భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో 'క్విట్ ఇండియా ఉద్యమం' ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఉద్యమం బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి యావత్ దేశాన్ని సిద్ధంచేసింది. ఆ సమయంలోనే భారతదేశంలోని ప్రతి మూలలోని ప్రతి ఒక్కరు చేతులు కలిపి 'క్విట్ ఇండియా ఉద్యమం’లో' భాగమైయ్యారు.
- జులై 30, 2017 న 'మన్ కి బాత్'లో నరేంద్ర మోదీ
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన 5 సంవత్సరాలలో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పటినుండి 5 సంవత్సరాలలో, భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకోనుంది. నేడు మనం అవినీతి, చెత్త, కులతత్వం మరియు మతోన్మాదాలను మన దేశం నుండి పారద్రోలడానికి మనము ప్రతిజ్ఞ చేద్దాం. మన గతంతో అనుసంధానమైనప్పుడు మాత్రమే మనము అద్భుతమైన భవిష్యత్తును లిఖించగలము.
వారి చరిత్రతో సంబంధం తెగిపోయిన సమాజాలు నూతన పురోగతిని అధిగమించవని ప్రధాని మోదీ చెప్పినట్లు. ఈ సంవత్సరం, మన దేశం క్విట్ ఇండియా ఉద్యమం యొక్క 75 సంవత్సరాల గుర్తుగా, ఈ క్విజ్ మనము స్వేఛ్చగా శ్వాస పీల్చుకునే అవకాసం కల్పించిన 1942 నాటి నాయకుల చరిత్రలను జ్ఞాపకంచేస్తుంది.
ఈ క్విజ్లో పాల్గొనండి, మీ చరిత్ర జ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకోండి మరియు భవిష్యత్ గురించి ఆలోచించండి. మరియు ఆకర్షణీయమైన బహుమతులను కూడా గెలుచుకోండి! రోజులో మొదటి పదిమంది విజేతలకు ప్రత్యేక సర్టిఫికేట్ అందించబడుతుంది మరియు అగ్ర స్కోర్ల నుండి ఇరవై విజేతలకు ప్రధానితో సంభాషించే అవకాసం వస్తుంది.
క్విజ్ ఆగస్టు 8, 2017 న ప్రారంభమవుతుంది.


