Stalwarts Say

శ్రీ మ‌ద‌న్ ఆర్ క్రిష్ణ‌న్‌, విపి & ఎండి-ఇండియా, మెడ్ ట్రానిక్ (2018 వ సంవ‌త్స‌రం, న‌వంబ‌ర్ నెల 19 వ తేదీన చేసిన వ్యాఖ్యలు)
శ్రీ మ‌ద‌న్ ఆర్ క్రిష్ణ‌న్‌, విపి & ఎండి-ఇండియా, మెడ్ ట్రానిక్ (2018 వ సంవ‌త్స‌రం, న‌వంబ‌ర్ నెల 19 వ తేదీన చేసిన వ్యాఖ్యలు)
November 22, 2018

‘‘ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క క్రియాశీలత్వం, ఆయ‌న ప్ర‌భుత్వం యొక్క హుషారుత‌నం మరియు చేయ‌గ‌లుగుతామనే ధోర‌ణి ప్రేర‌ణ‌ ను అందించేవే.  ఆయ‌న నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సాధించ లేన‌టువంటిదిగా తోచిన ల‌క్ష్యాన్ని పెట్టుకొన్నారు.  మ‌రి ప్ర‌స్తుతం వారు దానిని సాధించ గ‌లిగేటంత స‌మీపం లోకి వ‌చ్చేశారు.  జిఎస్‌టి, ఇంకా ఇన్‌సాల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సి కోడ్ ల వంటి ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన కొన్ని ప‌రివ‌ర్త‌న పూర్వ‌క సంస్క‌ర‌ణ‌ లు ర్యాంకుల‌ ను పూర్తిగా ప్ర‌భావితం చేయ‌వ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ కూడా ఈ సంస్క‌ర‌ణ‌ల లో ఒక ప‌య‌న‌ గ‌తి ఏర్ప‌డ‌డాన్ని నేను గ‌మ‌నించ‌ గ‌లుగుతున్నాను.   ప్ర‌ధాన మంత్రి అందిస్తున్న స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, తీసుకొంటున్న స‌రైన చ‌ర్య‌ల తో మ‌నం కేవ‌లం చిన్న చిన్న అడుగులు కాకుండా అదే విధ‌మైన ప‌య‌న‌ గ‌తి ని మనం గ‌మ‌నించవచ్చని నేను అమిత‌ ఆశా భావం తో ఉన్నాను. ’’

Share
లూలు గ్రూప్ ఇంటర్ నేశనల్ చైర్ మన్ శ్రీ యూస‌ఫ్ అలీ  (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
లూలు గ్రూప్ ఇంటర్ నేశనల్ చైర్ మన్ శ్రీ యూస‌ఫ్ అలీ (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
November 22, 2018

‘‘ ప్ర‌స్తుత కాలం లో అన్ని దేశాలు భార‌త‌దేశం లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి  చూస్తున్నాయి. దీనికి ఒక బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఒక బ‌ల‌మైన నాయ‌క‌త్వం సృష్టించిన‌టువంటి ప‌ర్యావ‌ర‌ణం, ఇంకా ఉదార‌వాద విధానం.. ఇవే కార‌ణాలు.  యావ‌త్తు ప్ర‌పంచం ప్ర‌స్తుతం భార‌త‌దేశం పై దృష్టి ని సారిస్తోంది.  భార‌త‌దేశం త్వ‌ర‌లోనే ప్ర‌పంచం లో అతి పెద్ద ఆర్థిక శ‌క్తుల‌ లో ఒక‌టి కాగలుగుతుంది.  ఇదివ‌ర‌కు మ‌న విశిష్ట దేశం లో పెట్టుబ‌డి పెట్టాలంటే దాదాపు 25-30 మిలియ‌న్  ప్ర‌వాసీ భార‌తీయులకు అనేకమైనటువంటి ఆంక్ష‌లు ఉండేవి.  కానీ ఇప్పుడు ఎంతో ఉదార‌మైన విధానం వ‌చ్చింది. మ‌రి ఎన్ఆర్ఐ పెట్టుబ‌డి ని దేశీయ పెట్టుబ‌డి గా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతోంది; ఎఫ్‌డిఐ మెరుగైంది.  ప్ర‌స్తుతం విదేశీ పెట్టుబ‌డి తో జాయింటు వెంచ‌ర్ లను ఏర్పాటు చేయ‌వ‌చ్చు.  ఎన్ఆర్ఐ పెట్టుబ‌డులు భార‌త‌దేశం లోకి వ‌స్తున్నాయి. ఇది మ‌న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ర్యాంకింగ్ ల‌లో వృద్ధి కి ఒక ముఖ్య‌ ప‌రిణామం. ’’

