Himachal Pradesh, as a land of spirituality and bravery: PM Modi
Government is focusing on next-generation infrastructure in Himachal Pradesh. Projects related to highways, railways, power, solar energy and petroleum sector, are underway in the state: PM Modi
Those in habit of looting money now afraid of 'Chowkidar': PM Modi

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ధ‌ర్మ‌శాల‌ లో నిర్వ‌హించిన జ‌న్ అభ‌ర్ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగించారు.

వేదిక వ‌ద్ద‌కు రావ‌డానికి ముందు ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాని మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌ మంత్రి, అస‌మాన ధైర్య‌సాహ‌సాల‌కు, ఆధ్యాత్మిక‌త‌కు పేరెన్నిక‌గ‌ల ప్రాంతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అని ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌శంసించారు.

మాజీ ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ కి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ తో ప్ర‌త్యేక బంధం ఉండేద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

గ‌త ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతాల‌ లోని ప్ర‌జ‌ల‌కు వివిధ ప‌థ‌కాల ద్వారా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేరువ అయింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌శంసించారు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి పెడుతున్న‌ద‌ని చెప్పారు. జాతీయ‌ ర‌హదారులు, రైల్వేలు, విద్యుత్‌, సౌర‌విద్యుత్‌,పెట్రోలియం రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్‌ లో కొన‌సాగుతున్నాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌ర్యాట‌క ప‌రంగా గ‌ల శ‌క్తిని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. మ‌న దేశాన్ని సంద‌ర్శించేందుకు వ‌స్తున్న విదేశీ ప‌ర్యాట‌కులు 2013 లో 70 ల‌క్ష‌ల‌ మంది ఉండ‌గా, 2017 నాటికి వీరి సంఖ్య కోటి మందికి చేరింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. అలాగే, 2013లో అనుమతి పొందిన హోట‌ళ్ల సంఖ్య 1200 ఉండ‌గా, అవి ప్ర‌స్తుతం 1800 కు పెరిగాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

మ‌న మాజీ సైనికులు న‌ల‌భై సంవ‌త్స‌రాల‌పాటు ‘ఒక‌ ర్యాంకు, ఒకే పెన్ష‌న్’ కోసం కోరుతూ వ‌చ్చార‌ని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇందుకు సంబంధించిన అంశాలు, వ‌న‌రుల గురించి అర్ధం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఆ త‌ర్వాత మ‌న మాజీ సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒ.ఆర్‌.ఒ.పి ని అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

అలాగే, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు క‌ట్టుబ‌డి స్వ‌చ్ఛ‌త‌కు కృషి చేస్తుండ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌ మంత్రి వారికి అభినంద‌న‌లు తెలిపారు. స్వ‌చ్ఛ‌త‌ను వారు ఒక సంస్కారంగా అంగీక‌రించార‌ని ఆయ‌న అన్నారు. ఇది రాష్ట్రం లో ప‌ర్యాట‌క‌రంగం ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.

 

కేంద్ర ప్ర‌భుత్వం అవినీతికి ఏ ర‌కంగా అడ్డుక‌ట్ట‌వేసిన‌దీ ప్ర‌ధాన‌ మంత్రి వివ‌రించారు. ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా అవినీతికి క‌ళ్లెం వేశామ‌ని దీని ద్వారా సుమారు 90,000 కోట్ల రూపాయ‌లు ఆదా అయిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 డిసెంబర్ 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity