The human face of 'Khaki' uniform has been engraved in the public memory due to the good work done by police especially during this COVID-19 pandemic: PM
Women officers can be more helpful in making the youth understand the outcome of joining the terror groups and stop them from doing so: PM
Never lose the respect for the 'Khaki' uniform: PM Modi to IPS Probationers

నమస్కారం.

మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,

సాధారణంగా, ఈ అకాడమి నుంచి ఉత్తీర్ణులైన స్నేహితులందరితో దిల్లీ లో నేను స్వయంగా భేటీ అయ్యే వాడిని. వారి తో నేను నా నివాసంలో సమావేశమై, నా ఆలోచనల ను వారి తో పంచుకోవడాన్ని నా భాగ్యం గా భావించేవాడిని. కరోనా నేపథ్యం లో, ఈ అవకాశాన్ని నేను కోల్పోతున్నాను. అయితే నా పదవీకాలంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుసుకొంటానని నేను అనుకుంటున్నాను.

స్నేహితులారా,

ఒకటి మాత్రం తథ్యం. మీరు శిక్షణార్థి గా పనిచేస్తున్నంత కాలం, మీరు ఒక రక్షిత వాతావరణం లో పనిచేస్తారు. ఏదైనా తప్పు జరిగిందంటే గనక, దానిని గురించి మీ సహోద్యోగి లేదా మీకు శిక్షణను అందిస్తున్న వారు చూసుకొంటారని మీకు తెలుసు. ఈ అకాడమి నుంచి మీరు బయటకు అడుగుపెట్టిన మరుక్షణం లో, మీరు ఇక రక్షిత వాతావరణం లో ఉండబోరు. మీరు కొత్త వారని గాని, మీకు అనుభవం లేదన్న విషయాన్ని గాని ఒక సాధారణ వ్యక్తి ఆలోచించడు. మీరు సాహిబ్ అని, యూనిఫార్మ్ లో ఉన్నారని, నా పని ఎందుకు చేయడం లేదు? అని అతడు అనుకొంటాడు. మీరు సాహిబ్, మీరు ఇలా ఎలా చేయగలరు? మీ పట్ల ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది.

మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకొంటారు, మీరు ఏ విధం గా పనిచేస్తారు అన్న విషయాలను ప్రతిదీ సూక్ష్మంగా పర్యవేక్షించడం జరుగుతుంది.

మీరు మొదట్లో అతి జాగ్రత్త గా ఉండాలని అనుకొంటారు, మొదట్లో ఏర్పడే అభిప్రాయం చివరి వరకు ఉండడమే మీ ఈ ప్రవర్తన కు కారణం అవుతుంది. మీరు ఫలానా తరహా అధికారి అని ఒకసారి ముద్ర పడిందీ అంటే, అప్పుడు ఆ ఇమేజ్ మీరు ఎక్కడికి బదిలీ అయినా, మీ వెంట వస్తూ ఉంటుంది. ఆ ముద్ర నుంచి బయటకు రావడానికి మీకు ఎక్కువ కాలం పడుతుంది. అందువల్ల, మీరు చాలా శ్రద్ధ తో కృషి చేస్తూ ఉంటారు.

రెండోది, సమాజం లో ఒక లోపం ఉంది. మేము కూడా ఎన్నికైన తరువాత దిల్లీ కి వచ్చినప్పుడు, ఇద్దరు లేదా నలుగురు మనుషులు మమ్మల్ని అంటిపెట్టుకొని మా వెంట ఉంటూ ఉంటారు. వారు ఎవరన్నది మేము ఎరుగం. చాలా త్వరగా వారు వారి సేవలను అందించడం మొదలుపెట్టేస్తారు. ‘సాహిబ్, మీకు కారు కావాలా’, లేక ‘మీకు నీళ్లు కావాలా..’, ‘‘వాటిని మీకోసం నేను తీసుకు వస్తాను; మీరు ఇంకా ఏమీ భుజించలేదని నేను అనుకొంటున్నాను. ఇక్కడి ఆహారం బాగోలేదు, వేరే చోటు నుండి మీకు భోజనం తీసుకురమ్మంటారా’’.. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా సేవలను అందించే వారు ఎవరు అన్నది మాకు తెలియదు. ఆ తరహా వ్యక్తులు మీరు ఎక్కడికి వెళ్లినా సరే, మీకు కూడా ఎదురుపడుతూ ఉంటారు. ఆ ప్రాంతం మీకు కొత్త; మీకు కూడా ఎన్నో అవసరాలు ఉండి ఉంటాయి. అయితే, మీరు ఈ వలయం లో చిక్కుకున్నారంటే, దానిలో నుంచి బయటకు రావడం చాలా కష్టం అయిపోతుంది. మొదట్లో, ఆ ప్రాంతం కొత్త కాబట్టి మీకు సమస్యలు ఎదురవుతాయి; కానీ, పరిస్థితులను స్వయం గా మీ కళ్లతో, మీ చెవులతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు, తొలి రోజుల్లో మీరు మీ చెవుల్లోకి వచ్చి పడే మాటలను వడపోసుకొంటూ ఉండండి.