Share
శ్రీ తనిత్ చియారవనోంత్, ఎండి- ఇండియా, సిపి గ్రూపు (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు)
శ్రీ తనిత్ చియారవనోంత్, ఎండి- ఇండియా, సిపి గ్రూపు (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు)
November 22, 2018

‘‘ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’  విష‌యానికి వ‌స్తే భార‌త‌దేశం గొప్ప‌గా మెరుగు ప‌డ‌డాన్ని చూసి మాకు బోలెడంత న‌మ్మ‌కం క‌లిగింది.  భార‌త‌దేశం కచ్చితంగా స‌రైన దిశ లో ప‌య‌నిస్తోంది.’’

Share
శ్రీ సంజ‌య్ అగ‌ర్వాల్‌, ఎండి, Fortum India (2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు)
శ్రీ సంజ‌య్ అగ‌ర్వాల్‌, ఎండి, Fortum India (2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు)
November 22, 2018

“ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ర్యాంకింగ్ లు మా వంటి వెలుప‌లి కంపెనీల కు మ‌రియు భార‌త‌దేశం లో మిలియ‌న్ ల కొద్దీ యూరో ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డానికి సుముఖం గా ఉన్న‌వారికి న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నాయి అని నేను భావిస్తున్నాను.’’

Share
శ్రీ హ‌ర్ష్ న్యోతియా, అంబుజ న్యోతియా గ్రూపు చైర్ మన్ 2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీన చేసిన వ్యాఖ్య లు
శ్రీ హ‌ర్ష్ న్యోతియా, అంబుజ న్యోతియా గ్రూపు చైర్ మన్ 2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీన చేసిన వ్యాఖ్య లు
November 22, 2018

గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో ఒక ఘటనాభరిత ప్ర‌యాణాన్ని సాగించాం.  మ‌న‌ం త‌క్కువ వ్య‌వ‌ధి లో 142వ స్థానం నుండి 77వ స్థానానికి చేరుకొన్నాం.  వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యానికి సంబంధించి అనేక చ‌ర్య‌లను తీసుకోవ‌డ‌ం జరిగింది.  మ‌రీ ముఖ్యంగా, కంపెనీల‌ను ఏర్పాటు చేయ‌గ‌ల‌గ‌డం లో మ‌రియు వివిధ అనుమ‌తులు పొంద‌డం లో వేగాన్ని అందుకోవ‌డ‌మైంది.  బోలెడంత పురోగ‌తిని సాధించాం.’’

Share
బిజినెస్ టెలివిజ‌న్ ఇండియా సంపాద‌కుడు శ్రీ సిద్ధార్థ్ జరాబి (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీన చేసిన వ్యాఖ్యలు)
బిజినెస్ టెలివిజ‌న్ ఇండియా సంపాద‌కుడు శ్రీ సిద్ధార్థ్ జరాబి (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీన చేసిన వ్యాఖ్యలు)
November 22, 2018

‘‘ ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యానికిసంబంధించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లో ఇదివ‌ర‌కు ఎరుగ‌నంత శ్ర‌ద్ధ‌ ను నేను గ‌మ‌నించాను. ఈ స్థాయి లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ర్యాంకింగ్ ల‌ను మెరుగు ప‌ర‌చ‌డం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించిన మ‌రొక ప్ర‌ధాని అంటూ ఎవ‌రైనా ఉన్నార‌ని నేను అనుకోను.  ఆయ‌న తాను అనుకొన్నది స్ప‌ష్టం గా చెబుతారు. అంతేగాక‌, దానిని ఎవ‌రి ప‌ట్లా ఎటువంటి ప‌క్ష‌పాతం అనేది లేకుండా ఒక పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో చేసివేస్తారు.  నేను దీనిని గుజ‌రాత్ లో గ‌మ‌నించాను. మ‌రి ఢిల్లీ లో కూడాను ప్ర‌తి ఒక్క‌రికీ అన్ని విధానాలు స‌మాన‌మే అనే సంగ‌తి ని నేను పూర్తి విశ్వాసం తో చెప్తున్నాను. ’’

