చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 పురుషుల ‘500 మీటర్ల-టి11’లో స్వర్ణ పతకం సాధించిన అంకుర్ ధామాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ ‘500 మీటర్ల-టి11’లో అద్భుత ప్రతిభతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న అంకుర్ ధామాకు నా హృదయపూర్వక అభినందనలు. అతని అసమాన నైపుణ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ విజయం యావద్దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. అతడు భవిష్యత్తులోనూ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Heartiest congratulations to @AnkurAthlete on the exceptional Gold Medal win in Men's 5000m T11. His remarkable performance was awe-inspiring and has made our nation proud. May he continue to chase new horizons! pic.twitter.com/HSEgjVXito
— Narendra Modi (@narendramodi) October 23, 2023