నాయకత్వం వహించడం లో సఫలం అవ్వాలని మీరు నిజంగా కోరుకొంటే, మీ చెవులకు వినపడే మాటలను అన్నింటినీ నమ్మేయకండి. మీరు మీ చెవులు మూసిపెట్టుకోవాలి అని నేను అనడం లేదు. మీ చెవులకు వినపడే విషయాల్లో ఏది తప్పు, లేక ఏది ఒప్పు అనేది వడపోత పోసుకోండి అని నేను చెప్తున్నాను. మీ ఉద్యోగ జీవనం, మీ కర్తవ్యం, లేదా ఒక వ్యక్తి గా మీకు అందిన విషయాల్లో నిజానిజాలను వడపోత పద్ధతిలో మీరు అందుకోవడం అనేది చాలా అవసరం. దీని వల్ల మీరు లాభపడతారు. ఎవరైనా ఒక పోస్టింగుకు వెళ్లినప్పుడు, ప్రజలు ఆయనను ఒక చెత్తబుట్ట అని భావిస్తారు. మరీ శక్తివంతుడైన వ్యక్తి ని, మరింత పెద్ద చెత్తబుట్ట గా ముద్ర వేసేయడం జరుగుతుంది. అందులోకి ప్రజలు చెత్తనంతా తెచ్చి పారబోస్తూ ఉంటారు. మనం కూడా ఆ చెత్త ను భాగ్యం అని భావించుకొంటూ ఉంటాం. మనం అంతరాత్మ ను శుభ్రంగా ఉంచుకొంటే, అది మనకే ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

ఇంకొక విషయం ఉంది.. మనం మన పోలీస్ స్టేషన్ల సంస్కృతిని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన పోలీస్ ఠాణా అనేది ఒక సామాజిక విశ్వసనీయత కు కేంద్రం గా ఎలా మారుతుంది? ప్రస్తుతం, మనం పోలీస్ స్టేషన్ల కు వెళ్తే, అవి పరిశుభ్రంగా ఉన్నాయి. అది మంచి విషయం. కొన్ని ప్రాంతాలలో కొన్ని పోలీస్ స్టేషన్లు చాలా పాతబడిపోయాయి, అవి శిథిలమైన స్థితి లో ఉన్నాయి. ఈ సంగతి నాకు తెలుసు, కానీ వాటిని శుభ్రంగా ఉంచడం కష్టమేమీ కాదు.

‘నేను ఎక్కడికి వెళ్లినా, నా అధీనంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నింటిలో.. అవి 50 కావచ్చు, 100 కావచ్చు లేదా 200 పోలీస్ స్టేషన్లు కావచ్చు.. వాటి నిర్వహణ సరిగ్గా జరిగేటట్లు చూడాలి, నేను 12-15 అంశాలను ఒక కాగితం లో రాసి సిద్ధంగా పెట్టుకుంటాను’ అని మనం నిర్ణయించుకోవాలి. ఒక మనిషి ని మార్చడం కష్టం కావచ్చు, కానీ వ్యవస్థ లో మార్పు ను తీసుకు రావచ్చు. వాతావరణాన్ని మార్చవచ్చు. ఈ విషయం మీ ప్రాధాన్యతల జాబితా లో ఉంటుందా? మరి ఫైళ్ల ను సరైన విధంగా ఉంచాలి, మీ దగ్గరికి వచ్చే వారికి కుర్చీలో కూర్చునే ఏర్పాట్లు చేయడమెలా.. ఇవి చాలా చిన్న విషయాలు. వీటిని మీరు పట్టించుకోవాలి.

కొంత మంది పోలీసులు వారు మొదట్లో డ్యూటీలో చేరినప్పుడు, వారు వారి అధికారాన్ని ప్రదర్శించుకోవాలని, ప్రజలు వారి ని చూసి భయపడేటట్టు చేయాలని భావిస్తారు. ‘నా పేరు వినపడినంత మాత్రానికే సంఘ వ్యతిరేక శక్తులు వణికిపోవాలి’ అని వారు అనుకొంటారు. సింఘమ్ లాంటి సినిమాలను చూస్తూ పెరిగిన వారు ఇలాంటి ఆలోచనలకు మొగ్గు చూపుతారు. ఫలితంగా అనేక ముఖ్యమైన పనులను వదిలిపెట్టేయడం జరుగుతుంది. మీరు ఒక ఉత్తమ జట్టు ను తయారు చేయడానికి, మీ దగ్గర పనిచేసే 100-200-500 మంది లో గుణాత్మకమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనితో, ప్రజల ధోరణి మీకు అనుకూలంగా మారడాన్ని మీరు గమనిస్తారు.