Share
సిఐఐ ప్రెసిడెంటు శ్రీ రాకేశ్ భార‌తీ మిత్త‌ల్  (2018 వ సంవత్సరం నవంబర్ 19వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
సిఐఐ ప్రెసిడెంటు శ్రీ రాకేశ్ భార‌తీ మిత్త‌ల్ (2018 వ సంవత్సరం నవంబర్ 19వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
November 22, 2018

‘‘ గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో వ్యాపారానికి సంబంధించిన ప్ర‌తి అంశాన్ని ఒక ఉద్య‌మం త‌ర‌హా లో చేప‌ట్టినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ని నేను అభినందించదల‌చాను.  ఇది గొప్ప ఫ‌లితాల‌ను అందించింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ త‌న ప‌ట్ల సంశ‌యాల‌ను వెలిబుచ్చిన‌ వారి మాటలు త‌ప్ప‌ు అని నిరూపించారు. ఆయ‌న మొద‌ట్లో సాధించ‌డానికి క‌ష్టంగా తోచినప్పటికీ ఆ త‌రువాత అందుకోలేనివి కాన‌టువంటి ల‌క్ష్యాల‌ను త‌న జ‌ట్టు కు ఇచ్చే ఒక కార్పొరేట్ ప్ర‌ముఖుని లాగా ప‌ని చేస్తారు.  ఈ ప‌ద్ధ‌తి లో సిద్ధించే ఫలితం ఎలా ఉంటుంది అంటే అది ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌ష్టి గా ప‌ని చేసి, మార్గం లో ఎదుర‌య్యే అవ‌రోధాల‌ను తొల‌గించేట‌ట్లు చేస్తుంది.  ఉదాహ‌ర‌ణ‌కు మన‌ం జిఎస్‌టి అమ‌లు లో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు ప‌రిశ్ర‌మ యొక్క ఇబ్బందుల‌ను ఆర్థిక మండ‌లి మ‌రియు ప్ర‌భుత్వం వెనువెంట‌నే తీర్చి వేశాయి; ఈ సంస్క‌ర‌ణల కార‌ణం గా భార‌త‌దేశ ప‌రిశ్ర‌మ రంగం సంతోషించ‌డ‌మే కాకుండా ఈ మౌలిక మార్పుల‌ను ప్ర‌పంచ ప‌రిశ్ర‌మ సహితం గ‌మ‌నిస్తోంది.  అంతేకాదు, భార‌త‌దేశ విప‌ణి ఇవ్వ‌జూపే అవ‌కాశాల‌ను వినియోగించుకొని ప్రపంచ పరిశ్రమ పెట్టుబడి ని కూడా పెడుతుంది. ’’

Share
శ్రీ మాల్క‌మ్ రిగ్ లే, కంట్రీ మేనేజ‌ర్ (ఇండియా), ఇఎన్‌జిఐఇ, (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19 వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
శ్రీ మాల్క‌మ్ రిగ్ లే, కంట్రీ మేనేజ‌ర్ (ఇండియా), ఇఎన్‌జిఐఇ, (2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19 వ తేదీ నాడు చేసిన వ్యాఖ్యలు)
November 22, 2018

“ ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యంతాలూకు మ‌న స్థానాలు ప్ర‌స్తుతం దాదాపు 77 శాతం ఎగ‌బాకాయి. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క పార‌ద‌ర్శ‌క‌త్వం ఇంకా ద‌క్ష‌త క‌లిగిన నిర్వ‌హ‌ణ విధానాల కార‌ణంగా భార‌త‌దేశం లోకి రావ‌డం ప్ర‌స్తుతం సుల‌భ‌త‌రం అయింది.  ప‌ని లో జాప్యానికి తావు లేదు. పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒకే ఒక మంచి దేశం గా భార‌త‌దేశం ఉంది. అది సుప‌రిపాల‌న తో సాగుతోంది. ఆ దేశానికి శుభం జరగాలని ఆకాంక్ష‌ిస్తున్నాను. ’’

Share
డాక్ట‌ర్ బి.ఆర్‌. శెట్టి , ఎన్ఎమ్‌సి హెల్త్ కేర్ చైర్‌మ‌న్‌ (2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి)
డాక్ట‌ర్ బి.ఆర్‌. శెట్టి , ఎన్ఎమ్‌సి హెల్త్ కేర్ చైర్‌మ‌న్‌ (2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి)
November 19, 2018

