2021వ సంవత్సరం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నిర్వహించిన ‘యూనిటీ ఇన్ క్రియేటివిటీ’ పోటీ లో విజేతల తో పాటు ఆ పోటీ లో పాలుపంచుకొన్న వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఈ పోటీ లో దేశ వ్యాప్తం గా 5 లక్షల మంది కి పైగా ఎంతో ఉత్సాహం తో పాల్గొన్నారు. వారి లో నుండి 272 మంది విజేతల ను ఎంపిక చేయడమైంది. విజేతల కు వారు చాటిన సృజనశీలత్వాని కి గాను పురస్కారాల ను సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రదానం చేసింది. ఈ పోటీ యొక్క గ్రాండ్ ఫినాలే ను దిల్లీ లోని నెహ్ రూ పార్క్ లో నిర్వహించడం జరిగింది.
అమృత్ మహోత్సవ్ యొక్క అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,
‘‘అద్భుతమైనటువంటి సృజనశీలత్వం తో నిండిన దేశభక్తి భావన #UnityInCreativity కి ఒక సరికొత్త ఉదాహరణ ను ఆవిష్కరించింది. లక్షల కొద్దీ దేశ ప్రజలు ఈ పోటీ లో పాల్గొనడానికి ఉత్సాహం గా ముందుకు వచ్చారో, అది ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించేటటువంటిది గా ఉంది. విజేతల తో పాటు ఈ పోటీ లో పాలుపంచుకొన్న వారందరికీ అనేకానేక శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
अद्भुत रचनात्मकता से भरी देशभक्ति की इस भावना ने #UnityInCreativity की एक नई मिसाल पेश की है। जिस प्रकार लाखों देशवासियों ने इसमें बढ़-चढ़कर भागीदारी की, वो हर किसी को प्रेरित करने वाला है। विजेताओं के साथ ही सभी प्रतिभागियों को बहुत-बहुत शुभकामनाएं। https://t.co/b25XwOsXJy
— Narendra Modi (@narendramodi) February 8, 2023