సామాన్య మానవుడి లో భయాన్ని రేకెత్తించాలని మీరు కోరుకుంటారా, లేక వారితో ఆప్యాయంగా మెలగాలని మీరు కోరుకుంటారా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మీరు పలుకుబడి ని సాధించుకోవాలని ప్రయత్నించారంటే, అది కొంత కాలం పాటే జరుగుతుంది. కానీ మీరు ప్రజల తో అనురాగాన్ని కలిగివుండాలనుకొంటే, మీరు పదవీవిరమణ చేసిన తరువాత కూడా మిమ్మల్ని వారు జ్ఞాపకం పెట్టుకొంటారు. మీరు మొదట్లో ఉద్యోగం లో చేరిన ప్రాంతం ప్రజలు 20 ఏళ్ల క్రితం అక్కడికి మీరు వచ్చిన సంగతి ని, అప్పట్లో మీకు స్థానికంగా మాట్లాడే భాష కూడా తెలియకపోయినప్పటికీ మీ ప్రవర్తన తో ప్రజల మనసులను గెలుచుకొన్నారన్న విషయాన్నీ గుర్తుంచుకుంటారు. మీరు సామాన్య మానవుడి మనసు ను గెలుచుకున్నారా అంటే, ప్రతిదీ సర్దుకుంటుంది.

పోలీస్ వ్యవస్థ లో ఒక నమ్మకం అంటూ ఉంది. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ని అయినప్పుడు.. దీపావళి ముగిసిన వెంటనే.. గుజరాత్ లో ఓ కొత్త సంవత్సరం వస్తుంది. ముఖ్యమంత్రులు క్రమం తప్పకుండా పోలీసు సిబ్బంది తో భేటీ అయిన సందర్భాల్లో పోలీసు సిబ్బంది ‘దివాలీ మిలన్’ పేరిట ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నేను కూడా అక్కడకు వెళ్తూ ఉండే వాడిని. మునుపు ముఖ్యమంత్రులు గా పనిచేసిన వారు అక్కడకు వెళ్లి, ఒక వేదిక మీద కూర్చొని, ఏవో కొన్ని మాటలు మాట్లాడి, వారి శుభాకాంక్షలు తెలియజేసి, వెళ్లిపోయే వారు. నేను మొదటిసారి గా అక్కడికి వెళ్లినప్పుడు, ప్రజలందరితోనూ భేటీ అయ్యాను. అప్పడు ఒక పోలీస్ అధికారి నన్ను ఆపివేశాడు. నేను ప్రతి ఒక్కరితో కరచాలనం ఎందుకు చేస్తున్నట్టు అని ఆయన అన్నాడు. ఆ పని చేయకండి అని ఆయన చెప్పాడు. నేను కలుసుకొంటున్న వారిలో కానిస్టేబుళ్లు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఉన్నారు. అక్కడ దాదాపుగా 100-150 మంది దాకా ఉన్నారు. ఎందుకు చేయకూడదు? అని నేను ఆయనను అడిగాను. ప్రతి ఒక్కరితో నేను చేయి ని కలుపుతూ కరచాలనం చేస్తూ పోతే గనక సాయంత్రానికంతా నా చేతులు వాచిపోయి, నాకు వైద్య చికిత్స అవసరమవుతుంది అని ఆయన నాతో చెప్పాడు. అలా ఎందుకని అనుకొంటున్నావు అని ఆయనతో నేను అన్నాను. అయితే పోలీస్ విభాగం లో ఇది ఇలాగే ఉంటుంది, అతడు దుర్భాష ను ప్రయోగిస్తాడు అని ఒక భావన ఉంది.

యూనిఫార్మ్ లో ఉన్న పోలీసు కు సంబంధించిన ఈ ఇమేజి కృత్రిమమైంది. కరోనా సంక్షోభ కాలం లో మనం చూశాము ఇది నిజం కాదు అన్న విషయాన్ని. అతడు కూడా మనిషే. అతడు కూడా మానవాళి సంక్షేమం కోసం తన విధి ని తాను నిర్వర్తిస్తున్నాడు. ఈ ఇమేజ్ ని మన ప్రవర్తన ద్వారా సమాజం లో బలపరచవచ్చు. మనం యావత్తు స్వభావాన్ని మన ప్రవర్తన ద్వారా ఏ రకంగా మార్చగలం?