ప్ర‌స్తుతం వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యంసంబంధిత స్థానాల లో మ‌నం దాదాపు 77 శాతం పురోగ‌మించాం.  ఇప్పుడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క పార‌ద‌ర్శ‌క‌త్వం మ‌రియు ద‌క్ష‌త క‌లిగిన నిర్వ‌హ‌ణ ల కార‌ణంగా భార‌త‌దేశానికి త‌ర‌లిరావ‌డం సులువు గా మారిపోయింది.  ప‌ని లో జాప్యానికి తావు లేదు. పెట్టుబ‌డి పెట్ట‌డానికి భార‌త‌దేశం ఒకే ఒక మంచి దేశం గా ఉంది. ఈ దేశం లో సుప‌రిపాల‌న సాగుతోంది. ఈ దేశాని కి అంతా మంచే జ‌ర‌గాల‌ని నేను అభిల‌షిస్తున్నాను. ’’

Share
శ్రీ సుప్రియ ధండా , వెస్టర్న్ డిజిట‌ల్ విపి మ‌రియు కంట్రీ మేనేజ‌ర్‌ 2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
శ్రీ సుప్రియ ధండా , వెస్టర్న్ డిజిట‌ల్ విపి మ‌రియు కంట్రీ మేనేజ‌ర్‌ 2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
November 19, 2018

కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం 142 వ స్థానం నుండి 77వ స్థానానికి ఎగ‌బాక‌డాన్ని చూడ‌డం అమిత ఉత్తేజ‌క‌రం గా ఉంది.  నేను అనుకొంటున్నాను ఇది కేవ‌లం ఆరంభ‌మే అని. భార‌త‌దేశం అగ్ర‌గామి 25 స్థానాల లోకి చేరడాన్ని నేను ఇష్ట‌ప‌డుతాను.  అనేక దేశాలు పెట్టుబ‌డి పెట్టాల‌ని చూసేట‌టువంటి ఒక పాశ్చాత్య డిజిట‌ల్ కార్పొరేట్ నుండి ఈ ఖ్యాతి ద‌క్క‌డ‌మ‌నేది చాలా ఆస‌క్తిదాయ‌కం గా ఉంది.  ఇది భార‌త‌దేశాన్ని ఒక విప‌ణి గా, పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒక గ‌మ్య స్థానం గా మార్చి వేసింది.  మ‌నకు ఒక ఆక‌ర్ష‌క ప్ర‌ధాన మంత్రి ఉన్నారు. శ్రీ మోదీ ప్ర‌పంచం లో ఉత్త‌మ‌మైన నేత‌ల‌లో ఒక‌రుగా ఉన్నారు.

Share
Paytm వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ 2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
Paytm వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ 2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
November 19, 2018

నేను చాలా ఉత్సాహం తో ఉన్నాను.  గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌ లో నా అభిప్రాయం లో నేను మీకు న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లిగేది ఏమిటంటే మీరు ఒక చిన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ అయినా స‌రే మీ వెన్నంటి ఈ దేశం నిలుస్తోంది అని.

Share
కొటక్ మహీంద్ర బ్యాంకు చైర్ మన్ శ్రీ ఉద‌య్ కొట‌క్ 2018వ సంవ‌త్స‌రం, న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
కొటక్ మహీంద్ర బ్యాంకు చైర్ మన్ శ్రీ ఉద‌య్ కొట‌క్ 2018వ సంవ‌త్స‌రం, న‌వంబ‌ర్ నెల 19వ తేదీ నాడు అన్న మాటలు ఇవి
November 19, 2018

వ్యాపారప‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని మెరుగు ప‌ర‌చడం మరియు దానిని వ్యాపారానికి సుల‌భ‌ త‌రంగా మార్చే శ్ర‌ద్ధ స్వ‌యం గా ప్ర‌ధాన మంత్రి స్థాయి లో వ్య‌క్తం అయినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను.  ఇది యావ‌త్తు ప్ర‌భుత్వం లోనూ ప్ర‌తిఫ‌లిస్తోంది. భార‌త‌దేశం ఆర్థికం గా స‌మృద్ధం కావాలంటే దేశం లో వ్యాపారం చేయ‌డాన్ని స‌ర‌ళ‌త‌రంగా మార్చ‌డం ప‌ట్ల అదే ప‌ని గా శ్ర‌ద్ధ ను వ‌హించ‌డమే స‌రి అయిన ప‌ద్ధ‌తి అని నేను త‌లుస్తాను.

Share