భారత అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను నవంబర్ 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కైరూట్ మొదటి కక్ష రాకెట్ విక్రమ్-Iను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 200,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని కార్యాలయాన్ని నిర్మించారు. ఇక్కడ బహుళ ప్రయోగ వాహనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, సమగ్రపరచడం, పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాంపస్ ప్రతి నెలా ఒక కక్ష రాకెట్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
స్కైరూట్ దేశంలోని ప్రముఖ ప్రైవేటు అంతరిక్ష సంస్థ. దీనిని పవన్ చందన, భరత్ ఢాకా స్థాపించారు, వీరిద్దరూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు....ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు. స్కైరూట్ తన ఉప-కక్ష రాకెట్ అయిన విక్రమ్- ఎస్ ను 2022 నవంబర్ లో ప్రయోగించింది. దీని ద్వారా అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి భారత ప్రైవేటు సంస్థగా స్కైరూట్ నిలిచింది.
ప్రైవేటు అంతరిక్ష సంస్థల వేగవంతమైన అభివృద్ధి.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల విజయానికి నిదర్శనం. ఇది ఆత్మవిశ్వాసంతో కూడిన, సమర్థవంతమైన ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారత్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది.