అదే విధంగా, రాజకీయ నాయకుల మొట్టమొదటి ముఖాముఖి పోలీసులతో ఉంటుందని నేను గమనించాను. యూనిఫార్మ్ లో ఉన్న వారు రాజకీయ నాయకుల ను ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అలాగే, రాజకీయ నాయకుల దృష్టి ని ఆకర్షించాలని యాభై మంది లో అయిదు మంది తరచుగా చప్పట్లు చరుస్తూ ఉండే సంగతి ని మీరు గమనించవచ్చు.

మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థ లో భాగం అనే సంగతి ని మనం మరచిపోకూడదు. ప్రజాస్వామ్యం లో పార్టీ ఏదయినప్పటికీ, ఎన్నికైన ప్రతినిధి పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఎన్నికైన ఒక ప్రతినిధి ని గౌరవించడం అంటే, అది ప్రజాస్వామ్య ప్రక్రియ ను గౌరవించడమే అవుతుంది. రెండింటి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, కానీ వాటిని సంబాళించేందుకు మార్గాలు కూడా ఉన్నాయి. ఆ పద్దతి ని మనం అనుసరించాలి. మీతో నేను నా అనుభవాన్ని పంచుకొంటున్నాను. నేను మొదటిసారి గా ముఖ్యమంత్రి ని అయినప్పుడు, మీకు శిక్షణనిస్తున్న అతుల్ గారు నాకు శిక్షణ ఇచ్చే వారు. నేను ఆయన వద్ద శిక్షణ పొందాను, దీనికి కారణం ఆయన నేను ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు, నా భద్రత కు సంబంధించిన ఇన్-ఛార్జి గా ఉండే వారు.

ఒక రోజు, ఇలా జరిగింది.. ఈ పోలీసు ఏర్పాట్లు, దానికి సంబంధించిన సరంజామా అంతా నాకు అంత సౌకర్యవంతంగా ఉన్నాయని అనిపించదు. వాటిని నేను ఎంతో అడ్డంకి గా పరిగణిస్తాను, అయితే వాటి ని నేను తప్పించుకోలేని పరిస్థితి. ఏమైనప్పటికీ, ఒక్కొక్కసారి, నేను నియమాలను ఉల్లంఘించే వాడిని, కారు లో నుంచి బయటకు వచ్చేసి గుంపు లో ఉన్న ప్రజల తో కరచాలనం చేసే వాడిని. ఒక రోజు, అతుల్ కర్వాల్ నాకు కొంత సమయం ఇవ్వండి అంటూ మనవి చేసి, నా గది లోకి వచ్చారు. ఆయనకు ఈ సంగతి ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలియదు గాని, ఆయన తన అసంతృప్తి ని ప్రకటించారు. అప్పట్లో ఆయన చాలా జూనియర్. నేను 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ను గురించి మాట్లాడుతున్నాను.

ఆయ‌న ముఖ్య‌మంత్రి క‌ళ్ల‌లోకి చూస్తూ త‌న అస‌మ్మ‌తిని తెలిపారు. నేను అలా చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న నాకు చెప్పారు. నా అంత నేనుగా కారులోంచి వెలుప‌లకు రాకూడ‌ద‌ని, జ‌నంలో క‌లిసిపోరాద‌ని చెప్పారు. అప్పుడు ఆయ‌న‌కు నేను చెప్పాను. మీరేమైనా నాజీవితానికి మాస్ట‌రా, ఏం చేయాలో మీరు న‌న్ను ఆదేశిస్తారా అన్నాను. ఆయ‌న ఏమాత్రం జంక‌లేదు. నేను ఆయ‌న ముందే చెబుతున్నాను. ఆయ‌న ఏమాత్రం జంక లేదు. నేను కేవ‌లం ఒక వ్య‌క్తి కాద‌ని, రాష్ట్రానికి చెందిన వాడిన‌ని ఏమాత్రం అర‌మ‌రిక‌లు లేకుండా చెప్పారు. న‌న్ను ర‌క్షించ‌డం ఆయ‌న బాధ్య‌త‌. నిబంధ‌న‌లు పాటించాల్సిందిగా ఆయ‌న న‌న్ను అభ్య‌ర్ధించారు, లేకుంటే నిబంధ‌న‌లు అమ‌ల‌య్యేలా చూస్తాన‌న్నారు.

నేను ఏమీ మాట్లాడ‌లేదు. ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల , ఎన్నికైన ప్రజాప్ర‌తినిధి ప‌ట్ల గ‌ల గౌర‌వం అది. అంతేకాదు, విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా విష‌యాల‌ను గౌర‌వంగా చెప్పే ప‌ద్ధ‌తి. అవి ముఖ్య‌మంత్రిగా నా తొలి సంవ‌త్స‌రాలు. ఆ విష‌యం నాకు ఎందుకు బాగా గుర్తుండి పోయిందంటే, పోలీస్ అధికారిగా ఒక ఎన్నికైన ప్రజాప్ర‌తినిధి ప్రాధాన్య‌త‌ను మ‌న‌సులో ఉంచుకుని, తాను చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌యాన్ని ఏమాత్రం అర‌మ‌రిక‌లు లేకుండా ఆయ‌న చెప్పిన తీరు . ప్ర‌తి పోలీసు జ‌వాన్ ఇలా చేయవ‌చ్చు, ఎవ‌రైనా చేయ‌వ‌చ్చు. మ‌నం దీనిని గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌రో అంశం కూడా …చూడండి, సాంకేతిక ప‌రిజ్ఞానం ఈరోజుల‌లో ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌నున్న‌ట్టు రుజువైంది. ఇంత‌కు ముందు పోలిసింగ్ , కానిస్టేబుల్ స్థాయిలో స‌మాచారం సేక‌రించ‌డం ద్వారా, నిఘా ద్వారా జ‌రిగేది.అది బాగానే ఉంటూ ఉండేది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు, అది క్ర‌మేణా తగ్గుతూ వ‌చ్చింది. మీరు ఎన్న‌టికీ ఈ విష‌యంలో రాజీప‌డ‌కూడ‌దు. ఎందుకంటే, కానిస్టేబుళ్ల స్థాయిలో నిఘా స‌మాచార సేక‌ర‌ణ పోలిసింగ్ కు కీల‌క‌మైన‌ది. మీరు మీ సోర్సుల‌ను ,పోలీసు వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఆస్తుల‌ను అభివృద్ధి చేయాలి. అలాగే పోలీస్ స్టేష‌న్‌లోని సిబ్బంది గురించి ఆలోచించి వారిని ప్రోత్స‌హించాలి. ప్ర‌స్తుతం సాంకేతిక ప‌రిజ్ఞానం సుల‌భంగా అందుబాటులో ఉంటోంది. నేరాల‌ను క‌నిపెట్ట‌డంలో సాంకేతిక ప‌రిజ్ఞానం పెద్ద ఎత్తున స‌హాయ‌ప‌డుతోంది.ఇది సిసిటివి కెమెరాల ద్వారా కావ‌చ్చు లేదా మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా కావ‌చ్చు. ఇది మంచిదే. అయితే , ఈరోజుల్లో ఎంతో మంది పోలీసులు స‌స్పెండ్ అయింది కూడా టెక్నాల‌జీ వ‌ల్లే . కొన్ని సంద‌ర్భాల‌లో వారు అనుచితంగా వ్య‌వ‌హరించ‌వ‌చ్చు. కోపం తెచ్చుకోవ‌చ్చు. త‌మ స‌హ‌జ‌స్వ‌భావాన్ని కోల్పోయి మితిమీరి వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. దీనిని వారికి తెలియ‌కుండానే వేరొక‌రు వీడియో తీయ‌వ‌చ్చు.

ఆ త‌ర్వాత ఆ వీడియో వైర‌ల్ అవుతుంది. ఇక అక్క‌డ నుంచి తీవ్ర‌మైన మీడియా ఒత్తిడి ఏర్ప‌డుతుంది. పోలీసుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు చాలా మంది ముందుకు రావ‌చ్చు. చివ‌ర‌కు వారిని పోలీసు వ్య‌వ‌స్థ కొంత కాలం స‌స్పెండ్ చేయ‌వ‌చ్చు. ఈ మ‌చ్చ వారి కెరీర్‌పై ఉండిపోతుంది.

టెక్నాల‌జీ ఒక ర‌కంగా మేలు, మ‌రో ర‌కంగా అన‌ర్దం కూడా. పోలీసులు చాలావ‌ర‌కు దీని ప్ర‌భావానికి గురౌతున్నారు.మీరు వారికి శిక్ష‌ణ‌నివ్వాలి. నిర్మాణాత్మ‌కంగా, గ‌రిష్ఠంగా సాంకేతిక ప‌రిజ్ఞాన వినియోగం ప్రాధాన్య‌త గురించి తెలియ‌జెప్పాలి. ఈ బ్యాచ్‌లో చాలామంది టెక్నాల‌జీ నేప‌థ్యం నుంచి వ‌చ్చార‌ని గ‌మ‌నించాను. ఈరోజుల్లో స‌మాచారానికి కొదువే లేదు. బిగ్ డాటా, కృత్రిమ మేథ‌, సామాజిక మాధ్య‌మాలు ఇలా ఎన్నో ప‌లు కొత్త ఉప‌క‌ర‌ణాలు ఉన్నాయి. స‌మాచార విశ్లేష‌ణ ద్వారా మంచి ఫ‌లితాలు పొంద‌డానికి వీటిని వాడ‌వ‌చ్చు. మీరు ఒక బృందాన్ని ఏర్పర‌చి , మీతో క‌లిసిప‌నిచేసే వారిని అందులో చేర్చ‌వ‌చ్చు. అంతేకాదు, ప్ర‌తిఒక్క‌రూ సాంకేతిక ప‌రిజ్ఞానంలో నైపుణ్యం క‌లిగిన వారై ఉండాల్సిన అవ‌స‌రం లేదు .

దీనికి నేను ఒక ఉదాహ‌ర‌ణ చెబుతాను. నేను ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు ఒక కానిస్టేబుల్ నా సెక్యూరిటీలొ ఉండే వాడు. అత‌ని హోదా ఏమిటో నాకు స్ప‌ష్టంగా గుర్తు లేదు. అప్పుడు కేంద్రంలో యుపిఏ ప్ర‌భుత్వం ఉంది. ఒక ఈ మెయిల్ లో స‌మ‌స్య వ‌చ్చింది. ఆ స‌మ‌స్య‌ ఎంత‌కూ పరిష్కారం కాలేదు. ఇది ప్ర‌భుత్వానికి ఆందోళ‌న క‌లిగించింది. ఆ వార్త ప‌త్రిక‌ల‌లో కూడా విస్తృతంగా వ‌చ్చింది.

నా బృందంలోని 12 వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ఒక యువ‌కుడు దీనిపై శ్ర‌ద్ధ‌పెట్టాడు. మీకు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌వ‌చ్చు, అత‌ను ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాడు. అప్ప‌ట్లో చిదంబ‌రం జీ కేంద్ర హోంమంత్రిగా ఉన్నార‌ని అనుకుంటాను. ఆయ‌న అత‌నిని పిలిపించి అత‌నికి ఒక స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌తిభ క‌లిగిన వారు కేవ‌లం కొద్దిమంది మాత్ర‌మే ఉంటారు.

మ‌నం అలాంటి వారిని గుర్తించి, వారిని స‌రిగా ఉప‌యోగించుకోవాలి.మీరు అలా చేసిన‌ట్ట‌యితే, మీకు కొత్త ఆయుధం దొరికిన‌ట్టే ,వారు మీకు బ‌లంగా మారుతారు. మీరు వంద‌మంది పోలీసు అధికారుల బృంద‌మైతే, మీరు ఇలాంటి వారిని ఉప‌యొగించుకున్న‌ట్ట‌యితే , స‌మాచారాన్ని విశ్లేషించేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుకున్‌రట్ట‌యితే, ఈ వంద‌మంది వెయ్యిమంది అవుతారు. మీ బ‌లం అంత‌లా ఉంటుంది. అందువ‌ల్ల దీనిపై దృష్టిపెట్టండి.

ఇక రెండ‌వ‌ది, మీరు దీనిని చూసే ఉంటారు. ఇంత‌కు ముందు, ఎప్పుడైనా ప్ర‌కృతి విప‌త్తులు, వ‌ర‌ద‌లు, భూకంపాలు లేదా ఏవైనా పెద్ద పెద్ద ప్ర‌మాదాలు, తుపాన్లు వ‌చ్చిన‌పుడు సైన్యాన్ని ఆ ప్రాంతాల‌కు పంప‌డం చూసే ఉంటాం. సైనిక సిబ్బందిని చూడ‌గానే , వారు త‌మ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తార‌ని , త‌మ‌ను ఇబ్బందుల‌నుంచి గ‌ట్టెక్కిస్తార‌ని ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకోవ‌డం చాలా స‌హ‌జం. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పోలీసు శాఖ‌నుంచి తీసుకున్న వారితో క‌ల‌ ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్‌, ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్ సిబ్బంది

అద్భుత‌మైన ప‌ని చేస్తున్నారు. వీరి కృషిని టివి ఛానళ్లు కూడా గుర్తించాయి. వారు నీళ్ల‌ల్లో, దుమ్ములో ప‌రుగులు తీస్తున్నారు, పెద్ద పెద్ద బండ‌రాళ్ల‌ను ఎత్తుతున్నారు. ఇది పోలీసు విభాగానికి కొత్త ఇమేజ్ తీసుకువ‌చ్చింది.
ఎస్‌.డి.ఆర్‌.ఎఫ్‌, ఎన్‌డిఆర్ఎఫ్‌కు సంబంధించి మీ ప్రాంతంలో వీలైన‌న్ని ఎక్కు వ బృందాల‌ను త‌యారు చేయాల్సిందిగా నేను మిమ్మ‌ల్ని కోరుతున్నాను. వీటిని పోలీసులతో , ప్ర‌జ‌ల‌తో ఏర్పాటు చేయ‌వ‌చ్చు.

ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయ‌గ‌లిగే నైపుణ్యం మీకు ఉంటే, మీరు మ‌రింత ఉప‌యుక్తంగా ఉండ‌గ‌లుగుతారు. అలాంటి అవ‌స‌రాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ‌, ఎన్‌.డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్ వ‌ల్ల దేశంలో పోలీసుల‌కు కొత్త ఇమేజ్ ఏర్ప‌డుతోంది.

వారు సంక్షోభ‌స‌మ‌యంలో వ‌చ్చి ఆదుకున్నార‌ని ప్ర‌జ‌లు గ‌ర్వంతో చెబుతున్నారు.భ‌వ‌నం కూలిపోయింది, అందులో చిక్కుకుపోయిన‌వారిని ర‌క్షించి బ‌య‌ట‌కు తీసుకువచ్చార‌ని చెబుతున్నారు.

ప‌లు అంశాల విష‌యంలో మీరు నాయ‌క‌త్వాన్ని అందించాల‌ని నేను కోరుకుంటున్నాను. శిక్ష‌ణ ప్రాముఖ్య‌త‌ను మీరు గుర్తించి ఉంటారు. శిక్ష‌ణ‌ను మ‌నం ఎప్ప‌డూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు శిక్ష‌ణ‌ను ఒక శిక్ష‌గా భావిస్తుంటారు. ఎవ‌రినైనా శిక్ష‌ణ‌కు వెళ్ల‌మని అంటే, ఇక అత‌ను స‌రిగా ప‌నిచేయ‌ని అధికారి అయి ఉంటాడ‌ని అభిప్రాయ‌ప‌డుతుంటారు. మ‌నం శిక్ష‌ణ‌ను చుల‌క‌న చేశాం. సుప‌రిపాల‌నకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌కు మూల‌కార‌ణం ఇదే. మ‌నం దీనినుంచి బ‌య‌ట‌ప‌డాల్సి ఉంది.

నేను మ‌రోసారి అతుల్ క‌ర్వాల్‌ను అభినందిస్తున్నాను. అతుల్ కూడా టెక్నాల‌జీ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన‌వారే. ఎవ‌రెస్టును అధిరోహించారు. అత్యంత‌ సాహ‌సి. పోలీసు శాఖ‌లో ఏ ప‌ద‌విఅయినా ఆయ‌న‌కు ఏమాత్రం క‌ష్టం కాదు. కొద్దిసంవ‌త్స‌రాల క్రితం, ఆయ‌నే స్వ‌యంగా హైద‌రాబాద్‌లో ప్రొబేష‌న‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. ఈసారి కూడా ఆయ‌న స్వ‌యంగా శిక్ష‌ణ ప‌నిని కోరుకున్నారు. ఇంత‌కంటే ముఖ్య‌మైన‌ది ఏముంటుంది చెప్పండి? దీనికి గుర్తింపు ఉండాల‌ని నేను కోరుకుంటాను.
ఇక , ప్ర‌భుత్వం ఒక కొత్త కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది- అది మిష‌న్ క‌ర్మ‌యోగి. రెండు రోజుల క్రితం కేబినెట్ దీనిని ఆమోదించింది. మిష‌న్ క‌ర్మ‌యోగి రూపంలో శిక్ష‌ణ కార్య‌క‌లాపాల‌కు పెద్ద ఎత్తున ప్రాధాన్య‌త ఇవ్వాలని అనుకుంటున్నాము.
దీనిని చేప‌ట్టి ముందుకు తీసుకువెళ్లాలి. నాకు సంబంధించిన మ‌రో అనుభ‌వాన్నికూడా మీకు చెప్ప‌ద‌ల‌చుకున్నాను. నేను గుజ‌రాత్‌లో 72 గంట‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశాను. ప్ర‌భుత్వ అధికారులు అంద‌ంరికీ ఈ 72గంట‌ల శిక్ష‌ణ త‌ప్ప‌ని స‌రి చేశాం. వారిప్ర‌తిస్పంద‌న ను తీసుకునేవాడిని.

తొలుత‌, శిక్ష‌ణ తీసుకున్న 250 మందితో నేను స‌మావేశ‌మ‌య్యాను. ఆ 72 గంట‌ల శిక్ష‌ణ పై వారి అభిప్రాయం తెలుసుకున్నాను. చాలామంది, ఈ శిక్ష‌ణ‌ను 72 గంట‌ల‌కంటే ఇంకా పెంచాల‌ని, ఇది త‌మ‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంద‌ని చెప్పారు. అప్ప‌డు ఒక పోలీసు పైకి లేచారు. నేను అత‌నిని త‌న అనుభ‌వం చెప్ప‌మ‌న్నాను. ఇంత‌కు ముందు తాను కేవ‌లం ఒక పోలీసున‌ని, 72 గంట‌ల శిక్ష‌ణ త‌న‌ను పోలీసుతోపాటు, మంచి మాన‌వీయ‌త క‌లిగిన‌వాడిగా మార్చింద‌ని చెప్పారు.

శిక్ష‌ణ శ‌క్తి ఇది. మ‌న‌కు నిరంత‌ర శిక్ష‌ణ అవ‌స‌రం. ఈ పెరేడ్ అనంత‌రం, మీరు ఒక్క క్ష‌ణం కూడా అశ్‌‌ద్ధ చేయ‌కుండా నిరంత‌రం ప్రాక్టీసు చేయండి. మీ ఆరోగ్యం గురించి ప‌ట్టించుకోండి, మీ స‌హ‌చ‌రుల ఆరోగ్యం గురించి వాక‌బు చేయండి. వారు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తున్నారా, వారు బ‌రువు నియంత్రించుకుంటున్నారా, రెగ్యుల‌ర్‌గా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారా అన్న‌ది తెలుసుకోండి.

దీని ప్రాధాన్య‌త గురించి నొక్కి చెప్పండి. ఎందుకంటే, శారీర‌క‌దారుఢ్యం అంటే యూనిఫాంలో ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌డం మాత్ర‌మే కాదు, మీప‌నికి త‌గ్గ‌ట్టుగా ఉండాలి.అందువ‌ల్ల ఈ విష‌యంలో మీరు నాయ‌క‌త్వం వ‌హించాలి.ఇది మీ బాధ్య‌త‌. దీనిగురించి మ‌న ప‌విత్ర‌గ్రంథాలు ఇలా అంటున్నాయి.

यत्, यत् आचरति, श्रेष्ठः,

तत्, तत्, एव, इतरः, जनः,

सः, यत्, प्रमाणम्, कुरुते, लोकः,

तत्, अनुवर्तते।।

ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు; ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది అని దీని అర్థం.

మీరు ఆ ఉత్త‌ముల కేట‌గిరీలో ఉన్నార‌ని నేను గ‌ట్టిగా భావిస్తున్నాను. మీకు అవ‌కాశం వ‌చ్చింది. అంతేకాదు అది మీ బాధ్య‌త కూడా. ప్ర‌తి నిబంధ‌న‌ ఎంతో ముఖ్య‌మైన‌ది. అయితే మీరు మీ విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా మాన‌వాళి ఇవాళ‌ ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌నుంచి వారిని ర‌క్షించ‌డంలో , మ‌న దేశ త్రివ‌ర్ణ‌పతాకం ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప‌చేయ‌డంలో , భార‌త‌రాజ్యాంగం ప‌ట్ల అంకిత భావంతో ప‌నిచేయ‌డంలో మీ పాత్ర‌ ఎంతో కీల‌క‌మైన‌ది.

నేను రూల్‌ప్ర‌కారం ప‌నిచేయాలా లేక‌ నా రోల్ ప్ర‌కారం పనిచేయాలా? మ‌నం మ‌న రోల్ కు ప్రాధాన్య‌త‌నిస్తే రూల్స్ వాటంత‌ట అవే పాటింప‌బ‌డ‌తాయి. మ‌నం మ‌న రోల్‌ను స‌క్ర‌మంగా పాటిస్తే, ప్ర‌జ‌ల‌లో మ‌న‌పై న‌మ్మ‌కం కూడా పెరుగుతుంది.

మ‌రోసారి నేను మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఖాఖీ ప్ర‌తిష్ఠ పెంచ‌డంలో మీరు ఏమాత్రం తీసిపోర‌ని నేను విశ్‌ాసిస్తున్నాను. నావైపు నుంచి మీ ప‌ట్ల, మీ కుటుంబాలు,మీగౌర‌వం ప‌ట్ల‌ బాధ్య‌త‌ల‌ను ఏమాత్రం విస్మ‌రించ‌బోన‌ని నేను హామీ ఇస్తున్నాను. ఈ విశ్వాసంతో , ఈ శుభ సందర్భంగా నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

 
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Modi 3.0: First 100 Days Marked by Key Infrastructure Projects, Reforms, and Growth Plans

Media Coverage

Modi 3.0: First 100 Days Marked by Key Infrastructure Projects, Reforms, and Growth Plans
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 సెప్టెంబర్ 2024
September 16, 2024

100 Days of PM Modi 3.0: Delivery of Promises towards Viksit Bharat

Holistic Development across India – from Heritage to Modern Transportation – Decade of PM Modi