ముంబయి లోని జుహూ బీచ్ లో నిర్వహించిన క్లీనథన్ కు సంబంధించి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడిస్తూ, ఈ కార్యాన్ని ప్రశంసించారు. క్లీనథన్ లో పాలుపంచుకొన్న ప్రజల ను ఆయన ప్రశంసిస్తూ, మనం మన కోస్తా తీర ప్రాంతాల ను పరిశుభ్రం గా అట్టిపెట్టుకొనేందుకు శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భేష్.. ఈ కార్యం లో పాలుపంచుకొన్న వారందరిని నేను ప్రశంసిస్తున్నాను.
‘‘భారతదేశం లో పొడుగైన, సుందరమైన కోస్తా తీరం ఉంది; మరి మనం ఈ కోస్తా తీర ప్రాంతాల ను స్వచ్ఛం గా అట్టిపెట్టుకోవడం పట్ల శ్రద్ధ తీసుకోవడం ఎంతైనా ముఖ్యం.’’ అని పేర్కొన్నారు.
Commendable...I appreciate all those involved in this effort.
— Narendra Modi (@narendramodi) September 12, 2022
India is blessed with a long and beautiful coastline and it is important we focus on keeping our coasts clean. https://t.co/mxMTUNLYNC


