోజున మనం భరతమాత వీర పుత్రుడు భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటాం.
భగత్ సింగ్ జయంతిని జరుపుకోవడానికి ముందుగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాం. చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు అమర వీరుడైన భగత్ సింగ్ పేరును పెడుతున్నాం. దానికోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాం. నేను చండీఘడ్, పంజాబ్, హర్యానా అలాగే ఈ దేశవాసులందరికీ ఓ నిర్ణయం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మిత్రులారా, మనం మన స్వాతంత్ర్యం సేనానులనుంచి ప్రేరణ పొందాలి, వాళ్ల ఆదర్శాలను పాటిస్తూ వాళ్లు కలలుగన్న భారత దేశాన్ని నిర్మించాలి. అదే మనం వాళ్లకు అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. అమర వీరుల్ని స్మరించుకోవడం, వాళ్ల పేరును కొన్ని ప్రదేశాలకు, కొన్ని కట్టడాలకు పెట్టడం మనకి ప్రేరణనిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ దేశం ఆ కర్తవ్య పథంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పుడు చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు పెట్టడం ఆ దిశగా మరో అడుగు ముందుకు వెయ్యడమే.
నాక్కావాల్సిందేంటంటే, అమృత మహోత్సవాల్లో మనం మన స్వాతంత్ర్య సేనానులకు సంబంధించి విశేషమైన సందర్భాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే విధంగా సెప్టెంబర్ 28వ తేదీనాడుకూడా ప్రతి ఒక్క యువకుడూ ఓ సరికొత్త ప్రయత్నాన్ని తప్పకుండా మొదలుపెట్టాలి.
అలాగే నా ప్రియమైన దేశవాసులారా, మీకందరికీ సెప్టెంబర్ 28వ తేదీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? నేను కేవలం రెండు ముక్కలు మాత్రం చెబుతాను. కానీ నాకు తెలుసు మీ ఉత్సాహం నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది.
ఆ రెండు పదాలేంటంటే సర్జికల్ స్ట్రైక్! ఉత్సాహం పెరిగిందికదా! మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న అమృత మహాత్సవాల సంరంభం దాన్ని మనం మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన సంతోషాన్ని అందరితో పంచుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! జీవితంలో అనేక సంఘర్షణలను ఎదుర్కున్న వ్యక్తి ముందు ఎలాంటి బాధా నిలబడలేదంటారు. మన నిత్య జీవితంలో మనం కొందరు ఎలాంటి వాళ్లను చూస్తామంటే, వాళ్లు ఏదో ఒక శారీరకమైన లోపంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది వినలేనివాళ్లుంటారు, లేదంటే మాట్లాడి మనసులోని మాటలు చెప్పలేనివాళ్లుంటారు.అలాంటి మిత్రలకు చాలా పెద్ద ఆధారం సైన్ లాంగ్వేజ్. కానీ భారత దేశంలో చాలా కాలంగా చాలా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సంజ్ఞల భాషకు చాలా కాలం వరకూ స్పష్టమైన హావభావాలుండేవికావు. స్టాండర్డ్స్ ఉండేవి కావు. ఆ ఇబ్బందుల్ని తొలగించడం కోసమే 2015లో ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ సెంటర్ ని స్థాపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ సంస్థ ఇప్పటికే వెయ్యి పదాలు, భావాలతో కూడిన డిక్ష్నరీని తయారు చేసింది. రెండు రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 23వ తేదీన సైన్ లాంగ్వేజ్ డే రోజున ఎన్నో స్కూళ్ల పాఠ్యాంశాలను కూడా సైన్ లాంగ్వేజ్ లో లాంచ్ చేశాం. సైన్ లాంగ్వేజ్ నిర్ణయించిన స్టాండర్డ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ విద్యా విధానంలోకూడా చాలా గట్టి ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు తయారు చేసిన సైన్ లాంగ్వేజ్ డిక్ష్నరీని వీడియో తీసి నిరంతరాయంగా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. యూట్యూబ్ లో చాలామంది, చాలా సంస్థలు, భారతీయ భాషల్లో సైన్ లాంగ్వేజ్ లో ఛానళ్లుకూడా ప్రారంభించారు. అంటే ఏడెనిమిదేళ్లక్రితం సైన్ లాంగ్వేజ్ ని అభివృద్ధి చెయ్యడానికి ప్రారంభించిన పథకంవల్ల ఇప్పుడు లక్షలాదిమంది దివ్యాంగులైన సోదరసోదరీమణులకు లాభం కలుగుతోంది.
హర్యానా వాసియైన పూజగారు ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ ని చూసి చాలా సంతోషపడుతున్నారు. ముందసలు ఆవిడకి తన బిడ్డతో సంబంధం ఉండేది కాదు. కానీ 2018లో సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ తీసుకున్నాక తల్లీ బిడ్డా ఇద్దరి జీవితం సుఖంగా సాగిపోతోంది. పూజగారి పిల్లవాడు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. పైగా తను వాళ్ల స్కూల్లో స్టోరీ టెల్లింగ్ లో ప్రైజ్ గెలిచి చూపించాడుకూడా. ఈ విధంగామో టింకా గారికి ఓ పదేళ్ల కూతురుంది. తను పాపం వినలేదు. టింకా గారు తన కూతురితో సైన్ లాంగ్వేజ్ కోర్స్ చేయించారు. కానీ ఆవిడకు మాత్రం ఆ సైన్ లాంగ్వేజ్ రాదు. ఆ కారణం వల్ల తను తన బిడ్డతో కమ్యూనికేట్ చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు టింకాగారుకూడా సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ పొందిన తర్వాత వాళ్లిద్దరూ హాయిగా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నారు.
ఈ ప్రయత్నాలవల్ల కేరళవాసియైన మంజుగారికి కూడా చాలా లాభం కలిగింది. మంజుగారు పుట్టినప్పట్నుంచీ బధిరురాలే. అదిమాత్రమే కాక తన తల్లిదండ్రులకు కూడా ఇలాంటి స్థితే ఉండేది. ఆ పరిస్థితుల్లో సైన్ లాంగ్వేజ్ మొత్తం కుటుంబానికి మాట్లాడుకోవడానికి మాధ్యమం అయ్యింది. ఇప్పుడసలు మంజుగారు స్వయంగా తనే సైన్ లాంగ్వేజ్ టీచర్ కావాలని నిర్ణయించుకున్నారు.
మిత్రులారా నేను దీని గురించి మనసులో మాటలో ఎందుకు చెబుతున్నానంటే ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ గురించి అందరికీ అవగాహన కలగాలని. దీని ద్వారా వికలాంగులైన సోదర సోదరీమణులకు మనం వీలైనంత ఎక్కువగా సాయం చెయ్యగలుగుతాం.
సోదర సోదరీమణులారా, కొన్ని రోజుల క్రితం నాకు బ్రెయిలీ లిపిలో రాసిన హేమకోశం ఓ కాపీ దొరికింది. హేమకోశం అస్సామీ భాషలోని అత్యంత పురాతనమైన డిక్ష్నరీలలో ఒకటి. దాన్ని 19వ శతాబ్దంలో తయారు చేశారు. దానికి ప్రముఖ భాషావేత్త హేమచంద్రబారువా సంపాదకత్వం వహించారు.
ఆ హేమకోశం ఎడిషన్ దాదాపుగా 10వేల పేజీలకు పైనే ఉంది. దాన్ని 15 వాల్యూములుగా ప్రచురించడం జరుగుతోంది. దాంట్లో ఉన్న లక్షకంటే ఎక్కువ పదాలను అనువదించాలి. నేను అత్యంత ప్రయోజనకరమైన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రయత్నం దివ్యాంగులైన సోదరసోదరీమణుల కౌశలాన్ని, సామర్ధ్యాన్ని పెంచడానికి చాలా సాయపడుతుంది. ఇవ్వాళ్ల భారతదేశం పారా స్పోర్ట్స్ లోకూడా విజయకేతనాన్ని ఎగరేస్తోంది. మనం అలాంటి ఎన్నో టోర్నమెంట్లలో పాలుపంచుకోవడం జరిగింది. ఇవ్వాళ్ల చాలామంది ఎలా ఉన్నారంటే వికలాంగుల్లో ఫిట్ నెస్ కల్చర్ ని పెంచేందుకు క్షేత్ర స్థాయిలో చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దానివల్ల దివ్యాంగుల ఆత్మ విశ్వాసానికి చాలా బలం చేకూరుతోంది.
ప్రియమైన దేశవాసులారా, నేను కొన్ని రోజుల క్రితం సూతర్ కి చెందిన ఓ పిల్ల అన్వీని కలిశాను. అన్వీతోపాటు అన్వీ యోగా కూడా నాకు ఎంత బాగా గుర్తుండిపోయిందంటే దాని గురించి నేను మనసులో మాట శ్రోతలందరికీ చెప్పదలచుకున్నాను.
మిత్రలారా, అన్వీ పుట్టినప్పటినుంచే డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతోంది. తను చిన్నప్పట్నుంచీ అత్యంత క్లిష్టతరమైన హృద్రోగంతో బాధపడుతోంది. తను మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు, అప్పుడే తను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. ఇన్ని కష్టాలున్నప్పటికీ కూడా, అన్వీగానీ, తన తల్లిదండ్రులుగానీ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. అన్వీ తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ గురించి మొత్త సమాచారాన్ని సేకరించారు. తర్వాత అన్వీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించారు. వాళ్లు అన్వీకి మంచినీళ్ల గ్లాస్ ఎలా పట్టుకోవాలి, బుట్లకు లేసులు ఎలా కట్టుకోవాలి, బట్టలకు గుండీలు ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న చిన్న విషయాలను నేర్పించడం మొదలుపెట్టారు. ఏ వస్తువును ఎక్కడుంచాలి, మంచి అలవాట్లంటే ఏంటి లాంటి విషయాలన్నింటినీ చాలా ధైర్యంగా వాళ్లు అన్వీకి నేర్పించే ప్రయత్నం చేశారు. అసలు అన్వీ వాటన్నింటినీ ఎంత ఇష్టంగా నేర్చుకుందంటే, ఎంత ప్రతిభను చూపించిందంటే, దాన్ని చూసి దాన్ని చూసి వాళ్లమ్మానాన్నలకు కూడా కాస్త నమ్మకం కలిగింది. వాళ్లు అన్వీని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. అసలప్పుడు ఎంత కష్టంగా ఉండేదంటే అన్వీ కనీసం తన కాళ్లమీద నిలబడగలిగేది కాదు. అలాంటి పరిస్థితిలో అన్వీ తల్లిదండ్రులు తనని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. మొట్టమొదటిసారి తను యోగ గురువు దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకూడా అసలీ పిల్ల యోగా చెయ్యగలుగుతుందా అన్న సందిగ్థంలో ఉన్నారు. కానీ అసలా కోచ్ కి కూడా అసలు అన్వీకి ఈ విషయంలో ఎంత పట్టుదల ఉంది అన్న విషయం గురించి ఎలాంటి అంచనా లేదేమో. తను తన తల్లితోపాటు యోగాను అభ్యసించడం మొదలుపెట్టింది. పైగా ఇప్పుడు తను యోగాలో ఎక్స్ పర్ట్ అయిపోయింది. ఇవ్వాళ్ల అన్వీ కాంపిటీషన్లలో పాల్గొంటోంది, మెడల్స్ సాధిస్తోంది. యోగా అన్వీకి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అన్వీ పట్టుదలగా శ్రద్ధగా యోగాని నేర్చుకుని తన జీవితాన్ని సాఫల్యం చేసుకుంది. వాళ్లమ్మానాన్నలు నాకేం చెప్పారంటే యోగావల్ల అన్వీ జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందన్నారు. ఇప్పుడు తనకి ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది. యోగావల్ల అన్వీకి ఫిజికల్ హెల్త్ కూడా బాగుపడింది. అలాగే మందుల అవసరం కూడా రోజురోజుకీ తగ్గిపోతోంది. నా ఉద్దేశం ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్న మనసులో మాటల శ్రోతలు అన్వీకి యోగా వల్ల కలిగిన లాభాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యాలి. నాకు తెలిసినంతవరకూ యోగా శక్తి సామర్ధ్యాలను పరీక్షించడానికి, నిరూపించడానికి అన్వీ చాలా గొప్ప కేస్ స్టడీ అవుతుంది. విద్యావేత్తలైన శాస్త్రజ్ఞులు ముందుకొచ్చి అన్వీ గురించి ఆధ్యయనం చేసి యోగా సామర్ధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంది.
అలా పరిశోధనలు చెయ్యడంవల్ల ప్రపంచంలో డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న అనేకమంది పిల్లలకు చాలా మేలు కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగా దోహదపడుతుందో ప్రపంచం మొత్తానికీ ఇప్పుడు చాలా బాగా తెలిసిపోయింది. ప్రత్యేకించి డయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ లాంటి లోపాలకు సంబంధించిన కష్టానష్టాలనుంచి బైటపడేందుకు యోగవల్ల చాలా మేలు కలుగుతుంది. యోగాకి ఉన్న ఇంతటి శక్తిని గుర్తించి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి భారత దేశానికి సంబంధించిన మరో ప్రయత్నాన్నికూడా ఇప్పుడు గుర్తించింది. దాన్ని గౌరవించింది. ఆ ప్రయత్నం ఏంటంటే 2017లో ప్రారంభించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్. దానివల్ల బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్న లక్షలాదిమందికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతర్జాతీయ సంస్థల దృష్టిని మనవైపుకు ఎంతగా ఆకర్షించిందంటే నిజంగా చాలా అద్భుతం అది. అసలు మనందరికీ అత్యంత ఆశాజనకమైన విషయం ఏంటంటే ఎంతమందికైతే చికిత్స చేశారో వాళ్లలో సగంమందికి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంది. నేను ఈ ఇనిషియేటివ్ కోసం పనిచేస్తున్నవాళ్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్లంతా ఎంతో శ్రమపడి దీనిలో సఫలతను సాధించారు.
మిత్రులారా, మానవ జీవన అభివృద్ధి యాత్రం, నిరంతరాయంగా నీళ్లతో ముడిపడి ఉంది. అయితే అది సముద్రం కావొచ్చు, లేదంటే నదికావొచ్చు, చెరువు కావొచ్చు.
భారత దేశపు సౌభాగ్యం ఏంటంటే దాదాపుగా 7వేల 5 వందల కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ ఉన్నందువల్ల మనకి సముద్రంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఈ తీర ప్రాంతం ఎన్నో రాష్ట్రాలను, ద్వీపాలను తాకుతూ పోతుంది.
భారత దేశంలో ఉన్న వేర్వేరు సముదాయాలు, అలాగే వైవిధ్యంతో కూడిన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లడాన్ని మనం స్వయంగా చూడొచ్చు. అది మాత్రమే కాక ఈ తీరప్రాంతాల్లో ఉన్నవాళ్ల ఆహార వ్యవహారాలు అందర్నీ చాలా ఆకట్టుకుంటాయి. మనకున్న ఈ తీర ప్రాంతం పర్యావరణానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కుంటోంది. ఓ వైపున క్లైమేట్ ఛేంజ్ మెరైన్ ఎకో సిస్టమ్స్ కి చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మరో వైపున మన బీచ్ లలో పెరిగిపోతున్న మురికి అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. మనందరి బాధ్యత ఏంటంటే మనం ఆ సమస్యల గురించి చాలా పట్టుదలగా, నిరంతరాయంగా శ్రమించాలి. నేను దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ క్లీనింగ్ కోసం స్వచ్ఛమైన సాగరం, సురక్షితమైన సాగరం అనే పేరుతో ఒక ప్రయత్నం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. జూలై 5వ తేదీన ప్రారంభమైన ఈ పథకానికి సంబంధించిన ప్రయత్నాలుగడచిన సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి రోజున సఫలమయ్యాయి. ఆ రోజు కోస్టల్ క్లీనింగ్ అప్ డే కూడా. స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో మొదలైన ఈ యుద్ధం 75 రోజుల పాట నడిచింది. దీంట్లో జన భాగ్యస్వామ్యం పెద్ద ఎత్తున ఉంటోంది. ఈ ప్రయోగం వల్ల దాదాపుగా నెలన్నర ముంచీ పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాల్ని చూడడం జరిగింది. గోవాలో ఓ పెద్ద మానవ హారాన్ని రూపొందించారు. కాకినాడలో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా జనానికి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
NSSకి చెందిన దాదాపు 5000 మంది సోదర సోదరీమణులు 30 టన్నులకంటే ఎక్కువ ప్లాస్టిక్ ని సేకరించారు. ఒడిషాలో మూడు రోజుల్లోనే 20 వేలమంది కంటే ఎక్కువ మంది విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛమైన సాగరం – సురక్షితమైన సాగరం కోసం వాళ్లు వాళ్లతోపాటుగా వాళ్ల కుటుంబాల్ని, చుట్టుపక్కల వాళ్లనందర్నీ ప్రేరేపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Elected Officials, ప్రభుత్వంలోని నగరాల్లోని మేయర్లు, గ్రామాల్లోని సర్పంచులతో నేను మాట్లాడినప్పుడు నేను వాళ్లకి ఓ మాట తప్పక చెబుతాను. స్వచ్ఛతకోసం చేస్తున్న ఈ యజ్ఞంలో స్థానిక సంస్థల ప్రతినిధులను, స్థానికుల్ని కూడా భాగస్వాముల్ని చెయ్యాలని ఇన్నోవేటివ్ తరహాలో పనులు చెయ్యమని చెబుతుంటాను.
బెంగళూరులో ఓ టీమ్ ఉంది - Youth For Parivarthan– యూత్ ఫర్ పరివర్తన్. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా ఈ టీమ్ స్వచ్ఛతకోసం అదే విధంగా ఇతర సామాజిక అంశాలకోసం చాలా పరిశ్రమ చేస్తోంది. వాళ్ల మోటో చాలా స్పష్టంగా ఉంది. 'Stop Complaining, Start Acting'. ఈ టీమ్ నగరంలోని దాదాపు 370 ప్రాంతాల్లో సుందరంగా తీర్చిదిద్దింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ Youth For Parivarthanఅనే సంస్థలో వంద నుంచి నూట యాభైమంది సభ్యులు చేరారు. ప్రతి ఆదివారం వీళ్లీ పని మొదలుపెడతారు. మధ్యాహ్నం వరకూ చేస్తారు. ఈ పనిలో చెత్తను ఎలాగూ ఏరి పారేస్తారు. దాంతోపాటుగా పెయింటింగ్ అలాగే Artistic Sketches వేసే పని కూడా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వీళ్లు సుప్రసిద్ధులైన వ్యక్తుల మాటల్ని, వాళ్ల ఇన్స్పిరేషనల్ కొటేషన్లని కూడా మీరు చూడొచ్చు. బెంగుళూరులో Youth For Parivarthanచేసిన ప్రయత్నాల తర్వాత మీకు నేను మీరట్ కి చెందిన కబాడ్ సే జుగాడ్ ('कबाड़सेजुगाड़') పథకం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పథకం పర్యావరణ పరిరక్షణతోపాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పని కూడా చేస్తోంది. ఈ యుద్ధంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో లోహ వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్, పాత టైర్లు, అలాగే డ్రమ్ములు లాంటి పాడైపోయిన వస్తువుల్ని ఉపయోగిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో సామాజిక స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడం ఎలాగో చూపించేందుకు ఈ ప్రయత్నాన్నికూడా మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రయత్నాలు చేపట్టిన వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా ఉత్సవాల వెలుగులు కనిపిస్తున్నాయి. రేపు నవరాత్రుల్లో మొదటి రోజు. ఈ రోజున మనం అమ్మవారి మొదటి స్వరూపమైన శైలపుత్రిని ఆరాధిస్తాం. ఇక్కడ్నుంచి తొమ్మిది రోజులపాటు నియమబద్ధులమై, ఉపవాసం ఉంటూ, తర్వాత విజయ దశమి పండుగను జరుపుకుంటాం. అంటే ఓ విధంగా మన రక్తంలో భక్తి మరియు ఆధ్యాత్మికతలతోకూడన ఎంతటి నిగూఢమైన సందేశం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. నియమబద్ధమైన ప్రణాళికతో సిద్ధిని పొందడానికి ఆ తర్వాత విజయదశమి పండుగ జరుపుకోవడం, ఈ రెండూ జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించుకునే మార్గాలు అవుతాయి. దసరా తర్వాత ధన త్రయోదశి, దీపావళి పండుగలు కూడా వస్తాయి.
మిత్రులారా, కొద్ది సంవత్సరాలుగా మన పండుగలకు ఓ సరికొత్త సంకల్పాన్నికూడా జోడించుకున్నాం. మీకందరికీ తెలిసిన విషయమే, ఆ సంకల్పం ఏంటంటే - 'Vocal for Local' అనే సంకల్పం. ఇప్పడు మనం పండుగల సంతోషంలో మన local పౌరుల్ని, శిల్పకారుల్ని, వ్యాపారుల్ని కూడా కలుపుకుంటున్నాం. రాబోయే అక్టోబర్ 2వ తేదీన బాపూజీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ handloom, handicraft లాంటి ప్రాడక్ట్ లన్నింటినీ కలుపుకునే మీరు సామాన్లు కొనుక్కోండి. అసలు ఈ పండుగకు నిజమైన ఆనందం ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగం అయినప్పుడే, అందుకే స్థానిక ప్రాడక్టులకు సంబంధించిన వాళ్లందరికీ మనం మద్దతివ్వాలి.
చాలా మంచి పని ఏంటంటే, పండుగల్లో మనం ఏ గిఫ్ట్ లు ఇచ్చినా సరే, వాటిలో ఇలాంటి ప్రాడక్ట్ లను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పథకానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే స్వాతంత్ర్య అమృత కాలంలోకి అడుగుపెట్టేటప్పటికల్లా మనం స్వయం సమృద్ధ భారతాన్ని సాధించాలని కలలుగంటున్నాం కాబట్టి. ఓ విధంగా చూస్తే మనకి ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన వాళ్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది. అందుకోసం నేను మీకు ఏం చెప్పదలచుకున్నానంటే, ఈసారి ఖాదీ, handloom లేదంటే handicraft లాంటి ప్రాడక్టుల్ని కొనడంలో మీరు అన్ని రికార్డుల్నీ అధిగమించాలి. మనం చూస్తున్నాం పండుగల్లో packingకి అలాగే packaging కోసం polythene bagsని విరివిగా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛతకోసం తపిస్తున్న ఈ సందర్భంలో polythene వల్ల నష్టం కలిగించే చెత్త మన పండుగ వాతావరణాన్ని పాడు చేస్తుంది. అందుకోసం మనం స్థానికంగా తయారైన non-plastic బ్యాగుల్ని మాత్రమే ఉపయోగించాలి. మన దగ్గర జూట్ వి, నారవి, అరటి నారతో చేసినవి ఇలాంటి సంప్రదాయికమైన వస్తువులతో చేసిన బ్యాగుల ఉపయోగం చాలా బాగా పెరుగుతోంది. పండుగల్లో వీటిని విరివిగా వాడి వీటి తయారీని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అలాగే స్వచ్ఛత అంటే మన ఆరోగ్యంతోపాటుగా పర్యావహరణ హితాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రియమైన దేశవాసులారా, మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే – పరహిత్ సరిస్ ధర్మ నహీ భాయీ అని చెబుతున్నాయి. అంటే ఇతరులకు మేలు చెయ్యడం కంటే మించిన ధర్మం, ఇతరులకు సేవ చేయడం కంటే మించిన ధర్మం, సాయం చెయ్యడాన్ని మించిన ధర్మం మరొకటి లేదని. గడచిన రోజుల్లో దేశంలో సమాజ సేవకు సంబంధించి ఓ ఉదాహరణను మనం చూడగలిగాం. మీరుకూడా చూసే ఉంటారు. జనం ముందుకొచ్చి టీబీతో బాధపడుతున్న రోగుల్ని దత్తత తీసుకుంటున్నారు. వాళ్లకి పౌష్టిక ఆహారం అందించే బాధ్యతను స్వీకరిస్తున్నారు. నిజానికి ఇదికూడా టీబీ విముక్త భారత దేశం అనే పథకంలో ఒక భాగమే. దీంట్లో జనం భాగస్వాములవుతున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సరైన పోషణ లభిస్తేనే సరైన సమయంలో వేసుకున్న మందులు టీబీని తగ్గించగలుగుతాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, భక్తితో కూడిన ఈ జన భాగస్వామ్యం వల్ల 2025వ సంవత్సరానికల్లా భారత దేశం టీబీనుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది.
మిత్రలారా, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ ద్వీపంలో కూడా నాకు అలాంటి ఒక ఉదాహరణ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. అక్కడున్న ఆదీవాసీ ప్రాంతాల్లో నివశించే జినూ రావతీయ్ గారు నాకేమని లేఖ రాశారంటే అక్కడ గ్రామాలను దత్తత చేసుకునే కార్యక్రమం నడుస్తోందట, దానిద్వారా Medical college students 50 గ్రామాలను దత్తత చేసుకున్నారట. వాటిలో జిన్ గారి గ్రామం కూడా ఉందట. ఆ మెడికల్ విద్యార్థులు రోగాల బారిన పడకుండా ఆయా గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారట. జబ్బు చేసిన వాళ్లకు సాయం కూడా చేస్తున్నారట. అలాగే ప్రభుత్వ పథకాల గురించి కూడా వివరిస్తున్నారట. పరోపకారమనే ఈ భావన గ్రామాల్లో నివశిస్తున్నవారి జీవితాల్లో తప్పక సంతోషాన్ని నింపుతుంది. నేను దీనికి medical college విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రలారా, మనసులో మాటలో మనం కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సందర్భాల్లో మనకి ఈ సందర్భంగా పాత విషయాల గురించి చాలా లోతుగా ఆలోచించే అవకాశం కూడా కలుగుతోంది. కిందటి నెల మనసులో మాటలో నేను తృణ ధాన్యాల గురించి అలాగే 2023ని'International Millet Year' గా మనం జరుపుకోవాలని చెప్పాను. ఈ విషయం మీద జనం చాలా ఆసక్తి చూపించారు. నాకు దాని గురించి ఎన్నో లేఖలొచ్చాయి. వాటిలో జనం ఏం చెబుతున్నారంటే, వాళ్లు ఏ విధంగా మిల్లెట్స్ ని దైనందిన ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారో చెబుతున్నారు. కొందరైతే మిల్లెట్స్ తో తయారు చేసే సంప్రదాయబద్ధమైన ఆహార పదార్ధాల గురించి కూడా చెప్పారు. ఇది ఒక చాలా పెద్ద మార్పుకు సంకేతం. జనానికి ఉన్న ఈ ఉత్సాహాన్ని చూసి నాకేమనిపిస్తోందంటే మనందరం కలిసి దీనిమీద ఓ ఈ బుక్ ని తయారు చేస్తే బాగుంటుంది. దాంట్లో మనం మిల్లెట్లతో తయారు చేసుకునే dishes గురించి అలాగే మనందరి అనుభవాల గురించి వివరించడం బాగుంటుంది. దానివల్ల International Millet Year ప్రారంభం కావడానికి ముందే మన దగ్గర millets కి సంబంధించిన ఒక public encyclopaediaకూడా తయారవుతుంది. మనం దాన్ని MyGov portalలో కూడా పబ్లిష్ చెయ్యొచ్చు.
మిత్రులారా, మనసులో మాటలో ఈసారి ఈ విషయాలు చాలు, కానీ సెలవు తీసుకోవడానికి ముందు నేను మీకు మన National Games గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సెప్టెంబర్ 29వ తేదీనుంచి గుజరాత్ లో National Games కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది మనకి మహత్తరమైన అవకాశం. ఎందుకంటే మనం చాలా ఏళ్ల తర్వాత National Gamesని ఏర్పాటు చేసుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారి వల్ల కిందటి సారి ఈ ఆటల పోటీలను రద్దు చెయ్యాల్సొచ్చింది. ఈ ఆటల పోటీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు నేనివ్వాళ్ల వాళ్లందరి మధ్యే ఉంటాను. మీరందరూ కూడా National Games ని తప్పకుండా follow అవ్వండి. అలాగే మన ఆటగాళ్లకి ఆత్మ స్థైర్యాన్ని పెంచండి. ఇంక నేను ఇవ్వాళ్టికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చేనెల మనసులో మాటలో కొత్త విషయాలతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ ఆగస్టు నెలలోమీ ఉత్తరాలు, సందేశాలు, కార్డులు అన్నీ నా కార్యాలయాన్ని త్రివర్ణమయం చేశాయి. త్రివర్ణ పతాకం లేని లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ గురించిన్ విషయాలు లేని ఏ లేఖను నేను బహుశా చూడలేదు. పిల్లలు, యువ స్నేహితులు అమృత మహోత్సవం సందర్భంగా అందమైన చిత్రాలను, కళాకృతులను పంపారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ మాసంలో మన దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో అమృత మహోత్సవఅమృతధార ప్రవహిస్తోంది. అమృత మహోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భంలో దేశ సామూహిక శక్తిని మనం చూశాం. చైతన్య అనుభూతిని పొందాం. ఇంత పెద్ద దేశంలో ఎన్నో వైవిధ్యాలు. కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే భావనతో వ్యవహరించినట్టు అనిపించింది. త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడడంలో ప్రథమ రక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చారు. స్వచ్చతా అభియాన్ లోనూ టీకా ప్రచారంలోనూ దేశ స్ఫూర్తిని కూడా మనం చూశాం. అమృత మహోత్సవంలో మళ్లీ అదే దేశభక్తి స్ఫూర్తిని చూడబోతున్నాం.ఎత్తైన పర్వతాల శిఖరాలపైనా, దేశ సరిహద్దుల్లోనూ, సముద్రం మధ్యలోనూ కూడా మన సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాక ప్రచారానికి ప్రజలు కూడా విభిన్నమైన వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. అలా వచ్చిన యువ సహచరుడు కృష్నీల్ అనిల్ గారు. అనిల్ గారు ఒక పజిల్ కళాకారుడు. రికార్డు సమయంలో మొజాయిక్ కళతో అందమైన త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు.కర్ణాటకలోని కోలార్‌లో 630 అడుగుల పొడవు, 205 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని అపురూప దృశ్యాన్ని ప్రదర్శించారు. అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు దిఘాలిపుఖురి యుద్ధ స్మారకం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు తమ స్వహస్తాలతో 20 అడుగుల త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. అదేవిధంగాఇండోర్‌లోని ప్రజలు మానవహారం ద్వారా భారతదేశ పటాన్ని రూపొందించారు.చండీగఢ్‌లో యువకులు భారీ మానవ త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. ఈ రెండు ప్రయత్నాలూ గిన్నిస్ రికార్డులో కూడా నమోదయ్యాయి. వీటన్నింటి మధ్యలోహిమాచల్ ప్రదేశ్‌లోని గంగోట్ పంచాయితీ నుండి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా కనిపించింది.ఇక్కడ పంచాయతీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో వలస కూలీల పిల్లలను ముఖ్య అతిథులుగా భాగస్వాములను చేశారు.
మిత్రులారా!అమృత మహోత్సవంలోని ఈ వర్ణాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయి. బోట్స్ వానాలో నివసిస్తున్న స్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులో విశేషమేమిటంటేఈ 75 పాటలు హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, తమిళం, తెలుగు, కన్నడ , సంస్కృతం వంటి భాషల్లో పాడారు. అదేవిధంగా నమీబియాలో ఇండో-నమీబియా సాంస్కృతిక-సాంప్రదాయిక సంబంధాలపై ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు.
మిత్రులారా!నేను మరో సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితంభారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అక్కడ 'స్వరాజ్' దూరదర్శన్ సీరియల్ ను ప్రదర్శించారు. ఆ సీరియల్ ప్రీమియర్‌కి వెళ్లే అవకాశం నాకు లభించింది.స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుని, గుర్తింపు పొందని వీరులు, వీరవనితల కృషిని దేశంలోని యువ తరానికి పరిచయం చేసేందుకు ఇదో గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు దూరదర్శన్‌లో ప్రసారమవుతుంది.ఈ సీరియల్ 75 వారాల పాటు కొనసాగుతుందని నాకు చెప్పారు. మీరు సమయాన్ని వెచ్చించి మీరు చూడడంతో పాటు మీ ఇంట్లోని పిల్లలకు కూడా చూపించాలని నేను కోరుతున్నాను. పాఠశాలలు, కాలేజీల వారు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి; సోమవారం పాఠశాలలు, కాలేజీలు తెరిచినప్పుడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ చూపించాలని నేను కోరుతున్నాను. తద్వారా స్వాతంత్ర్య సముపార్జన కోసం శ్రమించిన ఈ గొప్ప వీరుల పట్ల మన దేశంలో అవగాహన కలుగుతుంది. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది వరకు – అంటే 2023 ఆగస్టు వరకు జరుగుతాయి. దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసంమనం చేస్తున్న రచనలను, కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!నేటికీ మన పూర్వికుల జ్ఞానం, మన పూర్వికుల దూరదృష్టి, మన పూర్వికుల అంతర్దర్శనంఈరోజుకీ ఎంతో ప్రభావశీలత కలిగిఉన్నాయి. ఈ విషయాలపై లోతుల్లోకి తరచి చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఓమాన్-మాపో మానుషీ:అమృక్తమం ధాత్ తోకాయ్ తనయాయ్ శం యోః|
యూయం హిష్ఠా భిషజో మాతృతమా విశ్వస్య స్థాతు: జగతో జనిత్రీ: ||
అని వేల సంవత్సరాల నాటిమన ఋగ్వేదంలో చెప్పారు.
“ఓ జలమా! నువ్వేమానవాళికి మంచి స్నేహితుడివి. జీవాన్ని ఇచ్చేది కూడా నువ్వే. నీ నుండి ఆహారం ఉత్పత్తి అవుతుంది. నీవే మా పిల్లలకు ప్రయోజనకారి. నువ్వే మాకు రక్షణ కల్పించేది. మమ్మల్ని అన్ని చెడుల నుండి దూరంగా ఉంచేది కూడా నువ్వే. నువ్వే అత్యుత్తమ ఔషధం. ఈ బ్రహ్మాండాన్ని పెంచి పోషించేది నువ్వే.” అని దీని అర్థం.
ఆలోచించండి… నీటి గురించి, నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో పేర్కొన్నారు. నేటి సందర్భంలో ఈ జ్ఞానాన్ని చూసినప్పుడుమనం పులకించిపోతాం. దేశం ఈ జ్ఞానాన్ని తన శక్తిగా స్వీకరించినప్పుడు దేశ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది…నాలుగు నెలల క్రితం 'మన్ కీ బాత్'లో నేను అమృత్ సరోవర్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో స్థానిక పరిపాలన జత గూడింది. స్వచ్చంద సంస్థలు తోడయ్యాయి. స్థానిక ప్రజలు భాగస్వాములయ్యారు. చూస్తూ ఉండగానే అమృత్ సరోవర్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారింది. దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు, రాబోయే తరాల పట్ల ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం కూడా తోడవుతుంది. సంకల్పం ఉదాత్తమవుతుంది.తెలంగాణలోని వరంగల్ నుండి ఒక గొప్ప ప్రయత్నం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ కొత్త గ్రామ పంచాయితీ ఏర్పడింది. ఆ పంచాయతీ పేరు 'మంగ్త్యా-వాల్యా తాండా'. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. వర్షాకాలంలో చాలా నీరు నిల్వ ఉండే ప్రాంతం సమీపంలో ఈ పంచాయతీ ఉంది.గ్రామస్థుల చొరవతోఇప్పుడు ఈ స్థలాన్ని అమృత్ సరోవర్ అభియాన్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా ఈ చెరువు నీటితో నిండిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో ఉన్న మోచా గ్రామ పంచాయతీలో నిర్మించిన అమృత్ సరోవర్ గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమృత్ సరోవర్ కన్హా నేషనల్ పార్క్ సమీపంలో నిర్మితమైంది. దీనివల్ల ఈ ప్రాంతం అందం మరింత పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన షహీద్ భగత్ సింగ్ అమృత్ సరోవర్ కూడా ప్రజలను ఆకర్షిస్తోంది.నివారి గ్రామ పంచాయతీలో నిర్మించిన ఈ సరస్సు 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. సరస్సు ఒడ్డున ఉన్న తోటలు దాని అందాన్ని పెంచుతున్నాయి. సరస్సు సమీపంలోని35 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. కర్ణాటకలోనూ అమృత్ సరోవర్ ఉద్యమం జోరుగా సాగుతోంది.ఇక్కడ బాగల్కోట్ జిల్లాలోని 'బిల్కెరూర్' గ్రామంలో ప్రజలు చాలా అందమైన అమృత సరోవరాన్ని నిర్మించారు. వాస్తవానికిఈ ప్రాంతంలోకొండ నుండి నీరు రావడంతో ప్రజలు చాలా నష్టపోయేవారు. రైతులకు నష్టం కలిగేది. వారి పంటలు కూడా దెబ్బతినేవి. అమృత సరోవరం చేసేందుకు గ్రామ ప్రజలు మొత్తం నీటిని కాలువలుగా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వరద సమస్య కూడా తీరింది.అమృత్ సరోవర్ అభియాన్ నేటి మన అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే తరాలకు కూడా అంతే ఆవశ్యకంగా ఉంది. ఈ ప్రచారంలోచాలా చోట్లపాత నీటి వనరులను కూడా పునరుద్ధరించారు. జంతువుల దాహం తీర్చడంతో పాటు వ్యవసాయానికి కూడాఅమృత సరోవర్‌ను వినియోగిస్తున్నారు.ఈ చెరువుల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అదే సమయంలో వాటి చుట్టూ పచ్చదనం కూడా పెరుగుతోంది. ఇదొక్కటే కాదు-అమృత్ సరోవర్‌లో చేపల పెంపకం కోసం చాలా చోట్ల ప్రజలు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. అమృత్ సరోవర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని; ఈ నీటి నిల్వ, నీటి సంరక్షణ ప్రయత్నాలకు పూర్తి శక్తిని అందించి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మలని అందరినీ -ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! అస్సాంలోని బొంగై గ్రామంలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ సంపూర్ణ. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడటం. ఈ పోరాటం చేసే పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రంలోని ఆరోగ్యవంతమైన బిడ్డ తల్లి ప్రతివారం పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిని కలుసుకుని పౌష్టికాహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని చర్చిస్తుంది. అంటేఒక తల్లి మరొక తల్లికి స్నేహితురాలు అవుతుంది. ఆమెకు సహాయం చేస్తుంది. ఆమెకు నేర్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సహాయంతోఈ ప్రాంతంలోఒక సంవత్సరంలో90 శాతానికి పైగా పిల్లల పోషకాహార లోపాన్ని నిర్మూలించగలిగారు. మీరు ఊహించగలారా! పోషకాహార లోపాన్ని తొలగించడానికి పాటలను, సంగీతాన్ని, భజనలను కూడా ఉపయోగించవచ్చా?మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జరుగుతున్న "మేరా బచ్చా అభియాన్"లో వీటిని విజయవంతంగా ఉపయోగించారు. దీని కిందజిల్లాలో భజనలను, కీర్తనలను నిర్వహించారు. ఇందులో ‘పోషణ్ గురు’ అని పిలిచే శిక్షకులకు భాగస్వామ్యం కల్పించారు. అంగన్వాడీ కేంద్రానికి మహిళలు పిడికెడు ధాన్యాన్ని తీసుకొచ్చి, ఆ ధాన్యంతో శనివారాల్లో 'బాలభోజ్' నిర్వహించే మట్కా కార్యక్రమం కూడా జరిగింది.దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు పెరగడంతోపాటు పోషకాహార లోపం కూడా తగ్గుముఖం పట్టింది. పోషకాహార లోపంపై అవగాహన పెంచేందుకు జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం కూడా జరుగుతోంది. జార్ఖండ్‌లోని గిరిడీహ్‌లో పాము-నిచ్చెన ఆటను సిద్ధం చేశారు. ఆటల ద్వారా పిల్లలు మంచి, చెడు అలవాట్లను తెలుసుకుంటారు.
మిత్రులారా!పోషకాహార లోపానికి సంబంధించిన అనేక వినూత్న ప్రయోగాల గురించి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే నెలలో మనమందరం ఈ ప్రచారంలో చేరాలి. సెప్టెంబరు నెల పండుగలతో పాటు పోషకాహారానికి సంబంధించిన అతి పెద్ద ప్రచారానికి కూడా అంకితమైంది. మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటాం.
పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మక, విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించడంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా పోషకాహార ప్రచారంలో ముఖ్యమైన భాగంగా మారింది. దేశంలోని లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ పరికరాలను అందించడం నుండి అంగన్వాడీ సేవలను అందజేయడం, పర్యవేక్షణలకోసం పోషన్ ట్రాకర్ కూడాప్రారంభమైంది.
అన్ని ఆకాంక్షాత్మక జిల్లాలు -యాస్పిరేషన్ జిల్లాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో14 నుండి 18 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను పోషణ్ అభియాన్ పరిధిలోకి తీసుకువచ్చారు. పోషకాహార లోపం సమస్యకు పరిష్కారం ఈ దశలకే పరిమితం కాదు - ఈ పోరాటంలోఅనేక ఇతర కార్యక్రమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకుజల్ జీవన్ మిషన్‌ను తీసుకోండి. భారతదేశాన్ని పోషకాహార లోప రహితంగా మార్చడంలో ఈ మిషన్ కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది.పోషకాహార లోపం సవాళ్లను ఎదుర్కోవడంలో సామాజిక అవగాహన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని తొలగించే ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! చెన్నైకి చెందిన శ్రీదేవి వరదరాజన్ గారు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. “కొత్త సంవత్సరం రావడానికి 5 నెలల కన్నా తక్కువ సమయం ఉంది. రాబోయే నూతన సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటామని మనందరికీ తెలుసు” అని ఆమె మై గవ్ లో రాశారు. దేశ చిరుధాన్యాల భౌగోళిక చిత్ర పటాన్ని కూడా ఆమె నాకు పంపారు. 'మన్ కీ బాత్'లో రాబోయే ఎపిసోడ్లో మీరు దీని గురించి చర్చించగలరా అని కూడా ఆమె అడిగారు. నా దేశ ప్రజలలో ఇలాంటి స్ఫూర్తిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.భారతదేశం చేసిన ఈ ప్రతిపాదనకు 70కి పైగా దేశాల మద్దతు లభించిందని తెలిసి మీరు కూడా చాలా సంతోషిస్తారు. నేడుప్రపంచవ్యాప్తంగాఈ చిరుధాన్యాలపై మోజు పెరుగుతోంది. మిత్రులారా!నేను చిరు ధాన్యాల గురించి మాట్లాడేటప్పుడునా ప్రయత్నాలలో ఒకదాన్ని మీతో ఈ రోజు పంచుకోవాలనుకుంటున్నాను.కొంతకాలంగా విదేశీ అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు, వివిధ దేశాల అధినేతలు భారతదేశానికి వచ్చినప్పుడుభారతదేశంలోని చిరుధాన్యాలతో చేసిన వంటలను తయారుచేయించడం నా ప్రయత్నం. ఆ పెద్దలకు ఈ వంటకాలు చాలా ఇష్టమయ్యాయని అనుభవంలోకి వచ్చింది. మన చిరుధాన్యాల గురించి చాలా సమాచారాన్ని సేకరించడానికి కూడా వారు ప్రయత్నిస్తారు.చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ప్రాచీన కాలం నుండి మన వ్యవసాయం, సంస్కృతి, నాగరికతలో ఒక భాగం. మన వేదాలలో చిరుధాన్యాల ప్రస్తావన ఉంది. అదే విధంగాపురాణాల్లో, తొల్కాప్పియంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజల ఆహారంలో వివిధ రకాల చిరుధాన్యాలు ఉంటాయి. మన సంస్కృతిలాగే చిరుధాన్యాలు కూడా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, కొర్రలు, ఒరిగలు, అరికెలు, సామలు, ఉలవలు - ఇవన్నీ చిరుధాన్యాలే. ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత కూడా భారతీయులమైన మన భుజాలపైనే ఉంది. మనమందరం కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి. దేశ ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన పెంచాలి.మిత్రులారా!మీకు బాగా తెలుసు…చిరుధాన్యాలు రైతులకు- ముఖ్యంగా చిన్న రైతులకు కూడా ప్రయోజనకరం. వాస్తవానికిపంట చాలా తక్కువ సమయంలో సిద్ధంగా ఉంటుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. ముఖ్యంగా మన చిన్న రైతులకు చిరుధాన్యాలు మేలు చేస్తాయి. చిరుధాన్యాల గడ్డిని కూడా ఉత్తమ మేతగా పరిగణిస్తారు. ఈ రోజుల్లోయువతరం ఆరోగ్యకరమైన జీవనం, ఆహారంపై చాలా దృష్టి పెడుతుంది.ఈ విధంగా చూసినా చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చిరుధాన్యాల్లో ఒకటి కాదు-అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.ఉదర, కాలేయ వ్యాధుల నుండి రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.కొంతకాలం క్రితమేమనం పోషకాహార లోపం గురించి మాట్లాడుకున్నాం. పోషకాహార లోపంతో పోరాడడంలో చిరుధాన్యాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి శక్తితో పాటు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. నేడు దేశంలో చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించడంతో పాటుఉత్పత్తిని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. నా రైతు సోదరులు, సోదరీమణులు చిరుధాన్యాలను- అంటే ముతక ధాన్యాలను తమవిగా భావించి, లాభాలు పొందాలని నా కోరిక. చిరుధాన్యాలపై పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లు నేడు పుట్టుకొస్తుండటం నాకు చాలా సంతోషకరం. వీరిలో కొందరు మిల్లెట్ కుకీలను తయారు చేస్తుంటే, మరికొందరు మిల్లెట్ పాన్ కేక్స్, దోశలను కూడా తయారు చేస్తున్నారు. మిల్లెట్ ఎనర్జీ బార్లు, మిల్లెట్ అల్పాహారాలను తయారు చేస్తున్న వారు కొందరు ఉన్నారు.ఈ రంగంలో పనిచేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ సీజన్లో మనం చాలా వంటలలో చిరుధాన్యాలను కూడా ఉపయోగిస్తాం. మీరు మీ ఇళ్లలో తయారు చేసిన అటువంటి వంటకాల చిత్రాలను తప్పనిసరిగా సోషల్ మీడియాలో షేర్ చేయండి. మిల్లెట్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ఇది సహాయపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!కొద్ది రోజుల క్రితం, అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని జోర్సింగ్ గ్రామం నుండి నేను ఒక వార్త చూశాను. ఈ వార్త ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు గురించి. వాస్తవానికి ఈ నెలలో జోర్సింగ్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతకు ముందు పల్లెల్లో కరెంటు వచ్చినప్పుడు ప్రజలు సంతోషించేవారు. ఇప్పుడు నవ భారతదేశంలో 4జీ వస్తే అదే ఆనందం పొందుతున్నాం. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయమైంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కొత్త ఉదయాన్ని తెచ్చింది. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్న సౌకర్యాలను డిజిటల్ ఇండియా గ్రామ గ్రామానికీ తీసుకువచ్చింది. దీని వల్ల దేశంలో కొత్త డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆవిర్భవిస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన సేఠా సింగ్ రావత్ గారు'దర్జీ ఆన్లైన్' అనే 'ఈ-స్టోర్'ని నిర్వహిస్తున్నారు. ఈ 'దర్జీ ఆన్లైన్' అంటే ఏమిటని మీరు ఆలోచిస్తారు. నిజానికి- సేఠా సింగ్ రావత్ గారు కోవిడ్‌కు ముందు టైలరింగ్ పని చేసేవారు.కోవిడ్ వచ్చినప్పుడురావత్ గారు ఈ సవాలును కష్టంగా తీసుకోలేదు. ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆయన 'కామన్ సర్వీస్ సెంటర్' అంటే CSC E-స్టోర్‌లో చేరారు. ఆన్లైన్లో పని చేయడం ప్రారంభించారు. కస్టమర్లు పెద్ద సంఖ్యలో మాస్కుల కోసం ఆర్డర్లు ఇవ్వడాన్ని ఆయన చూశారు. ఆయన కొంతమంది మహిళలను పనిలోకి తీసుకుని మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. దీని తర్వాత ఆయన 'దర్జీ ఆన్లైన్' పేరుతో తన ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. అందులోఅనేక ఇతర బట్టలు కూడా అమ్మడం ప్రారంభించారు.నేడుడిజిటల్ ఇండియా శక్తితోసేఠా సింగ్ గారి పని ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు ఆయనకు దేశం నలుమూలల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. వందలాది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారు.ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో నివసిస్తున్న ఓం ప్రకాష్ సింగ్ గారిని కూడా డిజిటల్ ఇండియా డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఆయన తన గ్రామంలో వెయ్యికి పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. ఓం ప్రకాష్ గారు తన కామన్ సర్వీస్ సెంటర్ చుట్టూ ఉచిత వైఫై జోన్‌ను కూడా సృష్టించారు. ఇది అవసరమైన వారికి చాలా సహాయం చేస్తోంది. ఓం ప్రకాష్ గారి పని ఎంతగా పెరిగిపోయిందంటే ఆయన 20 మందికి పైగా తన దగ్గర పనిలో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, తహసీల్ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించి ఉపాధి కూడా పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ లాగా, ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ అంటే GEM పోర్టల్‌లో ఇలాంటి విజయగాథలు ఎన్ని కనిపిస్తున్నాయి.
మిత్రులారా! నాకు గ్రామాల నుండి ఇలాంటి సందేశాలు చాలా వస్తుంటాయి. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన మార్పులను ఆ సందేశాలు నాతో పంచుకుంటాయి. ఇంటర్నెట్ మన యువ స్నేహితులు చదువుకునే, నేర్చుకునే విధానాన్ని మార్చింది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన గుడియా సింగ్ ఉన్నావ్‌లోని అమోయియా గ్రామంలో ఉన్న తన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన చదువు గురించి ఆందోళన చెందారు. అయితేభారత్ నెట్ ఆమె ఆందోళనను పరిష్కరించింది. గుడియా ఇంటర్నెట్ ద్వారా తన చదువును కొనసాగించారు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. డిజిటల్ ఇండియా ప్రచారం ద్వారా గ్రామగ్రామానా ఇలాంటి జీవితాలెన్నో కొత్త శక్తిని పొందుతున్నాయి. మీరు గ్రామాల్లోని డిజిటల్ వ్యాపారవేత్తల గురించి మీకు వీలైనంత ఎక్కువగా రాయండి. వారి విజయగాథలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా!కొంతకాలం క్రితంహిమాచల్ ప్రదేశ్ కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత రమేశ్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. రమేశ్ గారు తన లేఖలో పర్వతాల గొప్పతనాన్ని ప్రస్తావించారు. “పర్వతాల మీద నివాసాలు చాలా దూరం ఉండవచ్చు. కానీ ప్రజల హృదయాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయ”ని ఆయన రాశారు. నిజమే!పర్వతాలపై నివసించే ప్రజల జీవితాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.పర్వత ప్రాంతాల్లో ఉండేవారి జీవనశైలి, సంస్కృతి నుండి మనకు లభించే మొదటి పాఠం ఏమిటంటేమనం పరిస్థితుల ఒత్తిడికి లోనుకాకపోతే వాటిని సులభంగా అధిగమించవచ్చు. రెండవది-స్థానిక వనరులతో మనం ఎలా స్వయం సమృద్ధి చెందగలమో కూడా తెలుసుకోవచ్చు. నేను ప్రస్తావించిన మొదటి పాఠం, దాని అందమైన చిత్రం ఈ రోజుల్లో స్పీతీ ప్రాంతంలో కనిపిస్తుంది.స్పీతీ గిరిజన ప్రాంతం. ఇక్కడఈ రోజుల్లోబఠానీలు తీయడం జరుగుతుంది. కొండప్రాంత పొలాల్లో ఇది శ్రమతో కూడుకున్న పని. అయితే ఇక్కడ మాత్రం గ్రామంలోని మహిళలు ఉమ్మడిగా ఒకరికొకరు సహకరిస్తూ అందరి పొలాలలోంచి బఠానీలు కోస్తారు. ఈ పనితో పాటుమహిళలు 'ఛప్రా మాఝీ ఛప్రా' అనే స్థానిక పాటను కూడా పాడతారు.ఇక్కడ పరస్పర సహకారం కూడా జానపద సంప్రదాయంలో భాగమే. స్థానిక వనరుల వినియోగానికి కూడా ఉత్తమ ఉదాహరణ స్పీతీలో ఉంది. స్పీతీలో ఆవులను పెంచే రైతులు వాటి పేడను ఎండబెట్టి బస్తాల్లో నింపుతారు. శీతాకాలం వచ్చినప్పుడుఈ బస్తాలను ఆవు ఉండే ప్రదేశంలో వేస్తారు. ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఖూడ్ అని పిలుస్తారు.హిమపాతం మధ్యఈ బస్తాలు చలి నుండి ఆవులకు రక్షణ కల్పిస్తాయి. చలికాలం తర్వాత ఈ ఆవు పేడను పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తారు. అంటేజంతువుల వ్యర్థాల నుండే వాటికి రక్షణ కల్పిస్తారు. వాటి నుండే పొలాలకు ఎరువు కూడా లభిస్తుంది. సాగు ఖర్చు కూడా తక్కువ. పొలంలో దిగుబడి కూడా ఎక్కువ. అందుకే ఈ రోజుల్లో ఈ ప్రాంతం సహజ వ్యవసాయానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.
మిత్రులారా!మనమరొక కొండరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో కూడా ఇటువంటి మెచ్చుకోదగిన అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో అనేక రకాల ఔషధాలు, వృక్షజాలం కనిపిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ఒక పండు బేడు. దీన్నే హిమాలయన్ ఫిగ్లేదా హిమాలయన్ అంజీర్అని కూడా అంటారు.ఈ పండులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రజలు దీన్ని పండ్ల రూపంలోనే కాకుండాఅనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండులోని ఈ గుణాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బేడు రసం, జామ్‌లు, చట్నీలు, ఊరగాయలు, ఎండబెట్టి తయారు చేసిన డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.పితోర్‌ఘర్ పాలకవర్గం చొరవ, స్థానిక ప్రజల సహకారం కారణంగా బేడును వివిధ రూపాల్లో మార్కెట్లోకి తీసుకురావడంలో విజయం సాధించగలిగారు. బేడును పర్వత ప్రాంత అంజీర్ లేదా పహాడీ అంజీర్ గా బ్రాండ్ చేయడం ద్వారా ఆన్లైన్ మార్కెట్ కూడా మొదలైంది.దీని కారణంగారైతులకు కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండాబేడుఔషధ గుణాల ప్రయోజనాలు సుదూరప్రాంతాలకు చేరుకోవడం ప్రారంభించాయి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' ప్రారంభంలో మనం స్వతంత్ర భారత అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం అనే గొప్ప పండుగతో పాటు రానున్న రోజుల్లో మరెన్నో పండుగలు రానున్నాయి. కొద్ది రోజుల తర్వాతగణేశుడిని పూజించే పండుగ గణేశ్ చతుర్థి వస్తోంది. గణేశ్ చతుర్థిఅంటే గణపతి బప్పా ఆశీస్సుల పండుగ.గణేశ్ చతుర్థికి ముందే ఓనం పండుగ కూడా ప్రారంభమవుతుంది. ఓనం ముఖ్యంగా కేరళలో శాంతి, సమృద్ధి అనే భావనలతో జరుపుకుంటారు. హర్తాళికా తీజ్ కూడా ఆగస్టు 30న వస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఒడిశాలో నువాఖాయి పండుగను కూడా జరుపుకుంటారు. నువాఖాయి అంటే కొత్త ఆహారం. అంటే ఇది కూడా అనేక ఇతర పండుగల మాదిరిగానే మన వ్యవసాయ సంప్రదాయానికి సంబంధించిన పండుగ. వీటి మధ్య జైన సమాజం వారి సంవత్సరాది పండుగ కూడా ఉంటుంది. మన ఈ పండుగలన్నీ మన సాంస్కృతిక సమృద్ధికి, చైతన్యానికి మారుపేర్లు.ఈ పండుగలు, ప్రత్యేక విశేషాల సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ పండుగలతో పాటు రేపు- ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రపంచ వేదికలపై మన యువ ఆటగాళ్లు మన త్రివర్ణ పతాకం వైభవాన్ని కొనసాగించాలని కోరుకుందాం. ఇదే ధ్యాన్ చంద్ గారికి మన నివాళి. మనమందరం కలిసి దేశం కోసం ఇలాగే పని చేద్దాం. దేశ గౌరవాన్ని పెంచుదాం. ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. వచ్చే నెలలోమరోసారి 'మన్ కీ బాత్' ఉంటుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు..
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 'మన్ కీ బాత్' 91వ ఎపిసోడ్. మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వివిధ అంశాలపై మన అభిప్రాయాన్ని పంచుకున్నాం. కానీ, ఈసారి 'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నసందర్భంలో నిర్వహించుకుంటోన్న స్వాతంత్ర్య దినోత్సవమే ఇందుకు కారణం. మనమందరం చాలా అద్భుతమైన, చారిత్రాత్మక క్షణానికి సాక్షులుగా ఉండబోతున్నాం. ఈశ్వరుడు మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు. మీరు కూడా ఆలోచించండి. మనం బానిసత్వ యుగంలో జన్మించి ఉంటే ఈ రోజు ఊహ ఎలా ఉండేది? బానిసత్వం నుండి విముక్తి పొందాలనే ఆ తపన, పరాధీనతా సంకెళ్ళ నుండి స్వేచ్ఛ పొందాలనే ఆకాంక్ష - ఎంత గాఢంగా ఉండి ఉండాలి. ఆ రోజుల్లో ప్రతిరోజూ లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడడం, త్యాగాలు చేయడం చూసి ఉండేవాళ్లం. మన భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందుతుందో అనే ఆలోచనతో ఉండేవాళ్లం. వందేమాతరం, భారత్ మా కీ జై అంటూ నినాదాలు చేస్తూ మన జీవితాలను రాబోయే తరాలకు అంకితం చేయాలని యవ్వనాన్ని కోల్పోయినా సరేనని భావించేవాళ్ళం. స్వాతంత్ర్యం పొందే రోజు మన జీవితంలోకి వస్తుందనే కలతో మనం ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచేవాళ్ళం.
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా! స్వతంత్ర భారత అమృతోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం చూసి చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దీనికి సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాంటి కార్యక్రమమే ఈ నెల ప్రారంభంలో మేఘాలయలో జరిగింది. మేఘాలయ వీర యోధులు యు. టిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయనను స్మరించుకున్నారు. ఖాసీ కొండలను నియంత్రించడానికి, అక్కడి సంస్కృతిపై దాడి చేయడానికి బ్రిటిష్ వారు చేసిన కుట్రను టిరోత్ సింగ్ జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. చరిత్రను సజీవంగా చూపారు. ఇందులో భాగంగా మేఘాలయ మహోన్నత సంస్కృతిని చాలా అందంగా చిత్రీకరించిన ఉత్సవాన్ని కూడా నిర్వహించారు.
కొన్ని వారాల కిందట కర్ణాటకలో అమృత భారతి కన్నడార్థి అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో రాష్ట్రంలోని 75 చోట్ల స్వతంత్ర భారత అమృతోత్సవాలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో కర్ణాటకలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడంతో పాటు స్థానిక సాహిత్య విజయాలను కూడా తెరపైకి తెచ్చేందుకు కృషి చేశారు.
మిత్రులారా! ఈ జూలైలో చాలా ఆసక్తికరమైన ప్రయత్నం జరిగింది. దీనికి స్వాతంత్ర్య రైలు, రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ రైల్వే పాత్ర గురించి ప్రజలకు తెలియడమే ఈ ప్రయత్నం లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి రైల్వే స్టేషన్లు దేశంలో చాలా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. జార్ఖండ్‌లోని గోమో జంక్షన్‌ను ఇప్పుడు అధికారికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జంక్షన్ గోమో అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఈ స్టేషన్లో నేతాజీ సుభాష్ కాల్కా మెయిల్ ఎక్కి, బ్రిటిష్ అధికారుల నుండి తప్పించుకోవడంలో విజయం సాధించారు. లక్నో సమీపంలోని కాకోరి రైల్వే స్టేషన్ పేరు మీరందరూ విని ఉంటారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ , అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి ధైర్యవంతుల పేర్లు ఈ స్టేషన్‌తో ముడిపడి ఉన్నాయి. రైల్లో వెళ్లే బ్రిటిష్ వారి ఖజానాను ఇక్కడ దోచుకోవడం ద్వారా వీర విప్లవకారులు తమ శక్తిని బ్రిటిష్ వారికి తెలియజెప్పారు. తమిళనాడు ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడితే తూత్తుకుడి జిల్లాలోని వాంచీ మణియాచ్చీ జంక్షన్ గురించి తెలుసుకుంటారు. ఈ స్టేషన్‌కు తమిళ స్వాతంత్ర్య సమరయోధుడు వాంచినాథన్ పేరు పెట్టారు. బ్రిటిష్ కలెక్టర్‌ను ఆయన చర్యల ఫలితంగా 25 ఏళ్ల యువకుడు వాంచి శిక్షించిన ప్రదేశం ఇదే.
మిత్రులారా! ఈ జాబితా చాలా పెద్దది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 75 రైల్వే స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఈ 75 స్టేషన్లను చాలా అందంగా అలంకరించారు. వీటిలో అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీకు సమీపంలోని అటువంటి చారిత్రక స్టేషన్‌ని సందర్శించడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. మీకు తెలియని స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర గురించి అక్కడ మీరు వివరంగా తెలుసుకుంటారు. నేను ఈ స్టేషన్లకు సమీపంలోని పాఠశాల విద్యార్థులను కోరుతున్నాను. ఆ పాఠశాలలలోని చిన్న పిల్లలను ఆ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ పిల్లలకు జరిగిన మొత్తం సంఘటనల క్రమాన్ని వివరించమని ఉపాధ్యాయులను కూడా కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వాతంత్ర్య అమృత మహోత్సవం లో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా- హర్ ఘర్ తిరంగా' అనే ప్రత్యేక ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీరు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. లేదా మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. త్రివర్ణ పతాకం మనల్ని కలుపుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మనమందరం మన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని నేను సూచిస్తున్నాను. మీకు తెలుసా! ఆగస్టు 2వ తేదీకి మన త్రివర్ణ పతాకంతో కూడా ప్రత్యేక సంబంధం ఉంది. ఆ రోజు మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి జయంతి. వారికి నా గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. మన జాతీయ జెండా గురించి మాట్లాడుతూ నేను గొప్ప విప్లవకారురాలు మేడమ్ కామాను కూడా గుర్తుంచుకుంటాను. త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర చాలా కీలకం.
మిత్రులారా!స్వాతంత్ర్య అమృతోత్సవంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాలన్నింటిలో అతిపెద్ద సందేశం ఏమిటంటే దేశవాసులుగా మనమందరందరం మన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. అప్పుడే అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల కల నెరవేరుతుంది. వారి కలల భారతదేశాన్ని నిర్మించగలుగుతాం. అందుకే రాబోయే 25 సంవత్సరాల ఈ అమృత కాలం ప్రతి దేశవాసికి కర్తవ్యకాలం లాంటిది. దేశాన్ని పూర్తిగా విముక్తి చేయడానికి మన వీర యోధులు ఈ బాధ్యతను మనకు ఇచ్చారు. దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! కరోనాపై మన దేశవాసుల పోరాటం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం నేటికీ పోరాడుతోంది. సమగ్ర ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఇందులో చాలా సహాయపడింది. ఇందులో భారతీయ సంప్రదాయ పద్ధతులు ఎంతగా ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే. కరోనాపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో ఆయుష్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై, భారతీయ వైద్యంపై ఆసక్తి పెరుగుతోంది. ఆయుష్ ఎగుమతులు రికార్డు వృద్ధిని సాధించడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు కూడా ఆవిర్భవించడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో దాదాపు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా కాలంలో ఔషధ మొక్కలపై పరిశోధనలు చాలా పెరిగాయి. దీని గురించి అనేక పరిశోధన అధ్యయనాల ప్రచురణలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి ప్రారంభం.
మిత్రులారా! వివిధ రకాల ఔషధ మొక్కలు, మూలికలకు సంబంధించి దేశంలో మరో గొప్ప ప్రయత్నం జరిగింది. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ప్రారంభం జులై నెలలో జరిగింది. మన మూలాలతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ ప్రపంచాన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా ఇది ఒక ఉదాహరణ. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం సంరక్షిత మొక్కలు లేదా మొక్కల భాగాల డిజిటల్ చిత్రాల ఆసక్తికరమైన సేకరణ. ఇది అంతర్జాలంలో ఉచితంగా లభిస్తుంది. ఈ వర్చువల్ హెర్బేరియంలో లక్షకు పైగా నమూనాలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ హెర్బేరియంలో భారతదేశంలోని వృక్ష సంబంధ వైవిధ్యం కూడా కనిపిస్తుంది. భారతీయ వృక్షజాలంపై పరిశోధనలో ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ఒక ముఖ్యమైన వనరుగా మారుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రతిసారీ 'మన్ కీ బాత్'లో మన ముఖాల్లో మధురమైన చిరునవ్వు తెప్పించే దేశప్రజల విజయాల గురించి చర్చిస్తాం. ఒక విజయగాథ మధురమైన చిరునవ్వులను పంచడంతో పాటు తీపి రుచిని కూడా పంచితే మీరు దాన్ని ఖచ్చితంగా బంగారానికి తావి అబ్బినట్టుందని అంటారు. ఈ రోజుల్లో మన రైతులు తేనె ఉత్పత్తిలో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు. తేనెలోని తీపి మన రైతుల జీవితాలను కూడా మారుస్తోంది. వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది. హర్యానాలోని యమునానగర్‌లో సుభాష్ కాంబోజ్ జీ అనే తేనెటీగల పెంపకందారు నివసిస్తున్నారు. సుభాష్ గారు తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ తీసుకున్నారు. దీని తరువాత ఆయన కేవలం ఆరు పెట్టెలతో తన పనిని ప్రారంభించారు. ఈరోజు సుమారు రెండు వేల పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. వాటి తేనె అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. వినోద్ కుమార్ గారు కూడా జమ్మూలోని పల్లీ గావ్ లో ఒకటిన్నర వేలకు పైగా యూనిట్లలో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. గత ఏడాది రాణి తేనెటీగ పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. ఈ పనితో ఏటా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
కర్ణాటకకు చెందిన మరో రైతు మధుకేశ్వర్ హెగ్డే గారు. 50 తేనెటీగల యూనిట్లకు భారత ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకున్నట్టు మధుకేశ్వర్ గారు తెలిపారు. నేడు ఆయన 800 యూనిట్లను నిర్వహిస్తున్నారు. టన్నులకొద్ది తేనెను విక్రయిస్తున్నారు. ఆయన తన పనిలో కొత్తదనం చూపుతున్నారు. జామున్ తేనె, తులసి తేనె, ఉసిరి తేనె వంటి రకరకాల వృక్షాల తేనెను కూడా తయారు చేస్తున్నారు. మధుకేశ్వర్ గారూ.. తేనె ఉత్పత్తిలో మీ వైవిధ్య భరితమైన కార్యాచరణ, విజయం మీ పేరును సార్థకం చేస్తున్నాయి.
మిత్రులారా! మన సాంప్రదాయిక ఆరోగ్య శాస్త్రంలో తేనెకు ఎంత ప్రాధాన్యత ఉందో మీకందరికీ తెలుసు. ఆయుర్వేద గ్రంథాలలో తేనెను అమృతంగా వర్ణించారు. తేనె మనకు రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజుల్లో తేనె ఉత్పత్తిలో అనేక అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న యువత కూడా దాన్ని తమ స్వయం ఉపాధిగా చేసుకుంటోంది.
అలాంటి ఒక యువకుడు – ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు చెందిన నిమిత్ సింగ్. నిమిత్ గారు బీటెక్ చేశారు. ఆయన తండ్రి కూడా వైద్యులే. కానీ తన చదువు తర్వాత నిమిత్ గారు ఉద్యోగం కాకుండా స్వయం ఉపాధిని నిర్ణయించుకున్నారు. తేనె తయారీ పనులను ప్రారంభించారు. నాణ్యత తనిఖీ కోసం లక్నోలో తన సొంత ల్యాబ్‌ను కూడా నిర్మించారు. నిమిత్ గారు ఇప్పుడు తేనె, బీ వ్యాక్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాంటి యువకుల కృషి వల్లనే నేడు దేశం ఇంత పెద్ద తేనె ఉత్పత్తిదారుగా మారుతోంది. దేశం నుండి తేనె ఎగుమతి కూడా పెరిగిందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. దేశం జాతీయ తేనెటీగల పెంపక ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులు కష్టపడి పనిచేశారు. మన తేనె మాధుర్యం ప్రపంచానికి చేరడం ప్రారంభించింది. ఈ రంగంలో ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. మన యువత ఈ అవకాశాలతో అనుసంధాన కావాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కొత్త అవకాశాలను స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత ఆశిష్ బహల్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. ఆయన తన లేఖలో చంబాకు చెందిన 'మింజర్ మేళా' గురించి ప్రస్తావించారు. మొక్కజొన్న పూలను మింజర్ అంటారు. మొక్కజొన్నలో పూలు వచ్చినప్పుడు మింజర్ మేళా కూడా జరుపుకుంటారు. ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. యాదృచ్ఛికంగా మింజర్ మేళా కూడా ఈ సమయంలోనే జరుగుతోంది. మీరు హిమాచల్ వెళ్లి ఉంటే ఈ మేళాను చూడటానికి చంబాకు వెళ్లవచ్చు.
చంబా ఎంత అందమైందంటే ఇక్కడి జానపద గేయాల్లో ఇలా పేర్కొన్నారు..
“చంబే ఏక్ దిన్ ఓణా-కనే మహీనా రౌణా”అని.
అంటే.. చంబాకి ఒకరోజు వచ్చేవాళ్లు.. దాని అందాలను చూస్తూ నెలల తరబడి ఇక్కడే ఉండిపోతారు.
మిత్రులారా! మన దేశంలో జాతరలు గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జాతరలు ప్రజలను, మనస్సులను కలుపుతాయి. హిమాచల్‌లో వర్షాలు కురిసిన తరువాత- ఖరీఫ్ పంటలు పండినప్పుడు- సెప్టెంబర్‌లో సిమ్లా, మండి, కులు, సోలన్ లకు విహారయాత్ర జరుపుకుంటారు. జాగ్ర జాతర కూడా సెప్టెంబర్ లోనే రాబోతోంది. జాగ్ర జాతరలలో మహాసూ దేవతను ఆహ్వానిస్తూ బీసు పాటలు పాడతారు. మహాసు దేవత మేల్కొలుపు హిమాచల్‌లోని సిమ్లా, కిన్నౌర్, సిర్మౌర్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా జరుగుతుంది.
మిత్రులారా! మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీ సమాజానికి సంబంధించిన అనేక సాంప్రదాయిక జాతరలు ఉన్నాయి. ఈ జాతరలలో కొన్ని ఆదివాసీ సంస్కృతికి సంబంధించినవి. కొన్ని జాతరలు ఆదివాసీల చరిత్ర, వారసత్వానికి సంబంధించినవి. ఉదాహరణకు మీకు అవకాశం దొరికితే తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను తప్పక సందర్శించండి. ఈ జాతరను తెలంగాణ మహాకుంభమేళాగా పిలుస్తారు. సారలమ్మ జాతరను ఇద్దరు ఆదివాసీ మహిళా నాయకురాళ్లు సమ్మక్క, సారలమ్మల గౌరవార్థం జరుపుకుంటారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోయ ఆదివాసీ సమాజానికి కూడా అతి పెద్ద విశ్వాస కేంద్రం. ఆంధ్ర ప్రదేశ్‌లోని మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజ విశ్వాసాలకు సంబంధించిన పెద్ద జాతర. మరిడమ్మ జాతర జ్యేష్ట అమావాస్య నుండి ఆషాఢ అమావాస్య వరకు జరుగుతుంది. ఇక్కడి ఆదివాసీ సమాజం దీన్ని శక్తి ఆరాధనతో అనుసంధానిస్తుంది. ఇక్కడే తూర్పుగోదావరిలోని పెద్దాపురంలో మరిడమ్మ గుడి కూడా ఉంది. ఇదేవిధంగా రాజస్థాన్‌లోని గరాసియా తెగ ప్రజలు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు 'సియావా కా మేళా' లేదా 'మన్ ఖాన్ రో మేళా' నిర్వహిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న నారాయణపూర్‌లోని 'మావలీ మేళా' కూడా చాలా ప్రత్యేకమైంది. అక్కడికి సమీపంలోనే మధ్యప్రదేశ్‌లోని భగోరియా మేళా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. భోజరాజు కాలంలో భగోరియా జాతర ప్రారంభమైందంటారు. అప్పుడు భిల్లు రాజులు కాసూమరా, బాలూన్ వారి రాజధానుల్లో మొదటిసారి నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు ఈ జాతరలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
అదేవిధంగా తరణేతర్, మాధోపూర్ వంటి అనేక జాతరలు గుజరాత్లో చాలా ప్రసిద్ధి చెందాయి. జాతరలు మన సమాజానికి, జీవితానికి గొప్ప శక్తి వనరులు. మీ చుట్టూ కూడా ఇలాంటి జాతరలు ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. ఆధునిక కాలంలో 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలోపేతం చేయడానికి సమాజంలోని ఈ పురాతన బంధాలు చాలా ముఖ్యమైనవి.
మన యువత తప్పనిసరిగా వాటితో అనుసంధానం కావాలి. మీరు ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి. మీకు కావాలంటే ప్రత్యేకమైన హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఆ జాతరల గురించి ఇతరులకు కూడా తెలిసిపోతుంది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ఒక పోటీని ప్రారంభించబోతోంది. జాతరాల ఉత్తమ చిత్రాలను పంపిన వారికి బహుమతులను కూడా అందిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయొద్దు. జాతరలను సందర్శించండి. వాటి చిత్రాలను పంచుకోండి. బహుశా మీరు బహుమతి కూడా పొందవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు తప్పక గమనించి ఉంటారు- బొమ్మల ఎగుమతిలో పవర్‌హౌస్‌గా మారడానికి భారతదేశానికి పూర్తి సామర్థ్యం ఉందని 'మన్ కీ బాత్'లోని ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను. క్రీడలు, ఆటలలో భారతదేశం గొప్ప వారసత్వం గురించి నేను ప్రత్యేకంగా చర్చించాను. భారతదేశంలోని స్థానిక బొమ్మలు సంప్రదాయం, ప్రకృతి రెండింటికీ అనుగుణంగా ఉంటాయి. పర్యావరణ అనుకూలమైనవి. ఈ రోజు నేను భారతీయ బొమ్మల విజయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన యువకులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తల కారణంగా, మన బొమ్మల పరిశ్రమ చేసిన పనులను, సాధించిన విజయాలను ఎవరూ కనీసం ఊహించలేరు. భారతీయ బొమ్మల విషయానికి వస్తే వోకల్ ఫర్ లోకల్ అనే స్వరం ప్రతిచోటా వినిపిస్తోంది. ఇప్పుడు భారతదేశానికి విదేశాల నుండి వచ్చే బొమ్మల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో 3 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలు విదేశాల నుంచి వచ్చేవి. ఇప్పుడు వాటి దిగుమతులు 70 శాతం వరకు తగ్గాయి. ఈ కాలంలో భారతదేశం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సంతోషించదగ్గ విషయం. గతంలో భారతదేశం నుండి 300-400 కోట్ల రూపాయల విలువైన బొమ్మలు మాత్రమే విదేశాలకు వెళ్ళేవి. ఇదంతా కరోనా కాలంలో జరిగిందని మీకు ఇప్పటికే తెలుసు. భారతదేశపు బొమ్మల రంగం రూపాంతరం చెందడం ద్వారా తనను తాను నిరూపించుకుంది. భారతీయ తయారీదారులు ఇప్పుడు భారతీయ ఇతిహాసాలు, చరిత్ర , సంస్కృతి ఆధారంగా బొమ్మలను తయారు చేస్తున్నారు. దేశంలో ప్రతిచోటా బొమ్మల ఉత్పత్తిదారుల సమూహాలు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలు వాటి నుండి చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఈ చిన్న వ్యాపారవేత్తలు తయారు చేసిన బొమ్మలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. భారతదేశానికి చెందిన బొమ్మల తయారీదారులు ప్రపంచంలోని ప్రముఖ గ్లోబల్ టాయ్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నారు. మన స్టార్టప్ రంగం కూడా బొమ్మల ప్రపంచంపై పూర్తి శ్రద్ధ చూపడం నాకు చాలా నచ్చింది. వారు ఈ ప్రాంతంలో చాలా సరదా వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. బెంగుళూరులో శూమీ టాయ్స్ అనే స్టార్టప్ పర్యావరణ అనుకూల బొమ్మలపై దృష్టి సారిస్తోంది. గుజరాత్లో ఆర్కిడ్జూ కంపెనీ భౌతిక వాస్తవిక ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే సాంకేతికత ఆధారిత ఫ్లాష్ కార్డులను, కథాపుస్తకాలను తయారు చేస్తోంది.
పూణేకి చెందిన ఫన్‌వెన్షన్ అనే సంస్థ అభ్యసన, బొమ్మలు, కృత్యాల ప్రహేళికల ద్వారా పిల్లల్లో విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలపై, గణితశాస్త్రంపై ఆసక్తిని పెంచడంలో నిమగ్నమై ఉంది. బొమ్మల ప్రపంచంలో గొప్ప కృషి చేస్తున్న తయారీదారులను, స్టార్ట్-అప్‌లందరినీ నేను అభినందిస్తున్నాను. మనమందరం కలిసి భారతీయ బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేలా చేద్దాం. దీంతో పాటు మరింత ఎక్కువగా భారతీయ బొమ్మలు, పజిల్స్, ఆటల సామగ్రిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాను.
మిత్రులారా! తరగతి గది అయినా, ఆట స్థలం అయినా నేడు మన యువత ప్రతి రంగంలోనూ దేశం గర్వించేలా చేస్తున్నారు. ఈ నెలలో పివి సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించారు. ఐర్లాండ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో కూడా మన క్రీడాకారులు 11 పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు. రోమ్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చూపారు. గ్రీకో-రోమన్ ఈవెంట్లో మన అథ్లెట్ సూరజ్ అద్భుతం చేశారు. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఈవెంట్లో రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆటగాళ్ల విషయంలో ఈ నెల మొత్తం ఉత్తమ ప్రదర్శనలతో నిండిపోయింది. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప గౌరవం. ఈ టోర్నమెంటు జులై 28వ తేదీన ప్రారంభమైంది. టోర్నమెంటు ప్రారంభ వేడుకలకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అదే రోజున యు. కె. లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. యువ ఉత్సాహంతో నిండిన భారత జట్టు అక్కడ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశప్రజల తరపున క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడా సమాఖ్య- ఫిఫా ఆధ్వర్యంలో జరిగే పదిహేడేళ్ల లోపు బాలికల ప్రపంచకప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుండడం సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంటు అక్టోబర్ కు కాస్త అటూ ఇటూగా జరుగుతుంది. ఇది దేశ యువతుల్లో క్రీడల పట్ల ఉత్సాహాన్ని పెంచుతుంది.
మిత్రులారా! కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించారు. కృషి, అంకితభావంతో విజయం సాధించిన విద్యార్థులందరినీ నేను అభినందిస్తున్నాను. మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ పరిస్థితుల్లో మన యువత చూపిన ధైర్యం, సంయమనం ఎంతో అభినందనీయం. అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యంపై చర్చను దేశ పర్యటనతో ప్రారంభించాం. వచ్చేసారి మనం కలిసినప్పుడు మన తర్వాతి 25 సంవత్సరాల ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది. మన ప్రియమైన త్రివర్ణ పతాకాన్ని మన ఇళ్ల వద్ద, మన ప్రియమైనవారి ఇళ్లలో ఎగురవేయడానికి మనం అందరం సంఘటితం కావాలి. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం ఎలా జరుపుకున్నారు, ఏమైనా ప్రత్యేకంగా చేశారా అనే వివరాలను నాతో పంచుకోండి. మన ఈ అమృతోత్సవంలోని వివిధ రంగుల గురించి వచ్చేసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడ్కోలు చెప్పేందుకు నన్ను అనుమతించండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కోసం మీ అందరి నుండి నాకు చాలా లేఖలు వచ్చాయి.సామాజిక మాధ్యమాల నుండి,నమో యాప్ ద్వారా కూడా నాకు చాలా సందేశాలు వచ్చాయి. మీ స్పందనకు నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలోపరస్పర స్ఫూర్తిదాయక ప్రయత్నాలను చర్చించడం, ప్రజా చైతన్యం ద్వారా వచ్చిన మార్పు గాథలను దేశం మొత్తానికి తెలియజేయడం మా ప్రయత్నం.దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రజా చైతన్య ఉద్యమం గురించి నేను ఈ రోజు మీతో చర్చించాలనుకుంటున్నాను. కానీ, అంతకు ముందు నేను నేటి తరం యువతను- 24-25 సంవత్సరాల యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైంది. నా ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఆలోచించండి. మీ వయస్సులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు జీవించే హక్కు కూడా ఒకప్పుడు లేదని మీకు తెలుసా! ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇది అసాధ్యం. కానీ నా యువ మిత్రులారా! ఇది మన దేశంలో ఒకసారి జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట 1975 నాటి సంగతి ఇది. జూన్‌లో ఇదే సమయంలో అత్యవసర పరిస్థితి -ఎమర్జెన్సీ- విధించారు. అప్పుడు దేశ ప్రజలు అన్ని హక్కులూ కోల్పోయారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం భారతీయులందరికీ లభించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆ హక్కులలో ఉన్నాయి. ఆ సమయంలో భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. దేశంలోని న్యాయస్థానాలు, ప్రతి రాజ్యాంగ సంస్థ, పత్రికా రంగాలు అన్నీ నియంత్రణకు గురయ్యాయి. ఆమోదం లేకుండా ఏదీ ముద్రించకూడదని సెన్సార్షిప్ షరతు. నాకు గుర్తుంది- అప్పటి ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించేందుకు నిరాకరించడంతో ఆయనపై నిషేధం విధించారు. రేడియోలోకి ఆయన ప్రవేశ అవకాశాన్ని తొలగించారు. అయితే ఎన్నో ప్రయత్నాలు, వేల సంఖ్యలో అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం ఏమాత్రం సడలలేదు. భారతదేశ ప్రజల్లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య విలువలు, మన హృదయాల్లో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిచివరకు విజయం సాధించాయి. భారతదేశ ప్రజలు ఎమర్జెన్సీని తొలగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు. నియంతృత్వ మనస్తత్వాన్ని, నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించడం విషయంలో ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఉదాహరణ దొరకడం కష్టం. ఎమర్జెన్సీ సమయంలోదేశప్రజల పోరాటానికి సాక్షిగా, భాగస్వామిగా ఉండే అదృష్టం - ప్రజాస్వామ్య సైనికుడిగా నాకు లభించింది. నేడు-దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా-అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఆ భయంకరమైన ఎమర్జెన్సీ కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు.రాబోయే తరాలు కూడా మరిచిపోకూడదు. అమృత మహోత్సవం వందల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి విజయ గాథను మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తర్వాత 75 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా ఇముడ్చుకుంటుంది. చరిత్రలోని ప్రతి ముఖ్యమైన దశ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం.
నా ప్రియమైన దేశప్రజలారా! జీవితంలో ఆకాశానికి సంబంధించిన ఊహలు లేని వారు మనలో ఎవ్వరూ ఉండరు. చిన్నతనంలో ఆకాశంలోని చంద్రుడు, నక్షత్రాల కథలు అందరినీ ఆకర్షిస్తాయి. యువతకుఆకాశాన్ని తాకడం కలలను నిజం చేయడానికి పర్యాయపదంగా ఉంటుంది. నేడు-మన భారతదేశం అనేక రంగాలలో విజయాల ఆకాశాన్ని తాకుతున్నప్పుడుఆకాశం లేదా అంతరిక్షం దాని నుండి దూరంగా ఎలా ఉండగలదు! గత కొన్నేళ్లుగా మన దేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్నో పెద్ద పనులు జరిగాయి. దేశం సాధించిన ఈ విజయాలలో ఒకటి ఇన్-స్పేస్ అనే ఏజెన్సీ ఏర్పాటు. భారతదేశఅంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ ఇది. ఈ ప్రారంభం మన దేశ యువతను విశేషంగా ఆకర్షించింది.నాకు చాలా మంది యువకుల నుంచి దీనికి సంబంధించిన సందేశాలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల క్రితం నేను ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్ళినప్పుడుచాలా మంది యువ స్టార్టప్ వ్యవస్థాపకుల ఆలోచనలను, ఉత్సాహాన్ని చూశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. మీరువారి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఉదాహరణకు, స్పేస్ స్టార్ట్-అప్ల సంఖ్యను, వేగాన్ని మాత్రమే తీసుకోండి. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల గురించి ఎవరూ ఆలోచించలేదు. నేడు వాటి సంఖ్య వందకు పైగా ఉంది. ఈ స్టార్టప్‌లన్నీ ఇంతకుముందు ఆలోచించని, ప్రైవేట్ రంగానికి అసాధ్యమని భావించిన ఆలోచనలపై పనిచేస్తున్నాయి.ఉదాహరణకుచెన్నై, హైదరాబాద్‌లలోఅగ్నికుల్ , స్కైరూట్ అనే రెండు స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు తక్కువ భారాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. దీని కారణంగా స్పేస్ లాంచింగ్ ఖర్చు చాలా తక్కువఅవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ అనే మరో స్టార్టప్ కృత్రిమ ఉపగ్రహాల వినియోగం విషయంలో అత్యధిక సాంకేతికత ఉన్న సౌర ఫలకలతో పని చేస్తోంది. అంతరిక్ష వ్యర్థాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మరో స్పేస్ స్టార్టప్ దిగంతరాకు చెందిన తన్వీర్ అహ్మద్‌ని కూడా కలిశాను.అంతరిక్ష వ్యర్థాలను నిర్మూలించే సాంకేతికతపై పని చేయాలనినేను వారికి ఒక సవాలు కూడా ఇచ్చాను. దిగంతరా, ధృవ స్పేస్ రెండూ జూన్ 30వ తేదీన ఇస్రో వాహక నౌక నుండి తమ మొదటి ప్రయోగాన్ని చేస్తున్నాయి. అదేవిధంగా బెంగుళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ల సంస్థ ఆస్ట్రోమ్ వ్యవస్థాపకురాలు నేహా కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో పని చేస్తున్నారు.చిన్నవిగా ఉండి, తక్కువ ఖర్చు ఉండే ఫ్లాట్ యాంటినా లను ఈ స్టార్టప్‌లు తయారు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.
మిత్రులారా!ఇన్-స్పేస్ కార్యక్రమంలోనేను మెహసాణా పాఠశాల విద్యార్థిని తన్వీ పటేల్‌ను కూడా కలిశాను. ఆమె చాలా చిన్న కృత్రిమ ఉపగ్రహం కోసం పని చేస్తోంది. దీన్ని రాబోయే కొద్ది నెలల్లో అంతరిక్షంలోకి పంపుతున్నారు. తన్వి తన పని గురించి గుజరాతీలో చాలా సరళంగా చెప్పింది.తన్విలాగేదేశంలోని దాదాపు ఏడున్నర వందల మంది పాఠశాల విద్యార్థులు అమృత మహోత్సవంలో ఇటువంటి 75 ఉపగ్రహాలపై పని చేస్తున్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది దేశంలోని చిన్న పట్టణాలకు చెందినవారు కావడం కూడా సంతోషకరమైన విషయం.
మిత్రులారా!ఇదే యువతమదిలో కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగం చిత్రం రహస్య మిషన్ లాగా ఉండేది. కానీదేశం అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టింది. అదే యువత ఇప్పుడు వారి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.దేశంలోని యువత ఆకాశాన్ని తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడుమన దేశం ఎలా వెనుకబడి ఉంటుంది!
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్'లోఇప్పుడు మీ మనస్సును ఆహ్లాదపరిచే, మీకు స్ఫూర్తినిచ్చే అంశం గురించి మాట్లాడుదాం.మన ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా ఇటీవలమళ్ళీ ముఖ్యాంశాలలో నిలిచారు. ఒలింపిక్స్ తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటిగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ రజత పతకం సాధించారు. ఇది మాత్రమే కాదు- ఆయన తన సొంత జావెలిన్ త్రో రికార్డును కూడా బద్దలు కొట్టారు. కుర్టానే గేమ్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వించేలా చేశారు నీరజ్. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ స్వర్ణం సాధించారు. ఈ ధైర్యమే నేటి యువతరానికి గుర్తింపు.స్టార్టప్‌ల నుంచి క్రీడా ప్రపంచం వరకు భారత యువత కొత్త రికార్డులు సృష్టిస్తోంది.ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో కూడా మన క్రీడాకారులు ఎన్నో రికార్డులు సృష్టించారు. ఈ గేమ్‌లలో మొత్తం 12 రికార్డులు బద్దలయ్యాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు- 11 రికార్డులను మహిళా క్రీడాకారులు నమోదు చేశారు. మణిపూర్ కు చెందిన ఎం. మార్టినా దేవి వెయిట్ లిఫ్టింగ్ లో ఎనిమిది రికార్డులు సృష్టించారు.
అలాగే సంజన, సోనాక్షి, భావన కూడా విభిన్న రికార్డులు సృష్టించారు. రానున్న కాలంలో అంతర్జాతీయ క్రీడల్లో భారత ఖ్యాతి ఎంతగా పెరుగుతుందో ఈ ఆటగాళ్లు తమ కఠోర శ్రమతో నిరూపించారు. నేను ఈ క్రీడాకారులందరినీ అభినందిస్తున్నాను. భవిష్యత్తు బాగుండాలని వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
స్నేహితులారా!ఖేలో ఇండియా యువజన క్రీడల్లో మరో ప్రత్యేకత ఉంది.ఈసారి కూడా ఇలాంటి ప్రతిభావంతులు చాలా మంది బయటి ప్రపంచానికి తెలిశారు. వారు చాలా సాధారణ కుటుంబాల నుండి వచ్చారు. ఈ క్రీడాకారులు తమ జీవితంలో చాలా కష్టపడి విజయాల స్థాయికి చేరుకున్నారు. వారి విజయంలో వారి కుటుంబం, తల్లిదండ్రుల పాత్ర కూడా పెద్దది.
సైక్లింగ్70 కి.మీ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీనగర్‌కు చెందిన ఆదిల్ అల్తాఫ్ తండ్రి టైలరింగ్ పని చేస్తున్నారు. కానీ, తన కొడుకు కలలను నెరవేర్చడానికి ఆయన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆదిల్ తన తండ్రితో పాటు సమస్త జమ్మూ-కాశ్మీర్ గర్వంతో తలెత్తుకునేలా చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం పొందిన చెన్నై కి చెందిన ఎల్.ధనుష్ తండ్రి కూడా సాధారణ కార్పెంటర్. సాంగ్లీకి చెందిన అమ్మాయి కాజోల్ సర్గర్ తండ్రి టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాజోల్ తన తండ్రి పనిలో సాయం చేయడంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ లోనూ కృషి చేసింది. ఆమె, ఆమె కుటుంబం కృషి ఫలించింది. కాజోల్ వెయిట్ లిఫ్టింగ్‌లో చాలా ప్రశంసలు అందుకున్నారు. రోహ్తక్కి చెందిన తనూ కూడా ఇదే విధమైన కృషి చేసింది.తనూ తండ్రి రాజ్బీర్ సింగ్ రోహ్తక్లో స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తనూ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించి, తన కలను, తన కుటుంబం కలను, తన తండ్రి కలను నిజం చేశారు.
మిత్రులారా!క్రీడా ప్రపంచంలో ఇప్పుడు భారతీయ క్రీడాకారుల ప్రాబల్యం పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ క్రీడలకు కొత్త గుర్తింపు కూడా ఏర్పడుతోంది.ఈసారి ఖేలో ఇండియా యువజన క్రీడల్లో ఒలింపిక్స్ లో ఉండే క్రీడలతో పాటుదేశీయ క్రీడలను కూడా చేర్చారు.ఈ ఐదు క్రీడలు – గత్కా, థాంగ్ తా, యోగాసనాలు, కలరిపయట్టు, మల్లఖంబ్.
మిత్రులారా! అంతర్జాతీయ టోర్నమెంటు జరిగే ఆ భారతీయ క్రీడ శతాబ్దాల క్రితం మనదేశంలో పుట్టింది. ఇది జులై 28 నుంచి ప్రారంభమయ్యే చెస్ ఒలింపియాడ్ ఈవెంట్. ఈసారి 180కి పైగా దేశాలు చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నాయి. మన నేటి క్రీడలు, ఫిట్‌నెస్‌ల చర్చ ఒక పేరు లేకుండా పూర్తి కాదు. ఆ పేరు – తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ గారిది. ఏడు శిఖరాగ్రాల ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా ఆమె మరో ఘనత సాధించారు. ఏడు శిఖరాగ్రాల సవాలు అంటే ప్రపంచంలో అత్యంత కఠినమైన, ఎత్తైన పర్వతాల ఆరోహణ సవాలు. పూర్ణఉన్నతమైన స్ఫూర్తితోఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ దెనాలి శిఖరారోహణ పూర్తి చేయడం ద్వారా దేశం గర్వించేలా చేశారు.ఆమే -కేవలం 13 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి అద్భుతమైన సాహసకృత్యం చేసిన భారతదేశ అమ్మాయి పూర్ణ.
స్నేహితులారా!క్రీడల విషయానికి వస్తే, ఈ రోజు నేను భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను.ఈ నెలలో ఆమె క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది చాలా మంది క్రీడాభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు-చాలా మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మిథాలీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మన్ కీ బాత్‌లో వ్యర్థాల నుండి సంపద సృష్టికి సంబంధించిన విజయవంతమైన ప్రయత్నాలను మనం చర్చిస్తున్నాం. అలాంటి ఒక ఉదాహరణ మిజోరాం రాజధాని ఐజ్వాల్ ది. ఐజ్వాల్‌లో 'చిటే లూయి' అనే అందమైన నది ఉంది. ఇది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల మురికిగా, చెత్త కుప్పగా మారింది. ఈ నదిని కాపాడేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసి సేవ్ చిటే లూయి కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేస్తున్నారు. నదిని శుభ్రపరిచే ఈ ప్రచారం వ్యర్థాల నుండి సంపద సృష్టికి కూడా అవకాశం కల్పించింది.
వాస్తవానికిఈ నది, దాని ఒడ్డు ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలతో నిండి ఉంది. నదిని కాపాడేందుకు కృషి చేస్తున్న సంస్థ ఈ పాలిథిన్‌తో రోడ్డు వేయాలని నిర్ణయించింది.అంటే నది నుంచి వెలువడే వ్యర్థాలతో మిజోరాంలోని ఓ గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రోడ్డు నిర్మించింది. అంటే స్వచ్ఛతతో పాటు వికాసం కూడా.
మిత్రులారా!పుదుచ్చేరి యువకులు కూడా తమ స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరి సముద్రం ఒడ్డున ఉంది. అక్కడి బీచ్‌లు, సముద్ర అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కానీ, పుదుచ్చేరి సముద్ర తీరంలో కూడా ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరుగుతోంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని, బీచ్‌లను, జీవావరణాన్ని కాపాడేందుకు ఇక్కడి ప్రజలు 'రీసైక్లింగ్ ఫర్ లైఫ్' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరిలోని కరైకల్‌లో ఇప్పుడు ప్రతిరోజూ వేల కిలోల చెత్తను సేకరించి వేరు చేస్తున్నారు. అందులోని సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా చేసి, మిగిలిన వాటిని వేరు చేసి రీసైకిల్ చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమే కాకుండాసింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రచారానికి ఊపునిస్తాయి.
మిత్రులారా!నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలోహిమాచల్ ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన సైక్లింగ్ ర్యాలీ కూడా జరుగుతోంది. దీని గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సిమ్లా నుండి మండి వరకు సైక్లిస్టుల బృందం పరిశుభ్రత సందేశాన్ని తీసుకువెళ్ళడం ప్రారంభించింది. పర్వత రహదారులపై దాదాపు 175 కిలోమీటర్ల దూరాన్నివారు సైక్లింగ్ ద్వారా మాత్రమే పూర్తి చేస్తారు. ఈ బృందంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు.మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే-మన పర్వతాలు, నదులు, మన సముద్రాలు శుభ్రంగా ఉంటే-మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు రాస్తూ ఉండాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో రుతుపవనాలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. 'నీరు','జల సంరక్షణ' దిశలో విశేష కృషి చేయాల్సిన సమయం కూడా ఇదే. మన దేశంలోశతాబ్దాలుగాఈ బాధ్యతను సమాజం తీసుకుంటోంది. మీకు గుర్తుండే ఉంటుంది- 'మన్ కీ బాత్'లో మనం ఒకసారి దిగుడు బావుల వారసత్వ సంపద గురించి చర్చించాం.మెట్ల బావులు లేదా దిగుడు బావుల్లో మెట్లు దిగడం ద్వారా నీటిని చేరుకుంటారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వందల సంవత్సరాల నాటి ఇలాంటి బావి ఉంది. దాన్ని 'సుల్తాన్ మెట్ల బావి' అంటారు. దీన్ని రావు సుల్తాన్ సింగ్ నిర్మించారు. కానీ నిర్లక్ష్యం కారణంగాఈ ప్రదేశం క్రమంగా నిర్జనమై చెత్త కుప్పగా మారింది. ఒకరోజు అక్కడ తిరుగుతున్న కొందరు యువకులు ఈ మెట్లబావి వద్దకు వచ్చి దాని పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు.ఈ యువకులు సుల్తాన్ మెట్ల బావి రూపురేఖలను, అదృష్టాన్ని మార్చాలనిఆ క్షణంలోనే సంకల్పించారు. వారు తమ మిషన్‌కు 'సుల్తాన్ సే సుర్-తాన్' లేదా ‘సుల్తాన్ నుండి స్వర తాళాల వరకు’ అని పేరు పెట్టారు. ఈ సుర్-తాన్ లేదా స్వర తాళాలు ఏమిటి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. వాస్తవానికిఈ యువకులు తమ ప్రయత్నాలతో మెట్ల బావిని పునరుద్ధరించడమే కాకుండాసంగీత స్వరతాళాలతో దీన్ని అనుసంధానించారు. సుల్తాన్ మెట్ల బావిని శుభ్రం చేసిన తరువాత, దానిని అలంకరించిన తరువాత, అక్కడ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఈ మార్పు గురించి ఎంతగా చర్చలు జరుగుతున్నాయంటే దీన్ని చూడటానికి విదేశాల నుండి కూడా చాలా మంది రావడం ప్రారంభించారు.ఈ విజయవంతమైన ప్రయత్నంలో ముఖ్యమైన విషయం ఏమిటంటేప్రచారాన్ని ప్రారంభించిన యువత చార్టర్డ్ అకౌంటెంట్లు. యాదృచ్ఛికంగాకొన్ని రోజుల తర్వాత జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం. దేశంలోని సీఏలందరినీ ఈ సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాను. నీటి వనరులను సంగీతం, ఇతర సామాజిక కార్యక్రమాలతో అనుసంధానించడం ద్వారా మనం వాటి గురించి ఇలాంటి చైతన్యాన్ని కలిగించవచ్చు. నీటి సంరక్షణ నిజంగా జీవన సంరక్షణ. ఈ రోజుల్లో ఎన్ని 'నదీ మహోత్సవాలు' జరగడం ప్రారంభించాయో మీరు తప్పక చూసి ఉంటారు. మీ పట్టణాలలో అలాంటి నీటి వనరులు ఏవైనా ఉంటేమీరు తప్పనిసరిగా ఏదో ఒకకార్యక్రమం నిర్వహించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!మన ఉపనిషత్తుల జీవన మంత్రం ఉంది - 'చరైవేతి-చరైవేతి-చరైవేతి'. మీరు కూడా ఈ మంత్రాన్ని విని ఉంటారు. దీని అర్థం - కొనసాగించు, కొనసాగించు. గతిశీలంగా ఉండడం మన స్వభావంలో భాగమే కాబట్టి ఈ మంత్రం మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఒక దేశంగావేల సంవత్సరాల పాటు సాగిన అభివృద్ధి ప్రయాణం ద్వారా మనం ఇంత దూరం వచ్చాం.ఒక సమాజంగా మనం ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. మన సాంస్కృతిక చలనశీలత,యాత్రలు దీనికి చాలా దోహదపడ్డాయి. అందుకే మన రుషులు, మునులు తీర్థయాత్ర వంటి ధార్మిక బాధ్యతలను మనకు అప్పగించారు. మనమందరం వేర్వేరు తీర్థయాత్రలకు వెళ్తాం. ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం మీరు చూశారు. మన దేశంలోఎప్పటికప్పుడువివిధ దైవిక యాత్రలు కూడా జరుగుతాయి. దైవిక యాత్రలు అంటే భక్తులే కాదు- మన దేవుళ్లు కూడా ప్రయాణం చేస్తారు.మరికొద్ది రోజుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ యాత్ర ప్రారంభం అవుతోంది. ఒరిస్సాలో జరిగే పూరీ యాత్ర ప్రతి దేశవాసికీ సుపరిచితం. ఈ సందర్భంగా పూరీకి వెళ్లే భాగ్యం కలగాలన్నది ప్రజల ఆకాంక్ష. ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్నాథ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు.జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం రెండవ రోజు ప్రారంభమవుతుంది. మన గ్రంథాలలో 'ఆషాఢస్య ద్వితీయ దివసే... రథయాత్ర' అన్నారు. సంస్కృత శ్లోకాలలో ఈ వర్ణన కనిపిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఆషాఢ ద్వితీయ నుంచి ప్రతి సంవత్సరం రథయాత్ర సాగుతుంది. నేను గుజరాత్లో ఉన్నానుకాబట్టి ప్రతి సంవత్సరం ఈ యాత్రలో సేవ చేసే అవకాశం కూడా నాకు లభించింది.ఆషాఢ ద్వితీయనుఆషాఢీ బిజ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి కచ్ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. నా కచ్ సోదర సోదరీమణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. నాకు గుర్తుంది-ఆషాఢ ద్వితీయకు ఒక రోజు ముందు-అంటే ఆషాఢమాసం మొదటిరోజున గుజరాత్లో సంస్కృత భాషలో పాటలు, సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలతో సంస్కృత పండుగను జరపడం ప్రారంభించాం.ఈ కార్యక్రమం పేరు - 'ఆషాఢస్య ప్రథమ దివసే'. ఈ పండుగకు ఈ ప్రత్యేక పేరు పెట్టడం వెనుక కూడా ఓ కారణం ఉంది. ఆషాఢ మాసం నుండి వర్ష ఆగమనంపై సుప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు మేఘదూతం రచించాడు. మేఘదూతంలో ఒక శ్లోకం ఉంది – ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమ్ ఆశ్లిష్ట సానుమ్- అంటే ఆషాఢ మాసంలో తొలిరోజు పర్వత శిఖరాలతో కప్పబడిన మేఘాలు. ఈ శ్లోకం ఈ కార్యక్రమానికి ఆధారమైంది.
మిత్రులారా!అహ్మదాబాద్ కావచ్చు. లేదా పూరీ కావచ్చు. జగన్నాథ భగవానుడు ఈ యాత్ర ద్వారా మనకు చాలా లోతైన మానవీయ సందేశాలను అందిస్తాడు. జగన్నాథుడు జగత్తుకు ప్రభువు. అయితే ఆయన యాత్రలో పేదలకు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక భాగస్వామ్యం ఉంటుంది. దేవుడు కూడా సమాజంలోని ప్రతి వర్గంతోనూ, ప్రతి వ్యక్తితోనూ కలిసి నడుస్తాడు. అలాగే మనదేశంలో జరిగే అన్ని యాత్రల్లోనూ పేద-ధనిక అనే భేదభావం ఉండదు.అన్ని వివక్షలకు అతీతంగా యాత్రే ప్రధానమైంది. మహారాష్ట్రలోని పండరిపూర్ యాత్ర గురించి మీరు తప్పక విని ఉంటారు. పండరిపూర్ యాత్రలో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అన్న భేదం ఉండదు. అందరూ భగవాన్ విఠలుడి సేవకులు. నాలుగు రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర కూడా జూన్ 30వ తేదీన ప్రారంభం అవుతోంది. అమర్నాథ్ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్‌లోని స్థానిక ప్రజలు ఈ యాత్ర బాధ్యతను తీసుకోవడంతో పాటు యాత్రికులకు సహకరిస్తారు.
మిత్రులారా!దక్షిణాదిలోశబరిమల యాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గం పూర్తిగా అడవులతో ఉన్న కాలం నుండి శబరిమల కొండలపై ఉన్న అయ్యప్ప దర్శనం కోసం ఈ యాత్ర కొనసాగుతోంది. నేటికీప్రజలు ఈ యాత్రలకు వెళ్లినప్పుడుధార్మిక ఆచారాల నిర్వహణ నుండి, బస ఏర్పాట్ల వరకు పేదలకుఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంటేఈ యాత్రలు మనకు నేరుగా పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.అందుకే ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక యాత్రలో సౌకర్యాలు పెంచేందుకు దేశం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా అలాంటి యాత్రలో వెళితే, ఆధ్యాత్మికతతో పాటు ఏక్ భారత్-శ్రేష్ట భారత్ దర్శనం కూడా కలుగుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎప్పటిలాగే ఈసారి కూడా 'మన్ కీ బాత్' ద్వారా మీ అందరితో అనుసంధానం కావడం చాలా ఆహ్లాదకరమైన అనుభవం. మనం దేశప్రజల సాఫల్యాలు, విజయాల గురించి చర్చించాం. వీటన్నింటి మధ్యమనం కరోనా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితేనేడు దేశంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన సమగ్ర రక్షణ కవచం ఉండటం సంతృప్తిని కలిగించే విషయం. మనం దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల స్థాయికి చేరుకున్నాం. దేశంలో ప్రి కాషన్ డోసులను ఇవ్వడం కూడా వేగవంతం చేస్తున్నారు. మీ రెండవ డోసు తర్వాత ప్రి కాషన్ డోసు తీసుకునే సమయం వస్తే మీరు ఈ మూడవ డోసుతప్పక తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులకు-ముఖ్యంగా వృద్ధులకు- ప్రి కాషన్ డోసు వేయించండి. చేతుల పరిశుభ్రత, మాస్కుల వంటి అవసరమైన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. వర్షాకాలంలో మన చుట్టూ ఉండే మురికి వల్ల వచ్చే వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త గా ఉండాలి. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అలాంటి శక్తితో ముందుకు సాగండి. వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు.. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మరోసారి 'మన్ కీ బాత్' ద్వారా నా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం వచ్చింది. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి స్వాగతం. కొన్ని రోజుల క్రితం మనందరికీ స్ఫూర్తినిచ్చే విజయాన్ని దేశం సాధించింది. ఈ విజయం భారతదేశ సామర్థ్యంపై కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. క్రికెట్ మైదానంలో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ ఎవరైనా సెంచరీ చేశారని వింటే మీరు సంతోషిస్తుండవచ్చు. కానీ, భారత్ మరో రంగంలో సెంచరీ చేసింది. అది చాలా విశేషమైంది. ఈ నెల 5వ తేదీకి దేశంలో యూనికార్న్ స్టార్టప్ ల సంఖ్య 100కి చేరుకుంది. యూనికార్న్ స్టార్టప్ అంటే కనీసం ఏడున్నర వేల కోట్ల రూపాయల స్టార్టప్ అని మీకు తెలుసు. ఈ యూనికార్న్‌ల మొత్తం విలువ 330 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఖచ్చితంగా ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన మొత్తం యూనికార్న్‌లలో 44 స్టార్టప్ లు గత ఏడాదే మొదలయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాత్రమే కాదు- ఈ సంవత్సరం 3-4 నెలల్లో 14 కొత్త యూనికార్న్‌లు ఏర్పడ్డాయి. అంటే ఈ ప్రపంచ మహమ్మారి యుగంలో కూడా మన స్టార్టప్‌లు సంపదను, విలువను సృష్టిస్తున్నాయి. భారతీయ యూనికార్న్‌ల సగటు వార్షిక వృద్ధి రేటు USA, UKలతో సహా అనేక ఇతర దేశాల కంటే ఎక్కువ. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. శుభవార్త ఏమిటంటే మన యూనికార్న్ స్టార్టప్ లు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్-టెక్, బయోటెక్ వంటి అనేక రంగాల్లో అవి పనిచేస్తున్నాయి. నేను మరింత ముఖ్యమైందిగా భావించే మరో విషయం ఏమిటంటే స్టార్టప్‌ల ప్రపంచం నవీన భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. భారతదేశ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదు- చిన్న పట్టణాలు , నగరాల నుండి కూడా వ్యవస్థాపకులు ముందుకు వస్తున్నారు. భారతదేశంలో వినూత్న ఆలోచన ఉన్న వ్యక్తి సంపదను సృష్టించగలడని ఇది నిరూపిస్తుంది.
మిత్రులారా! దేశం సాధించిన ఈ విజయం వెనుక దేశంలోని యువశక్తి, ప్రతిభ, ప్రభుత్వం ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. అందరి సహకారం ఉంది. కానీ ఇందులో ఇంకో విషయం ఉత్తమ మార్గదర్శి స్టార్టప్‌ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలడు. సరైన నిర్ణయం విషయంలో వ్యవస్థాపకులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేయగలడు. వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు తమను తాము అంకితం చేసుకున్న అనేక మంది మార్గదర్శకులు భారతదేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.
శ్రీధర్ వెంబు గారు ఇటీవలే పద్మ అవార్డును పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు మరో పారిశ్రామికవేత్తని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. శ్రీధర్ గారు గ్రామీణ ప్రాంతం నుండి తన పనిని ప్రారంభించారు. గ్రామంలోనే ఉంటూ గ్రామీణ యువతను ఈ ప్రాంతంలో ఏదో ఒక మంచి పని చేయాలని ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2014లో వన్-బ్రిడ్జ్ అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించిన మదన్ పడకి వంటి వ్యక్తులు కూడా మనకు ఉన్నారు. దక్షిణ, తూర్పు భారతదేశంలోని 75 కంటే ఎక్కువ జిల్లాల్లో వన్-బ్రిడ్జ్ అందుబాటులో ఉంది. దీనితో అనుబంధించబడిన 9000 మందికి పైగా గ్రామీణ పారిశ్రామికవేత్తలు గ్రామీణ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నారు. మీరా షెనాయ్ గారు కూడా అలాంటి ఒక ఉదాహరణ. మార్కెట్ తో అనుసంధానమైన నైపుణ్యాల శిక్షణను గ్రామీణ, గిరిజన, వికలాంగ యువతకు అందించేందుకు ఆమె విశేషమైన కృషి చేస్తున్నారు. నేను ఇక్కడ కొన్ని పేర్లను మాత్రమే తీసుకున్నాను. కానీ ఈ రోజు మన మధ్య మార్గదర్శకుల కొరత లేదు. ఈ రోజు దేశంలో స్టార్టప్‌ల కోసం పూర్తి మద్దతు వ్యవస్థను సిద్ధం చేయడం మనకు చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో భారతదేశంలోని స్టార్టప్ ప్రపంచంలో మనం కొత్త పురోగతిని చూడగలమన్న నమ్మకం నాకు ఉంది.
మిత్రులారా! దేశ ప్రజల సృజన, కళాత్మక ప్రతిభ మిళితమై ఉన్న ఒక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన అంశాన్ని కొన్ని రోజుల క్రితం చూశాను. ఇది తమిళనాడులోని తంజావూరు నుండి స్వయం సహాయక బృందం నాకు పంపిన బహుమతి. ఈ బహుమతిలో భారతీయత పరిమళం, మాతృ శక్తి ఆశీర్వాదాలు ఉన్నాయి. నా పట్ల వారికి ఉన్న స్నేహభావనకు ఇది నిదర్శనం. ఇది ప్రత్యేకమైన తంజావూరు బొమ్మ. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. స్థానిక సంస్కృతిలో భాగంగా రూపొందించిన ఈ బహుమతిని నాకు పంపినందుకు తంజావూరు స్వయం సహాయక బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా! ఈ తంజావూరు బొమ్మ ఎంత అందంగా ఉందో అంతే అందంగా మహిళా సాధికారతకు సంబంధించిన కొత్త గాథలను కూడా లిఖిస్తోంది. తంజావూరులో మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు, కియోస్క్‌లు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎన్నో పేద కుటుంబాల జీవితాలు మారిపోయాయి. అటువంటి కియోస్క్‌లు, దుకాణాల సహాయంతో మహిళలు ఇప్పుడు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించగలుగుతున్నారు. ఈ కార్యక్రమానికి 'థారగైగల్ కైవినై పోరుత్తకల్ వీరప్పనై అంగడి' అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే 22 స్వయం సహాయక బృందాలు ఈ చొరవతో అనుసంధానమయ్యాయి. ఈ మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు తంజావూరులో చాలా ప్రధానమైన ప్రదేశంలో ఉన్నాయి. వాటి బాధ్యతను కూడా మహిళలు పూర్తిగా తీసుకుంటున్నారు.
ఈ మహిళా స్వయం సహాయక బృందం తంజావూరు బొమ్మలు, కాంస్య దీపాలు మొదలైన జిఐ ఉత్పత్తులే కాకుండా అల్లికలు, కృత్రిమ ఆభరణాలు కూడా తయారు చేస్తారు. ఇటువంటి దుకాణాల కారణంగా GI ఉత్పత్తులతో పాటు హస్తకళా ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ ప్రచారం వల్ల చేతివృత్తిదారులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా మహిళలు కూడా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ సాధికారత సాధిస్తున్నారు. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా నాకో విన్నపం. మీ ప్రాంతంలో ఏ మహిళా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయో తెలుసుకోండి. మీరు వారి ఉత్పత్తుల గురించి సమాచారాన్ని కూడా సేకరించాలి. వీలైనంత ఎక్కువగా ఈ ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా మీరు స్వయం సహాయక బృందానికి ఆదాయాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్రచారానికి ఊపునిస్తారు.
మిత్రులారా! మన దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉంది. వివిధ ప్రాంతాలలో భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతి మన గుర్తింపు. ఈ వైవిధ్యం ఒక దేశంగా మనల్ని శక్తివంతం చేస్తుంది. మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. దీనికి సంబంధించిన చాలా స్పూర్తిదాయకమైన ఉదాహరణ కల్పన గారు. ఈ విషయాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు కల్పన. కానీ ఆమె ప్రయత్నం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తితో నిండి ఉంది. వాస్తవానికి కల్పన గారు ఇటీవలే కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆమె విజయంలో ప్రత్యేకత ఏమిటంటే కల్పనకు కొంతకాలం క్రితం వరకు కన్నడ భాష తెలియదు. మూడు నెలల్లో కన్నడ భాష నేర్చుకోవడమే కాకుండా 92 మార్కులు తెచ్చుకుని చూపించారు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. ఆమె గురించి మీకు ఆశ్చర్యం కలిగించే, మీకు స్ఫూర్తినిచ్చే అనేక ఇతర విషయాలు ఉన్నాయి. కల్పన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్. ఆమె ఇంతకుముందు టిబితో బాధపడ్డారు. ఆమె మూడవ తరగతిలో ఉన్నప్పుడు కంటి చూపును కూడా కోల్పోయారు. కానీ, 'సంకల్పం ఉన్నచోట, ఒక మార్గం ఉంటుంది'అన్న సూక్తి ఉంది కదా. కల్పనకు తరువాత మైసూరు నివాసి ప్రొఫెసర్ తారామూర్తి గారితో పరిచయం ఏర్పడింది. ఆమె కల్పనను ప్రోత్సహించడమే కాకుండా అన్ని విధాలుగా సహాయం చేశారు. ఈరోజు ఆమె తన కృషితో మనందరికీ ఆదర్శంగా నిలిచింది. కల్పన ధైర్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా దేశంలోని భాషా వైవిధ్యాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన శ్రీపతి టూడూ గారు. ఆయన పురూలియాలోని సిద్ధో-కానో-బిర్సా విశ్వవిద్యాలయంలో సంతాలీ భాష ప్రొఫెసర్. ఆయన సంతాలీ సమాజం కోసం వారి 'ఓల్ చికి' లిపిలో భారతదేశ రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. మన రాజ్యాంగం మన దేశంలోని ప్రతి పౌరుడికి వారి హక్కులు, కర్తవ్యాలపై అవగాహన కల్పిస్తుందని శ్రీపతి టూడూ గారు అంటారు. అందువల్ల ప్రతి పౌరుడు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సంతాలీ సమాజానికి వారి సొంత లిపిలో రాజ్యాంగ ప్రతిని సిద్ధం చేసి బహుమతిగా ఇచ్చాడు. శ్రీపతి గారి ఈ ఆలోచనను, ఆయన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి ఇది సజీవ ఉదాహరణ. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి అనేక ప్రయత్నాల గురించి మీరు 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' వెబ్సైట్లో కూడా చూడవచ్చు. అక్కడ మీరు ఆహారం, కళ, సంస్కృతి, పర్యాటకం వంటి అనేక అంశాలకు సంబంధించిన కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. మీరు ఈ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ఇది మీకు మన దేశం గురించి సమాచారాన్ని అందిస్తుంది. మీరు దేశం వైవిధ్యాన్ని కూడా అనుభూతి చెందుతారు.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని 'చార్-ధామ్' పవిత్ర యాత్ర కొనసాగుతోంది. 'చార్-ధామ్'కు, ముఖ్యంగా కేదార్నాథ్ కు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. ప్రజలు తమ 'చార్-ధామ్ యాత్ర' సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటున్నారు. కానీ కేదార్‌నాథ్‌లో కొంతమంది యాత్రికులు అపరిశుభ్రంగా వ్యాపింపజేయడం వల్ల భక్తులు చాలా బాధపడటం నేను చూశాను. సోషల్ మీడియాలో కూడా చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. పవిత్ర తీర్థయాత్రకు వెళ్ళి, అక్కడ అపరిశుభ్రతను వ్యాపించేలా చేయడం సరైంది కాదు. కానీ మిత్రులారా! ఈ ఫిర్యాదుల మధ్య చాలా మంచి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. విశ్వాసం ఉన్నచోట సృజన, సకారాత్మకత కూడా ఉన్నాయి. బాబా కేదార్ ధామ్‌లో పూజలు చేయడంతో పాటు స్వచ్చతా సాధన కూడా చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరు తాము బస చేసిన ప్రదేశానికి సమీపంలో శుభ్రం చేస్తున్నారు. మరొకరు ప్రయాణ మార్గం నుండి చెత్తను శుభ్రం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ప్రచార బృందంతో పాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. మిత్రులారా! తీర్థయాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్టే తీర్థ సేవ ప్రాముఖ్యత కూడా ఇక్కడ కనబడుతోంది. తీర్థ సేవ లేకుండా తీర్థయాత్ర కూడా అసంపూర్ణమే అని నేను చెప్తాను. దేవభూమి ఉత్తరాఖండ్‌లో పరిశుభ్రతా కార్యక్రమాల్లో, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా మంది ఉన్నారు. రుద్ర ప్రయాగకు చెందిన మనోజ్ బైంజ్ వాల్ గారి నుండి కూడా మీకు చాలా ప్రేరణ లభిస్తుంది. గత పాతికేళ్లుగా పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా పవిత్ర స్థలాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. గుప్తకాశీలో నివసించే సురేంద్ర బగ్వాడీ గారు స్వచ్చతను తన జీవిత మంత్రంగా మార్చుకున్నారు. ఆయన గుప్తకాశీలో క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఈ ప్రచారానికి 'మన్ కీ బాత్' అని పేరు పెట్టారని నాకు తెలిసింది. ఇదే విధంగా దేవర్ గావ్ కు చెందిన చంపాదేవి గత మూడేళ్లుగా గ్రామంలోని మహిళలకు వ్యర్థ పదార్థాల నిర్వహణను నేర్పిస్తున్నారు. చంపా గారు వందలాది చెట్లను నాటారు. తన శ్రమతో పచ్చని వనాన్ని రూపొందించారు. మిత్రులారా! అలాంటి వారి కృషి వల్ల ఆ దేవ భూమి, తీర్థయాత్రల దివ్యమైన అనుభూతి అక్కడ కలుగుతోంది. మనం అక్కడ అనుభవించే ఈ దైవత్వాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం మన దేశంలో 'చార్ ధామ్ యాత్ర'తో పాటు రాబోయే కాలంలో 'అమర్నాథ్ యాత్ర', 'పండర్పూర్ యాత్ర', 'జగన్నాథ యాత్ర' వంటి అనేక యాత్రలు ఉంటాయి. శ్రావణ మాసంలో బహుశా ప్రతి గ్రామంలో ఏదో ఒక జాతర జరుగుతుంది. మిత్రులారా! మనం ఎక్కడికి వెళ్లినా ఈ యాత్రా స్థలాల గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. పరిశుభ్రత, పవిత్ర వాతావరణం మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వాటిని మనం కాపాడుకోవాలి. అందుకే పరిశుభ్రతా తీర్మానాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్ని రోజుల తర్వాత జూన్ 5వ తేదీన 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' జరుపుకుంటున్నాం. పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలను నిర్వహించాలి. ఇది నిరంతరం జరగవలసిన పని. మీరు ఈసారి అందరూ కలిసి పరిశుభ్రత కోసం, చెట్ల పెంపకం కోసం కొంత ప్రయత్నం చేయండి. మీరే ఒక చెట్టును నాటండి. ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వండి.
నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెల జూన్ 21వ తేదీన మనం 8వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈసారి యోగా దినోత్సవ అంశం మానవత్వం కోసం యోగా. 'యోగా డే'ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. అవును! అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో మునుపటి కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఎక్కువ టీకా కవరేజ్ కారణంగా ఇప్పుడు ప్రజలు గతంలో కంటే ఎక్కువగా బయటకు వెళ్తున్నారు. అందువల్ల యోగా దినోత్సవం తో సహా అనేక విషయాల్లో చాలా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మన జీవితంలో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను కరోనా తెలియజేసింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత చాలా ఉంది. అవును. యోగా ద్వారా శారీరక, ఆధ్యాత్మిక, మేధో శ్రేయస్సు ఎంతగా వృద్ధి చెందుతుందో ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్త నుండి సినీ, క్రీడా ప్రముఖుల వరకు, విద్యార్థుల నుండి సామాన్య మానవుల వరకు, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ప్రజాదరణను చూడడానికి మీరందరూ ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా! ఈ సారి దేశ విదేశాల్లో యోగా దినోత్సవం సందర్భంగా చాలా వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణ గురించి తెలిసింది. వీటిలో ఒకటి గార్డియన్ రింగ్. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో సూర్యుని కదలికను ఉత్సవంగా జరుపుకుంటారు. అంటే సూర్యుడు ప్రయాణించేటప్పుడు భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల నుండి మనం యోగా ద్వారా దాన్ని స్వాగతిస్తాం. వివిధ దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సూర్యోదయం సమయంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం ఒక దేశం తర్వాత మరొక దేశం నుండి ప్రారంభమవుతుంది. తూర్పు నుండి పడమరకు ప్రయాణం నిరంతరం జరుగుతుంది. అలాగే ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమాల ధార ఒకదాని తర్వాత ఒకటిగా అనుసంధానమవుతుంది. అంటే ఇది ఒక రకమైన రిలే యోగా స్ట్రీమింగ్ ఈవెంట్. మీరు కూడా తప్పకుండా చూడండి.
మిత్రులారా! ఈసారి మన దేశంలో 'అమృత్ మహోత్సవ్'ను దృష్టిలో ఉంచుకుని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' దేశంలోని 75 ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. ఈ సందర్భంగా పలు సంస్థలు, దేశప్రజలు తమ తమ ప్రాంతాల్లో తమ స్థాయిలో వినూత్నంగా ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని, మీ నగరం, పట్టణం లేదా గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రదేశం పురాతన దేవాలయం, పర్యాటక కేంద్రం కావచ్చు. లేదా ప్రసిద్ధ నది, సరస్సు లేదా చెరువు ఒడ్డు కూడా కావచ్చు. దీంతో యోగాతో పాటు మీ ప్రాంతానికి గుర్తింపు పెరగడంతో పాటు టూరిజం కూడా పుంజుకుంటుంది. ప్రస్తుతం 'యోగా డే'కి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా జరుగుతోంది. వ్యక్తిగత, సామాజిక ప్రయత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 100వ రోజు, 75వ రోజు కౌంట్ డౌన్ కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో అస్సాంలోని శివసాగర్‌లో 50వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు, హైదరాబాద్‌లో 25వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు నిర్వహించారు. 'యోగా డే' కోసం మీరు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మరింత మంది వ్యక్తులను కలవండి. ప్రతి ఒక్కరూ 'యోగా డే' కార్యక్రమంలో చేరేవిధంగా స్ఫూర్తినివ్వండి. మీరందరూ 'యోగా డే'లో ఉత్సాహంగా పాల్గొంటారని, మీ రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను జపాన్ వెళ్ళాను. అనేక కార్యక్రమాల మధ్య కొందరు అద్భుతమైన వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. నేను వారి గురించి 'మన్ కీ బాత్'లో మీతో చర్చించాలనుకుంటున్నాను. వారు జపాన్ ప్రజలు. కానీ వారికి భారతదేశంతో అద్భుతమైన అనుబంధం, ప్రేమ ఉన్నాయి. వీరిలో ఒకరు ప్రముఖ కళా దర్శకులు హిరోషి కోయికే గారు. ఆయన మహాభారత్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ ప్రాజెక్ట్ కంబోడియాలో ప్రారంభమైంది. గత 9 సంవత్సరాలుగా కొనసాగుతోంది. హిరోషి కోయికే గారు ప్రతిదీ చాలా భిన్నమైన రీతిలో నిర్వహిస్తారు. ఆయన ప్రతి సంవత్సరం, ఆసియాలోని ఒక దేశానికి వెళ్తారు. అక్కడ స్థానిక కళాకారులు, సంగీతకారులతో మహాభారతంలోని భాగాలను రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన భారతదేశంతో పాటు కంబోడియా, ఇండోనేషియాతో సహా తొమ్మిది దేశాలలో రంగస్థల ప్రదర్శనను అందించారు. శాస్త్రీయ, సాంప్రదాయిక ఆసియా ప్రదర్శన కళల నేపథ్యం ఉన్న కళాకారులను హిరోషి కోయికేగారు ఒకచోట చేరుస్తారు. దీని కారణంగా, ఆయన పనిలో వైవిధ్యం కనిపిస్తుంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రదర్శనకారులు జావా నృత్యం, బాలినీస్ నృత్యం, థాయ్ నృత్యం ద్వారా మరింత ఆకర్షణీయంగా చేస్తారు. విశేషమేమిటంటే, ఇందులో ప్రతి ప్రదర్శకుడు తన స్వంత మాతృభాషలో మాట్లాడతారు. కొరియోగ్రఫీ ఈ వైవిధ్యాన్ని చాలా అందంగా ప్రదర్శిస్తుంది. సంగీత వైవిధ్యం దీన్ని మరింత సజీవంగా చేస్తుంది. మన సమాజంలోని వైవిధ్యాన్ని, సహజీవనం ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు నిజమైన శాంతి ఎలా ఉండాలో చెప్పడం వారి లక్ష్యం. వీరితో పాటు నేను జపాన్‌లో కలిసిన మరో ఇద్దరు వ్యక్తులు అత్సుషి మాత్సువో గారు, కెంజీ యోషీ గారు. వారిద్దరూ TEM ప్రొడక్షన్ కంపెనీకి అనుసంధానమై ఉన్నారు. ఈ సంస్థ 1993లో విడుదలైన జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణానికి సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ జపాన్ కు చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకుడు యుగో సాకో గారితో అనుబంధం కలిగి ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం 1983లో ఆయనకు రామాయణం గురించి తొలిసారిగా తెలిసింది. 'రామాయణం' ఆయన హృదయాన్ని తాకింది. ఆ తర్వాత దానిపై లోతుగా పరిశోధన చేయడం ప్రారంభించారు. అంతే కాదు- జపనీస్ భాషలో రామాయణానికి సంబంధించిన 10 వెర్షన్లు చదివారు. ఇంతటితో ఆగకుండా యానిమేషన్లో కూడా రూపొందించాలనుకున్నారు. ఇందులో భారతీయ యానిమేటర్లు కూడా ఆయనకు చాలా సహాయపడ్డారు. చిత్రంలో చూపిన భారతీయ ఆచారాలు, సంప్రదాయాల గురించి ఆయనకు మార్గనిర్దేశం చేశారు. భారతదేశంలోని ప్రజలు ధోతీని ఎలా ధరిస్తారు, చీర ఎలా ధరించాలి, జుట్టును ఎలా దువ్వుకుంటారో వారికి వివరించారు. కుటుంబం లోపల పిల్లలు ఒకరినొకరు ఎలా గౌరవిస్తారు, ఆశీర్వాదాల సంప్రదాయం ఏమిటి, ఉదయాన్నే లేవడం, ఇంట్లోని పెద్దలకు పాదాభివందనం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం- ఇలా అన్నీ- 30 ఏళ్ల తర్వాత ఈ యానిమేషన్ చిత్రం నాలుగింతల రెజల్యూషన్ ఉండే చిత్రంగా మళ్ళీ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మన భాష తెలియని, మన సంప్రదాయాల గురించి తెలియని మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ వాసులైన వారికి మన సంస్కృతి పట్ల ఉన్న అంకితభావం, గౌరవం ప్రశంసనీయమైనవి. ఏ భారతీయుడికి ఇది గర్వంగా అనిపించదు?
నా ప్రియమైన దేశవాసులారా! వ్యక్తిగత ప్రయోజనాలకు పై స్థాయిలో సమాజానికి సేవ చేయాలనే మంత్రం, సమాజం కోసం నేను అనే మంత్రం మన విలువలలో ఒక భాగం. మన దేశంలో లెక్కలేనంతమంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో నివాసముంటున్న రామ్‌భూపాల్‌రెడ్డి గారి గురించి నాకు తెలిసింది. రాంభూపాల్ రెడ్డి గారు ఉద్యోగ విరమణ తర్వాత తన సంపాదనంతా ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 'సుకన్య సమృద్ధి యోజన' కింద దాదాపు 100 మంది ఆడపిల్లల కోసం ఖాతాలు తెరిచి అందులో 25 లక్షల రూపాయలకు పైగా డబ్బును డిపాజిట్ చేశారు. అటువంటి సేవకు మరొక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని కచౌరా గ్రామంలో ఉంది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. ఇంతలో గ్రామానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్వర్ సింగ్ అనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలంలో మంచినీరు వచ్చింది. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఈ నీళ్లతో మిగతా గ్రామస్తులందరికీ ఎందుకు సేవ చేయకూడదని ఆయన అనుకున్నారు. కానీ, పొలం నుంచి గ్రామానికి నీరు తీసుకెళ్లేందుకు 30-32 లక్షల రూపాయలు కావాలి. కొంతకాలం తర్వాత కున్వర్ సింగ్ గారి తమ్ముడు శ్యామ్ సింగ్ గారు సైన్యం నుండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆయనకు ఈ విషయం తెలిసింది. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బునంతా ఈ పనికి అప్పగించి పొలం నుంచి గ్రామానికి పైప్‌లైన్ వేసి గ్రామస్తులకు మంచినీళ్లు సరఫరా చేశారు. ససహృదయత, కర్తవ్యంపై అంకితభావం ఉంటే ఒక్క వ్యక్తి కూడా మొత్తం సమాజ భవిష్యత్తును ఎలా మార్చగలడనే విషయం తెలిపేందుకు ఈ ప్రయత్నం ప్రేరణగా నిలుస్తుంది. కర్తవ్య మార్గంలో నడవడం ద్వారానే సమాజాన్ని శక్తివంతం చేయగలం. దేశాన్ని శక్తివంతం చేయగలం. ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో ఇది మన సంకల్పం. ఇది మన సాధన కూడా కావాలి. దానికి ఒకే మార్గం - కర్తవ్యం, కర్తవ్యం , కర్తవ్యం.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు మనం 'మన్ కీ బాత్'లో సమాజానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చించాం. మీరందరూ నాకు వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను పంపండి. వాటి ఆధారంగా మన చర్చ ముందుకు సాగుతుంది. అలాగే 'మన్ కీ బాత్' తర్వాతి సంచిక కోసం మీ సూచనలను పంపడం మర్చిపోవద్దు. ప్రస్తుతం స్వాతంత్య్ర అమృత మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు పాల్గొంటున్న కార్యక్రమాల గురించి కూడా తప్పక చెప్పండి. నమో యాప్, మై గవ్ లపై మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను. తర్వాతిసారి మనం మరోమారు కలుద్దాం. దేశప్రజలకు సంబంధించిన ఇలాంటి అంశాలపై మరోసారి మాట్లాడుకుందాం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న అన్ని జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవి కాలంలో జంతువులు, పక్షులకు ఆహారం, నీరు అందించే మానవీయ బాధ్యతను మీరు కొనసాగించాలి. ఇది గుర్తుంచుకోండి. అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.
కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. ఆయన తొలిసారి అవకాశం లభించిన వెంటనే ప్రధాన మంత్రి మ్యూజియం చూడటానికి వచ్చారు. నమో యాప్‌లో సార్థక్ గారు నాకు రాసిన సందేశం చాలా ఆసక్తికరంగా ఉంది. తాను చాలా ఏళ్లుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నానని, వార్తాపత్రికలు చదువుతున్నానని, సోషల్ మీడియాతో కొన్నాళ్లుగా కనెక్ట్ అయ్యానని, కాబట్టి తనకు జనరల్ నాలెడ్జ్ చాలా బాగుందని ఆయన అనుకున్నారు.కానీప్రధానమంత్రి మ్యూజియాన్ని సందర్శించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. తన దేశం గురించి, దేశానికి నాయకత్వం వహించిన వారి గురించి తనకు పెద్దగా తెలియదని గ్రహించారు. ప్రధాన మంత్రి మ్యూజియంలో తనకు ఆసక్తికరంగా కనిపించిన విషయాలను ఆయన రాశారు. లాల్ బహదూర్ శాస్త్రికి ఆయన అత్తమామలు బహుమతిగా ఇచ్చిన చరఖాను చూసి సార్థక్ గారు చాలా సంతోషించారు. శాస్త్రి జీ పాస్‌బుక్‌ను కూడా సార్థక్ గారుచూశారు. శాస్త్రి గారి వద్ద ఎంత తక్కువ డబ్బు ఉందో కూడా చూశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి ముందు మొరార్జీ భాయ్ దేశాయ్ గుజరాత్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారని కూడా తనకు తెలియదని సార్థక్ గారు రాశారు.మొరార్జీ దేశాయ్ పరిపాలనారంగంలో సుదీర్ఘకాలం సేవలందించారు. చౌదరి చరణ్ సింగ్ గారి గురించి కూడా సార్థక్ గారు రాశారు. జమీందారీ నిర్మూలన కోసం చౌదరి చరణ్ సింగ్ జీ గొప్ప కృషి చేశారని ఆయనకు తెలియదు. ఇది మాత్రమే కాదు- నేను శ్రీ పి.వి. నరసింహారావు గారు భూ సంస్కరణల విషయంలో చాలా ఆసక్తిని కనబరిచిన సంగతి కూడా ఈ మ్యూజియంలో తనకు తెలిసిందని సార్థక్ గారు తెలిపారు. చంద్రశేఖర్ గారు4 వేల కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్రాత్మక భారతదేశ యాత్ర చేశారని ఈ మ్యూజియానికి వచ్చిన తర్వాతే సార్థక్ గారికి కూడా తెలిసింది. అటల్ జీ ఉపయోగించిన వస్తువులను మ్యూజియంలో చూసినప్పుడు, ఆయన ప్రసంగాలు వింటుంటే సార్థక్ గర్వంతో ఉప్పొంగిపోయారు. ఈ మ్యూజియంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, జయ ప్రకాష్ నారాయణ్, మన ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా చాలా ఆసక్తికరమైన సమాచారం ఉందని సార్థక్ గారు తెలిపారు.
మిత్రులారా! దేశ ప్రధానమంత్రుల సేవలను గుర్తుంచుకోవడానికి స్వతంత్ర భారత అమృత మహోత్సవంకంటే మంచి సందర్భం ఏముంటుంది! స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం దేశానికి గర్వకారణం. ప్రజలలో చరిత్ర పట్ల ఆసక్తి చాలా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలోదేశంలోని అమూల్యమైన వారసత్వ సంపదతో యువతను అనుసంధానిస్తూ ఈ మ్యూజియం యువతకు కూడా కేంద్రంగా మారుతోంది.
మిత్రులారా! మ్యూజియం గురించి మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడునేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనిపించింది. మీ జనరల్ నాలెడ్జి ఏం చెప్తుందో చూద్దాం. మీకు ఎంత అవగాహన ఉందో చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నా యువ సహచరులుకాగితం, పెన్ను చేతుల్లోకి తీసుకున్నారా? నేను ప్రస్తుతం మిమ్మల్ని అడిగే ప్రశ్నల సమాధానాలను నమో యాప్ లేదా సోషల్ మీడియాలో #MuseumQuizతో పంచుకోవచ్చు. దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్నికోరుతున్నాను. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో మ్యూజియంపై ఆసక్తి పెరుగుతుంది. దేశంలోని ఏ నగరంలో ప్రసిద్ధ రైలు మ్యూజియం ఉందో మీకు తెలుసా? అక్కడ గత 45 ఏళ్లుగా భారతీయ రైల్వే వారసత్వాన్ని చూసే అవకాశం ప్రజలకు లభిస్తోంది. నేను మీకు మరొక క్లూ ఇస్తాను. మీరు ఇక్కడ ఫెయిరీ క్వీన్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సెలూన్ నుండి మొదలుకొని ఫైర్‌లెస్ స్టీమ్ లోకోమోటివ్ వరకు కూడా చూడవచ్చు. ముంబైలోని ఏ మ్యూజియం కరెన్సీ పరిణామాన్ని ఆసక్తికరంగా వివరిస్తుందో మీకు తెలుసా? ఇక్కడ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన నాణేలు ఉన్నాయి. మరోవైపు ఈ-మనీ కూడా ఉంది. మూడవ ప్రశ్న 'విరాసత్-ఎ-ఖల్సా' ఏ మ్యూజియానికి సంబంధించింది? పంజాబ్‌లోని ఏ నగరంలో ఈ మ్యూజియం ఉందో తెలుసా? మీరందరూ గాలిపటం ఎగురవేయడంలో చాలా ఆనందించి ఉంటారు. తర్వాతి ప్రశ్న దీనికి సంబంధించింది. దేశంలోని ఏకైక గాలిపటాల మ్యూజియం ఎక్కడ ఉంది? నేను మీకు ఒక క్లూ ఇస్తాను. ఇక్కడ ఉన్న అతిపెద్ద గాలిపటం పొడవు వెడల్పులు 22అడుగులు, 16 అడుగులు. ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడే ఇంకో విషయం చెప్తాను. ఈ మ్యూజియం ఉన్న ఊరికి బాపుకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నతనంలో టపాసులు సేకరించే హాబీ ఎవరికి మాత్రం ఉండదు! అయితేభారతదేశంలో పోస్టల్ స్టాంపులకు సంబంధించిన జాతీయ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసా? నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. గుల్షన్ మహల్ అనే భవనంలో ఏ మ్యూజియం ఉంది? మీ కోసం క్లూ ఏమిటంటేఈ మ్యూజియంలో మీరు సినిమా డైరెక్టర్‌గా కూడా మారవచ్చు. మీరు కెమెరా, ఎడిటింగ్ నైపుణ్యాలను కూడా అక్కడ చూడవచ్చు. సరే! భారతదేశ వస్త్ర వారసత్వాన్ని తెలియజేసే మ్యూజియం ఏదైనా మీకు తెలుసా? ఈ మ్యూజియంలో సూక్ష్మ వర్ణ చిత్రాలు, జైన లిఖిత ప్రతులు, శిల్పాలు - మరెన్నో ఉన్నాయి. ఇది ప్రత్యేక తరహా ప్రదర్శనకు కూడా ప్రసిద్ధి చెందింది.
మిత్రులారా!ఈ టెక్నాలజీ యుగంలోమీరు వాటికి సమాధానాలు కనుగొనడం చాలా సులభం. మన కొత్త తరంలో ఆసక్తి పెరగాలని, వాటి గురించి మరింత ఎక్కువగా చదవాలని, చూడ్డానికి వెళ్లాలని నేను ఈ ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు మ్యూజియాలకు ఉన్న ప్రాధాన్యత కారణంగా చాలా మంది స్వయంగా ముందుకు వచ్చి వాటికి విరాళాలు ఇస్తున్నారు. చాలా మంది తమ పాత సేకరణలతో పాటు చారిత్రక విశేషాలను మ్యూజియంలకు అందజేస్తున్నారు. మీరు ఇలా చేసినప్పుడుఒక విధంగామీరు మొత్తం సమాజంతో సాంస్కృతిక అంశాలను పంచుకుంటారు. భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రజలు దీని కోసం ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిగత ప్రయత్నాలన్నింటినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజుల్లో మారుతున్న కాలంలోకోవిడ్ నిబంధనల కారణంగామ్యూజియాలలో కొత్త పద్ధతులను అవలంబించడంపై దృష్టి సారిస్తున్నారు.
మ్యూజియాలలో డిజిటలైజేషన్‌పై కూడా దృష్టి పెరిగింది. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నా యువ సహచరుల కోసం నా దగ్గర ఒక ఆలోచన ఉంది. రాబోయే సెలవుల్లో మీ స్నేహితుల బృందంతో స్థానిక మ్యూజియాన్ని ఎందుకు సందర్శించకూడదు! #MuseumMemoriesతో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇతరుల మనస్సులలో కూడా మ్యూజియాలపై ఆసక్తిని పెంచుతారు.
నా ప్రియమైన దేశప్రజలారా!మీరు మీ జీవితంలో చాలా తీర్మానాలు చేసి ఉండాలి. వాటిని నెరవేర్చడానికి మీరు కష్టపడి ఉండాలి. మిత్రులారా!కానీ ఇటీవలనేను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన తీర్మానం గురించి తెలుసుకున్నాను. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలతో తప్పక పంచుకోవాలని అనుకున్నాను.
మిత్రులారా!రోజంతా ఊరంతా తిరుగుతూనగదు రూపంలో ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయనుఅనే సంకల్పంతో ఎవరైనా తమ ఇంటి నుండి బయటకు రాగలరని మీరు ఊహించగలరా! ఇది ఆసక్తికరమైన తీర్మానం కదా! ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు సాగరిక, ప్రేక్ష ఇలాంటి ఒక క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగం చేశారు. ఢిల్లీలో సాగరిక, ప్రేక్ష ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్ సౌకర్యం లభించింది. UPI QR కోడ్ కారణంగావారు నగదు విత్‌డ్రా చేయాల్సిన అవసరం రాలేదు. స్ట్రీట్ ఫుడ్ దుకాణాల్లోనూ వీధి వ్యాపారుల దగ్గర కూడావారు ఆన్లైన్ లావాదేవీల సౌకర్యాన్ని పొందారు.
మిత్రులారా!ఢిల్లీ మెట్రో నగరం కాబట్టి అక్కడ ఇవన్నీ ఉండటం చాలా సులభమణి ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు UPI వ్యాప్తి కేవలం ఢిల్లీ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాదు. ఘజియాబాద్ కు చెందిన ఆనందితా త్రిపాఠి గారి నుండి నాకు సందేశం వచ్చింది. ఆనందిత గత వారం తన భర్తతో కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లారు. అస్సాం నుంచి మొదలుకుని మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ వరకు తమ ప్రయాణ అనుభవాన్ని చెప్పారు. చాలా రోజుల ఈ ప్రయాణంలో వారు మారుమూల ప్రాంతాల్లో కూడా నగదు ఉపయోగించవలసిన అవసరం రాలేదని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం వరకు మంచి ఇంటర్నెట్ సదుపాయం కూడా లేని చోట ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. సాగరిక, ప్రేక్ష, ఆనందిత అనుభవాలను పరిశీలిస్తూ క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగాన్ని ప్రయత్నించమని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. తప్పకుండా చేయండి. మిత్రులారా!గత కొన్ని సంవత్సరాలుగా BHIM UPI మన ఆర్థిక వ్యవస్థ, అలవాట్లలో ఒక భాగంగా మారింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో, చాలా గ్రామాల్లో ప్రజలు UPI ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ ఎకానమీ వల్ల దేశంలో ఒక సంస్కృతి కూడా ఏర్పడుతోంది. డిజిటల్ చెల్లింపుల కారణంగా వీధుల్లోని చిన్నచిన్న దుకాణాలు కూడా ఎక్కువ మంది వినియోగదారులకు సేవలను అందించడాన్ని సులభతరం చేశాయి. ఇప్పుడు వారికి నగదు సమస్య కూడా లేదు. మీరు రోజువారీ జీవితంలో UPI సౌలభ్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా నగదు తీసుకెళ్లడం, బ్యాంకుకు వెళ్ళడం, ఏటీఎం వెతకడం మొదలైన సమస్యలు దూరమయ్యాయి. అన్ని చెల్లింపులు మొబైల్ నుండే జరుగుతాయి. కానీమీ ఈ చిన్న ఆన్లైన్ చెల్లింపుల వల్ల దేశంలో ఎంత పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా! ప్రస్తుతం మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో యూపీఐ లావాదేవీలు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనివల్ల దేశంలో సౌలభ్యం కూడా పెరిగి నిజాయితీ వాతావరణం కూడా ఏర్పడుతోంది. ఇప్పుడు ఫిన్-టెక్కి సంబంధించిన అనేక కొత్త స్టార్టప్‌లు కూడా దేశంలో ముందుకు సాగుతున్నాయి. ఈ డిజిటల్ చెల్లింపు శక్తి, స్టార్ట్-అప్ వ్యవస్థకు సంబంధించి మీకు ఏవైనా అనుభవాలు ఉంటే పంచుకోవాలని నేను కోరుతున్నాను. మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తిగా మారవచ్చు.
నా ప్రియమైన దేశవాసులారా ! సాంకేతికతలోని శక్తి సామాన్య ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందోమన చుట్టూ మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. టెక్నాలజీ మరో గొప్ప పని చేసింది. దివ్యాంగ సహచరుల అసాధారణ సామర్థ్యాల ప్రయోజనాన్ని దేశానికి, ప్రపంచానికి చూపించడమే ఈ పని. మన దివ్యాంగ సోదర సోదరీమణులు ఏం చేయగలరో టోక్యో పారాలింపిక్స్‌లో మనం చూశాం. క్రీడలతోపాటు కళలు, విద్యారంగం మొదలైన అనేక ఇతర క్షేత్రాల్లో దివ్యాంగసహచరులు అద్భుతాలు చేస్తున్నారు. కానీ ఈ సహచరులకు సాంకేతికత లోని శక్తి లభించినప్పుడు వారు మరింత ఉన్నత గమ్యాలను చేరుకుంటారు. అందుకేఈ రోజుల్లో దేశం దివ్యాంగులకు వనరులను, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోంది. దేశంలో అనేక స్టార్టప్‌లు, సంస్థలు ఈ దిశలో స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ఒకటి – వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. ఈ సంస్థ సహాయక సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తోంది. దివ్యాంగ కళాకారుల కృషిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు వినూత్నమైన ప్రారంభం కూడా జరిగింది. వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ సంస్థకు చెందిన కళాకారుల చిత్రాల డిజిటల్ ఆర్ట్ గ్యాలరీని సంస్థ సిద్ధం చేసింది. దివ్యాంగులైన సహచరులు ఎంత అసాధారణమైన ప్రతిభతో సుసంపన్నమవుతారో, వారు ఎలాంటి అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారో తెలిపేందుకు ఈ ఆర్ట్ గ్యాలరీ ఉదాహరణగా నిలుస్తుంది. దివ్యాంగ సహచరుల జీవితంలో ఉండే సవాళ్లు, వాటిని అధిగమిస్తే వారు ఎంత దూరం చేరుకోగలరు మొదలైన విషయాలు ఈ పెయింటింగ్స్ చూస్తే తెలుస్తాయి. మీకు కూడా దివ్యాంగ సహచరులు తెలిస్తే, వారి ప్రతిభను తెలుసుకుంటే, డిజిటల్ టెక్నాలజీ సహాయంతోమీరు వారిని ప్రపంచం ముందుకు తీసుకురావచ్చు. దివ్యాంగ సహచరులు కూడా అలాంటి ప్రయత్నాలలో పాలుపంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్నఈ వేడి- నీటిని ఆదా చేసే విషయంలో మన బాధ్యతను పెంచుతుంది. మీరు ఇప్పుడు ఉన్న చోట పుష్కలంగా నీరు అందుబాటులో ఉండవచ్చు. కానీనీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించే కోట్లాది ప్రజలను కూడా మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారికి ప్రతి నీటి బొట్టు అమృతం లాంటిది.
మిత్రులారా!స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నసందర్భంగా అమృతోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో దేశం ముఖ్యమైనవిగా భావిస్తున్న సంకల్పాలలో నీటి సంరక్షణ కూడా ఒకటి. అమృత మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను నిర్మిస్తారు. ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు. మీ పట్టణానికి 75 అమృత సరోవరాలు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మీరందరూ-ముఖ్యంగా యువత ఈ ప్రచారం గురించి తెలుసుకోవాలని,ఈ బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఏదైనా చరిత్ర ఉన్నా,ఒక పోరాట యోధుని జ్ఞాపకాలు ఉన్నా మీరు వాటిని అమృత సరోవరాలతో కూడా అనుసంధానించవచ్చు. అమృత్ సరోవర్ సంకల్పం తీసుకున్న తర్వాతదాని కోసం చాలా చోట్ల శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయని తెలిసి నాకు చాలా సంతోషమైంది. యూపీలోని రాంపూర్ లో పట్వాయి గ్రామ పంచాయతీ గురించి నాకు సమాచారం వచ్చింది. అక్కడ గ్రామసభ జరిగే స్థలంలో ఒక చెరువు ఉంది. కానీ అది మురికితో, చెత్తతో నిండి ఉంది. ఎంతో కష్టంతో స్థానికుల సహకారంతో, స్థానిక పాఠశాల విద్యార్థుల సహకారంతో ఆ మురికి చెరువు గత కొన్ని వారాల్లో రూపాంతరం చెందింది.ఇప్పుడు ఆ సరస్సు ఒడ్డున రిటైనింగ్ వాల్, ప్రహరీ గోడ, ఫుడ్ కోర్ట్, ఫౌంటెన్లు, లైటింగ్ లాంటి ఏర్పాట్లు చేశారు. ఈ కృషికి రాంపూర్‌లోని పట్వాయి గ్రామపంచాయతీని, గ్రామ ప్రజలను,అక్కడి చిన్నారులను అభినందిస్తున్నాను.
మిత్రులారా!నీటి లభ్యత, నీటి కొరతదేశ ప్రగతిని, అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తాయి. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత వంటి అంశాలతో పాటు నీటి సంరక్షణ గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడటం మీరు గమనించి ఉంటారు.
“పానీయం పరమం లోకే, జీవానాం జీవనం స్మృతమ్” అని మన గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
అంటే ప్రపంచంలో ప్రతి జీవికి నీరే ఆధారం. నీరే అతి పెద్ద వనరు కూడా. అందుకే మన పూర్వీకులు నీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వేదాల నుండి పురాణాల వరకుప్రతిచోటా- నీటి పొదుపు;చెరువులు, సరస్సులు మొదలైన వాటి నిర్మాణం మనిషి సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యంగా పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో నీటి సంరక్షణ, నీటి వనరుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగాసింధు-సరస్వతి , హరప్పా నాగరికతలలో కూడా నీటికి సంబంధించి భారతదేశంలో ఇంజనీరింగ్ ఎంత అభివృద్ధి చెందిందో చరిత్ర విద్యార్థులకు తెలిసి ఉండవచ్చు. పురాతన కాలంలో, అనేక నగరాల్లో నీటి వనరులు ఒకదానితో ఒకటి అనుసంధానమైన వ్యవస్థ ఉండేది. ఆ సమయంలో జనాభా అంతగా లేదు. సహజ వనరుల కొరత లేదు. ఒక రకమైన సమృద్ధి ఉంది. అయినప్పటికీనీటి సంరక్షణ గురించిఅప్పుడుఅవగాహన చాలా ఎక్కువగా ఉండేది. కానీఈరోజులలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మీ ప్రాంతంలోని ఇటువంటి పాత చెరువులు, బావులు, సరస్సుల గురించి తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అమృత్ సరోవర్ అభియాన్ కారణంగానీటి సంరక్షణతో పాటుమీ ప్రాంతానికి గుర్తింపు కూడా లభిస్తుంది. దీంతో నగరాలతో పాటు వివిధ ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజల విహారయాత్రలకు కూడా స్థలం లభిస్తుంది.
*****
మిత్రులారా నీటికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ మన భవిష్యత్తుతో ముండిపడిందే. అది మన సామాజిక బాధ్యతకదా. దీనికోసం శతాబ్దాలుగా విభిన్న సమాజాలు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కచ్ కి చెందిన మాల్ ధారీ అనే ఓ తెగ జల సంరక్షణకోసం వృదాస్ అనే ఓ ప్రత్యేకమైన ప్రక్రియని అనుసరిస్తుంది. దాంట్లో చిన్న చిన్న బావుల్ని ఏర్పాటు చేసుకుని వాటి సంరక్షణకోసం చుట్టుపక్కలంతా మొక్కల్ని నాటి చెట్లు పెంచుతారు. అదే విధంగా మధ్యప్రదేశ్ కి చెందిన బీల్ అనే తెగ హల్మా అనే ఓ సంప్రదాయ విధానాన్ని అనుసరించింది. ఈ విధానంలో జల సంరక్షణకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకునేందుకు అందరూ కలసి ఓ చోట సమావేశమవుతారు. హల్మా విధానంలో కనుగొన్న పరిష్కారాల వల్ల ఈ ప్రదేశంలో నీటి ఎద్దడి తగ్గిపోయింది. అలాగే భూగర్భజలాలు పెరుగుతున్నాయి.
మిత్రులారా అసలు ఇది మన కర్తవ్యం అన్న భావన అందరి మనసుల్లో కలిగితే నీటి ఎద్దడికి సంబంధించిన అతి పెద్ద సమస్యలకు కూడా సులభ పరిష్కారాలు లభిస్తాయి. అందుకే మనం స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ జల సంరక్షణ, జీవన సంరక్షణ అనే సంకల్పాలు చేద్దాం. మనం ప్రతి నీటి బొట్టునూ, అలాగే మన జీవితాలను కాపాడుకుందాం.
ప్రియతమ దేశవాసులారా మీరంతా చసే ఉంటారు నేను కొన్ని రోజుల క్రితం నా యువనేస్తాలతో, విద్యార్ధులతో పరీక్షలపై చర్చ జరిపాను. దాంట్లో చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే వాళ్లకి పరీక్షల్లో లెక్కల పరీక్షంటే చాలా భయమేస్తోందట. ఇదే విషయాన్ని ఎంతో మంది విద్యార్ధులు నాకు సందేశాల ద్వారాకూడా పంపించారు. ఈసారి మనసులో మాటలో లెక్కల గురించి చర్చించాలని నేను ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. మిత్రులారా అసలు లెక్కల గురించైతే మన భారతీయులెవరూ అస్సలు భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే లెక్కలకి సంబంధించి భారతీయులే ఎక్కువగా వీలైనన్ని పరిశోధనలు, ఆవిష్కారాలు చేశారుకదా. సున్నా విలువ అలాగే దాని ప్రాధాన్యత గురించి మన యువతరం వినే ఉంటుందికదా. నిజానికి మీకింకో విషయం కూడా తెలిసే ఉంటుంది అసలు సున్నాని కనిపెట్టకపోయుంటే అసలు ప్రపంచం ఇంత వైజ్ఞానిక ప్రగతి సాధించడం కూడా మనం చూసుండే వాళ్లం కాదేమో. క్యాలిక్యులస్ నుంచి కంప్యూటర్ల వరకూ అన్ని వైజ్ఞానికి ఆవిష్కరణలూ సున్నామీదే ఆధారపడి ఉంటాయికదా. అసలు మన భారతీయ గణి శాస్త్రవేత్తలు, విద్వాంసులు ఏం రాశారంటే
యత్ కించిత్ వస్తు తత్ సర్వః గణితేన వినా నహి
దానర్థం ఏంటంటే అసలీ మొత్తం బ్రహ్మాండంలో ఏముందో మొత్తం అదంతా గణితం మీదే ఆధారపడి ఉందని. మీరు విజ్ఞాన శాస్త్రం గురించి గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు దీని గురించి అర్థమైపోతుంది. విజ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క సూత్రాన్నీ మేథమెటికల్ ఫార్ములాగానే వ్యక్తం చెయ్యడం జరిగిందికదా. న్యూటన్ లా కావొచ్చు, ప్రసిద్ధి చెందిన ఐన్ స్టీన్ ఈక్వేషన్ కావొచ్చు, అసలీ బ్రహ్మాండానికి సంబంధించిన మొత్తం విజ్ఞానమంతా గణితమే కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు థియరీ ఆఫ్ ఎవ్రీ థింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం బ్రహ్మాండం గురించి చెప్పడానికి ఒకే ఒక సూత్రమన్న మాట. అసలు గణితానికి సంబంధించి మన మహర్షులు ఎంతో విస్తృత స్థాయిలో ఆలోచించారు, పరిశోధనలు చేశారు. మనం కేవలం సున్నానిమాత్రం ఆవిష్కరించడమే కాక అనంతం అంటే ఇన్ఫినిటీనికూడా కనిపెట్టాం. సాధారణమైన మాటల్లో మనం సంఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు మిలియెన్, బిలియెన్, ట్రిలియెన్ వరకూ చెబుతాం, ఆలోచిస్తాం. కానీ వేదాల్లో అలాగే భారతీయ గణితంలో ఈ గణన ఇంకా చాలా ముందుకెళ్లింది. మనకి ఓ పురాతనమైన శ్లోకం కూడా ప్రచారంలో ఉంది.
ఏకం దశం శతంచైవ సహస్రం అయుతం తథా
లక్షంచ నియుతంచైవ కోటిః అర్బుదమ్ ఏవచ
వృదం ఖర్వే నిఖర్వ చ శంఖః పదమః చ సాగరః
అంత్యం మధ్యం పరార్ధః చ దశ వృదధ్వా యధా క్రమమ్
ఈ శ్లోకంలో సంఖ్యల ఆర్డర్ ని చెప్పారు. ఎలాగంటే ఒకటి, పది, వంద, వెయ్యి, అయుతం, లక్ష, నియుత, అలాగే కోటి. సంఖ్యలు ఈ విధంగా వెళ్తుంటాయి సంఖ్య, పదం అలాగే సాగరం వరకూ. ఓ సాగరం అంటే ఎంతంటే పదికి టూదీ పవర్ ఆఫ్ 57. అది మాత్రమే కాక ఇంకా ఆ తర్వాత ఓధ్ అలాగే మహోధ్ లాంటి సంఖ్యలు కూడా ఉన్నాయి. ఓ మహోధ్ అంటే ఎంతంటే 10కి టూది పవర్ ఆఫ్ 62కి సమానం. అంటే ఒకటి తర్వాత 62 సున్నాలు 62 జీరోస్. మనం అసలు అంత పెద్ద సంఖ్యల గురించి సలు తలచుకున్నా సరే కష్టంగా అనిపిస్తుంది. కానీ భారతీయ గణితంలో వీటి ప్రయోగం వేలాది సంవత్సరాలుగా జరుగుతోంది. నాకు కొన్ని రోజుల క్రితం ఇంటెల్ కంపెనీ సీఈఓ కలిశారు. అసలు ఇంటెల్ పేరు వింటేనే మీ మనసులో కంప్యూటర్ అన్న ఆలోచన వచ్చేస్తుందికదా. మీరు కంప్యూటర్ గురించి మన బైనరీ సిస్టమ్ గురించి కూడా వినుంటారుకదా. కానీ మీకోటి తెలుసా అసలు మన దేశంలో ఆచార్య పింగళుడు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ బైనరీ సిస్టమ్ గురించి ఆలోచించాడు. ఈ విధంగా ఆర్యభట్టనుంచి రామానుజం లాంటి గణిత శాస్త్ర వేత్తల వరకూ అందరూ గణితానికి సంబంధించిన న్నో సూత్రాలను సిద్ధాంతీకరించారు.
మిత్రులారా అసలు మన భారతీయులకెప్పుడూ గణితం అస్సలు కష్టంగా అనిపించలేదు. దానికి మన వైదిక గణితం కూడా ఓ కారణం. ఆధునిక కాలంలో వైదిక గణితానికి సంబంధించిన కీర్తెవరికి దక్కుతుందంటే శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహరాజ్ కే. ఆయన క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ప్రాచీన విధానాలను ఆధునికీకరించారు. అలాగే దానికి వైదిక గణితం అనే పేరు పెట్టారు. అసలు వైదిక గణితం విశిష్టత ఏంటంటే మీరు దాంతో అత్యంత కఠిమైన లెక్కల్ని కూడా రెప్పపాటు కాలంలో చేసెయ్యొచ్చు. అసలీ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలా వైదిక గణితాన్ని నేర్చుకునేవాళ్లు నేర్పించేవాళ్ల వీడియాలు అనేకం చూడొచ్చు.
మిత్రులారా ఇవ్వాళ్టి మనసులో మాటలో అలా వైదిక గణితం నేర్పించే ఓ మిత్రుడు మనతో కలవబోతున్నారు. ఆయనెవరంటే కోలకతాకి చందిన సౌరవ్ టేక్రీవాల్ గారు. ఆయన గడచిన రెండు రెండున్నర దశాబ్దాలనుంచి వైదిక్ మ్యాధమెటిక్స్ అనే ఈ మూవ్ మెంట్ ని చాలా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం.
నరేంద్ర మోడీ గౌరవ్ గారూ నమస్కారం
గౌరవ్ నమస్కారం సర్
నరేంద్ర మోడీ మేమేం విన్నామంటే మీకు వైదిక్ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమట కదా, చాలా పరిశ్రమ చేశారట కదా
ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను
తర్వాత అసలు మీకు దానిమీద ఎందుకు ఇష్టత కలిగిందో చెప్పండి
గౌరవ్ సార్ నేను ఇరవై ఏళ్లక్రితం బిజినెస్ స్కూల్ కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, దానికో కాంపిటీటివ్ ఎగ్జామ్ జరిగేది.
దాని పేరు క్యాట్.
అందులో గణితానికి సంబంధించి చాలా ప్రశ్నలొచ్చేవి.
వాటిని చాలా తక్కువ సమయంలో పూర్తి చెయ్యాలి.
అప్పుడు మా అమ్మ నాకో పుస్తకం తెచ్చిచ్చింది, దాని పేరేంటంటే వైదిక గణితం.
స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహారాజు ఆ పుస్తకం రాశారు.
ఆవిడా పుస్తకంలో పదహారు సూత్రాల్ని ఇచ్చారు.
వాటివల్ల గణితం చాలా సులభంగా, చాలా తొందరగా పూర్తైపోయేది.
నేనా పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది.
తర్వాత నాకు మ్యాథమెటిక్స్ మీద ఇష్టత ఏర్పడింది.
అసలు మనకున్న ఆ విజ్ఞానాన్ని, ఆ బలాన్ని ప్రపంచం నలుమూలలా విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యొచ్చనిపించింది.
అందుకే నేను అప్పట్నుంచీ వైదిక గణితాన్ని ప్రపంచంలో మూలమూలలా ప్రచారం చెయ్యడం అనే ఓ మిషన్ కి చేపట్టి అందుకోసం ప్రయత్నిస్తున్నాను.
ఎందుకంటే ప్రతొక్కరూ లెక్కలంటే భయపడతారు కాబట్టి.
పైగా అసలు వైదిక గణితం కంటే తేలికైంది ఇంకేదైనా ఉంటుందా.
నరేంద్రమోడీ గౌరవ్ గారు మీరు ఎన్నేళ్లుగా దీనికోసం పనిచేస్తున్నారు.
గౌరవ్ దాదాపుగా ఇవ్వాళ్టికి ఇరవై ఏళ్లయ్యింది సార్. నేను పూర్తిగా ఇందులోనే ఉన్నాను.
నరేంద్రమోడీ మరి అవేర్ నెస్ కోసం ఏం చేస్తారు? ఏమేం ప్రయోగాలు చేస్తారు?
గౌరవ్ మేం స్కూళ్లకెళ్తాం. మేం ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తాం.
మా సంస్థ పేరేంటంటే వైదిక్ మ్యాథ్స్ ఫోరమ్ ఇండియా.
ఆ సంస్థ ద్వారా మేము ఇంటర్ నెట్ మాధ్యమంలో ఇరవై నాలుగ్గంటలూ చదువు చెబుతాం సర్.
నరేంద్రమోడీ గౌరవ్ గారూ నాకసలెప్పుడూ పిల్లలతో మాట్లాడ్డం చాలా ఇష్టమని, పైగా నేను దానికోసం అవకాశాలు వెతుక్కుంటానని మీకు తెలుసుకదా. పైగా అసలు ఎగ్జామ్ వారియెర్ తో నేను పూర్తిగా ఓ విధంగా దాన్ని ఇనిస్టిట్యూషనలైజ్ చేసేశాను.
పైగా అసలు విషయం ఏంటంటే మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు లెక్కల గురించి మాట్లాడితే చాలు చాలామంది పిల్లలు వెంటనే పారిపోతారు. అందుకే నేనేం చేస్తానంటే అలాంటి అనవసరపు భయాల్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తాను. అసలా భయాన్ని పోగొట్టాలి. అలాగే వాళ్లకి మనకి వారసత్వంగా లభించిన చిన్న చిన్న టెక్నిక్స్ ని చెప్పాలి. ఎందుకంటే భారతీయులకి లెక్కలంటే కొత్త విషయమేం కాదుగా. బహుశా ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన రీతుల్లో భారత దేశానికి చెందిన గణిత శాస్త్ర రీతులుకూడా భాగమేనేమో. మకి ఎగ్జామ్ వారియెర్స్ మనసుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మీరు వాళ్లకేం చెబుతారు?
గౌరవ్ సర్ ఇది పిల్లలకి అన్నింటికంటే ఎక్కువ ఉపయోగపడే విషయం. ఎందుకంటే అసలు పరీక్షలంటేనే చాలా భయపడిపోతారు పిల్లలు, వాళ్లకి చాలా అపోహలుంటాయా విషయంలో ప్రతి ఇంట్లోనూ. పరీక్షలకోసం పిల్లలు ట్యూషన్లకెళ్తారు. తల్లిదండ్రులు ఇబ్బందిపడుతుంటారు. అసలు మామూలు గణితంతో పోలిస్తే వేద గణితం పదిహేను వందల శాతం ఎక్కువ వేగవంతమైంది. అలాగే దానివల్ల పిల్లలకు చాలా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అలాగే మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు మేం వైదిక గణితంతోపాటుగా యోగానికడా ఇంట్రడ్యూస్ చేశాం. దానివల్ల ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే కళ్లుమూసుకుని కూడా కాలిక్యులేషన్ చేసేయొచ్చు వైదిక గణిత పద్ధతుల్లో.
నరేంద్రమోడీ నిజానికి అదెలాంటి ధ్యాన రీతి అంటే దాంట్లో ఆ విధంగా గణించడం కూడా ధ్యానంలో ఓ ప్రైమరీ కోర్సు కదా
గౌరవ్ అవును సర్
నరేంద్ర మోడీ సరే గౌరవ్ గారూ, మీరు దీన్ని మిషన్ మోడలో తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ అమ్మగారు మిమ్మల్ని ఓ గురువు రూపంలో ఈ దారిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇవ్వాళ్ల మీరుకూడా లక్షలాది మంది పిల్లల్ని ఈ మార్గంలోకి తీసుకొస్తున్నారు. నా తరఫున మీకు హార్ధిక శుభాభినందనలు.
గౌరవ్ ధన్యవాదాలు సర్. మీరు వైదిక గణితానికి ఈ విధంగా ఇప్పుడు గుర్తింపుని తీసుకొచ్చేందుకు, దానికోసం నన్ను ఎంపిక చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను సర్. మేం మీకు ఋణపడి ఉన్నాం.
నరేంద్రమోడీ మీకు హార్థిక శుభాకాంక్షలు. నమస్కారం.
గౌరవ్ నమస్తే సర్.
మిత్రులారా గౌరవ్ గారు అసలు వైదిక గణితం సాధారణ గణితాన్ని ఏ విధంగా కష్టాన్ని ఇష్టంగా మారుస్తుందో చాలా చక్కగా చెప్పారు. అది మాత్రమే కాక వైదిక గణితం ద్వారా మీరు అతి పెద్ద ప్రాబ్లమ్స్ ని కూడా అత్యంత సులభంగా సాల్వ్ చెయ్యొచ్చు. అందుకే ప్రతొక్క తల్లీ తండ్రీ వైదిక గణితాన్ని తమ పిల్లలకి
నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల వాళ్లకి కాన్ఫిడెన్స్ పెరగడం మాత్రమే కాక వాళ్ల అనలెటికల్ పవర్ కూడా పెరుగుతుంది. పైగా ఏంటంటే లెక్కలనే పేరు చెప్పగానే కొందరు పిల్లల్లో ఉన్న కాస్తో కూస్తో భయం కూడా పూర్తిగా దూరమైపోతుంది.
ప్రియమైన మిత్రులారా ఇవ్వాళ్ల మనం మనసులో మాటలో మ్యూజియం నుంచి మ్యాథ్స్ వరకూ అనేక విధాలైన జ్ఞానాన్ని పెంపొందించే విషయాల గురించి చర్చించుకున్నాం. అసలీ విషయాలన్నీ మీ సూచనలవల్లే మనసులో మాటలో చోటు చేసుకుంటున్నాయి. నాకు మీరు ఇదే విధంగా ఇకపై కూడా మీ సలహాలు, సూచనలను నమో యాప్ మరియు మై గౌవ్ ల ద్వారా పంపిస్తూనే ఉండండి. రాబోయే రోజుల్లో దేశంలో ఈద్ పండగకూడా రాబోతోంది. మే మూడో తేదీన అక్షయ తృతీయ, అలాగే పరశురామ భగవానుడి జయంతిని కూడా జరుపుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినంకూడా వస్తుంది. ఈ పండుగలన్నీ శాంతి, పవిత్రత, దానం అలాగే సహృదయతలను
పెంపొందించే పర్వాలే. మీకందరికీ ఈ పర్వాలకు సంబంధించి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగల్ని చాలా సంతోషంగా చాలా మంచి మనసుతో జరుపుకోండి. వాటితోపాటుగా మీరు కరోనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకోండి. నియమిత కాల వ్యవధుల్లో చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. దానినుంచి తప్పించుకోవడానికి ఉన్న ఉపాయాలన్నింటినీ మీరు
తప్పకుండా పాటించండి. మళ్లీ వచ్చేసారి మనసులో మాటలో మళ్లీ కలుసుకుందాం. అలాగే మీరు పంపించిన ఇంకొన్ని కొత్త విషయాల గురించి కూడా చర్చించుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. హృదయపూర్వక
ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.
మిత్రులారా! దేశంలోని నలుమూలల నుండి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి . అస్సాంలోని హైలకండి నుండి లెదర్ ఉత్పత్తులు కావచ్చు లేదా ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపూర్ నుండి పండ్లు , కూరగాయలు కావచ్చు లేదా చందౌలీ నుండి నల్ల బియ్యం కావచ్చు… వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు లదదాఖ డఖ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ యాప్రికాట్ దుబాయ్‌లో కూడా దొరుకుతుంది. తమిళనాడు నుండి పంపిన అరటిపండ్లు సౌదీ అరేబియాలో కూడా లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను కొత్త కొత్త దేశాలకు పంపడం గొప్ప విషయం. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌లో పండిన చిరుధాన్యాలు తొలి విడతగా డెన్మార్క్‌కు ఎగుమతయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగనపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. త్రిపుర నుండి తాజా పనసపండ్లను విమానంలో లండన్‌కు ఎగుమతి చేశారు. నాగాలాండ్‌కు చెందిన రాజా మిర్చ్‌ను మొదటిసారిగా లండన్‌కు పంపారు. అదేవిధంగా మొదటి దశలో భాలియా గోధుమలు గుజరాత్ నుండి కెన్యాకు, శ్రీలంకకు ఎగుమతి అయ్యాయి. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెళితే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మిత్రులారా! ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఈ జాబితా లాగే మేక్ ఇన్ ఇండియా శక్తి కూడా చాలా గొప్పది. భారతదేశం శక్తి కూడా అంత గొప్పది. దాని సామర్థ్యానికి ఆధారం మన రైతులు, మన చేతివృత్తులు, మన నేత కార్మికులు, మన ఇంజనీర్లు, మన చిన్న వ్యాపారవేత్తలు, మన MSME రంగం, అనేక విభిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు. ఈ రంగాలు, ఈ వృత్తులు, ఈ రంగాల్లోని వ్యక్తులు దేశానికి నిజమైన బలం. వారి కృషి కారణంగా 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్య సాధన సాధ్యమైంది. భారతదేశ ప్రజల ఈ శక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతిమూలలో కొత్త మార్కెట్లను చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం నినదిస్తే మన స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. రండి.. స్థానికతను ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన ఉత్పత్తుల ప్రతిష్ఠను మరింత పెంచుకుందాం.
మిత్రులారా! స్థానిక స్థాయిలో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనలో గర్వాన్ని నింపబోతోందని తెలుసుకుని 'మన్ కీ బాత్' శ్రోతలు సంతోషిస్తారు. ఈ రోజు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఇ-మార్కెట్ ద్వారా ప్రభుత్వ సేకరణలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ ఇ-మార్కెట్ పోర్టల్ – GeM- ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్నవ్యాపారులు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది- పాత వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారు కూడా GeM పోర్టల్‌లో తన వస్తువులను ప్రభుత్వానికి విక్రయించవచ్చు - ఇది కొత్త భారతదేశం. పెద్దగా కలలు కనడమే కాదు- ఇంతకు ముందు ఎవరూ చేరుకోని లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్ని కూడా చూపిస్తాడు. ఈ ధైర్యసాహసాల బలంతో భారతీయులమైన మనమందరం కలిసి స్వావలంబన భారతదేశ కలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు ఇటీవల జరిగిన పద్మపురస్కారాల ప్రదాన వేడుకలో బాబా శివానంద్ జీని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి చురుకుదనాన్నిచూసి, నాలాగే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి ఉంటారు. రెప్పపాటులో ఆయన నంది ముద్రలో నమస్కరించడం ప్రారంభించారు. నేను బాబా శివానంద్ జీకి పదే పదే వంగి నమస్కరించాను. బాబా శివానంద్ 126 ఏళ్ల వయస్సు, ఆయన ఫిట్నెస్- రెండూ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బాబా శివానంద్ తన వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫిట్ గా ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది కామెంట్స్ చూశాను. నిజానికి బాబా శివానంద్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను. ఆయనకు యోగా అంటే అభిరుచి ఎక్కువ. ఆయన చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నారు.
జీవేం శరదః శతం|
మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తారు. ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' జరుపుకుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి యోగ, ఆయుర్వేదం మొదలైన భారతీయ చింతన పెరుగుతోంది. గత వారం ఖతర్‌లో యోగా కార్యక్రమం నిర్వహించడం మీరు చూసి ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయుష్ పరిశ్రమ మార్కెట్ కూడా నిరంతరం పెరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు 22 వేల కోట్ల రూపాయలు. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. అంటే, ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. స్టార్టప్ ప్రపంచంలో కూడా ఆయుష్ ఆకర్షణీయంగా మారుతోంది.
మిత్రులారా! ఆరోగ్య రంగంలోని ఇతర స్టార్టప్‌ల గురించి నేను ఇంతకు ముందు చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయుష్ స్టార్ట్-అప్ల గురించి మీతో మాట్లాడతాను. ఇందులో ఒక స్టార్టప్ ‘కపివా’. దాని అర్థం దాని పేరులోనే ఇమిడిఉంది. ఇందులో క అంటే కఫ, పి అంటే పిత్త, వా అంటే వాత. ఈ స్టార్టప్ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రత్యేకమైన భావన అయిన నిరోగ్-స్ట్రీట్ అనే మరో స్టార్టప్ కూడా ఉంది. దీని సాంకేతికత ఆధారిత వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద వైద్యులను నేరుగా ప్రజలతో అనుసంధానిస్తుంది. 50 వేల మందికి పైగా అభ్యాసకులు ఈ స్టార్టప్ తో అనుసంధానమయ్యారు. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్య రంగంలో ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనే మరో హెల్త్‌కేర్ టెక్నాలజీ స్టార్టప్ కూడా పనిచేస్తోంది. ఇగ్జొరియల్ (Ixoreal) అశ్వగంధ వాడకం గురించి అవగాహన కల్పించడమే కాకుండా అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తుల తయారీ ప్రక్రియపై భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. ఆధునిక మూలికా పరిశోధన, సంప్రదాయ పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా క్యూర్ వేద సంపూర్ణ జీవితానికి ఆహార పదార్ధాలను రూపొందించింది.
మిత్రులారా! నేను ఇప్పటివరకు కొన్ని పేర్లను మాత్రమే పేర్కొన్నాను. ఈ జాబితా చాలా పెద్దది. ఇది భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు, భారతదేశంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలకు చిహ్నం. ఆరోగ్య రంగంలోని స్టార్ట్-అప్లు, ముఖ్యంగా ఆయుష్ స్టార్ట్-అప్‌లను ఒక విషయం కోరుతున్నాను. మీరు ఆన్లైన్లో ఏ పోర్టల్‌ని తయారుచేసినా, ఏ కంటెంట్‌ను సృష్టించినా ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని భాషల్లో దాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లీషు అంతగా మాట్లాడని, అర్థం కాని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి దేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుండి మెరుగైన నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్ట్-అప్లు త్వరలో ప్రపంచవ్యాప్తమవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మిత్రులారా! ఆరోగ్యం నేరుగా పరిశుభ్రతకు సంబంధించిన విషయం. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత కోసం కృషిచేసేవారి ప్రయత్నాలను మేం ఎప్పుడూ ప్రస్తావిస్తాం. అలాంటి స్వచ్ఛాగ్రహి చంద్రకిషోర్ పాటిల్ గారు. ఆయన మహారాష్ట్రలోని నాసిక్‌లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చంద్రకిషోర్ జీ సంకల్పం చాలా లోతైనది. గోదావరి నది పక్కనే ఉంటూ నదిలో చెత్త వేయకుండా ప్రజలను ఆయన నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా నదిలో చెత్త వేస్తుంటే వెంటనే ఆపుతారు. చంద్రకిషోర్ జీ ఈ పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నదిలో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులన్నీ సాయంత్రానికి ఆయన దగ్గర చేరతాయి. చంద్రకిషోర్ జీ చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది. స్ఫూర్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా, మరొక స్వచ్ఛాగ్రహి - ఒరిస్సాలోని పూరీకి చెందిన రాహుల్ మహారాణా. రాహుల్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున పూరీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటి వరకు వందల కిలోల ప్లాస్టిక్ చెత్తను, మురికిని శుభ్రం చేశారు. పూరీ రాహుల్ అయినా, నాసిక్కి చెందిన చంద్రకిషోర్ అయినా మనకు చాలా నేర్పుతారు. పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకాకరణ – ఇలా సందర్భం ఏదైనా పౌరులుగా మనం మన విధులను నిర్వహించాలి. ఈ ప్రయత్నాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికి మనకు సహాయపడతాయి.
నా ప్రియమైన దేశప్రజలారా! కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్ గారి గురించి మాట్లాడుకుందాం. 'జీవించేందుకు అవసరమయ్యే నీటి కోసం కుండలు' అనే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిస్తే ఇది ఎంత అద్భుతమైన పని అని మీరు అనుకుంటారు.
మిత్రులారా! వేసవిలో జంతువులకు, పక్షులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముపట్టం శ్రీ నారాయణన్ గారు మట్టి కుండలను పంపిణీ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో జంతువులు, పక్షుల సమస్యను చూసి ఆయన కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల్లో నీళ్లు నింపే పని మాత్రమే ఇతరులకు ఉండేలా స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. నారాయణన్ గారు పంపిణీ చేసిన పాత్రల సంఖ్య లక్ష దాటబోతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. తన ప్రచారంలో, గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి లక్షవ పాత్రను విరాళంగా ఇవ్వనున్నారు. ఈరోజు వేసవి కాలం వచ్చిందంటే, నారాయణన్ గారు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ వేసవిలో మన జంతు, పక్షి స్నేహితులకు కూడా నీటిని ఏర్పాటు చేస్తాం.
మిత్రులారా! మన సంకల్పాలను తిరిగి గుర్తు తెచ్చుకోవలసిందిగా 'మన్ కీ బాత్' శ్రోతలను నేను కోరుతున్నాను. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు మనం చేయగలిగే పని చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్ కు మనం సమాన ప్రాధాన్యతనిస్తూనే ఉండాలి. ఇంట్లో వినియోగించిన నీటిని కుండీల్లో వాడుకోవచ్చు. తోటపనిలో వాడుకోవచ్చు. ఆ నీటిని మళ్లీ వాడాలి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు మీ ఇంట్లో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు. రహీమ్‌దాస్ జీ శతాబ్దాల క్రితం 'రహిమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్' అని చెప్పారు. ఈ నీటి పొదుపు పనిలో నేను పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేసినట్టే వారు 'వాటర్ వారియర్'గా మారడం ద్వారా నీటి ఆదాలో సహకరించవచ్చు.
మిత్రులారా! మన దేశంలో నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ, శతాబ్దాలుగా సమాజ స్వభావంలో భాగం. దేశంలో చాలా మంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అరుణ్ కృష్ణమూర్తి చెన్నైకి చెందిన మిత్రుడు. అరుణ్ గారు తన ప్రాంతంలోని చెరువులు, సరస్సులను శుభ్రం చేసే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 150కి పైగా చెరువులు, సరస్సులను శుద్ధి చేసే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రోహన్ కాలే గారు కూడా కృషి చేస్తున్నారు. రోహన్ గారు వృత్తిరీత్యా హెచ్ఆర్ ప్రొఫెషనల్. మహారాష్ట్రలోని వందలాది దిగుడు బావులను పరిరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బావులు చాలా వందల సంవత్సరాల నాటివి. అవి మన వారసత్వంలో భాగమయ్యాయి. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేటలో ఉన్న బాగి కూడా అలాంటి దిగుడుబావుల్లో ఒకటి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఈ మెట్ల బావి మట్టితోనూ చెత్తతోనూ నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ దిగుడుబావిని పునరుద్ధరించాలనే ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైంది.
మిత్రులారా! ఎప్పుడూ నీటి కొరత ఉండే రాష్ట్రం నుండి నేను వచ్చాను. గుజరాత్లో ఈ దిగుడు బావుల ను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వావ్ ప్రధాన భూమిక నిర్వహించాయి. ఈ దిగుడు బావులు లేదా మెట్ల బావుల రక్షణలో 'జల్ మందిర్ పథకం' ప్రముఖ పాత్ర పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్ల బావులను పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడానికి ఇది చాలా దోహదపడింది.
మీరు స్థానికంగా కూడా ఇలాంటి ఉద్యమాలను నిర్వహించవచ్చు. చెక్ డ్యామ్‌లు కానివ్వండి, వాననీటి సంరక్షణ కానివ్వండి.. వీటిలో వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవి. సామూహిక కృషి కూడా అవసరం. స్వతంత్ర్య భారత అమృతోత్సవాల్లో మన దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవరాలను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సులను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. మీరు ఈ దిశలో తప్పకుండా కొంత ప్రయత్నం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' విశిష్టత, సౌందర్యం ఏమిటంటే మీ సందేశాలు అనేక భాషలలో, అనేక మాండలికాలలో నాకు అందుతాయి. చాలా మంది మై గవ్ లో ఆడియో సందేశాలను కూడా పంపుతారు. భారతదేశ సంస్కృతి, మన భాషలు, మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ- ఈ వైవిధ్యాలన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. ‘ఏక్ భారత్ -శ్రేష్ట్ భారత్’ గా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రక ప్రదేశాలు, పురాణాలు - చాలా దోహదపడతాయి. నేను ఇప్పుడే మీతో ఈ విషయం ఎందుకు చెబుతున్నానని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కారణం ‘మాధవ్‌పూర్ మేళా’. మాధవపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భారతదేశ వైవిధ్యంతో ఆ మేళాకు ఎలా సంబంధం ఉందో తెలుసుకోవడం మన్ కీ బాత్ శ్రోతలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మిత్రులారా! ‘మాధవ్‌పూర్ జాతర’ గుజరాత్‌లోని పోర్బందర్లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం తూర్పు చివరతో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దీనికి సమాధానం కూడా ఒక పౌరాణిక కథ నుండి తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్యప్రాంత రాజకుమారి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. ఈ వివాహం పోరుబందర్‌లోని మాధవపూర్‌లో జరిగింది. ఆ పెళ్ళికి గుర్తుగా ఈ రోజు కూడా మాధవపూర్ జాతర అక్కడ జరుగుతుంది. తూర్పు, పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల నుండి చాలా మంది ఘరాతీలు ఈ జాతరకు రావడం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి కళాకారులు చేరుకుంటారు. హస్తకళకు సంబంధించిన కళాకారులు వస్తారు. నలుగురు చంద్రుల వెన్నెలలాగా ఈ జాతర అందాలు పొందుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌కు చాలా అందమైన ఉదాహరణను సృష్టిస్తోంది. మీరు ఈ జాతర గురించి చదివి తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! దేశంలో స్వాతంత్ర్య అమృతోత్సవం ఇప్పుడు ప్రజల భాగస్వామ్యానికి కొత్త ఉదాహరణగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక వేడుకలు జరిగాయి. దేశం స్వాతంత్ర్యం సాధించిన వీరులను, వీరవనితలను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంది. అదే రోజు కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో విప్లవీ భారత్ గ్యాలరీని ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. భారతదేశంలోని వీర విప్లవకారులకు నివాళులర్పించేందుకు ఇది చాలా ప్రత్యేకమైన గ్యాలరీ. అవకాశం దొరికితే చూడడానికి తప్పకుండా వెళ్ళండి.
మిత్రులారా, ఏప్రిల్ నెలలో మనం ఇద్దరు మహానుభావుల జయంతిని కూడా జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతిని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్షకు, అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా ఫూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున ఉద్యమాలు కూడా చేశారు.
మిత్రులారా! మహాత్మా ఫూలే గురించిన ఈ చర్చలో సావిత్రీబాయి ఫూలే గారి ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనది. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రీబాయి ఫూలే ప్రముఖ పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వారిద్దరూ కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలలో మహాత్మా ఫూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సమాజ అభివృద్ధిని ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చని కూడా ఆయన చెప్పేవారు. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని కోరుతున్నాను. ఆడపిల్లలను బడిలో చేర్పించడం కోసం కొద్దిరోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ కూడా ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల చదువుకు దూరమైన ఆడపిల్లలను మళ్లీ పాఠశాలకు తీసుకురావడంపై శ్రద్ధ పెట్టడం జరుగుతోంది.
మిత్రులారా! బాబాసాహెబ్‌తో అనుబంధం ఉన్న పంచ తీర్థం కోసం పని చేసే అవకాశం కూడా లభించడం మనందరి అదృష్టం. మహూలోని ఆయన జన్మస్థలమైనా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్‌లోని ఆయన నివాసమైనా, నాగ్‌పూర్ దీక్షా భూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్ మహాపరినిర్వాణస్థలమైనా- అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థాలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్‌లకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించాలని నేను 'మన్ కీ బాత్' శ్రోతలను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి కూడా 'మన్ కీ బాత్'లో మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. వచ్చే నెలలో చాలా పండుగలు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులలో మనం ఉపవాసాలు చేస్తాం. శక్తి సాధన చేస్తాం. శక్తిని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు మనకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం, పట్టుదల కూడా మనకు పర్వాలే. కాబట్టి నవరాత్రులు ఎప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల మొదటి రోజున గుడి పడ్వా పండుగ కూడా ఉంది. ఈస్టర్ కూడా ఏప్రిల్‌లో వస్తుంది. రంజాన్ పవిత్ర రోజులు కూడా ప్రారంభమవుతాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకుని మన పండుగలను జరుపుకుందాం. భారతదేశ వైవిధ్యాన్ని బలోపేతం చేద్దాం. ఇదే అందరి కోరిక. ఈసారి 'మన్ కీ బాత్'లో ఇవే విషయాలు. కొత్త అంశాలతో వచ్చే నెలలో మళ్లీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు !
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ విజయ ప్రస్తావనతో 'మన్ కీ బాత్' ప్రారంభిద్దాం. ఈ నెల మొదట్లో ఇటలీ నుండి తన విలువైన వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడంలో భారతదేశం విజయవంతమైంది. ఇది ఒక వారసత్వ సంపద. వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైన అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహం. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం బీహార్‌లోని గయా జీ దేవస్థానం కుండల్పూర్ ఆలయం నుంచి చోరీ అయింది. అయితే ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇప్పుడు భారతదేశం ఈ విగ్రహాన్ని తిరిగి పొందింది. అదే విధంగా కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరులో హనుమంతుడి విగ్రహం చోరీకి గురైంది. ఈ హనుమాన్ విగ్రహం కూడా 600-700 సంవత్సరాల నాటిది. ఈ నెల ప్రారంభంలో దీన్ని ఆస్ట్రేలియాలో స్వీకరించాం. మన విశేష ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది.
మిత్రులారా! వేలాది సంవత్సరాల మన చరిత్రలో దేశంలోని నలుమూలల్లో ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి విగ్రహాలు తయారవుతూ వచ్చాయి. ఇందులో శ్రద్ధ, సామర్థ్యం, నైపుణ్యం, వైవిధ్యం మిళితమై ఉన్నాయి. మన ప్రతి విగ్రహంలో ఆ కాలం నాటి చరిత్ర ప్రభావం కూడా కనిపిస్తుంది. అవి భారతీయ శిల్పకళకు అద్వితీయమైన ఉదాహరణలు మాత్రమే కాదు- మన విశ్వాసం కూడా అందులో మిళితమైంది. గతంలో చాలా విగ్రహాలు చోరీకి గురై భారత్ నుంచి వెళ్లిపోయాయి. కొన్నిసార్లు వివిధ దేశాల్లో ఆ విగ్రహాలను విక్రయించారు. వారికి అవి కళాఖండాలు మాత్రమే. వారికి దాని చరిత్రతో గానీ విశ్వాసాలతో గానీ ఎలాంటి సంబంధమూ లేదు. ఈ విగ్రహాలను తిరిగి తీసుకురావడం భారతమాత పట్ల మన బాధ్యత. ఈ విగ్రహాలలో భారతదేశ ఆత్మ ఉంది. విశ్వాసం ఉంది. వాటికి సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బాధ్యతను గ్రహించిన భారత్ తన ప్రయత్నాలను పెంచింది. దొంగతనం చేసే ప్రవృత్తిలో భయం కూడా దీనికి కారణం. ఈ విగ్రహాలను దొంగిలించి తీసుకెళ్లిన దేశాల వారు ఇప్పుడు భారత్‌తో సంబంధాలలో సున్నితత్వం విషయంలో దౌత్య మార్గంలో కూడా దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందని భావించడం ప్రారంభించారు. దీనికి కారణం భారతదేశ భావాలు దానితో ముడిపడి ఉన్నాయి. భారతదేశ గౌరవం కూడా దానితో ముడిపడి ఉంది. ఒక విధంగా ఇది ప్రజల మధ్య సంబంధాలలో కూడా చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. కాశీలో చోరీకి గురైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా తిరిగి తీసుకురావడం కొద్దిరోజుల క్రితమే మీరు చూసి ఉంటారు. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారుతున్నదనడానికి ఇదొక ఉదాహరణ. 2013 సంవత్సరం వరకు దాదాపు 13 విగ్రహాలు భారతదేశానికి వచ్చాయి. అయితే గత ఏడేళ్లలో భారతదేశం విజయవంతంగా 200 కంటే ఎక్కువ విలువైన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చింది. అమెరికా, బ్రిటన్, హాలండ్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్- ఇలా ఎన్నో దేశాలు భారత్ స్ఫూర్తిని అర్థం చేసుకుని విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి సహకరించాయి. గతేడాది సెప్టెంబర్‌లో నేను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఎన్నో వస్తువులు లభ్యమయ్యాయి. దేశంలోని ఏదైనా విలువైన వారసత్వ సంపద తిరిగి వచ్చినప్పుడు చరిత్రపై గౌరవం ఉన్నవారు, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు; విశ్వాసం , సంస్కృతితో ముడిపడి ఉన్న వ్యక్తులు; భారతీయులుగా మనందరమూ సంతోషపడడం చాలా సహజం.
మిత్రులారా! భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ ఈ రోజు 'మన్ కీ బాత్'లో మీకు ఇద్దరిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో Facebook, Twitter, Instagramలలో వార్తల్లో ఉన్న ఆ ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు కిలీ పాల్, ఆయన సోదరి నీమా. మీరు కూడా వారి గురించి తప్పకుండా విని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారికి భారతీయ సంగీతంపై అభిరుచి, మమకారం ఉన్నాయి. ఈ కారణంగా వారు చాలా ప్రజాదరణ పొందారు. పెదవులు కదిలించే విధానం చూస్తే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈమధ్య రిపబ్లిక్ డే సందర్భంగా మన జాతీయ గీతం 'జన గణ మన'ను వారు ఆలపించిన వీడియో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా లతా దీదీకి ఓ పాట పాడి వారు ఆత్మీయ నివాళులర్పించారు. ఈ అద్భుతమైన సృజనాత్మకతకు ఈ ఇద్దరు తోబుట్టువులు కిలి, నీమాలను నేను చాలా అభినందిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా వారిని సన్మానించారు. భారతీయ సంగీతంలోని మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు గుర్తుంది- కొన్ని సంవత్సరాల కిందట ప్రపంచంలోని నూట యాభైకి పైగా దేశాల నుండి గాయకులు, సంగీతకారులు వారి వారి దేశాలలో, వారి వారి సాంప్రదాయిక ఆహార్యంతో పూజ్య బాపుకు ప్రియమైన- మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తన 'వైష్ణవ జనతో' పాడడం ద్వారా ఒక విజయవంతమైన ప్రయోగం చేశారు.
నేడు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల ముఖ్యమైన పండుగను జరుపుకుంటున్నప్పుడు దేశభక్తి గీతాలకు సంబంధించి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు. విదేశీ పౌరులను, అక్కడి నుండి ప్రసిద్ధ గాయకులను భారతీయ దేశభక్తి గీతాలు పాడటానికి ఆహ్వానిద్దాం. ఇది మాత్రమే కాదు- మన దేశంలో అనేక భాషలలో చాలా రకాల పాటలు ఉన్నాయి. టాంజానియాలోని కిలీ, నీమా భారతదేశంలోని పాటలకు ఈ విధంగా పెదవులను కదపగలిగినట్టే ఎవరైనా గుజరాతీ పిల్లలు తమిళంలో చేయవచ్చు. కేరళ పిల్లలు అస్సామీ పాటలు చేయాలి. మరికొందరు కన్నడ పిల్లలు జమ్మూ కాశ్మీర్ పాటలు చేయాలి. మనం 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' అనుభూతి చెందగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు- మనం ఖచ్చితంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను కొత్త పద్ధతిలో జరుపుకోవచ్చు. నేను దేశంలోని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ భాషలలోని ప్రసిద్ధ పాటలను మీకు తోచిన విధానంలో వీడియో తీయండి. మీరు బాగా పాపులర్ అవుతారు. దేశంలోని వైవిధ్యం కొత్త తరానికి పరిచయం అవుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! కొద్దిరోజుల క్రితం మనం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మాతృభాష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వ్యుత్పత్తి ఏంటి అనే విషయాలపై విద్యా సంబంధమైన అంశాలను పండితులు చెప్పగలరు. మాతృభాషకు సంబంధించి నేను ఒకటే చెప్తాను- మన తల్లి మన జీవితాన్ని తీర్చిదిద్దే విధంగా మాతృభాష కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అమ్మ, మాతృభాష రెండూ జీవితపు పునాదిని పటిష్టం చేస్తాయి. చిరంజీవిని చేస్తాయి. మనం తల్లిని విడిచిపెట్టలేం. అలాగే మాతృభాషను కూడా వదలలేం. కొన్నాళ్ల కిందటి ఒక విషయం నాకు గుర్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు వివిధ కుటుంబాలను పరామర్శించే అవకాశం కలిగేది. ఒకసారి నేను తెలుగు కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ చాలా సంతోషకరమైన దృశ్యాన్ని చూశాను. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎంత పనిఉన్నా ఊరి బయట లేకుంటే కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేయాలని, భోజన సమయంలో తెలుగు భాషలో మాత్రమే మాట్లాడాలని నియమంగా పెట్టుకున్నట్టు వారు చెప్పారు. అక్కడ పుట్టిన పిల్లలకు కూడా ఇదే నియమం. మాతృభాషపై ఉన్న ఈ ప్రేమ కారణంగా ఈ కుటుంబం నన్ను ఎంతగానో ప్రభావితుడిని చేసింది.
మిత్రులారా! స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కొందరు వ్యక్తులు తమ భాష, వేషధారణ, తిండి, పానీయాల పట్ల సంకోచంతో మానసిక సంఘర్షణలో బతుకుతున్నారు. అయితే ప్రపంచంలో మరెక్కడా ఇలా ఉండదు. మన మాతృభాషను మనం గర్వంగా మాట్లాడాలి. మన భారతదేశం భాషల పరంగా చాలా సమృద్ధమైంది. దాన్ని ఇతర దేశాలతో పోల్చలేం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కోహిమా వరకు- వందలాది భాషలు, వేలాది మాండలికాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి కలిసిపోయాయి. భాషలు అనేకం. కానీ భావం ఒక్కటే. శతాబ్దాలుగా మన భాషలు తమను తాము మెరుగుపరుచుకుంటున్నాయి. ఒకదాని నుండి మరొకటి నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష తమిళం భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలోనే ఇంత గొప్ప వారసత్వ సంపద మనకు ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి. అదే విధంగా అనేక ప్రాచీన ధర్మ శాస్త్ర గ్రంథాల్లోని అభివ్యక్తి మన సంస్కృత భాషలో కూడా ఉంది. భారతదేశంలోని ప్రజలు సుమారుగా 121 అంటే 121 రకాల మాతృభాషలతో అనుబంధం కలిగి ఉండడం మనకు గర్వ కారణం. వీటిలో దైనందిన జీవితంలో 14 భాషలలో ఒక కోటి మందికి పైగా ప్రజలు సంభాషిస్తారు. అంటే అనేక యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు మన దేశంలో 14 వేర్వేరు భాషలతో అనుబంధం కలిగి ఉన్నారు. 2019 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ మూడవ స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడు ఈ విషయంలో గర్వపడాలి. భాష అనేది భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు. సమాజ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడేందుకు కూడా భాష ఉపయోగపడుతుంది. సుర్జన్ పరోహి గారు తన భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి సూరినామ్‌లో ఇలాంటి పని చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ఆయన 84వ ఏట అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు జీవనోపాధి కోసం వేలాది మంది కార్మికులతో పాటు చాలా ఏళ్ల కిందట సూరినామ్‌కు వెళ్లారు. సుర్జన్ పరోహి గారు హిందీలో చాలా మంచి కవిత్వం రాస్తారు. ఆయనకు అక్కడ జాతీయ కవులలో ఒకరిగా గుర్తింపు వచ్చింది. అంటే నేటికీ ఆయన గుండెల్లో హిందుస్థాన్ ధ్వని వినబడుతుంది. ఆయన రచనల్లో హిందుస్థానీ మట్టి సుగంధం ఉంది. సూరినామ్ ప్రజలు సుర్జన్ పరోహి పేరు మీద మ్యూజియం కూడా నిర్మించారు. 2015లో ఆయనను సన్మానించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మిత్రులారా! ఈరోజు- అంటే ఫిబ్రవరి 27న మరాఠీ భాషాదినోత్సవం కూడా.
"సర్వ్ మరాఠీ బంధు భగినినా మరాఠీ భాషా దినాచ్యా హార్దిక్ శుభేచ్ఛా! "
ఈ రోజు మరాఠీ కవిరాజు విష్ణు బామన్ షిర్వాడ్కర్ జీ, శ్రీ కుసుమాగ్రజ్ జీకి అంకితం. ఈరోజు కుసుమాగ్రజ్ గారి జన్మదినం కూడా. కుసుమాగ్రజ్ గారు మరాఠీలో కవిత్వం రాశారు. అనేక నాటకాలు రాశారు. మరాఠీ సాహిత్యానికి ఔన్నత్యం కల్పించారు.
మిత్రులారా! భాషకు స్వీయ లక్షణాలు ఉన్నాయి. మాతృభాషకు దాని స్వీయ విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. మన వృత్తిపరమైన కోర్సులను కూడా స్థానిక భాషలోనే బోధించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర అమృత కాలంలో మనమందరం కలిసి ఈ ప్రయత్నానికి ఊపు ఇవ్వాలి. ఇది మన స్వాభిమాన కార్యం. మీరు ఏ మాతృభాష మాట్లాడినా దాని యోగ్యత గురించి తెలుసుకుని ఆ విషయంపై రాయాలి.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా గారితో సమావేశమయ్యాను. ఈ సమావేశం ఆసక్తికరంగా, చాలా ఉద్వేగభరితంగా సాగింది. మనం చాలా మంచి స్నేహితులమైతే స్వేచ్ఛగా మాట్లాడతాం. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒడింగా గారు తన కుమార్తె గురించి చెప్పాడు. ఆయన కుమార్తె రోజ్ మేరీకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. దాని కారణంగా ఆయన తన కుమార్తెకు శస్త్రచికిత్స చేయించవలసి వచ్చింది. అయితే దీని వల్ల ఒక దుష్ఫలితం ఏమిటంటే రోజ్ మేరీ కంటి చూపు దాదాపుగా పోయింది. ఆయన కుమార్తె పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. మనం ఆ తండ్రి పరిస్థితిని కూడా ఊహించవచ్చు. ఆయన భావాలను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో తన కుమార్తె చికిత్స కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయని పెద్ద దేశం ప్రపంచంలోనే లేదు.
ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఓ విధంగా ఆశలన్నీ వదులుకున్నారు. దాంతో ఇల్లంతా నిస్పృహ వాతావరణం నెలకొంది. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియాకు వెళ్లాలని ఎవరో సూచించారు. ఆయన చాలా చేశారు. అలసిపోయారు. “ఒకసారి ప్రయత్నిద్దాం. ఏమవుతుంది?” అనుకుని భారతదేశానికి వచ్చారు. కేరళలోని ఆయుర్వేద ఆసుపత్రిలో తన కుమార్తెకు చికిత్స చేయించడం ప్రారంభించారు. ఆయన కూతురు చాలా కాలం ఇక్కడే ఉండిపోయింది. ఆయుర్వేద చికిత్స ప్రభావం వల్ల రోజ్ మేరీ కంటి చూపు చాలా వరకు తిరిగి వచ్చింది. రోజ్ మేరీకి కొత్త జీవితం లభించినట్టు, ఆమె జీవితానికి కొత్త వెలుగు వచ్చినట్టు మీరు ఊహించవచ్చు. కానీ మొత్తం కుటుంబానికి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఈ విషయం నాకు చెబుతున్నప్పుడు ఒడింగా గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. భారతీయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని కెన్యాకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయుర్వేదంలో వినియోగించే మొక్కలను పెంచి, మరింత మందికి ప్రయోజనం కలిగేలా కృషి చేస్తామన్నారు.
మన భూమి నుండి, సంప్రదాయం నుండి ఒకరి జీవితంలోని ఇంత గొప్ప బాధ తొలగిపోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది విని మీరు కూడా సంతోషిస్తారు. దాని గురించి గర్వించని భారతీయుడు ఎవరు ఉంటారు? ఒడింగా గారు మాత్రమే కాదు- ప్రపంచంలోని లక్షలాది ప్రజలు ఆయుర్వేదం నుండి ఇలాంటి ప్రయోజనాలను పొందుతున్నారని మనందరికీ తెలుసు.
బ్రిటన్ యువరాజు చార్లెస్ కూడా ఆయుర్వేదం అభిమానులలో ఒకరు. నేను ఆయనను కలిసినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తారు. ఆయనకు భారతదేశంలోని అనేక ఆయుర్వేద సంస్థల గురించి కూడా తెలుసు.
మిత్రులారా! గత ఏడేళ్లలో దేశంలో ఆయుర్వేద ప్రచారంపై చాలా శ్రద్ధ పెట్టారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు మన సంప్రదాయ వైద్యాన్ని, ఆరోగ్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ ఈ నెల మొదట్లో ప్రారంభమైంది. ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లను గుర్తించడం, వాటికి సహకారం ఇవ్వడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఈ రంగంలో పనిచేస్తున్న యువత తప్పనిసరిగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
మిత్రులారా! ప్రజలు కలిసి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, వారు అద్భుతమైన పనులు చేస్తారు. సమాజంలో ఇలాంటి పెద్ద మార్పులు ఎన్నో వచ్చాయి. అందులో ప్రజల భాగస్వామ్యం, సమిష్టి కృషి పెద్ద పాత్ర పోషించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ‘మిషన్ జల్ థల్’ పేరుతో అలాంటి ప్రజా ఉద్యమం జరుగుతోంది. శ్రీనగర్‌లోని సరస్సులను, చెరువులను శుభ్రపరిచి వాటి పాత వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ‘మిషన్ జల్ థల్’ దృష్టి కుశల్ సార్, గిల్ సార్ లపై ఉంది. ఇందులో ప్రజల భాగస్వామ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో, ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయో తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో సర్వే చేయించారు. దీనితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, వ్యర్థాలను శుభ్రం చేయడం వంటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మిషన్ రెండవ దశలో పాత నీటి కాలువలు, సరస్సులను నింపే 19 జలపాతాలను పునరుద్ధరించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించడానికి స్థానిక ప్రజలను, యువతను నీటి రాయబారులుగా మార్చారు. ఇప్పుడు ఇక్కడి స్థానిక ప్రజలు కూడా గిల్ సార్ సరస్సులో వలస పక్షులు, చేపల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఇది చూసి సంతోషిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి శ్రీనగర్ ప్రజలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! ఎనిమిదేళ్ల కిందట దేశం ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ మిషన్' విస్తరణ కాలంతో పాటు పెరిగింది. కొత్త ఆవిష్కరణలు కూడా అనుసంధానమయ్యాయి. మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా, ప్రతిచోటా పరిశుభ్రత కోసం కొంత ప్రయత్నం జరుగుతుందని మీకు తెలుస్తుంది. అస్సాంలోని కోక్రాఝర్‌లో అలాంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ మార్నింగ్ వాకర్స్ బృందం ఒకటి 'క్లీన్ అండ్ గ్రీన్ కోక్రాఝర్' మిషన్ కింద చాలా ప్రశంసనీయమైన చొరవ తీసుకుంది. వీరంతా కొత్త ఫ్లైఓవర్ ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డును శుభ్రం చేసి స్వచ్ఛత స్ఫూర్తి సందేశాన్ని అందించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద పాలిథిన్‌కు బదులు గుడ్డ సంచులు వినియోగించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు వ్యర్థాలను ఇంటి వద్దే వేరుచేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముంబాయిలోని సోమయ్య కాలేజీ విద్యార్థులు తమ పరిశుభ్రత ప్రచారంలో సౌందర్యాన్ని కూడా చేర్చారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్ గోడలను అందమైన పెయింటింగ్స్‌తో అలంకరించారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా నాకు తెలిసింది. ఇక్కడి యువత రణథంబోర్‌లో 'మిషన్ బీట్ ప్లాస్టిక్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో రణథంబోర్ అడవుల్లో ప్లాస్టిక్, పాలిథిన్ లను తొలగించారు. ప్రతి ఒక్కరి కృషిలోని ఈ స్ఫూర్తి దేశంలో ప్రజల భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అతిపెద్ద లక్ష్యాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! నేటి నుండి కొద్ది రోజులకే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. 'మన్ కీ బాత్'లో మనం మహిళల సాహసాలు, నైపుణ్యం, ప్రతిభకు సంబంధించిన అనేక ఉదాహరణలను పంచుకుంటున్నాము. నేడు స్కిల్ ఇండియా అయినా, స్వయం సహాయక బృందాలయినా, చిన్న, పెద్ద పరిశ్రమలైనా అన్ని చోట్లా మహిళలు ముందున్నారు. ఎక్కడ చూసినా మహిళలు పాత అపోహలను ఛేదిస్తున్నారు. నేడు మన దేశంలో మహిళలు పార్లమెంట్ నుంచి పంచాయతీల వరకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు పొందుతున్నారు. సైన్యంలో కూడా అమ్మాయిలు ఇప్పుడు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్నారు. గత నెల గణతంత్ర దినోత్సవం రోజున అమ్మాయిలు కూడా ఆధునిక యుద్ధ విమానాలను ఎగురవేయడం చూశాం. సైనిక్ పాఠశాలల్లో అమ్మాయిల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని దేశం తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ఇప్పుడు అమ్మాయిలు ప్రవేశం పొందుతున్నారు. అదేవిధంగా మన స్టార్ట్-అప్ ప్రపంచాన్ని చూడండి. గత సంవత్సరాలలో దేశంలో వేలాది కొత్త స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్టప్‌లలో దాదాపు సగం మహిళలే నిర్వహిస్తున్నవి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మహిళలకు ప్రసూతి సెలవుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన హక్కులు కల్పిస్తూ పెళ్లి వయసును సమానం చేసేందుకు దేశం ప్రయత్నిస్తోంది. దీంతో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో జరుగుతున్న మరో పెద్ద మార్పును మీరు తప్పక చూస్తారు. ఈ మార్పు మన సామాజిక ప్రచారాల విజయం. 'బేటీ బచావో, బేటీ పడావో' విజయాన్ని తీసుకోండి.. దీని ద్వారా నేడు దేశంలో లింగ నిష్పత్తి మెరుగుపడింది. పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య కూడా మెరుగుపడింది. మన అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అదేవిధంగా 'స్వచ్ఛ్ భారత్ అభియాన్' కింద దేశంలోని మహిళలు బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందారు. ముమ్మారు తలాక్ లాంటి సామాజిక దురాచారం కూడా అంతం కాబోతోంది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం వచ్చినప్పటి నుంచి దేశంలో ఈ కేసులు 80 శాతం తగ్గాయి. ఇంత తక్కువ సమయంలో ఈ మార్పులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన దేశంలో మార్పుకు, ప్రగతిశీల ప్రయత్నాలకు ఇప్పుడు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ మార్పు వస్తోంది.
నా ప్రియమైన దేశ వాసులారా! రేపు ఫిబ్రవరి 28న 'నేషనల్ సైన్స్ డే'. ఈ రోజు రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు కూడా ప్రసిద్ధి చెందింది. నేను సివి రామన్ గారితో పాటు మన వైజ్ఞానిక యాత్రను సుసంపన్నం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన శాస్త్రవేత్తలందరికీ నేను గౌరవపూర్వక నివాళులర్పిస్తున్నాను. మిత్రులారా! సాంకేతికత మన జీవితంలో సులభంగా, సరళంగా ఎక్కువ పాత్ర సంపాదించింది. ఏ సాంకేతికత మంచిది, ఏ సాంకేతికత ఉత్తమ వినియోగం ఏమిటి, -ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ, మన కుటుంబంలోని పిల్లలకు ఆ సాంకేతికతకు ఆధారం ఏమిటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాలను వివరించడం పైకి మన దృష్టి వెళ్లడం లేదన్నది కూడా నిజం. ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా కుటుంబాలన్నీ తమ పిల్లలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని చిన్న చిన్న ప్రయత్నాలతో తప్పకుండా ప్రారంభించాలని నేను కోరుతున్నాను.
ఉదాహరణకి ఇప్పుడు సరిగ్గా కనబడడం లేదు కానీ కళ్లద్దాలు పెట్టుకున్నాక కనిపిస్తోంది.. దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటో పిల్లలకు సులభంగా వివరించవచ్చు. కేవలం ‘అద్దాలు చూడండి- ఆనందించండి’ అనడం మాత్రమే కాదు. మీరు ఒక చిన్న కాగితంపై వారికి చెప్పవచ్చు. ఇప్పుడు వారు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది, సెన్సార్లు ఏమిటి? ఇలాంటి సైంటిఫిక్ విషయాలు ఇంట్లో చర్చిస్తారా? ఇంటి దైనందిన జీవితం వెనుక ఉన్న ఈ విషయాలను మనం సులభంగా వివరించవచ్చు. అది ఏమి చేస్తుందో దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో చెప్పవచ్చు. అదే విధంగా మనం ఎప్పుడైనా పిల్లలతో కలిసి ఆకాశాన్ని పరిశీలించామా? రాత్రిపూట నక్షత్రాల గురించి మాట్లాడాలి. వివిధ రకాల నక్షత్రరాశులు కనిపిస్తాయి. వాటి గురించి చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు పిల్లలలో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. ఈ రోజుల్లో, చాలా యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి నుండి మీరు నక్షత్రాలను, గ్రహాలను గుర్తించవచ్చు లేదా ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని మీరు గుర్తించవచ్చు. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. దేశ నిర్మాణానికి సంబంధించిన పనిలో మీ నైపుణ్యాలు , శాస్త్రీయ స్వభావాన్ని ఉపయోగించాలని మన స్టార్టప్ ఆవిష్కర్తలకు నేను చెప్తాను. దేశం పట్ల మన సమష్టి శాస్త్రీయ బాధ్యత కూడా ఇదే. ఈ రోజుల్లో మన స్టార్టప్‌లు వర్చువల్ రియాలిటీ ప్రపంచంలో చాలా మంచి పని చేస్తున్నాయని నేను చూస్తున్నాను. వర్చువల్ తరగతుల ఈ యుగంలో పిల్లలను దృష్టిలో ఉంచుకుని అటువంటి వర్చువల్ ల్యాబ్‌ను తయారు చేయవచ్చు. మనం వర్చువల్ రియాలిటీ ద్వారా పిల్లలను ఇంట్లో కూర్చొని కెమిస్ట్రీ ల్యాబ్‌ను అనుభవించేలా చేయవచ్చు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నా అభ్యర్థన ఏమిటంటే విద్యార్థులు , పిల్లలందరినీ ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించండి. వారితో కలిసి ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుగొనండి. కరోనాపై పోరాటంలో భారతీయ శాస్త్రవేత్తల పాత్రను కూడా ఈ రోజు నేను అభినందించాలనుకుంటున్నాను. వారి కృషి కారణంగానే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌ను తయారు చేయడం సాధ్యమైంది. ఇది ప్రపంచం మొత్తానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇది మానవాళికి సైన్స్ అందించిన బహుమతి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి కూడా మనం అనేక అంశాలపై చర్చించాం. మార్చి నెలలో అనేక పండుగలు వస్తున్యి. శివరాత్రి వస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరందరూ హోలీ కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తారు. హోలీ మనల్ని కలిపే పండుగ. ఇందులో మనవాడు -పరాయివాడు, చిన్న- పెద్ద అనే తేడాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ద్వేషాలు-విద్వేషాలు దూరమవుతాయి. అందుకే హోలీకి ఉన్న ప్రేమ, సామరస్యాలు హోలీ రంగుల కంటే గాఢమైనవని అంటారు. హోలీలో తీయనైన కజ్జికాయలతో పాటు, సంబంధాలలో కూడా ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. మనం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. మన కుటుంబంలోని వ్యక్తులతో మాత్రమే కాకుండా మీ విస్తృత కుటుంబంలో భాగమైన వారితో కూడా సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. దీన్ని చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గం కూడా మీరు గుర్తుంచుకోవాలి. 'వోకల్ ఫర్ లోకల్'తో పండుగ జరుపుకోవడమే ఈ మార్గం. పండుగల సందర్భంగా మీరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. తద్వారా మీ చుట్టూ నివసించే ప్రజల జీవితాలను కూడా వర్ణమయం చేయవచ్చు. ఉత్సాహం నింపవచ్చు. మన దేశం కరోపై విజయంసాధిస్తూ ముందుకు సాగడంతో, పండుగలలో ఉత్సాహం కూడా చాలా రెట్లు పెరిగింది. ఈ ఉత్సాహంతో మనం పండుగలు జరుపుకోవాలి. అదే సమయంలో మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. రానున్న పండుగల సందర్భంగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్ను. నేను ఎప్పుడూ మీ మాటలు, మీ ఉత్తరాలు, మీ సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' మరో ఎపిసోడ్లో కలుసుకుంటున్నాం. 2022లో ఇది మొదటి 'మన్ కీ బాత్'. ఈ రోజు మనం మన దేశం, దేశప్రజల సానుకూల ప్రేరణలు, సమిష్టి ప్రయత్నాలకు సంబంధించిన చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళదాం. ఈరోజు మన పూజ్య బాపు మహాత్మా గాంధీ గారి వర్ధంతి కూడా. ఈ జనవరి 30వ తేదీ మనకు బాపు బోధనలను గుర్తు చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే రిపబ్లిక్ డే జరుపుకున్నాం. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మనం చూసిన దేశ శౌర్య సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో గర్వం, ఉత్సాహాన్ని నింపాయి. మీరు తప్పక చూడవలసిన మార్పులుఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనవరి 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవం నాడు ప్రారంభమై జనవరి 30 వరకు అంటే గాంధీజీ వర్ధంతి వరకు కొనసాగుతాయి. ఇండియా గేట్ వద్ద నేతాజీ డిజిటల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దేశం స్వాగతించిన తీరును, దేశంలోని నలుమూలల నుంచి వెల్లువెత్తిన ఆనందోత్సాహాలను, ప్రతి దేశస్థుడు వ్యక్తం చేసిన భావాలను మనం ఎప్పటికీ మరచిపోలేం.
మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్ జవాన్ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.
మిత్రులారా!ఈ అమృత్ మహోత్సవ్ వేడుకల మధ్య దేశంలో చాలా ముఖ్యమైన జాతీయ అవార్డుల ప్రదానం కూడా జరిగింది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం. చిన్నవయసులో సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన పనులు చేసిన పిల్లలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ పిల్లల గురించి మనమందరం మన ఇళ్లలో చెప్పాలి. ఇవి మన పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తాయి. దేశానికి పేరు తేవాలనే ఉత్సాహాన్ని వారిలో నింపుతాయి. దేశంలో పద్మ అవార్డులను కూడా ప్రకటించారు. పద్మ అవార్డుల గ్రహీతలలోచాలా తక్కువ మందికి తెలిసిన వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు వెలుగులోకి రాని ఈ వీరులు సాధారణ పరిస్థితులలో అసాధారణమైన పనులు చేశారు. ఉదాహరణకుఉత్తరాఖండ్‌కు చెందిన బసంతీ దేవి గారికి పద్మశ్రీ ప్రకటించారు. బసంతీ దేవి గారు తన జీవితమంతా పోరాటాల మధ్యనే గడిపారు. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ఆశ్రమంలో నివసించారు.అక్కడే ఉంటూ నదిని కాపాడేందుకు పోరాడి పర్యావరణానికి విశేష కృషి చేశారు. మహిళా సాధికారత కోసం కూడా ఆమె చాలా కృషి చేశారు. అదేవిధంగామణిపూర్‌కు చెందిన 77 ఏళ్ల లౌ రెంబమ్ బీనో దేవిగారు దశాబ్దాలుగా మణిపూర్‌లోని లిబా వస్త్ర కళను సంరక్షిస్తున్నారు. ఆమెకుకూడాపద్మశ్రీ అవార్డు లభించింది.బైగా గిరిజన నృత్య కళకు ప్రాచుర్యం కల్పించినందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన అర్జున్ సింగ్ గారు పద్మ అవార్డును పొందారు. పద్మ పురస్కారం పొందిన మరొకరు అమాయ్ మహాలింగ నాయక్గారు.ఆయన కర్నాటకకు చెందిన రైతు. కొంతమంది ఆయనను టన్నెల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అందరూ ఆశ్చర్యపోయేవిధంగా వ్యవసాయంలో ఆయన ఆవిష్కరణలు చేశారు. ఆయన యత్నాల వల్లచిన్న రైతులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారు. ఇలా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వీరులు ఇంకా ఎందరో ఉన్నారు. వారు చేసిన కృషిని దేశం గౌరవించింది. మీరు వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారి నుండి మనం జీవితంలో చాలా నేర్చుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! అమృత్ మహోత్సవ్‌లో మీరందరూ నాకు చాలా ఉత్తరాలు, సందేశాలు పంపుతున్నారు. చాలా సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ సిరీస్‌లో ఎన్నో మరిచిపోలేని విషయాలు జరిగాయి. కోటి మందికి పైగా పిల్లలు తమ 'మన్ కీ బాత్'ను పోస్ట్ కార్డ్‌ల ద్వారా నాకు రాసి పంపారు. ఈ కోటి పోస్ట్ కార్డులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా వచ్చాయి. నేను ఈ పోస్ట్‌కార్డులలో చాలా వరకు చదవడానికి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించాను.ఈ పోస్ట్‌కార్డులు దేశ భవిష్యత్తు పట్ల మన కొత్త తరం దృష్టి ఎంత విశాలంగా ఉందో చూపిస్తాయి. 'మన్ కీ బాత్' శ్రోతల కోసంనేను మీతో పంచుకోవాలనుకుంటున్న కొన్ని పోస్ట్‌కార్డ్‌ల జాబితా రూపొందించాను. వీటిలో ఒకటి అస్సాంలోని గౌహతికి చెందిన రిద్ధిమా స్వర్గియారి రాసిన పోస్ట్‌కార్డు. రిద్ధిమా 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని. స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా, ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందిన దేశంగా, 100 శాతం అక్షరాస్యత కలిగిన దేశంగా, ప్రమాదాలు అసలే లేని దేశంగా, స్థిరమైన సాంకేతికతతో పూర్తి ఆహార భద్రతాసామర్థ్యం ఉన్నదేశంగా భారతదేశాన్ని చూడాలన్న కోరిక ఉందని ఆమె రాసింది.రిద్ధిమాతో పాటు మన బిడ్డలు ఏమనుకుంటున్నారో అవి నెరవేరతాయి.అందరి ప్రయత్నాలు ఏకమైనప్పుడుదేశం కోసం వారి కలలు నిజమవుతాయి.మీ యువ తరం ఈ లక్ష్యం కోసం పని చేసినప్పుడు మీరు ఖచ్చితంగా భారతదేశాన్ని మీరు కోరుకున్న విధంగా తయారు చేస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన నవ్య వర్మ పోస్ట్ కార్డ్ కూడా నా దగ్గర ఉంది. 2047లో ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, రైతులు సుసంపన్నంగా ఉండే, అవినీతికి తావులేని భారతదేశం తన కల అని నవ్య రాశారు. నవ్యా! దేశం కోసం మీ కల చాలా అభినందనీయం. దేశం కూడా ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది.అవినీతి రహిత భారత్ గురించి మీరు మాట్లాడారు. అవినీతి దేశాన్ని చెదపురుగులాగా గుల్లగా చేస్తుంది. దాన్ని వదిలించుకోవడానికి 2047 వరకు ఎందుకు వేచి ఉండాలి? మనమందరం దేశవాసులం, నేటి యువత కలిసి ఈ పనిని వీలైనంత త్వరగా చేయాలి. దీని కోసం మనం మన విధులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కర్తవ్యం ప్రధానంగా ఉండే చోట అవినీతి జరగదు.
మిత్రులారా! నా ముందు చెన్నైకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం రాసిన మరొక పోస్ట్‌కార్డ్ ఉంది. 2047లో రక్షణ రంగంలో భారత్‌ను ప్రధాన శక్తిగా చూడాలని ఇబ్రహీం కోరుకుంటున్నారు. చంద్రునిపై భారతదేశం తన స్వంత పరిశోధనా స్థావరాన్ని కలిగి ఉండాలని , అంగారక గ్రహంపైమానవ జనాభాను స్థిరపరిచే పనిని భారతదేశం ప్రారంభించాలని వారు కోరుతున్నారు. అలాగే, భూమిని కాలుష్య రహితంగా చేయడంలో భారతదేశం పోషించే ప్రధాన పాత్రను ఇబ్రాహీం చూస్తారు. ఇబ్రహీం! మీలాంటి యువత ఉన్న దేశానికి అసాధ్యమైంది ఏదీ లేదు.
మిత్రులారా! మన ముందు మరో ఉత్తరం ఉంది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లోని సరస్వతి విద్యా మందిర్‌లో 10వ తరగతి చదువుతున్న భావన రాసిన ఉత్తరమిది. ముందుగామీరు మీ పోస్టు కార్డును త్రివర్ణ పతాకంతో అలంకరించిన విధానం నాకు బాగా నచ్చిందని నేను భావనతో చెబుతాను. విప్లవకారుడు శిరీష్ కుమార్ గురించి భావన రాశారు.
మిత్రులారా! నేను గోవా నుండి లారెన్సియో పరేరా పోస్టు కార్డును కూడా అందుకున్నాను. పరేరా12వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఆ లేఖలోని అంశం కూడా బయటి ప్రపంచానికి తెలియని వీరులు. దాని హిందీ అర్థాన్ని నేను మీకు చెబుతున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధైర్యవంతులైన మహిళల్లో ప్రముఖులైన భికాజీ కామా గురించి పరేరా రాశారు. బాలికలకు సాధికారత కల్పించేందుకుభికాజీ కామా దేశ విదేశాల్లో ఎన్నో ప్రచారాలు చేశారు.అనేక ప్రదర్శనలు నిర్వహించారు. ఖచ్చితంగా భికాజీ కామా స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత సాహసోపేతమైన మహిళల్లో ఒకరు. 1907లో జర్మనీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో ఆమెకు సహకరించిన వ్యక్తి శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ. శ్రీ శ్యామ్‌జీ కృష్ణవర్మ గారు 1930లో జెనీవాలో మరణించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతతన చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావాలని ఆయన చివరి కోరిక.1947లో స్వాతంత్య్రం వచ్చిన రెండో రోజునే ఆయన చితాభస్మాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగలేదు. బహుశా భగవంతుడు నన్ను ఈ పని చేయమని కోరుకున్నాడేమో-నాకు ఈ పని చేసే అదృష్టం వచ్చింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఆయన చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ గారి జ్ఞాపకార్థం కచ్‌లోని మాండ్విలో ఆయన జన్మస్థలం వద్ద ఒక స్మారక చిహ్న నిర్మాణం కూడా జరిగింది.
మిత్రులారా!భారత దేశ స్వాతంత్ర్య అమృతోత్సవ ఉత్సాహం మన దేశంలోనే కాదు. భారతదేశ స్నేహపూర్వక దేశమైన క్రొయేషియా నుండి కూడా నాకు 75 పోస్ట్‌కార్డ్‌లు వచ్చాయి. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో ఉన్న స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు ఈ 75 కార్డులను భారతదేశ ప్రజలకు పంపారు. అమృతోత్సవసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన దేశవాసులందరి తరపుననేను క్రొయేషియాకు, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!భారతదేశం విద్య, విజ్ఞాన తపో భూమి. మనం విద్యను పుస్తక విజ్ఞానానికి పరిమితం చేయలేదు. కానీ దాన్ని జీవిత సంపూర్ణ అనుభవంగా చూశాం. మన దేశంలోని గొప్ప వ్యక్తులు కూడా విద్యారంగంతో లోతైన సంబంధం కలిగి ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు. గుజరాత్ విద్యాపీఠం నిర్మాణంలో మహాత్మా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు.గుజరాత్‌లోని ఆనంద్‌లో వల్లభ్ విద్యానగర్ అనే చాలా సుందరమైన ప్రదేశం ఉంది. సర్దార్ పటేల్ అభ్యర్థనతో ఆయన సహచరులు భాయ్ కాకా, భిఖా భాయ్ అక్కడ యువత కోసం విద్యా కేంద్రాలను స్థాపించారు. అదేవిధంగాపశ్చిమ బెంగాల్లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌ను స్థాపించారు.మహారాజా గైక్వాడ్ కూడా విద్యారంగాన్ని ప్రోత్సహించే వారిలో ఒకరు. ఆయన అనేక విద్యా సంస్థలను నిర్మించారు. డాక్టర్ అంబేద్కర్, శ్రీ అరబిందోతో సహా అనేక మంది వ్యక్తులను ఉన్నత విద్యారంగంలో ప్రేరేపించారు. అలాంటి మహానుభావుల జాబితాలో రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు కూడా ఉంది.రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ గారు తన ఇంటిని సాంకేతిక పాఠశాల స్థాపన కోసం అప్పగించారు. అలీగఢ్, మధురలో విద్యా కేంద్రాల నిర్మాణానికి ఆయన చాలా ఆర్థిక సహాయం చేశారు. కొంతకాలం క్రితం అలీగఢ్‌లో ఆయన పేరు మీద యూనివర్సిటీకి శంకుస్థాపన చేసే అవకాశం కూడా నాకు లభించింది. విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే చైతన్యవంతమైన స్ఫూర్తి నేటికీ భారతదేశంలో కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.ఈ భావనలోని అత్యంత అందమైన విషయం ఏమిటో మీకు తెలుసా? అంటేవిద్య పట్ల ఈ అవగాహన సమాజంలో ప్రతి స్థాయిలో కనిపిస్తుంది. తమిళనాడులోని త్రిప్పూర్ జిల్లా ఉదుమల్పేట్ బ్లాక్‌లో నివసిస్తున్న తాయమ్మళ్ గారి ఉదాహరణ చాలా స్ఫూర్తిదాయకం.తాయమ్మళ్ గారికి సొంతంగా భూమి లేదు. కొన్నేళ్లుగా వారి కుటుంబం కొబ్బరినీళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తాయమ్మళ్ గారు తన కొడుకును, కుమార్తెను చదివించడానికి ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. వారి పిల్లలు చిన్నవీరంపట్టి పంచాయతీ మాధ్యమిక పాఠశాలలో చదివారు.ఒకరోజు పాఠశాలలో తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో తరగతి గదులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆ సమావేశంలో తాయమ్మళ్ గారు కూడా ఉన్నారు. తాయమ్మళ్ గారు అంతా విన్నారు. ఇదే సమావేశంలో ఈ పనులకు డబ్బుల కొరతపై మళ్లీ చర్చ వచ్చింది.దీని తర్వాత తాయమ్మళ్ గారు ఏం చేశారో ఎవరూ ఊహించలేరు. కొబ్బరి నీళ్లు అమ్మి కొంత మూలధనాన్ని కూడబెట్టిన తాయమ్మళ్ గారు పాఠశాల కోసం లక్ష రూపాయలను విరాళంగా అందించారు. నిజానికి ఇలా చేయడానికి విశాల హృదయం, సేవా భావం కావాలి.
ప్రస్తుతం పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకోవచ్చని తాయమ్మళ్ గారుచెప్పారు. ఇప్పుడు పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పుడు అక్కడ ఉన్నత మాధ్యమిక విద్య ప్రారంభమవుతుంది. మన దేశంలో విద్య గురించి నేను మాట్లాడిన భావన ఇదే. IIT BHU పూర్వ విద్యార్థి చేసిన ఇలాంటి విరాళం గురించి కూడా నేను తెలుసుకున్నాను.BHU పూర్వ విద్యార్థి జయ్ చౌదరి IIT BHU ఫౌండేషన్‌కి ఒక మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
మిత్రులారా!మన దేశంలో చాలా మంది వివిధ రంగాలకు చెందిన వారుఇతరులకు సహాయం చేస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా మన వివిధ IITలలో ఇటువంటి ప్రయత్నాలు నిరంతరంగా కనిపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలకు కొదవలేదు.ఇలాంటి ప్రయత్నాలను మరింత పెంచేందుకు గతేడాది సెప్టెంబర్ నుంచి దేశంలో విద్యాంజలి అభియాన్ కూడా ప్రారంభమైంది. వివిధ సంస్థలు, CSR, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. విద్యాంజలి సామాజిక భాగస్వామ్యాన్ని,విద్యాసంస్థ తమదే అన్న స్ఫూర్తిని ప్రోత్సహిస్తోంది. మీ పాఠశాల, కళాశాలతో నిరంతరం అనుసంధానం అయ్యేందుకు వీలవుతుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా అందించడంలో ఉన్న సంతృప్తిని, ఆనందాన్ని స్వీయ అనుభవం ద్వారా మాత్రమే పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా!ప్రకృతిపై ప్రేమ, ప్రతి జీవిపై కరుణ- ఇది మన సంస్కృతి. మన సహజ స్వభావం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఒక పులి మరణించినపుడు మన ఈ ఆచారాల సంగ్రహావలోకనం కనిపించింది. ప్రజలు ఈ పులిని కాలర్ టైగ్రెస్ అని పిలిచేవారు. అటవీ శాఖ దీనికి టీ-15 అని పేరు పెట్టింది. ఈ పులి మరణంతో ప్రజలు తమ సంబంధీకులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్టు భావోద్వేగానికి గురయ్యారు.ప్రజలు ఆ పులికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పూర్తి గౌరవం, ఆప్యాయతతో వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఉంటారు. ప్రకృతిపై, జంతువులపై భారతీయులమైన మనకున్న ఈ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందింది. కాలర్ పులి తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. 25 పిల్లలను పెంచి, పెద్ద చేసింది. మనం ఈ T-15 జీవితాన్ని కూడా ఉత్సవంగా జరుపుకున్నాం. ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఆ పులికి భావోద్వేగ వీడ్కోలు కూడా ఇచ్చాం. ఇది భారతదేశ ప్రజల ప్రత్యేకత. ప్రతి జీవితో మనం ప్రేమ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాం. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ కవాతులోరాష్ట్రపతి అంగరక్షక బృందంలోని ఛార్జర్ గుర్రంవిరాట్ తన చివరి పరేడ్‌లో పాల్గొంది. ఈ గుర్రం విరాట్ 2003లో రాష్ట్రపతి భవన్‌కు వచ్చింది. కమాండెంట్ ఛార్జర్‌గా ప్రతిసారీ రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించేది. రాష్ట్రపతి భవన్లో విదేశీ దేశాధినేతలెవరికైనా స్వాగతం పలికినప్పుడు కూడా ఆ గుర్రం ఈ పాత్రను పోషించేది. ఈ ఏడాది ఆర్మీ డే రోజున గుర్రం విరాట్‌కు సైనిక దళాల ప్రధానాధిపతి COAS కమెండేషన్ కార్డ్ కూడా ఇచ్చారు. విరాట్ అపారమైన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆ గుర్రం పదవీ విరమణ తర్వాతఘనంగా వీడ్కోలు జరిగింది.
నా ప్రియమైన దేశప్రజలారా!చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు, ఉన్నతమైన లక్ష్యంతో పని చేసినప్పుడుదాని ఫలితాలు కూడా కనిపిస్తాయి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అస్సాం నుండి వచ్చింది. అస్సాం పేరు చెప్పగానే తేయాకు తోటలు, అనేక జాతీయ పార్కులు గుర్తొస్తాయి. వీటితో పాటుఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటే one horn Rhino చిత్రం కూడా మన మనస్సులోకి వస్తుంది. ఒక కొమ్ము ఉన్న ఖడ్గమృగం అస్సామీ సంస్కృతిలో భాగమని మీ అందరికీ తెలుసు. భారతరత్న భూపేన్ హజారికా పాట ప్రతి చెవిలో ప్రతిధ్వనిస్తుంది.
##పాట (ఒక ప్రత్యేక ఆడియో ఫైల్ WhatsAppలో షేర్ చేస్తారు)
మిత్రులారా! ఈ పాట అర్థం చాలా సందర్భోచితంగా ఉంది. ఏనుగులు, పులులకు నిలయమైన కాజిరంగా పచ్చటి పరిసరాల్లో ఒంటి కొమ్మున్న ఖడ్గమృగాన్ని భూమి చూస్తుందని, పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయని ఈ పాట పేర్కొంటోంది. అస్సాంలోని ప్రపంచ ప్రసిద్ధ చేనేత వస్త్రాలపై నేసిన పగడపు అలంకరణలో కూడా ఖడ్గమృగం కనిపిస్తుంది. అస్సాం సంస్కృతిలో ఇంత గొప్ప వైభవం ఉన్న ఖడ్గమృగం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.2013లో 37, 2014లో 32 ఖడ్గమృగాలను స్మగ్లర్లు చంపేశారు. ఈ సవాలును పరిష్కరించడానికిఅస్సాం ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో గత ఏడేళ్లలో ఖడ్గమృగంపై భారీ ప్రచారాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2400కు పైగా కొమ్ములను దహనం చేశారు.స్మగ్లర్లకు ఇది గట్టి హెచ్చరిక. అలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఇప్పుడు అస్సాంలో ఖడ్గమృగాల వేట క్రమంగా తగ్గుతోంది. 2013లో 37 ఖడ్గమృగాలను చంపేయగా 2020లో 2, 2021లో 1 మాత్రమే వేటలో మరణించినట్టుగా నమోదైంది. ఖడ్గమృగాలను రక్షించాలన్న అస్సాం ప్రజల సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా!భారతీయ సంస్కృతిలోని వైవిధ్యం, ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తాయి. అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, పశ్చిమ యూరప్, జపాన్లలో భారతీయ సంస్కృతి బాగా ప్రాచుర్యం పొందిందని నేను మీతో చెప్తే మీరు ఈ విషయాన్ని చాలా సాధారణమైందిగా భావిస్తారు. ఆశ్చర్యపోరు. కానీలాటిన్ అమెరికా, దక్షిణ అమెరికాలలో కూడా భారతీయ సంస్కృతి అంటే ఆకర్షణ బాగా ఉందని నేను చెప్తే మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచనలో పడతారు. మెక్సికోలో ఖాదీని ప్రమోట్ చేయాలనే విషయమైనా లేదా బ్రెజిల్లో భారతీయ సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నమైనా ఈ విషయాలపై ఇంతకుముందు 'మన్ కీ బాత్'లో చర్చించాం. అర్జెంటీనాలో రెపరెపలాడుతున్న భారతీయ సంస్కృతి గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అర్జెంటీనాలో మన సంస్కృతి అంటే చాలా ఇష్టం.2018లోనేను అర్జెంటీనా పర్యటన సందర్భంగా 'శాంతి కోసం యోగా' అనే యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను. అర్జెంటీనాలో హస్తినాపూర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఎక్కడి అర్జెంటీనా! - అక్కడ కూడా హస్తినాపూర్ ఫౌండేషన్ అని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫౌండేషన్ అర్జెంటీనాలో భారతీయ వైదిక సంప్రదాయాల వ్యాప్తిలో పాలుపంచుకుంది.దీన్ని 40 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ అనే మహిళా ప్రొఫెసర్ స్థాపించారు. ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ ఈరోజు 90వ ఏట అడుగుపెట్టబోతున్నారు. భారత్‌తో ఆమె అనుబంధం కూడా చాలా ఆసక్తికరం.. ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడుభారతీయ సంస్కృతి శక్తి తొలిసారిగా ఆమెకు పరిచయమైంది. ఆమె భారతదేశంలో కూడా చాలా కాలం గడిపారు. భగవద్గీత, ఉపనిషత్తుల గురించి లోతుగా తెలుసుకున్నారు. హస్తినాపూర్ ఫౌండేషన్ లో 40,000 మందికి పైగా సభ్యులున్నారు. అర్జెంటీనా, ఇతర లాటిన్ అమెరికా దేశాలలో ఈ సంస్థకు దాదాపు 30 శాఖలున్నాయి. హస్తినాపూర్ ఫౌండేషన్ స్పానిష్ భాషలో 100 కంటే ఎక్కువ వైదిక, తాత్త్విక గ్రంథాలను ప్రచురించింది. వారి ఆశ్రమం కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఆశ్రమంలో పన్నెండు ఆలయాలను నిర్మించారు. వాటిలో అనేక దేవుళ్ళ , దేవతల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో అద్వైతవాద ధ్యానం కోసం నిర్మించిన ఆలయం కూడా ఉంది.
మిత్రులారా!మన సంస్కృతి మనకే కాదు-ప్రపంచం మొత్తానికి అమూల్యమైన వారసత్వ సంపద. ఇలాంటి వందలాది ఉదాహరణలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సంస్కృతిని తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, దీని ప్రకారం జీవించాలని కోరుకుంటారు. మనం కూడా పూర్తి బాధ్యతతో మన సాంస్కృతిక వారసత్వాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రజలందరికీ చేరవేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు నేను మిమ్మలని- ముఖ్యంగా మన యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒకేసారి ఎన్ని పుష్-అప్లు చేయగలరో ఊహించండి. నేను మీకు చెప్పబోయేది తప్పకుండా మీలో ఆశ్చర్యాన్ని నింపుతుంది. మణిపూర్‌లో 24 ఏళ్ల థౌనా ఓజం నిరంజాయ్ సింగ్ ఒక్క నిమిషంలో 109 పుష్-అప్లు చేసి రికార్డు సృష్టించారు.నిరంజాయ్ సింగ్‌కు రికార్డును బద్దలు కొట్టడం కొత్త కాదు-అంతకు ముందు కూడాఒక నిమిషంలో ఒక పిడికిలితో అత్యధిక పుష్-అప్లు చేసిన రికార్డు సాధించారు. మీరు నిరంజాయ్ సింగ్ నుండి ప్రేరణ పొంది, శారీరక దృఢత్వాన్ని మీ జీవితంలో భాగం చేసుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.
మిత్రులారా!మీరు గర్వంగా భావించే ఒక అంశాన్ని ఈ రోజు నేను లడఖ్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. లడఖ్ లో త్వరలో ఆకర్షణీయమైన ఓపెన్ సింథటిక్ ట్రాక్, ఆస్ట్రో టర్ఫ్ ఫుట్‌బాల్ స్టేడియం ప్రారంభం కానున్నాయి. 10,000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మిస్తున్న ఈ స్టేడియం నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది. లడఖ్‌లో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే అతిపెద్ద ఓపెన్ స్టేడియం ఇదే. లడఖ్‌లోని ఈ ఆధునిక ఫుట్‌బాల్ స్టేడియంలో 8 లేన్లతో కూడిన సింథటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. దీంతోపాటు వెయ్యి పడకలతో హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది.ఈ స్టేడియం ఫుట్‌బాల్‌లో అతిపెద్ద సంస్థ అయిన FIFA కూడా ధృవీకరించింది. ఇంత పెద్ద స్థాయిలో క్రీడల మౌలిక సదుపాయాలు దేశంలోని యువతకు గొప్ప అవకాశాలను తెస్తాయి. అదే సమయంలోఈ ఏర్పాటు జరిగే చోటికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు, వెళతారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్టేడియం లడఖ్‌లోని మన యువతలో చాలా మందికి ప్రయోజనం కల్పిస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్'లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ఈ సమయంలో అందరి మదిలో మెదులుతున్న మరో అంశం కరోనా. కొత్త కరోనా వేవ్ తో భారతదేశం గొప్ప విజయం సాధిస్తూ పోరాడుతోంది. ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల మంది పిల్లలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం గర్వించదగ్గ విషయం.అంటే 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువతలో దాదాపు 60% మంది మూడు నుండి నాలుగు వారాల్లోనే టీకాలు వేయించుకున్నారు. ఇది మన యువతను రక్షించడమే కాకుండా వారి చదువును కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే 20 రోజుల్లోనే కోటి మంది ముందుజాగ్రత్త డోసు కూడా తీసుకున్నారు.మన దేశ వ్యాక్సిన్‌పై మన దేశప్రజలకున్న ఈ నమ్మకమే మనకు గొప్ప బలం. ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కూడా తగ్గడం ప్రారంభించాయి. ఇది చాలా సానుకూల సంకేతం. ప్రజలు సురక్షితంగా ఉండాలి. దేశ ఆర్థిక కార్యకలాపాల వేగం కొనసాగాలి. ఇది ప్రతి దేశవాసి కోరిక.
మీకు తెలుసు- 'మన్ కీ బాత్'లోకొన్ని విషయాలునేను చెప్పకుండా ఉండలేను. 'స్వచ్ఛతా అభియాన్' మనం మరచిపోనవసరం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని వేగవంతం చేయాలి. ఇది ముఖ్యమైంది. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం అనే మంత్రం మన బాధ్యత. స్వావలంబన భారతదేశ ప్రచారం కోసం మనం హృదయపూర్వకంగా పని చేయాలి. మనందరి కృషితో దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఈ కోరికతోనేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను. బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.
మిత్రులారా! ఇది జనశక్తిలోని బలం. భారతదేశం వందేళ్లలో వచ్చిన అతిపెద్ద అంటువ్యాధితో పోరాడగలగడం అందరి కృషి ఫలితం. ప్రతి కష్ట సమయంలో ఒక కుటుంబంలా ఒకరికొకరం అండగా నిలిచాం. మీ ప్రాంతంలో లేదా నగరంలో ఎవరికైనా సహాయం చేయడానికి సాధ్యమయ్యేదానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు ప్రపంచంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను భారతదేశంతో పోల్చి చూస్తే దేశం అపూర్వమైన పని చేసినట్లు అనిపిస్తుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించిందా అనిపిస్తుంది. 140 కోట్ల డోసుల వ్యాక్సిన్ల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి ఘనత. ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది. సైన్స్‌పై నమ్మకాన్ని చూపుతుంది. శాస్త్రవేత్తలపై నమ్మకాన్ని చూపుతుంది. సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడంలో భారతీయులమైన మన సంకల్ప శక్తికి నిదర్శనం. అయితే మిత్రులారా! ఈ మహమ్మారిని ఓడించడానికి పౌరులుగా మన స్వంత ప్రయత్నం చాలా ముఖ్యమని గత రెండేళ్లుగా మన అనుభవం చెప్తోంది. మన శాస్త్రవేత్తలు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. వారికి ప్రతిరోజూ కొత్త విషయాలను సేకరిస్తున్నారు. ఆ సూచనలపై పని చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కరోనా ఈ వైవిధ్యానికి వ్యతిరేకంగా అప్రమత్తత, స్వీయ క్రమశిక్షణ దేశానికి గొప్ప శక్తి. మన సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుంది. ఈ బాధ్యతతో మనం 2022లోకి ప్రవేశించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మహాభారత యుద్ధ సమయంలో 'నభః స్పృశం దీప్తం' అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే గర్వంతో ఆకాశాన్ని తాకడం. భారతీయ వాయుసేన ఆదర్శ వాక్యం కూడా ఇదే. తల్లి భారతి సేవలో నిమగ్నమైన అనేక మంది జీవితాలు ప్రతిరోజూ గర్వంగా ఈ ఆకాశపు ఎత్తులను తాకుతున్నాయి. అవి మనకు చాలా నేర్పుతాయి. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ జీవితం అలాంటిదే. తమిళనాడులో ఈ నెల ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో వరుణ్ సింగ్ ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రమాదంలో దేశ మొదటి సి.డి.ఎస్. జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా అనేక మంది ధైర్యవంతులను కోల్పోయాము. వరుణ్ సింగ్ కూడా మృత్యువుతో చాలా రోజులు ధైర్యంగా పోరాడారు. కానీ ఆయన కూడా మనల్ని వదిలి వెళ్లిపోయారు. వరుణ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నా మనసుకు హత్తుకునే విషయం చూశాను. ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. ఈ సన్మానం తరువాత ఆయన తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖ రాశారు. ఈ ఉత్తరం చదివాక నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే విజయ శిఖరాలను అధిరోహించినా ఆయన తన మూలాలను మరిచిపోలేదు. రెండవది – ఆయన తన విజయోత్సవాలను జరుపుకోవడానికి సమయం ఉన్నప్పుడు రాబోయే తరాల కోసం ఆలోచించారు. తాను చదివిన పాఠశాల విద్యార్థుల జీవితం కూడా వేడుకగా మారాలన్నారు. తన లేఖలో వరుణ్ సింగ్ తన పరాక్రమాన్ని వివరించలేదు కానీ తన వైఫల్యాల గురించి చెప్పారు. తన లోపాలను ఎలా సామర్థ్యాలుగా మార్చుకున్నారో చెప్పారు. ఈ లేఖలో ఒక చోట ఆయన ఇలా రాశారు- “సాధారణ మనిషిగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ పాఠశాలలో రాణించలేరు. ప్రతి ఒక్కరూ 90లు సాధించలేరు. మీరు సాధిస్తే అది అద్భుతమైన విజయం. తప్పక మెచ్చుకోవాలి. అయితే మీరు అలా సాధించకపోతే మీరు సాధారణ స్థాయిలో ఉన్నారని అనుకోకండి. మీరు పాఠశాలలో సాధారణంగా ఉండవచ్చు కానీ జీవితంలో రాబోయే విషయాలకు ఇది కొలమానం కాదు. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని కనుగొనండి. అది కళ, సంగీతం, గ్రాఫిక్ డిజైన్, సాహిత్యం మొదలైనవి కావచ్చు. మీరు ఏ పనిచేసినా, అంకితభావంతో చేయండి. మీ వంతు కృషి చేయండి. మరింతగా కృషి చేయవలసిందని ఆలోచిస్తూ ఎప్పుడూ పడుకోవద్దు.”
మిత్రులారా! సాధారణ స్థాయి నుండి అసాధారణంగా మారడానికి ఆయన ఇచ్చిన మంత్రం కూడా అంతే ముఖ్యమైనది. ఈ లేఖలో వరుణ్ సింగ్ ఇలా రాశారు. "నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిలో మీరు మంచిగా ఉండలేరని ఎప్పుడూ అనుకోకండి. ఇది సులభంగా రాదు. ఇది సమయం తీసుకుంటుంది. సౌకర్యాలను త్యాగం చేస్తుంది. నేను సామాన్యుడిని. ఈ రోజు నా కెరీర్లో కష్ట సాధ్యమైన మైలురాళ్లను చేరుకున్నాను. 12వ తరగతి మార్కులు మీరు జీవిత లక్ష్యాలను నిర్ణయిస్తాయని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. దాని కోసం పని చేయండి."
వరుణ్ తాను ఒక్క విద్యార్థిని ప్రేరేపించగలిగినా అది చాలా ఎక్కువ అని రాశారు. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను – ఆయన యావద్దేశానికి స్ఫూర్తినిచ్చారు. తన లేఖ ద్వారా కేవలం విద్యార్థులతో మాత్రమే మాట్లాడినప్పటికీ ఆయన మన మొత్తం సమాజానికి సందేశం ఇచ్చారు.
మిత్రులారా! ప్రతి సంవత్సరం నేను పరీక్షలపై విద్యార్థులతో ఇలాంటి అంశాలపై చర్చిస్తాను. ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రనాలీక రూపొందిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కూడా రెండు రోజుల తర్వాత డిసెంబర్ 28వ తేదీ నుండి మై గవ్ డాట్ ఇన్ లో ప్రారంభం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 28 నుండి జనవరి 20 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆన్లైన్ పోటీలను కూడా నిర్వహిస్తారు. మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లభిస్తుంది. మనం కలిసి పరీక్ష, కెరీర్, విజయం, విద్యార్థి జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చిద్దాం.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు నేను మీకు చాలా దూరం నుండి, సరిహద్దులు దాటి వచ్చిన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది కూడా:
గాత్రం #(వందే మాతరం)
వందేమాతరం.. వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం.. వందేమాతరం
శుభ్ర జ్యోత్స్నపులకితయామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం... వందేమాతరం.
మీరు దీన్ని విని ఆనందించారని, గర్వంగా భావించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వందేమాతరంలో ఉన్న స్ఫూర్తి మనలో గర్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది.
మిత్రులారా! ఈ అందమైన వీడియో ఎక్కడిది, ఏ దేశం నుండి వచ్చింది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సమాధానం మీ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది. వందేమాతరం అందించిన ఈ విద్యార్థులు గ్రీస్‌కు చెందినవారు. అక్కడ వారు ఇలియా లోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ఎంతో అందంగా, భావోద్వేగంతో 'వందేమాతరం' పాడిన తీరు అద్భుతం, ప్రశంసనీయం. ఇటువంటి ప్రయత్నాలు రెండు దేశాల ప్రజలను మరింత సన్నిహితం చేస్తాయి. నేను ఈ గ్రీస్ విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా వారు చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! నేను లక్నో నివాసి నీలేష్ గారి పోస్ట్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను. నీలేష్ గారు లక్నోలో ఒక ప్రత్యేకమైన డ్రోన్ ప్రదర్శనను ప్రశంసించారు. ఈ డ్రోన్ షోను లక్నోలోని రెసిడెన్సీ ప్రాంతంలో నిర్వహించారు. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య పోరాట సాక్ష్యం ఇప్పటికీ రెసిడెన్సీ గోడలపై కనిపిస్తుంది. రెసిడెన్సీలో జరిగిన డ్రోన్ షోలో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వేర్వేరు అంశాలకు జీవం పోశారు. చౌరీ చౌరా ఆందోళన కావచ్చు. కాకోరి రైలు సంఘటన కావచ్చు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అసమానమైన ధైర్యం, పరాక్రమం కావచ్చు. వీటన్నిటినీ ప్రదర్శించిన ఈ డ్రోన్ షో అందరి హృదయాలను గెలుచుకుంది. అదేవిధంగా మీరు మీ నగరాలు, గ్రామాలలో స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ఇందులో సాంకేతికత సహాయం కూడా పొందవచ్చు. స్వాతంత్ర్య అమృతోత్సవ పండుగ స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. దేశం కోసం కొత్త తీర్మానాలు చేయడానికి, ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ప్రేరణాత్మక ఉత్సవం, ప్రేరణాత్మక సందర్భం. స్వాతంత్య్ర సమరంలోని మహనీయుల స్ఫూర్తిని పొందుతూ దేశం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంటాం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభలతో సుసంపన్నమైంది. ఆ ప్రతిభా మూర్తుల సృజనాత్మకత ఇతరులను ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు ఒకరు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు విఠలాచార్య గారు ఒక ఉదాహరణ. మిత్రులారా! పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్య గారికి చిన్నప్పటి నుండి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా విఠలాచార్య గారు అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేశారు. అందులో అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తన సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని అనేక విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య గారు అంటారు. ఈరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కృషితో స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
మిత్రులారా! పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠన అభిరుచి అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం చాలా పుస్తకాలు చదివానని గర్వంగా చెప్పుకునే వారిని ఈ రోజుల్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పుస్తకాలను మరిన్ని చదవాలనుకుంటున్నాను. ఇది మంచి ధోరణి. దీన్ని మరింత పెంచాలి. ఈ సంవత్సరం మీకు ఇష్టమైన ఐదు పుస్తకాల గురించి చెప్పమని 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అడుగుతున్నాను. ఈ విధంగా, మీరు 2022లో మంచి పుస్తకాలను ఎంచుకోవడానికి ఇతర పాఠకులకు కూడా సహాయం చేయగలుగుతారు. మన స్క్రీన్ టైమ్ పెరుగుతున్న తరుణంలో పుస్తక పఠనం మరింత ప్రాచుర్యం పొందేందుకు మనం కలిసి కృషి చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! ఇటీవల నా దృష్టి ఒక ఆసక్తికరమైన ప్రయత్నంపైకి మళ్లింది. మన ప్రాచీన గ్రంథాలకు, సాంస్కృతిక విలువలకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందేందుకు ఈ ప్రయత్నం. పూణేలో భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక కేంద్రం ఉంది. మహాభారత ప్రాముఖ్యతను ఇతర దేశాల ప్రజలకు పరిచయం చేయడానికి ఈ సంస్థ ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఇప్పుడే ప్రారంభించినప్పటికీ ఇందులో బోధించే అంశాల రూపకల్పన 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్టు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. మన సంప్రదాయంలోని వివిధ అంశాలను ఆధునిక పద్ధతిలో ఎలా ప్రదర్శిస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు నేను ఈ అద్భుతమైన చొరవ గురించి చర్చిస్తున్నాను. సప్తసముద్రాల అవతల ఉన్న ప్రజలకు దీని ప్రయోజనాలను అందజేసేందుకు కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.
మిత్రులారా! నేడు భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచంలో పెరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన వారు మన సంస్కృతిని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉండటమే కాకుండా దానిని పెంచేందుకు సహకరిస్తున్నారు. అలాంటి వారిలో సెర్బియాకు చెందిన విద్యావేత్త డాక్టర్ మోమిర్ నికిచ్ ఒకరు. అతను సంస్కృత-సెర్బియన్ ద్విభాషా నిఘంటువును రూపొందించారు. ఈ నిఘంటువులో చేర్చిన 70 వేలకు పైగా సంస్కృత పదాలను సెర్బియన్ భాషలోకి అనువదించారు. డాక్టర్ నికిచ్ 70 ఏళ్ల వయసులో సంస్కృత భాష నేర్చుకున్నారని తెలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మహాత్మాగాంధీ వ్యాసాలను చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెప్తారు. ఇదే విధమైన ఉదాహరణ మంగోలియాకు చెందిన 93 సంవత్సరాల ప్రొఫెసర్ జె. గొందె ధరమ్ గారిది. గత 4 దశాబ్దాలలో ఆయన భారతదేశంలోని 40 పురాతన గ్రంథాలు, ఇతిహాసాలు, రచనలను మంగోలియన్ భాషలోకి అనువదించారు. మన దేశంలో కూడా చాలా మంది ఇలాంటి అభిరుచితో పనిచేస్తున్నారు. గోవాకు చెందిన సాగర్ ములే గారి కృషి గురించి కూడా నేను తెలుసుకున్నాను. శతాబ్దాల క్రితం నాటి 'కావి' చిత్రకళ అంతరించిపోకుండా కాపాడడంలో ఆయన నిమగ్నమయ్యారు. 'కావి' చిత్రకళ భారతదేశపు ప్రాచీన చరిత్రను స్వయంగా వివరిస్తుంది. 'కావ్' అంటే ఎర్ర మట్టి. ప్రాచీన కాలంలో ఈ కళలో ఎర్ర మట్టిని ఉపయోగించేవారు. గోవా పోర్చుగీసు పాలనలో ఉన్న సమయంలో అక్కడి నుంచి వలస వచ్చిన వారు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ అద్భుతమైన చిత్రకళను పరిచయం చేశారు. కాలక్రమేణా ఈ చిత్రకళ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ సాగర్ ములే గారు ఈ కళకు కొత్త జీవం పోశారు. ఆయన ప్రయత్నాలకు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. మిత్రులారా! ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు కూడా మన గొప్ప కళల పరిరక్షణలో చాలా సహకారం అందిస్తాయి.
మన దేశ ప్రజలు దృఢ సంకల్పంతో ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న మన ప్రాచీన కళలను అందంగా తీర్చిదిద్ది, కాపాడుకోవాలనే తపన ఒక ప్రజా ఉద్యమ రూపం పొందవచ్చు. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాల గురించి మాత్రమే మాట్లాడాను. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. నమో యాప్ ద్వారా మీరు వాటి సమాచారాన్ని తప్పనిసరిగా నాకు తెలియజేయాలి.
నా ప్రియమైన దేశ ప్రజలారా! అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం నుండి ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్‌గన్ సరెండర్ అభియాన్’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఎయిర్గన్లను అప్పగిస్తున్నారు. ఎందుకో తెలుసా? తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లో విచక్షణారహితంగా జరిగే పక్షుల వేటను అరికట్టవచ్చు. మిత్రులారా! అరుణాచల్ ప్రదేశ్ 500 కంటే ఎక్కువ జాతుల పక్షులకు నిలయం. వీటిలో కొన్ని దేశీయ జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కానీ క్రమంగా ఇప్పుడు అడవుల్లో పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దీన్ని సరిదిద్దేందుకే ఈ ఎయిర్‌గన్ సరెండర్ ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పర్వతం నుండి మైదానాల వరకు, ఒక సమాజం నుండి మరొక సమాజం వరకు, రాష్ట్రంలోని ప్రతిచోటా ప్రజలు హృదయపూర్వకంగా దీనిని స్వీకరించారు.అరుణాచల్ ప్రజలు తమ ఇష్టపూర్వకంగా 1600 కంటే ఎక్కువ ఎయిర్గన్లను అప్పగించారు. ఇందుకు అరుణాచల్ ప్రజలను ప్రశంసిస్తున్నాను. వారిని అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మీ అందరి నుండి 2022కు సంబంధించి చాలా సందేశాలు, సూచనలు వచ్చాయి. ప్రతిసారిలాగే చాలా మంది వ్యక్తుల సందేశాలలో ఒక అంశం ఉంది. ఇది పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కు సంబంధించింది. ఈ పరిశుభ్రత సంకల్పం క్రమశిక్షణ, జాగరూకత, అంకితభావంతో మాత్రమే నెరవేరుతుంది. ఎన్. సి. సి. క్యాడెట్లు ప్రారంభించిన పునీత్ సాగర్ అభియాన్‌లో కూడా మనం దీని సంగ్రహావలోకనం చూడవచ్చు. ఈ ప్రచారంలో 30 వేల మందికి పైగా ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ ఎన్సీసీ క్యాడెట్లు బీచ్‌లను శుభ్రం చేశారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి రీసైక్లింగ్ కోసం సేకరించారు. పరిశుభ్రత ఉన్నప్పుడే మన బీచ్‌లు, మన పర్వతాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయి. జీవితాంతం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అక్కడికి వెళ్ళి తెలిసో తెలియకో చెత్త కూడా వ్యాపింపజేస్తారు. మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాలను అపరిశుభ్రంగా మార్చకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి దేశవాసిపై ఉంది.
మిత్రులారా! కొంతమంది యువకులు ప్రారంభించిన ‘సాఫ్ వాటర్’ అనే స్టార్టప్ గురించి నాకు తెలిసింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ సహాయంతో ఇది ప్రజలకు వారి ప్రాంతంలోని నీటి స్వచ్ఛత, నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పరిశుభ్రత తదుపరి దశ. ప్రజల స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ స్టార్టప్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, దీనికి గ్లోబల్ అవార్డు కూడా లభించింది.
మిత్రులారా! ఈ ప్రయత్నంలో 'పరిశుభ్రత వైపు ఒక అడుగు' ప్రచారంలో ప్రతి ఒక్కరి పాత్రా ప్రధానమైంది. సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు.. ప్రతి ఒక్కరి పాత్రా ముఖ్యమైందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్లు, కాగితాలు ఎక్కువగా ఉండేవన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పాత పద్ధతులను మార్చడం ప్రారంభించినప్పటి నుండి ఈ ఫైళ్లు, కాగితాలు డిజిటలైజ్ అయి, కంప్యూటర్ ఫోల్డర్లో నిల్వ ఉంటున్నాయి. పాత, పెండింగ్‌లో ఉన్న మెటీరియల్‌ను తొలగించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ పరిశుభ్రతా డ్రైవ్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న జంక్‌యార్డ్ పూర్తిగా ఖాళీ అయింది. ఇప్పుడు ఈ జంక్‌యార్డ్ ను ప్రాంగణంగా, ఫలహారశాలగా మార్చారు. మరో జంక్‌యార్డ్‌ను ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాని ఖాళీగా ఉన్న జంక్‌యార్డ్‌ను వెల్నెస్ సెంటర్‌గా మార్చింది. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లీన్ ఏటీఎంను కూడా ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు చెత్తను ఇవ్వడం, బదులుగా నగదు తీసుకోవడం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని విభాగాలు ఎండు ఆకులు, చెట్ల నుండి పడే సేంద్రీయ వ్యర్థాల నుండి సేంద్రీయ కంపోస్ట్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. ఈ విభాగం వేస్ట్ పేపర్‌తో స్టేషనరీని తయారు చేసేందుకు కూడా కృషి చేస్తోంది. మన ప్రభుత్వ శాఖలు కూడా పరిశుభ్రత వంటి అంశంపై చాలా వినూత్నంగా ఆలోచిస్తాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఎవరూ నమ్మలేదు కానీ నేడు అది వ్యవస్థలో భాగమైపోతోంది. దేశప్రజలందరూ కలసి నడిపిస్తున్న దేశపు కొత్త ఆలోచన ఇది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్'లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా ఒక నెల తర్వాత కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం- కానీ, 2022లో. ప్రతి కొత్త ప్రారంభం మన సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాన్ని తెస్తుంది. ఆ లక్ష్యాలు ఇంతకు ముందు మనం ఊహించనివి కూడా కావచ్చు. నేడు దేశం వాటి కోసం ప్రయత్నాలు చేస్తోంది.
క్షణశః కణశశ్చైవ, విద్యామ్ అర్థం చ సాధయేత్
క్షణో నష్టే కుతో విద్యా, కణే నష్టే కుతో ధనమ్
అంటే మనం జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం డబ్బు సంపాదించవలసి వచ్చినప్పుడు, అంటే పురోగతి చెందవలసివచ్చినప్పుడు ప్రతి కణాన్ని- అంటే ప్రతి వనరును సముచితంగా ఉపయోగించాలి. ఎందుకంటే క్షణం నష్టపోతే జ్ఞానం, విద్య పోతాయి. వనరుల నష్టంతో సంపదకు, పురోగమనానికి దారులు మూసుకుపోతాయి. ఈ విషయం మన దేశవాసులందరికీ స్ఫూర్తిదాయకం. మనం చాలా నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలి. కొత్త లక్ష్యాలను సాధించాలి. అందుకే క్షణం కూడా వృధా చేయకుండా ఉండాలి. మనం దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. కాబట్టి మన ప్రతి వనరును పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఒకరకంగా ఇది స్వావలంబన భారతదేశ మంత్రం కూడా. ఎందుకంటే మనం మన వనరులను సక్రమంగా ఉపయోగించినప్పుడు వాటిని వృధా చేయనివ్వం. అప్పుడే స్థానిక శక్తిని గుర్తిస్తాం. అప్పుడే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. కాబట్టి ఉన్నతంగా ఆలోచించాలని, ఉన్నతంగా కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని మన సంకల్పాన్ని మళ్ళీ చెప్పుకుందాం. మన కలలు మనకు మాత్రమే పరిమితం కావు. మన కలలు మన సమాజం, దేశ అభివృద్ధికి సంబంధించినవిగా ఉంటాయి. మన పురోగతి దేశ పురోగతికి మార్గాన్ని తెరుస్తుంది. దీని కోసం ఈ రోజు నుండి మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, ఒక్క కణాన్ని కూడా కోల్పోకుండా పని చేయాలి. ఈ సంకల్పంతో రాబోయే సంవత్సరంలో దేశం ముందుకు సాగుతుందని, 2022 నవ భారత నిర్మాణానికి బంగారు పుట అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ నమ్మకంతో మీ అందరికీ 2022 శుభాకాంక్షలు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.
నా ప్రియమైన దేశప్రజలారా! అమృత మహోత్సవానికి సంబంధించిన చర్చలు తనకు బాగా నచ్చాయని సీతాపూర్ నుండి ఓజస్వీ నాకు రాశారు. ఆయన తన స్నేహితులతో కలిసి 'మన్ కీ బాత్' వింటారు. స్వాతంత్ర్య పోరాటం గురించి చాలా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. మిత్రులారా!అమృత మహోత్సవంనేర్చుకోవడంతో పాటు, దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అయినా ప్రభుత్వాలు అయినా, పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అమృత మహోత్సవ ప్రతిధ్వని వినిపిస్తోంది. ఈ మహోత్సవానితో అనుసంధానమైన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఈ మధ్య ఢిల్లీలో అలాంటి ఆసక్తికరమైన కార్యక్రమం ఒకటి జరిగింది. ‘స్వాతంత్ర్య పోరాట కథలు-పిల్లల ప్రసంగాలు’ అనే కార్యక్రమంలోపిల్లలు పూర్తి ఉత్సాహంతో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథలను ప్రస్తావించారు. విశేషమేమిటంటే భారత్‌తో పాటు నేపాల్, మారిషస్, టాంజానియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. మన దేశానికి చెందిన మహారత్న సంస్థ ఓ.ఎన్.జి.సి. కూడా అమృత మహోత్సవాన్ని విభిన్నంగా జరుపుకుంటోంది.ఈ మహోత్సవ రోజుల్లోవిద్యార్థుల కోసం చమురు క్షేత్రాలలో అధ్యయన యాత్రలను ఓ.ఎన్.జి.సి. నిర్వహిస్తోంది. ఈ అధ్యయనాలలోఓ.ఎన్.జి.సి. ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాల గురించి యువతకు తెలియజేస్తున్నారు. మన వర్ధమాన ఇంజనీర్లు దేశ నిర్మాణ ప్రయత్నాలలో పూర్తి ఉత్సాహంతో,అభిరుచితో చేతులు కలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మిత్రులారా! స్వాతంత్య్ర సాధనలో గిరిజన సమాజం అందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకునిదేశం కూడా గిరిజనులు గర్వించదగిన వారోత్సవాలను జరుపుకుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులలోజారవా,ఒంగే వంటి గిరిజన వర్గాల ప్రజలు తమ సంస్కృతిని సజీవంగా ప్రదర్శించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాకు చెందిన సూక్ష్మ లేఖకులు రామ్ కుమార్ జోషి అద్భుతమైన పని చేశారు. ఆయన చాలా చిన్నవైన పోస్టల్ స్టాంపులపైనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించారు. ఆయన హిందీలో రాసిన 'రామ్' అనే పదంపై చిత్రాలను రూపొందించారు. అందులో ఇద్దరు మహానీయుల జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా చెక్కారు.మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన కొంతమంది మిత్రులు కూడా ఒక చిరస్మరణీయమైన దాస్తాంగోయ్ కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించారు. ఇందులో రాణి దుర్గావతి ఎనలేని ధైర్యసాహసాలు, త్యాగాల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. అలాంటి ఒక కార్యక్రమం కాశీలో జరిగింది. గోస్వామి తులసీదాస్, సంత్ కబీర్, సంత్ రవి దాస్, భారతేందు హరిశ్చంద్ర, మున్షీ ప్రేమ్‌చంద్, జయశంకర్ ప్రసాద్ వంటి మహానుభావుల గౌరవార్థం మూడు రోజుల పండుగను నిర్వహించారు.వివిధ కాలాలలోవీరంతా దేశ ప్రజల చైతన్యంలో పెద్ద పాత్ర పోషించారు. మీకు గుర్తు ఉండవచ్చు. 'మన్ కీ బాత్' ఇంతకుముందు భాగాలలో నేను మూడు పోటీలను ప్రస్తావించాను. దేశభక్తి గీతాలు రాయడం; దేశభక్తికి, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన సంఘటనలకు చెందిన రంగవల్లికలను రూపుదిద్దడం;పిల్లల మనస్సులలో భవ్య భారతదేశ స్వప్నావిష్కరణ చేసేందుకుచిట్టిపాట లను రాయడం. ఈ పోటీల కోసం మీరు తప్పనిసరిగా ఎంట్రీని పంపారని నేను భావిస్తున్నాను. మీరు మీ మిత్రులతో కూడా ప్రణాళిక వేసుకుని, చర్చించి ఉండాలి. మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోని ప్రతి మూలలో ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!ఈ చర్చ నుండి నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా బృందావనానికి తీసుకెళ్తాను. భగవంతుని ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా బృందావనాన్ని చెప్తారు. మన యోగులు కూడా ఇలా చెప్పారు -
చిత్తంలో ఉందీ ఆశ -చిత్తంలో ఉందీ ఆశ
ఈ వైభవాన్ని వివరిస్తాను-
బృందావన వైభోగం, బృందావన వైభోగం
ఏవరికీ అంతుచిక్కలేదు-
దీని అర్థం ఏమిటంటే బృందావన మహిమనుమనందరం మన శక్తికి తగ్గట్టుగా చెప్పుకుంటాం. కానీ బృందావన ఆనందం, ఈ ప్రదేశం అందించే అనుభూతి, దాని తాదాత్మ్యత ఎవరూ కనుగొనలేరు. ఇది అపరిమితంగా ఉంటుంది. అందుకే బృందావనం ప్రపంచం నలుమూలల ప్రజలను ఆకర్షిస్తోంది.మీరు ప్రపంచంలోని ప్రతి మూలలో దాని ముద్రను కనుగొంటారు.
పెర్త్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక నగరం. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రపంచంతో బాగా పరిచయం కలిగి ఉంటారు. ఎందుకంటే పెర్త్‌లో క్రికెట్ మ్యాచ్‌లు తరచుగా జరుగుతాయి. పెర్త్‌లో 'సాక్రెడ్ ఇండియా గ్యాలరీ' పేరుతో కళా ప్రదర్శన శాలకూడా ఉంది. ఈ గ్యాలరీని స్వాన్ వ్యాలీలోని ఒక అందమైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నివాసి జగత్ తారిణి దాసి గారి కృషి ఫలితంగాఇది ఏర్పాటైంది. జగత్ తారిణి గారు ఆస్ట్రేలియాకు చెందినవారు. ఆమె అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అయితే ఆమె బృందావనం వచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇక్కడే గడిపారు. తాను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళినా, తిరిగి తన దేశానికి వెళ్ళినాబృందావనాన్నిమరచిపోలేనని చెప్పారు. అందువల్లబృందావనంతో, దాని ఆధ్యాత్మిక స్ఫూర్తితో అనుసంధానమయ్యేందుకు ఆమె ఆస్ట్రేలియాలోనే బృందావనాన్ని ఏర్పాటు చేశారు. తన కళను మాధ్యమంగా చేసుకుని అద్భుతమైన బృందావనాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు అనేక రకాల కళాఖండాలను చూసే అవకాశం లభిస్తుంది. వారు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలు – బృందావనం, నవద్వీప్, జగన్నాథపూరీల సంప్రదాయం,సంస్కృతిల సంగ్రహావలోకనం పొందుతారు.శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన అనేక కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన ఒక కళాఖండం కూడా ఉంది. దాని కింద బృందావన ప్రజలు ఆశ్రయం పొందారు. జగత్ తారిణి గారి ఈ అద్భుతమైన ప్రయత్నంకృష్ణభక్తి లోని శక్తిని చూపిస్తుంది. ఈ ప్రయత్నానికి వారందరికీ శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న బృందావనం గురించి మాట్లాడుతున్నాను. మన బుందేల్‌ఖండ్‌కు చెందిన ఝాన్సీతో ఆస్ట్రేలియాకు కూడా సంబంధం ఉందనేది ఆసక్తికరమైన చరిత్ర. నిజానికిఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడుఆమె న్యాయవాది జాన్ లాంగ్.జాన్ లాంగ్ నిజానికి ఆస్ట్రేలియా వాసి. భారతదేశంలో ఉండి ఆయన రాణి లక్ష్మీబాయి విషయంలో పోరాడాడు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఝాన్సీ, బుందేల్‌ఖండ్‌ల భాగస్వామ్యం మనందరికీ తెలుసు.రాణి లక్ష్మీబాయి,ఝల్కారీ బాయి వంటి వీరనారీమణులు ఇక్కడివారే. మేజర్ ధ్యాన్ చంద్ వంటి ఖేల్ రత్నను కూడా ఈ ప్రాంతమే దేశానికి అందించింది.
మిత్రులారా!శౌర్యాన్ని యుద్ధరంగంలో మాత్రమే ప్రదర్శించాల్సిన అవసరం లేదు. శౌర్యం వ్రతంగా మారినప్పుడు అది విస్తరిస్తుంది. అప్పుడు ప్రతి రంగంలోనూ అనేక కార్యాల సాధన ప్రారంభమవుతుంది. అలాంటి పరాక్రమం గురించి శ్రీమతి జ్యోత్స్నగారు నాకు లేఖ రాశారు. జాలౌన్‌లో ఒక నది ఉండేది - నూన్ నది. ఇక్కడి రైతులకు ఇది ప్రధాన నీటి వనరుగా ఉండేది. కానీక్రమంగా నూన్ నది అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ నదికి మిగిలి ఉన్న కొద్దిపాటి అస్తిత్వంగా ఇది కాలువగా మారింది. దీని కారణంగా రైతులకు సాగునీటికి కూడా ఇక్కట్లు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు జాలౌన్ ప్రజలు చొరవ తీసుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో వేలాది మంది గ్రామస్తులు, స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఇక్కడి పంచాయతీలు గ్రామస్తుల సహకారంతో పనులు ప్రారంభించాయి. నేడు అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో నదికి జీవం పోశాయి. దీని వల్ల ఎంతో మంది రైతులకులబ్ది కలుగుతోంది. యుద్ధభూమిలో కాకుండా ఇతర క్షేత్రాలలో ధైర్యసాహసాలకు ఇది ఒక ఉదాహరణ. ఇది మన దేశవాసుల సంకల్ప శక్తిని చూపుతుంది. మనం దృఢ సంకల్పంతో ఉంటేఅసాధ్యమైనదిఏదీ ఉండదని ఈ ఉదాహరణ చెప్తోంది. సామూహిక కృషి ఉండాలని ఇది చెబుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా!మనం ప్రకృతిని సంరక్షించినప్పుడు, ప్రకృతి కూడా మనకు రక్షణను, భద్రతను ఇస్తుంది. మనం వ్యక్తిగత జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తాం.అలాంటి ఒక ఉదాహరణను తమిళనాడు ప్రజలు అందించారు. ఈ ఉదాహరణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు సంబంధించింది. తీర ప్రాంతాలలో కొన్నిసార్లు భూమి మునిగిపోయే ప్రమాదం ఉందని మనకు తెలుసు. తూత్తుకుడిలో కూడా చాలా చిన్నచిన్న ద్వీపాలుఉన్నాయి. అవి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పెరుగుతోంది.ఇక్కడి ప్రజలు,నిపుణులు ప్రకృతి ద్వారానే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని రక్షించగలిగారు. ఈ ప్రజలు ఇప్పుడు ఈ దీవుల్లో తాటి చెట్లను నాటుతున్నారు. ఈ చెట్లు తుఫాన్లలో కూడా భూమికి రక్షణ ఇస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో కొత్త విశ్వాసం ఏర్పడింది.
మిత్రులారా!మనం ప్రకృతి సమతుల్యతను భంగపరిచినప్పుడు లేదా దాని స్వచ్ఛతను నాశనం చేసినప్పుడు మాత్రమే ప్రకృతి మనకు ముప్పు కలిగిస్తుంది. ప్రకృతి కూడా మనల్ని తల్లిలా ఆదరిస్తుంది. మన ప్రపంచాన్ని కొత్త రంగులతో నింపుతుంది.
ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను- మేఘాలయలో ఎగురుతున్న పడవ ఫోటో చాలా వైరల్ అవుతోంది. ఈ చిత్రం తొలిచూపులోనే మనల్ని ఆకర్షిస్తుంది. మీలో చాలామంది దీన్ని ఆన్లైన్లో చూసి ఉంటారు. గాలిలో తేలుతున్న ఈ పడవను నిశితంగా పరిశీలిస్తే అది నది నీటిలో కదులుతున్నట్లు తెలుస్తుంది. నది నీరు ఎంత శుభ్రంగా ఉందంటే నది కింది ప్రాంతం పారదర్శకంగా కనిపిస్తుంది. పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజలు తమ సహజ వారసత్వాన్ని సంరక్షించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి.ప్రకృతితో మమేకమై కాలం గడిపే జీవనశైలిని ఈ ప్రజలు నేటికీ సజీవంగా ఉంచారు. ఇది మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. మన చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడి, వాటి అసలు రూపానికి తీసుకురావాలి. ఇందులోనే మనందరి క్షేమం ఉంది. ప్రజా ప్రయోజనం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినప్పుడు, బడ్జెట్‌ను ఖర్చు చేసినప్పుడు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసినప్పుడుఅది పని చేస్తుందని ప్రజలు భావిస్తారు. కానీ ప్రభుత్వం రూపొందించే అనేక అభివృద్ధి పథకాలలోమానవీయ సంవేదనలకు సంబంధించిన విషయాలు ఎల్లప్పుడూ భిన్నమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రభుత్వ కృషితో, ప్రభుత్వ పథకాలతో ఏ జీవితం ఎలా మారిపోయిందో, ఆ మారిన జీవితాల అనుభవాలేమిటో విన్నప్పుడు మనలో కూడా సంవేదనలు కలుగుతాయి.మనసుకు సంతృప్తిని ఇవ్వడంతోపాటు ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్ఫూర్తిని కూడా ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటేఇది కేవలం స్వీయ ఆనందం మాత్రమే. అందుకే ఈ రోజు ‘మన్ కీ బాత్’ లో తమ మానసిక శక్తితో కొత్త జీవితాన్ని గెలిచిన అలాంటి ఇద్దరు మిత్రులు మనతో కలుస్తున్నారు. వారు ఆయుష్మాన్ భారత్ పథకం సహాయంతో తమ చికిత్సను పూర్తి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో మొదటి మిత్రుడు రాజేష్ కుమార్ ప్రజాపతి. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండేవి.
రండి.. రాజేష్ గారితో మాట్లాడదాం -
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నమస్తే.
రాజేష్ ప్రజాపతి: నమస్తేసార్.. నమస్తే
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీకు వచ్చిన వ్యాధి ఏమిటి? అప్పుడు
ఎవరో డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉండాలి. నాకు చెప్పండి. స్థానిక వైద్యుడు తప్పనిసరిగా చెప్పిన తర్వాత మీరు వేరే వైద్యుడి వద్దకు వెళ్లి ఉండాలి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదా? ఏం జరిగింది?
రాజేష్ ప్రజాపతి: నా గుండెలో ఒక సమస్య వచ్చింది సార్. నా
ఛాతీలో మంటగా అనిపించింది సార్. అప్పుడు డాక్టర్‌కి చూపించాను. అసిడిటీ ఉండవచ్చని డాక్టర్ చెప్పారు సార్. అందుకే చాలా రోజులు అసిడిటీ కి మందులు వాడాను. లాభం లేకపోవడంతో అప్పుడు నేను డాక్టర్ కపూర్ గారికి చూపించాను. “నీకు ఉన్న లక్షణాలు యాంజియోగ్రఫీ ద్వారా తెలుస్తాయి” అని డాక్టర్ గారుచెప్పారు. అప్పుడు ఆయన నన్ను శ్రీరామ్ మూర్తి గారికి రిఫర్ చేశారు. అప్పుడు మేం అమ్రేష్ అగర్వాల్ గారిని కలిశాం. ఆయన నా యాంజియోగ్రఫీ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు. “ఇది మీ సిర బ్లాక్ కావడం వల్ల జరిగింది” అని. ఎంత ఖర్చవుతుందని మేం అడిగాం. దాంతో ఆయుష్మాన్ కార్డు ఉంటుందని, దాన్ని ప్రధానమంత్రి గారు తయారు చేశారని ఆయన చెప్పారు. ఆ కార్డు మా దగ్గర ఉందని మేం చెప్పాం. దాంతో ఆయన నా కార్డు తీసుకున్నారు. నా చికిత్స మొత్తం ఆ కార్డుతోనే జరిగింది సార్. మీరు ఈ కార్డ్‌ని చాలా మంచి పద్ధతిలో తయారు చేశారు. ఇది పేద ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది. నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను!
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరేం చేస్తారు?
రాజేష్ ప్రజాపతి: సార్.. ఇప్పుడు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను సార్
ప్రధానమంత్రి: మీ వయసెంత ?
రాజేష్ ప్రజాపతి: నా వయసు నలభై తొమ్మిదేళ్లు సార్
ప్రధానమంత్రి: మీకు ఇంత చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చింది.
రాజేష్ ప్రజాపతి - అవును సార్...
ప్రధానమంత్రి: మీ కుటుంబంలో ఇంతకు ముందు మీ కుటుంబంలో మీ అమ్మకు గానీ నాన్నకు గానీ ఇంకా ఎవరికైనా ఇలా ఉందా? మీకే వచ్చిందా?
రాజేష్ ప్రజాపతి: లేదు సార్, ఎవరూ లేరు సార్. ఇది నాకే వచ్చింది.
ప్రధాన మంత్రి: ఈ ఆయుష్మాన్ కార్డును భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్డు పేదల కోసం ఒక పెద్ద పథకం. దీని గురించి మీకెలా తెలిసింది?
రాజేష్ ప్రజాపతి: సార్!ఇది చాలా పెద్ద పథకం. దీని ద్వారా పేద ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈ కార్డు ద్వారా ప్రజలు ఎంత ప్రయోజనం పొందారో ఆసుపత్రిలో చూశాం సార్. ఈ కార్డు మాదగ్గర ఉందని చెప్పినప్పుడు“సరే ఆ కార్డు తీసుకురండి.. అదే కార్డుతో మీకు వైద్యం చేస్తాన”ని డాక్టర్ చెప్పారు.
ప్రధానమంత్రి: మీ దగ్గర కార్డు లేకపోతేఎంత ఖర్చవుతుందో డాక్టర్ గారు చెప్పారా?
రాజేష్ ప్రజాపతి: కార్డు లేకపోతే చాలా ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు సార్. “సార్ నా దగ్గర కార్డ్ ఉంది” అని చెప్పాను. ఆ కార్డు వెంటనే చూపించమన్నారు డాక్టర్. ఆ కార్డు చూపిస్తే అదే కార్డ్ తో మొత్తం చికిత్స అంతా జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, మందులు కూడా ఆ కార్డు ద్వారానే వచ్చాయి.
ప్రధానమంత్రి: కాబట్టి రాజేష్ గారూ.. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగుంది.
రాజేష్ ప్రజాపతి: సార్! చాలా కృతజ్ఞతలు సార్!మీ ఆయుష్షు దీర్ఘకాలం ఉండాలి సార్. మీరు ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలి. మా కుటుంబ సభ్యులు కూడా మీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నేను అధికారంలో ఉండాలని కోరుకోకండి. నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా అధికారంలోకి వెళ్లాలనుకోను. నేను సేవలో మాత్రమే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ పదవి-ఈ ప్రధానమంత్రి పదవి.. ఇవన్నీ అధికారం కోసం కాదు సోదరా, సేవ కోసమే.
రాజేష్ ప్రజాపతి: మాకు కావలసింది సేవే సార్.. ఇంకేం కావాలి!
ప్రధానమంత్రి: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కోసం.
రాజేష్ ప్రజాపతి: సార్ .. చాలా గొప్ప విషయం
ప్రధానమంత్రి: అయితే చూడండి రాజేష్ గారూ.. మీరు మా కోసం ఒక పని చేయండి. చేస్తారా?
రాజేష్ ప్రజాపతి: అవును.. ఖచ్చితంగా చేస్తాసార్
ప్రధానమంత్రి: ప్రజలకు దీని గురించి తెలియడం లేదు. మీరు బాధ్యత వహించాలి. మీకు దీని వల్ల కలిగిన ఉపయోగాన్ని మీకు ఎలా ప్రయోజనం కలిగిందో మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాలకు చెప్పాలి.
రాజేష్ ప్రజాపతి: తప్పకుండాచెప్తాను సార్
ప్రధానమంత్రి: ఎప్పుడు కష్టాలు వస్తాయో తెలియదని, అందుకే ఇలాంటి కార్డును వారు కూడా తయారు చేసుకోవాలని వారికి చెప్పండి. డబ్బు లేకపోవడం వల్ల వారు మందు తీసుకోరు. వ్యాధికి మందు తీసుకోరు. అది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ గుండె సమస్య ఉంటే పేదలకు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు ఎన్ని నెలలు పని చేయకుండా ఉండాల్సి వస్తుంది?
రాజేష్ ప్రజాపతి: నేను పది అడుగులు కూడా నడవలేకపోయేవాడిని. మెట్లు ఎక్కలేకపోయే వాడిని సార్
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరు నాకు మంచి మిత్రునిగా మారడం ద్వారా, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మీకు వీలైనంత మంది పేదలకు వివరించడం ద్వారా మీరు అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయవచ్చు. మీరు కూడా సంతోషపడుతారు. రాజేష్ గారి ఆరోగ్యం బాగుపడడంతో పాటు రాజేష్ గారు వందలాది మందికి ఆరోగ్యం చేకూర్చారని నేను కూడా సంతోషిస్తాను. ఈ ఆయుష్మాన్ భారత్ పథకంపేదల కోసం. మధ్యతరగతి వారి కోసం. ఇది సాధారణ కుటుంబాల కోసం, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఇంటికి మీరు చేర్చాలి.
రాజేష్ ప్రజాపతి: ఖచ్చితంగా చేరుస్తాను సార్. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం సార్. ఆసుపత్రికి వచ్చిన చాలా మంది పేదలకు కార్డు ఉంటే కలిగే ప్రయోజనాలు చెప్పాం సార్. కార్డు ఉంటే ఉచితంగా చేస్తారని చెప్పాం సార్.
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. మీ శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. చాలా అభివృద్ధి చెందండి. నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! మనం రాజేష్ గారి మాటలు విన్నాం. ఇప్పుడు సుఖ్ దేవి గారు మనతో చేరుతున్నారు. మోకాళ్ల సమస్య ఆమెని చాలా బాధపెట్టింది. సుఖ్‌దేవి గారి బాధను విందాం. ఆమెకు ఆనందం ఎలా వచ్చిందో అర్థం చేసుకుందాం.
మోదీ గారు: సుఖదేవి గారూ.. నమస్తే! మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
సుఖ దేవి గారు:దాన్ దపరా నుండి సార్.
మోదీ గారు: ఇది ఎక్కడ ఉంది?
సుఖ దేవి గారు: మధురలో.
మోదీ గారు: మధురలోనా! సుఖదేవి గారూ.. అయితేమీరు నమస్తే చెప్పడంతో పాటు రాధే-రాధే అని కూడా చెప్పాలి.
సుఖదేవి గారు: అవును సార్. రాధే-రాధే.
మోదీ గారు: మీరు ఇబ్బందుల్లో ఉన్నారని మేము విన్నాము. మీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా? విషయమేమిటో చెప్పగలరా?
సుఖ దేవి గారు: అవును. నా మోకాలు దెబ్బతింది. కాబట్టి నాకు ఆపరేషన్ జరిగింది. ప్రయాగ్ హాస్పిటల్ లో.
మోదీ గారు: సుఖదేవి గారూ.. మీ వయస్సు ఎంత?
సుఖ దేవి గారు: వయస్సు 40 సంవత్సరాలు సార్ .
మోదీ గారు: సుఖదేవి అనే పేరు. 40 సంవత్సరాలు. సుఖదేవి అనారోగ్యం పాలయ్యారు.
సుఖ దేవి గారు: 15-16 సంవత్సరాల వయస్సు నుండేనేను అనారోగ్యంతో ఉన్నాను.
మోదీ గారు: ఇంత చిన్న వయస్సులో మీ మోకాలు
చెడిపోయిందా!
సుఖ దేవి గారు: కీళ్లనొప్పుల వల్ల మోకాలు చెడిపోయింది సార్.
మోదీ గారు: 16 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మీరు చికిత్స కూడా చేయించలేదా?
సుఖ దేవి గారు: లేదు. .. చేయించాను. పెయిన్ మెడిసిన్ తీసుకుంటూనే ఉన్న చిన్నా చితకా డాక్టర్లకు చూపించాను. స్థానికంగా దొరికే మందులు వాడాను. దాంతో మోకాలు మరింత పాడైపోయింది.
మోదీ గారు: సుఖదేవి గారూ.. ఆపరేషన్ ఆలోచన ఎలా వచ్చింది? దానికోసం డబ్బుఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఇదంతా ఎలా జరిగింది?
సుఖ దేవి గారు: నేను ఆయుష్మాన్ కార్డ్‌తో ఆ చికిత్సను పూర్తి చేశాను.
మోదీ గారు: మీకు ఆయుష్మాన్ కార్డు వచ్చిందా?
సుఖ దేవి గారు: అవును.
మోదీ గారు: ఆయుష్మాన్ కార్డుతో పేదలకు ఉచిత చికిత్సజరుగుతుంది. ఇది మీకు తెలుసా?
సుఖ దేవి గారు: స్కూల్లో ఒక మీటింగ్ ద్వారా మా భర్తకు తెలిసింది. నా పేరు మీద కార్డు చేయించారు.
మోదీ గారు: ఓహ్..
సుఖ దేవి గారు: అప్పుడు కార్డు ద్వారా ట్రీట్మెంట్ చేయించాను. నేను డబ్బు పెట్టుబడి పెట్టలేదు. నేను కార్డు ద్వారానే చికిత్స పొందాను. మంచి చికిత్స జరిగింది.
మోదీ గారు: కార్డు లేకపోతే ఎంత ఖర్చవుతుందని డాక్టర్ చెప్పేవారు?
సుఖ దేవి గారు: రెండున్నర లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు. ఆరేడేళ్ల నుంచి మంచంలో ఉన్నాను. “దేవుడా! నన్ను తీసుకెళ్లు. నాకు బతకాలని లేదు” అని అనుకునేదాన్ని.
మోదీ గారు: 6-7 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. అమ్మో!
సుఖ దేవి గారు: అవును.
మోదీ గారు: ఓ!
సుఖ దేవి గారు: అస్సలు లేవడం, కూచోవడం ఉండేది కాదు.
మోదీ గారు: ఇప్పుడు మీ మోకాలి మునుపటి కంటే మెరుగ్గా ఉందా?
సుఖ దేవి గారు: నేను చాలా ప్రయాణం చేస్తాను. నేను తిరుగుతున్నాను వంటగది పనిచేస్తాను. ఇంటి పనులు చేస్తాను. నేనే వండి పిల్లలకు భోజనం పెడతాను.
మోదీ గారు: కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు నిజంగా మిమ్మల్ని ఆయుష్మంతులుగా మార్చింది.
సుఖ దేవి గారు: ఈ పథకానికి చాలా ధన్యవాదాలు. కోలుకున్నాను. నా కాళ్ళపై నేను నిలబడగలుగుతున్నాను.
మోదీ గారు: కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఆనందిస్తున్నారు.
సుఖ దేవి గారు: అవును. పిల్లలు చాలా ఇబ్బందులు పడేవారు. తల్లి బాధపడితే బిడ్డలు కూడా బాధపడేవారు.
మోదీ గారు: చూడండి.. మన ఆరోగ్యం మన జీవితంలో అతిపెద్ద ఆనందం. ఇది ఆయుష్మాన్ భారత్ భావన. ప్రతి ఒక్కరూ ఈ సంతోషకరమైన జీవితాన్ని పొందాలి. సుఖదేవి గారూ.. మీకు మరోసారి శుభాకాంక్షలు. రాధే-రాధే.
సుఖ దేవి గారు: రాధే – రాధే.. నమస్తే!
నా ప్రియమైన దేశప్రజలారా! యువత అధికంగా ఉన్న ప్రతి దేశంలో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు అవే కొన్నిసార్లు యువత నిజమైన గుర్తింపుగా మారతాయి. మొదటి విషయం - ఆలోచనలు,ఆవిష్కరణ. రెండవది రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే మనస్తత్వం. మూడవది ఏదైనా చేయగలననే ఆత్మ విశ్వాసం-అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏ పనినైనా సాధించాలనే సంకల్పం. ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో మనం స్టార్ట్-అప్, స్టార్ట్-అప్, స్టార్ట్-అప్ అని అన్ని వైపులా వింటున్నాం. నిజమే.. ఇది స్టార్టప్ యుగం, అలాగే స్టార్ట్-అప్ ప్రపంచంలోఈ రోజు భారతదేశం ప్రపంచానికే ఒకరకంగా మార్గదర్శిగా నేతృత్వం వహిస్తుందన్నది కూడా నిజం. స్టార్టప్‌లు ఏడాదికేడాది రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్‌ల పరిధి పెరిగింది. ఈ రోజుల్లో 'యూనికార్న్' అనే పదం చాలా చర్చలో ఉంది. మీరందరూ తప్పక విని ఉంటారు. 'యూనికార్న్' అటువంటి స్టార్టప్. దీని విలువ కనీసం 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ.
మిత్రులారా! 2015 సంవత్సరం వరకు దేశంలో దాదాపు తొమ్మిది లేదా పది యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ ప్రపంచంలో కూడా వేగంగా పురోగమిస్తుందని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారంఈ సంవత్సరం పెద్ద మార్పు వచ్చింది. కేవలం 10 నెలల్లోప్రతి 10 రోజులకు ఒక యూనికార్న్ భారతదేశంలో తయారవుతోంది. కరోనా మహమ్మారి మధ్య మన యువత ఈ విజయాన్ని సాధించడం కూడా పెద్ద విషయం. ప్రస్తుతం భారతదేశంలో 70 కంటే ఎక్కువ యూనికార్న్‌లు ఉన్నాయి. అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ విలువను దాటిన 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయి. మిత్రులారా!స్టార్ట్-అప్ విజయం కారణంగాప్రతి ఒక్కరి దృష్టి దీనిపై పడింది. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి పెట్టుబడిదారుల సహకారం లభిస్తున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాల కిందట ఇది ఎవరూ ఊహించలేదు.
మిత్రులారా!భారతీయ యువత స్టార్టప్‌ల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారంలోకూడా సహకరిస్తోంది. ఈ రోజు మనం ఒక యువకుడు మయూర్ పాటిల్‌తో మాట్లాడదాం. ఆయన తన స్నేహితులతో కలిసి కాలుష్య సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించారు.
మోదీ గారు: మయూర్ గారూ.. నమస్తే.
మయూర్ పాటిల్ గారు: నమస్కారం సార్.
మోదీ గారు: మయూర్ గారూ.. మీరెలా ఉన్నారు?
మయూర్ పాటిల్ గారు: చాలా బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు ?
మోదీ గారు: నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే చెప్పండి. ప్రస్తుతం మీరేదో స్టార్టప్ ప్రపంచంలో ఉన్నారు.
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: వ్యర్థాలను ఉత్తమంగా పరివర్తన చేస్తున్నారు.
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: పర్యావరణ రంగంలో కూడా మీరు పని చేస్తున్నారు. మీ గురించి చెప్పండి. మీ పని గురించి మాకు చెప్పండి. ఈ పనికి మీకు ఎలా ఆలోచన వచ్చింది?
మయూర్ పాటిల్ గారు: సార్!నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు మోటార్ సైకిల్ ఉండేది. దాని మైలేజ్ చాలా తక్కువగా ఉండేది. ఎమిషన్ చాలా ఎక్కువగా ఉండేది. అది టూ స్ట్రోక్ మోటార్ సైకిల్. కాబట్టి ఉద్గారాలను తగ్గించి, దాని మైలేజీని కొద్దిగా పెంచడానికినేను ప్రయత్నించడం ప్రారంభించాను.ఎప్పుడో 2011-12లో నేను మైలేజీని లీటరుకు 62 కిలోమీటర్ల మేరకు పెంచాను. కాబట్టి అక్కడి నుండి నేను ప్రజల కోసం పెద్ద ఎత్తున తయారు చేయాలనే ప్రేరణ పొందాను. అప్పుడు చాలా మంది దాని నుండి ప్రయోజనం పొందుతారుకాబట్టి. 2017-18లో మేం దాని సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రాంతీయ రవాణా సంస్థలో 10 బస్సులలో ఉపయోగించాం. దాని ఫలితాన్ని తనిఖీ చేయడానికి దాదాపు మేం ఉద్గారాలను నలభై శాతం తగ్గించాం- బస్సులలో ..
మోదీ గారు: ఓహ్! మీరు కనుగొన్న ఈ సాంకేతికతకు పేటెంట్ మొదలైనవి పొందారా?
మయూర్ పాటిల్ గారు: అవును సార్! పేటెంట్ పూర్తయింది. ఈ సంవత్సరంలో మాకు పేటెంట్ వచ్చింది.
మోదీ గారు: మరి దీన్ని మరింత పెంచే ప్రణాళిక ఏమిటి? ఎలా చేస్తున్నారు? బస్సు ఫలితం వచ్చేసింది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే ఉంటాయి. కాబట్టి మీరు తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారు?
మయూర్ పాటిల్ గారు: సార్!స్టార్ట్-అప్ ఇండియాలో NITI ఆయోగ్ నుండి అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ నుండి మాకు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ ఆధారంగామేం ఎయిర్ ఫిల్టర్లను తయారు చేసే ఫ్యాక్టరీని ప్రారంభించాం.
మోదీ గారు: మీరు భారత ప్రభుత్వం నుండి ఎంత గ్రాంట్ పొందారు?
మయూర్ పాటిల్ గారు: 90 లక్షలు
మోదీ గారు: 90 లక్షలా!
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: మీ పని దానితో పూర్తయిందా !
మయూర్ పాటిల్ గారు: అవును.. ఇప్పుడే మొదలైంది. ఇంకా ప్రాసెస్ లో ఉన్నాం.
మోదీ గారు: మీరు ఎంత మంది స్నేహితులు కలిసి చేస్తున్నారు ఇదంతా?
మయూర్ పాటిల్ గారు: మేం నలుగురం సార్.
మోదీ గారు: నలుగురూ ఇంతకుముందు కలిసి చదువుకునేవారు. దాని నుండి మీకు ముందుకు వెళ్లాలనే ఆలోచన వచ్చింది.
మయూర్ పాటిల్ గారు: అవును సార్! అవును! మేము ఇంకా కాలేజీలోనే ఉన్నాం అప్పుడు. కాలేజీలో మేం ఇదంతా ఆలోచించాం. కనీసం నా మోటార్‌సైకిల్ కాలుష్యాన్ని తగ్గించి మైలేజీని పెంచాలని నా ఆలోచన.
మోదీ గారు: కాలుష్యాన్ని తగ్గించారు.. మైలేజీని పెంచారు.. అప్పుడు సగటు ఖర్చు ఎంత ఆదా అవుతుంది?
మయూర్ పాటిల్ గారు: సార్!మోటార్ సైకిల్ మైలేజీని పరీక్షించాం. లీటరుకు 25 కిలోమీటర్లు ఇచ్చే దాన్ని లీటర్‌కు 39 కిలోమీటర్లకు పెంచాం. అప్పుడు దాదాపు 14 కిలోమీటర్ల ప్రయోజనం. అందులో 40 శాతం కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ప్రాంతీయ రవాణా సంస్థ బస్సులను ప్రారంభించినప్పుడుఇంధన సామర్థ్యం 10 శాతం పెరిగింది. దానిలో ఉద్గారాలు 35-40 శాతం తగ్గాయి.
మోదీ గారు: మయూర్ గారూ.. మీతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. మీకు మిత్రులను కూడా అభినందిస్తున్నాను. కళాశాల జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యకు మీరు ఒక పరిష్కారం కనుగొనడంతో పాటు ఆ పరిష్కారం ఎంచుకున్న మార్గం పర్యావరణ సమస్యను పరిష్కరించింది. మీరు చొరవ తీసుకున్నారు. మన దేశ యువతఏదైనా పెద్ద సవాలును స్వీకరించి, మార్గాలను అన్వేషిస్తుంది. అదే మన యువత శక్తి. మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. నా తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు
మయూర్ పాటిల్ గారు: ధన్యవాదాలు సార్! ధన్యవాదాలు!
మిత్రులారా! కొన్నేళ్ల క్రితం ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటున్నానని, కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నానని చెబితే“నీకు ఉద్యోగం ఎందుకు వద్దు? ఉద్యోగంలో భద్రత ఉంటుంది. జీతం వస్తుంది. ఇబ్బంది కూడా తక్కువే.” అని కుటుంబ పెద్దలు సమాధానమిచ్చేవారు. కానీ, ఎవరైనా ఈరోజు తన స్వంత కంపెనీని ప్రారంభించాలనుకుంటేచుట్టూ ఉన్న వారందరూ చాలా ఉత్సాహపరుస్తారు. అతనికి పూర్తిగా మద్దతు ఇస్తారు. మిత్రులారా!ఇది భారతదేశ వృద్ధి కథ మలుపు. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని కలలు కంటున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు మనం 'మన్ కీ బాత్'లో అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. అమృత కాలంలో మన దేశప్రజలు కొత్త సంకల్పాలను ఎలా నెరవేరుస్తున్నారో చర్చించాం. డిసెంబర్ నెలలో సైన్యం ధైర్యసాహసాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాం. డిసెంబరు నెలలోమనం స్ఫూర్తి పొందే మరో పెద్ద రోజు మన ముందుకు వస్తుంది. అది డిసెంబర్ 6వ తేదీన వచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. బాబా సాహెబ్ తన జీవితమంతా దేశం కోసం,సమాజం కోసం తన విధులను నిర్వర్తించడానికి అంకితం చేశారు. మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనిమన రాజ్యాంగం ఆశిస్తున్నదని, అదే మన రాజ్యాంగంలోని ప్రాథమిక భావన అని దేశప్రజలమైన మనం ఎప్పటికీ మరచిపోకూడదు. కాబట్టి మన కర్తవ్యాలను పూర్తి నిజాయితీతో నిర్వహిస్తామనిఅమృత మహోత్సవంలో ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే బాబా సాహెబ్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి.
మిత్రులారా! ఇప్పుడు మనం డిసెంబర్ నెలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 2021లో తర్వాతి 'మన్ కీ బాత్' ఈ సంవత్సరంలో చివరి 'మన్ కీ బాత్' కావడం సహజం. 2022లో మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అవును.. నేను మీ నుండి చాలా సూచనలను ఆశిస్తూనే ఉన్నాను. దాన్ని కొనసాగిస్తాను. మీరు ఈ సంవత్సరానికి ఎలా వీడ్కోలు పలుకుతున్నారు, కొత్త సంవత్సరంలో మీరు ఏమి చేయబోతున్నారు- దయచేసి ఈ విషయాలు కూడా చెప్పండి. కరోనా ఇంకా పోలేదని మర్చిపోకండి. జాగ్రత్తలు తీసుకోవడం మనందరి బాధ్యత.
చాలా చాలా ధన్యవాదాలు!
ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.
మిత్రులారా వంద కోట్ల వాక్సీన్ డోసుల్ని వేయడం చాలా పెద్ద విషయం, కానీ దానికి సంబంధించిన లక్షలాది చిన్న చిన్న ప్రేరణలు, అలాగే గర్వంతో కూడుకున్న అనేక అనుభవాలు, అనేక ఉదాహరణలు దానికి ముడిపడి ఉన్నాయి | వాక్సినేషన్ మొదలుపెట్టిన రోజునే ఇంత పెద్ద కార్యక్రమం పూర్తిగా సఫలమవుతుందన్న విశ్వాసం నాకెలా కలిగిందని చాలామంది నాకు లేఖలు రాస్తున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు | నాకు అంతటి నమ్మకం ఎందుకు కలిగిందంటే, నాకు నా దేశంయొక్క, నా దేశ ప్రజలయొక్క శక్తి సామర్ధ్యాల గురించి చాలా బాగా తెలుసు కనుక | మన హెల్త్ వర్కర్లు దేశవాసులందరికీ టీకాలు వేసే ప్రయత్నంలో ఎలాంటి లోపం చెయ్యరన్న పూర్తి నమ్మకం నాకుంది. మన హెల్త్ వర్కర్లు పూర్తి స్థాయి అంకిత భావంతో, ఓ సత్సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. వాళ్లందరూ ఓ వినూత్నమైన సంకల్పంతో, అంకితభావంతో తమ శక్తికి మంచి చాలా కష్టపడ్డారు | ధృఢ నిశ్చయంతో మానవతా భావనతో సేవా దృక్పథంతో ముందుకు సాగి ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు | దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయి | అనేక రకాలైన ఇబ్బందుల్ని సవాళ్లని అధిగమించి వాళ్లు ఏ విధంగా దేశ ప్రజలందరికీ ఓ సురక్షా కవచాన్ని ఏర్పాటు చేశారో కథలు కథలుగా చెబుతున్నారు | ఈ సఫలత సాధించడానికి వాళ్లు ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని శ్రమలకోర్చారో మనం అనేక పత్రికల్లో వచ్చిన కథనాలు చూశాం, అనేక రకాల కథనాల్నికూడా విన్నాం | ఒకరిని మించి ఒకరుగా అనేక రకాలైన ప్రేరణలు మనకి కనిపించాయి | నేనివ్వాళ్టి మన్ కీ బాత్ లో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ హెల్త్ వర్కర్ పూనమ్ నౌటియాలా ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను | మిత్రులారా ఆ బాగేశ్వర్ దేశంలోకెల్లా నూటికి నూరుశాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన ఉత్తరాఖండ్ ఖండ్ కి చెందినవారు కావడం విశేషం | ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నికూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. ఎందుకంటే అది అత్యంత దుర్గమమైన, కఠినమైన ప్రదేశం కాబట్టి | అదే విధంగా అనేక విధాలైన అవాంతరాల్ని అధిగమించి హిమాచల్ ప్రదేశ్ కూడా నూటికి నూరుశాతం వాక్సినేషన్ ప్రక్రియలో సఫలత సాధించింది | నాకు తెలిసిన సమాచారం ప్రకారం పూనమ్ గారు తానున్న ప్రదేశంలో అందరికీ వాక్సీన్ ని అందించడానికి రాత్రింబవళ్లూ తీవ్రస్థాయిలో శ్రమించారు |
ప్రధాన మంత్రి :- పూనమ్ గారు నమస్తే |
పూనమ్ నౌటియాలా :- నమస్కారం సర్ |
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ దేశ వాసులందరికీ కాస్త మీ
గురించి చెబుతారా
పూనమ్ నౌటియాలా :- సార్ నా పేరు పూనమ్ నౌటియాలా | సార్
నేను ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లాలోని చానీ కోరాలీ సెక్టర్ లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తని సర్. నేనో ANMని సర్.
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ నాకు బాగేశ్వర్ కి వచ్చే
అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం. అది ఓ పుణ్య క్షేత్రం కావడం విశేషం. అక్కడ బాగేశ్వర్ మందిరం ఉంది, దాన్ని దర్శించుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎన్నో శతాబ్దాల క్రితం ఆ మందిరాన్ని అసలు ఎలా నిర్మించారోకదా అని.
పూనమ్ నౌటియాల్ :- అవును సార్.
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ మీరు మీ ప్రాంతంలో
ఉన్నవారందరికీ వాక్సినేషన్ పూర్తి చేశారా?
పూనమ్ నౌటియాల్ :- అవును సర్, మొత్తం అందరికీ పూర్తైపోయింది.
ప్రధానమంత్రి :- ఆ ప్రక్రియలో మీరేమైనా ఇబ్బందుల్ని
ఎదుర్కోవాల్సొచ్చిందా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్ | ఇక్కడ మాకు ఎక్కడైతే వర్షం
పడుతుందో అక్కడ రోడ్డు పూర్తిగా బ్లాకైపోతుంది | సార్ మేం నదిని దాటుకుని వెళ్లాల్సొచ్చింది |
మేం ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లాం సర్ |NHCVC కార్యక్రమంలో భాగంగా మేం ప్రతి ఇంటికీ వెళ్లాం | చాలామంది ఆరోగ్య కేంద్రానికి రాలేకపోయారండీ, ఎలాంటివాళ్లంటే వృద్ధులు, వికలాంగులులాంటి వాళ్లు, గర్భవతులైన మహిళలు, గృహిణులు చాలామంది |
ప్రధానమంత్రి :- పైగా అక్కడ కొండలమీద ఇళ్లు చాలా
దూరంగా ఉంటాయికదా.
పూనమ్ నౌటియాలా :- అవును |
ప్రధాన మంత్రి :- మరైతే మీరు ఒక్క రోజులో ఎంతదూరం
ప్రయాణించాల్సొచ్చేది.
పూనమ్ నౌటియాలా :- సార్ కిలోమీటర్ల ప్రకారం చూస్తే రోజుకి దాదాపు పది
కిలోమీటర్లు, ఎనిమిది కిలోమీటర్లు.
ప్రధాన మంత్రి :- నిజానికి పట్టణాల్లో నివశించేవాళ్లకి 8-10 కిలోమీటర్లు
కొండలెక్కి ప్రయాణించడమంటే ఏంటో తెలియదు. నాకు తెలిసి 8-10 కిలోమీటర్లు కొండలెక్కడమంటే మొత్తం రోజంతా పడుతుంది.
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధాన మంత్రి :- కానీ ఒక్కరోజులో ఇంతంటే, పైగా ఇది చాలా
ముఖ్యమైన వాక్సినేషన్ కార్యక్రమం కాబట్టి మొత్తం సామానంతా కూడా మోసుకెళ్లాల్సొస్తుంది. మీతోపాటుగా ఎవరైనా సహాయకులు కూడా వచ్చేవారా లేదా ?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. మేం ఐదుగురం టీమ్ మెంబర్లం
ఉంటాం సర్.
పూనమ్ నౌటియాలా :- ఆ..
పూనమ్ నౌటియాలా :- ఆ బృందంలో ఓ డాక్టర్, ఓ ANM, ఇంకా ఓ
ఫార్మసిస్ట్, ఆశా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉన్నారు సర్.
ప్రధానమంత్రి :- అవునా.. అయితే ఆ డేటా ఎంట్రీకోసం అక్కడ
కనెక్టివిటీ దొరికేదా లేకపోతే బాగేశ్వర్ కి తిరిగొచ్చాక చేసేవాళ్లా?
పూనమ్ నౌటియాలా :- సర్.. అక్కడక్కడా నెట్వర్క్ ఉండేది, మిగతావన్నీ
బాగేశ్వర్ కి తిరిగొచ్చాక ఎంట్రీ చేసేవాళ్లం మేము.
ప్రధాన మంత్రి :- అవును. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే
పూనమ్ గారు ఔటాఫ్ ది వే వెళ్లి జనానికి టీకాలు వేసేవాళ్లట. అసలు మీకా ఆలోచన ఎలా వచ్చింది, మీరప్పుడేమనుకున్నారు, మీరు ఎలా ముందుకెళ్లారు?
పూనమ్ నౌటియాలా :- మేమంతా, మొత్తం టీమ్ కలిసి మావల్ల ఒక్క డోస్
వాక్సీన్ కూడా మిస్ కాకూడదని బలంగా
సంకల్పించుకున్నాం. మన దేశం నుంచి కరోనా మహమ్మారిని దూరంగా తరిమి వెయ్యాలనుకున్నాం. నేను ఆశ కలిసి గ్రామాల వారీగా ఓ డ్యూ లిస్ట్ ని తయారు చేసుకున్నాం. ఆ జాబితా ప్రకారం చూసుకుని సెంటర్ కి వచ్చినవాళ్లకి అక్కడే టీకాలు వేసేశాం. తర్వాత మేం ఇంటింటికీ వెళ్లాం. సార్ ఆ తర్వాత మిగిలిపోయినవాళ్లు, సెంటర్ కి రాలేని వాళ్లని గుర్తించాం.
ప్రధాన మంత్రి :- మీరు అందరికీ నచ్చజెప్పాల్సొచ్చేదా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. నచ్చజెప్పాం.. అవును..
ప్రధాన మంత్రి :- ఇప్పుడు కూడా అందరూ వాక్సీన్ తీసుకోవడానికి
ఉత్సాహం చూపిస్తున్నారా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. అవును.. ఇప్పుడు అందరికీ
అర్థమైపోయింది. మొదట్లో మాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ వాక్సీన్ సురక్షితమైనదని, మేం కూడా వేసుకున్నామని, మేం బాగానే ఉన్నాంకదా అని జనానికి నచ్చజెప్పాల్సొచ్చేది. మా స్టాఫ్ అంతా వేసుకున్నామని మేం బాగున్నామని చెప్పాల్సొచ్చేది.
ప్రధాన మంత్రి :- ఎక్కడైనా వాక్సీన్ వేసిన తర్వాత ఏమైనా
ఇబ్బందులొచ్చాయా తర్వాత.. పూనమ్ నౌటియాలా :- లేదు లేదు సర్.. అలాంటిదేం లేదు..
పూనమ్ నౌటియాలా :- ఏం కాలేదా..
పూనమ్ నౌటియాలా :- అవును..
ప్రధాన మంత్రి :- అందరూ సంతోషంగానే ఉన్నారా
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధానమంత్రి :- అంతా బాగానే ఉందికదా..
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధాన మంత్రి :- అవును.. మీరు చాలా కష్టపడి పనిచేశారు.. ఆ
ప్రాంతం ఎలా ఉంటుందో, అక్కడ కొండలెక్కడం ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. ఓ కొండ ఎక్కడం మళ్లీ కిందికి దిగడం, మళ్లీ ఇంకో కొండెక్కడం, ఇళ్లుకూడా చాలా దూరంగా ఉంటాయి, మీరు చాలా చాలా కష్టపడి పనిచేశారు.
పూనమ్ నైటియాల్ :- ధన్యవాదాలు సర్, మీతో మాట్లాడ్డం నిజంగా నా
అదృష్టం.
ప్రధానమంత్రి :- మీలాంటి లక్షలాది మంది హెల్త్ వర్కర్లు
కఠినమైన పరిశ్రమతో భారత దేశంలో కోట్లాది వాక్సీన్ డోసుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇవ్వాళ్ల దానికి నేను కేవలం మీకు మాత్రమే కాక ఉచిత టీకాకరణ ప్రక్రియని ఇంత పెద్ద ఎత్తున పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భారతీయుడికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరివల్లే మన దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఇంతగా సఫలమయ్యింది. మీకు మీ కుటుంబాలకు నేను అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన దేశవాసులారా, మీకు తెలిసిందేకదా వచ్చే ఆదివారం, అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పండుగ. మనసులో మాట శ్రోతలందరి తరఫునా, నా తరఫునా, నేనా ఉక్కుమనిషికి నమస్కరిస్తున్నాను.
మిత్రులారా, అక్టోబర్ 31వ తేదీని మనం రాష్ట్రీయ సమైక్య దినంగా జరుపుకుంటున్నాం. ఏకత్వానికి సంబంధించిన ఏ విధానం లేదా ప్రక్రియతో అయినా సరే మనందరం అనుబంధాన్ని పెంచుకోవడం మన ధర్మం. మీరు చూసే ఉంటారు గుజరాత్ పోలీసులు కచ్ లోని లఖ్ పత్ కోటనుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహించారు. త్రిపుర పోలీసులు ఏకతా దివస్ ని జరుపుకునే సందర్భంలో త్రిపుర నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అంటే తూర్పు నుంచి పశ్చిమ దిశ వరకూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులుకూడా ఉరీనుంచి పఠాన్ కోట్ వరకూ అలాంటి బైక్ ర్యాలీని నిర్వహించి దేశంలో ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. నేనా జవానులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని అనేక మంది ఆడపడుచుల గురించి కూడా నాకు తెలిసింది. ఆ ఆడపడుచులందరూ కాశ్మీర్ లోని సైన్యానికి సంబంధించిన కార్యాలయాలకోసం, ప్రభుత్వ కార్యాలయాలకోసం మువ్వన్నెల జెండాలను కుడుతున్నారు. పరిపూర్ణమైన దేశ భక్తితో చేస్తున్న పని అది. నేను ఆ ఆడపడుచులు పడుతున్న శ్రమని అభినందిస్తున్నాను. మీరుకూడా భారతదేశంలో ఏకత్వం కోసం, భారత దేశ ఔన్నత్యం కోసం, ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు మీ మనసుకు ఎంతటి సంతోషం కలుగుతుందో మీరే చూడండి.
మిత్రులారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమనేవారంటే – మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలం. మనలో గనక ఏకత్వం లేకపోతే మనంతట మనమే కొత్త కొత్త ఆపదల్లో చిక్కుకుపోతాం. అంటే దేశం ఒక్కటిగా ఉంటే మనం ఉన్నతంగా ఉంటాం. మనం సర్దార్ పటేల్ జీవితంనుంచి ఆయన ఆశయాలనుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. మన ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సర్దార్ పటేల్ జీవితంపై ఓ పిక్టోరియెల్ బయోగ్రఫీని ప్రచురించింది. మన దేశంలోని యువకులందరూ దాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. దానిద్వారా మీకు ఆకర్షణీయమైన రీతిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ప్రియమైన సహచరులారా, జీవితం నిరంతరాయంగా ప్రగతిని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటుంది. విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా సరే, ప్రగతి పథం ఎంత వేగంగా ఉన్నాసరే, భవనాలు ఎంత అందంగా నిర్మితమైనా సరే, జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కానీ దానికి చక్కటి సంగీతాన్ని, కళల్ని, నాట్యాన్ని, సాహిత్యాన్ని జోడిస్తే అప్పుడు లభించే సంతృప్తి కోటానుకోట్ల రెట్లు పెరుగుతుంది. నిజానికి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు చాలా అవసరం. అందుకే ఇవన్నీ మన జీవితంలో ఓ కెటలిస్ట్ లా పనిచేస్తాయని చెబుతారుకదా. ఇవి మన శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మానవుడి మనస్సుని అంతర్గతంగా వికసింపజేసేందుకు, మన మనోయాత్రకు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చక్కటి సంగీతం, ఇంకా వివిధ రకాలైన కళలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. వాటికి ఉన్న శక్తి ఎలాంటిదంటే అవి కాలానికి, ప్రాంతానికి, మత తత్వానికీ కట్టుబడేవికావు, అమృత మహోత్సవంలోకూడా మన కళలు, సంస్కృతి, గీతాలు, సంగీతానికి సంబంధించిన రంగుల్ని నింపడం చాలా అవసరం.
నాక్కూడా అనేకమందినుంచి అమృత మహోత్సవానికి, అలాగే సంగీత సాహిత్యాలకు ఉన్న శక్తికి సంబంధించిన అనేక సూచనలు అందుతున్నాయి. ఆ సూచనలు నాకు అత్యంత విలువైనవి. నేను వాటిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అధ్యయనంకోసం పంపించాను. సంతోషకరమైన విషయం ఏంటంటే సాంస్కృతిక మంత్రిత్వ శాక వాటిని అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన పనికూడా మొదలయ్యింది. అలాంటి ఓ చక్కటి ఆలోచనే దేశ భక్తి గీతాల పోటీ. స్వాతంత్ర్య సంగ్రామంలో వేర్వేరు భాషలు, యాసల్లో దేశ భక్తి గీతాలు, భజనలు దేశాన్ని ఒక్కతాటిమీద నడిపించాయి. ఇప్పుడు అమృతకాలంలో మన యువత అలాంటి దేశ భక్తి గీతాల్ని రాసి, ఈ కార్యక్రమానికి మరింతగా శోభను పెంచొచ్చు. ఆ దేశ భక్తి గీతాలు మాతృభాషలో కూడా ఉండొచ్చు లేదా జాతీయ భాషలోనూ ఉండొచ్చు అలాగే ఇంగ్లిష్ భాషలో కూడా రాయొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రచనలు నవ భారతానికి సంబంధించిన కొత్త ఆలోచనలతో కూడినవయ్యుండాలి. వర్తమానానికి సంబంధించి ప్రేరణను స్వీకరించి దేశ భవిష్యత్తుని సమున్నతమైన పథంలో నడిపించగలిగేవి అయ్యుండాలి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఈ పోటీల్ని నిర్వహించాలి.
మిత్రులారా, మనసులో మాట శ్రోత ఒకరు ఏం సలహా ఇచ్చారంటే అమృత మహాత్సవంలో ముగ్గుల పోటీలుకూడా పెట్టాలన్నారు. మన దేశంలో పండుగ రోజుల్లో రంగు రంగుల ముగ్గులెయ్యడం శతాబ్దాలుగా ఆనవాయితీ. రంగుల ముగ్గుల్లో దేశం వైవిధ్యంగా కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వివధ పేర్లతో, వివిధ రకాలైన థీమ్ లతో రంగుల ముగ్గులు వేస్తారు. అందుకే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి కూడా ఓ క్యాంపెయిన్ నిర్వహించబోతోంది. మీరే ఆలోచించండి, స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన ముగ్గులు వేస్తే, జనం వాళ్లవాళ్ల ఇళ్లముందు, గోడల మీద స్వాతంత్ర్యోద్యమ కారుల బొమ్మల్ని చిత్రీకరిస్తే, స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన ఏ సంఘటననైనా రంగులతో చిత్రీకరిస్తే, అమృత మహోత్సవం శోభ ఎన్నో రెట్లు పెరుగుతుంది.
మిత్రులారా మనకి లాలి పాటలు పాడే ఇంకో కళకూడా ఉంది. మన దేశంలో లాలి పాటల ద్వారా చిన్న పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతారు. వాటిద్వారా మన సంస్కృతిని వాళ్లకి పరిచయం చేస్తారు. లాలిపాటలకు కూడా ఓ వైవిధ్యం ఉంది. మరప్పుడు మనం అమృత కాలంలో ఈ కళనుకూడా తిరిగి బతికించుకోకూడదు, దేశ భక్తికి సంబంధించిన లాలి పాటల్ని ఎందుకు రాయకూడదు, కవితలు, గీతాలు ఏదో ఒకటి రాయగలిగితే, చాలా తేలికగా ప్రతి ఇంట్లోనూ తల్లులు తమ చిన్నారి బాలలకు వాటిని వినిపించొచ్చుకదా. ఆ లాలిపాటల్లో ఆధునిక భారతం కనిపించాలి. 21వ శతాబ్దపు భారతీయ కలలు వాటిలో ప్రతిఫలించాలి. మీరు చేసిన ఈ సూచనల ఆధారంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాటికి సంబంధించిన పోటీల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మిత్రులారా, ఈ మూడు పోటీలూ అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున ప్రారంభం కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దానికి సంబంధించిన వివరాల్ని మీకు అందజేస్తుంది. ఆ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలోకూడా అందజేస్తారు. మీరందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మన యువతరం తప్పనిసరిగా తమలోని కళను, తమ ప్రతిభను ప్రదర్శించాలి. దానివల్ల మీ ప్రాంతానికి సంబంధించిన కళ, సంస్కృతి దేశంలో మూల మూలలకూ విస్తరిస్తాయి. మీ కథల్ని దేశం మొత్తం వింటుంది.
ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం అమృతోత్సవ సమయంలో వీరులైన, అమరులైన భరతమాత ముద్దు బిడ్డల్ని గుర్తు చేసుకుంటున్నాం. వచ్చే నెల నవంబర్ 15వ తేదీన అలాంటి మహా పురుషులు, వీర యోధులైన, భగవాన్ బిరసా ముండ్ గారి జయంతి రాబోతోంది. భగవాన్ బిరసా ముండ్ ను భరత మాతకు తండ్రిగా కీర్తిస్తారు. అంటే ఆయన ఈ భూమికే తండ్రి అని అర్థం. భగవాన్ బిరసా ముండ్ తమ నేలను, అడవుల్ని, భూమిని రక్షించుకోవడంకోసం తీవ్రమైన పోరాటం చేశారు. భూమికి తండ్రియైనవారే అంతటి పోరాటం చెయ్యగలరు. ఆయన మనకు మన సంస్కృతిని, దాని మూలాల్నీ చూసి గర్వించడం నేర్పించారు. విదేశీ పాలకులు ఆయన్ని ఎంతగా బెదిరించినా సరే, ఎంతగా ఒత్తిడి చేసినా సరే, ఆయన మాత్రం ఆదివాసీల సంస్కృతిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలంటే, కచ్చితంగా దానికి భగవాన్ బిరసా ముండ్ మనకు ప్రేరణగా నిలుస్తారు. ఆయన, పర్యావరణానికి హాని కలిగించే విదేశీ పాలనకు సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా సరే తీవ్రంగా వ్యతిరేకించారు. బీదసాదల్ని, కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అనేక రకాలైన సామాజిక దురాచారాల్ని నిర్మూలించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఉల్ గులాన్ ఉద్యమాన్ని ఆయన తప్ప ఇంకెవరు ముందుకు నడిపించగలిగుండేవారు. ఆ ఉద్యమం ఆంగ్లేయులకు మనశ్శాంతి లేకుండా చేసింది. దాని తర్వాతే ఆంగ్లేయులు భగవాన్ బిరసా ముండ్ ని పట్టించిన వారికి చాలా పెద్ద నగదు బహుమతిని ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైల్లోపెట్టింది. ఆయన్ని ఎంతగా వేధించారంటే పాతికేళ్లకంటే తక్కువ వయసులోనే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మనల్ని కేవలం భౌతికంగా మాత్రమే విడిచి వెళ్లిపోయారు. జనం మనసుల్లో మాత్రం ఆయన శాశ్వతమైన, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జనానికి ఆయన జీవితం ఓ ప్రేరణాత్మక శక్తిగా మిగిలిపోయింది. ఇవ్వాళ్టికీ ఆయన జీవిత గాథకు సంబంధించిన జానపద గీతాలు, కథలు మధ్య భారతంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ధరిత్రికే తండ్రి అయిన భగవాన్ బిరసా ముండ్ కి నేను నమస్కరిస్తున్నాను. ఆయన గురించి విస్తృత స్థాయిలో తెలుసుకోవాలని నేను యువతరానికి సూచిస్తున్నాను. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన ఆదివాసీ జాతుల పోరాట పటిమను గురించి మీరు ఎంతగా తెలుసుకుంటే అంతగా మీకు గౌరవప్రదమైన అనుభూతులు కలుగుతాయి.
ప్రియమైన సహచరులారా, ఇవ్వాళ్ల అక్టోబర్ 24వ తేదీ UN Day అంటే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజునే ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితిని స్థాపించిన రోజునుంచీ భారత్ కి దానిలో అనుబంధం ఉంది. భారత దేశం 1945లో స్వాతంత్ర్యం సాధించడానికి పూర్వమే ఐక్యరాజ్య సమితి చార్టర్ లో సంతకం చేసిందన్న విషయం మీకు తెలుసా. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రభావనాన్ని ఇంకా దాని శక్తిని పెంచడానికి భారతీయ నారీశక్తి చాలా ముఖ్యమైన భూమికను నిర్వహించింది. 1947-48లో UN Human Rights Universal Declarationని రూపొందించేటప్పుడు అందులో “All Men are Created Equal” అని రాశారు. కానీ భారతీ దేశానికి చెందిన ఓ Delegate దానికి అభ్యంతరం తెలిపారు. తర్వాత Universal Declarationలో - “All Human Beings are Created Equal” అని రాశారు. Gender Equality అనే ఈ అంశం భారత దేశంలో శతాబ్దాల క్రితమే అమల్లో ఉంది. శ్రీమతి హంసా మెహతా ఆ Delegate అన్న విషయం మీకు తెలుసా. ఆవిడవల్లే ఆ మార్పు జరిగింది. అప్పుడే మరో Delegate శ్రీమతి లక్ష్మీ మీనన్ Gender Equalityఅంశంపై బలంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అది మాత్రమే కాక, 1953లో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, UN General Assemblyకి తొలి మహిళా President అయ్యారు.
మిత్రులారా, మనం ఎలాంటి పవిత్రమైన నేలకు చెందినవాళ్లమంటే, దేన్ని విశ్వసిస్తామంటే, ఏమని ప్రార్థన చేస్తామంటే :
ఓం ద్యోశాన్తిరన్తరిక్ష శాన్తిః,
పృధ్వీ శాన్తిరాపః శాంతిరోషధయః శాన్తిః ।
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః శాన్తిర్బ్రహ్మమ్ శాన్తిః,
సర్వే శాన్తిః, శాన్తిరేవ శాన్తిః, సామా శాన్తిరేధి
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।।
భారత దేశం ఎప్పుడూ విశ్వశాంతికోసం పాటుపడింది. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం 1950వ దశాబ్దంలో నిరంతరాయంగా ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ లో భాగంగా ఉంది. దారిద్ర్య నిర్మూలన, Climate Change ఇంకా శ్రామికులకు సంబంధించి సమస్యలు విషయంలో సమాధానాలకు సంబంధించి భారతదేశం అగ్రపథంలో