A very special day for Rajasthan, development initiatives across aviation, energy and connectivity will strengthen infrastructure, accelerate growth and improve ease of living: PM
Regardless of how massive and unforeseen a challenge may be, New India neither backs away from its resolves nor slows its momentum: PM
Today itself, the new airport terminal was inaugurated in Jodhpur; this will provide a new impetus to tourism, trade, and employment in the Marwar region: PM
The resolve and efforts of the 21st century's New India have triumphed over the greatest energy crisis of the 21st century: PM
India made the right decisions at every level, accurately assessed the crisis in a timely manner, formulated an effective strategy, and utilized India's resources in a balanced way; It positively leveraged India's diplomatic power, and that is how India managed to emerge from the crisis: PM
India made the right decisions at every level and managed to emerge from the energy crisis: PM
Today, I thank and express my gratitude to our 1.4 billion citizens for the resolute way they stood by the country during these difficult times: PM
It is on the strength of the trust of our 1.4 billion citizens that the nation has been able to move forward: PM
Now, the governments of Rajasthan and Haryana will collaborate to deliver water to Shekhawati, benefiting the people of the entire adjoining Shekhawati region: PM

భారత్ మాతాకీ జై.

భారత్ మాతాకీ జై.

రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ బగాడే, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్‌ శర్మ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి జీ, ప్రేమ్‌చంద్‌ బైరవా జీ, రాజస్థాన్‌ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రియమైన సోదరీసోదరులారా,

ఇవాళ రాజస్థాన్‌లో 10 నుంచి 12 వేల ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలివచ్చారు. స్క్రీన్ల వైపు చూస్తుంటే ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తోంది. సాంకేతికత ద్వారా రాజస్థాన్‌లోని ప్రతి మూల నుంచి నా సోదరీసోదరులు ఇక్కడ మాతో అనుసంధానమయ్యారు. వారందరికీ నా నమస్కారాలు.

మిత్రులారా,

మండే ఎండలో సైతం భారీ సంఖ్యలో ప్రజలు ఇన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చి మమ్మల్ని ఆశీర్వదించటం బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాలపై మీకున్న నమ్మకం ఎంత బలమైనదో తెలియజేస్తోంది. ఈ మద్దతుకు, అభిమానానికి నేను రాజస్థాన్‌కు రుణపడి ఉంటాను.

సోదరీసోదరులారా,

ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.

 

మిత్రులారా,

శంకుస్థాపనలు చేయటంతోనే బీజేపీ ప్రభుత్వాలు ఆగిపోవని, ప్రాజెక్టులను పూర్తి చేయటానికి అహర్నిశలు శ్రమిస్తాయని చెప్పేందుకు ఇవాళ్టి ఈ రోజే సాక్ష్యం. కేవలం రెండు నెలల కిందట ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత, వేగంగా పనులను పూర్తి చేయటం అసాధారణమైన కృషికి నిదర్శనం. సవాలు ఎంత పెద్దదైనా, ఎంత ఊహించనిదైనా... నవభారతం సంకల్పం తీసుకున్నాక వెనకడుగు వేయదని, వేగాన్ని తగ్గించదని మీరు నిరూపించారు.

సోదరీసోదరులారా,

ఇవాళ రాజస్థాన్‌లో అభివృద్ధికి సంబంధించిన మరెన్నో కీలక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజే జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించాం. ఈ కొత్త టెర్మినల్ ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం నేను గమనించాను. ఆ నిర్మాణాల్లో రాజస్థాన్ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.

మిత్రులారా,

ఇది మార్వాడ్‌లో పర్యాటకం, వ్యాపారం, ఉపాధికి కొత్త ఊపునిస్తుంది. ముఖ్యంగా జోధ్‌పూర్‌తో అనుబంధం ఉన్నవారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జోధ్‌పూర్ నుంచే ఇవాళ ఉడాన్ పథకం నూతన దశ కూడా ప్రారంభమైంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలు విమానయాన సౌకర్యంతో అనుసంధానమవుతాయి. దీనితో పాటు జైపూర్ మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది.

సోదరీసోదరులారా,

శేఖావతి ప్రాంతంలో నీటి సంక్షోభ పరిష్కారం ముగింపునకు వస్తోంది. ఈ ప్రాజెక్టులన్నింటికీగానూ రాజస్థాన్‌లోని నా సోదరీసోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

ఇవాళ రాజస్థాన్‌లోని దాదాపు 54,000 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను కూడా అందుకున్నారు. వీరందరికీ ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తున్నా. వీరి యువశక్తి రాజస్థాన్ ఉజ్వల భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుంది.

 

మిత్రులారా,

రాజస్థాన్ గడ్డ మీద ఉండి, మన దేశ మరో శక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అలజడిని సృష్టించిందో మీకు తెలుసు. ప్రతి దేశం ఆందోళనలో ఉంది. ఈ యుద్ధం 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తీసుకువచ్చింది. అగ్రదేశాలు సైతం ఇంధన కొరతతో అల్లాడిపోతున్నాయి.

కానీ... మిత్రులారా,

21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో 21వ శతాబ్దపు నవ భారత సంకల్ప బలం, ప్రయత్నాలు విజయం సాధించాయి. ప్రతి స్థాయిలోనూ భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంది. సంక్షోభాన్ని సకాలంలో అంచనా వేసింది. సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించింది. వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించుకుంది. దౌత్య శక్తిని సానుకూలంగా వినియోగించుకుంటూ ఆ సంక్షోభాన్ని భారత్ అధిగమించింది.

మిత్రులారా,

కొన్ని శక్తులు బహిరంగంగా వదంతులను, భయాన్ని వ్యాప్తి చేయటంలో నిమగ్నమై ఉన్నప్పుడు తెరవెనుక రాత్రింబవళ్లు ఎంతో కృషి జరిగింది. విధానపరమైన, దౌత్యపరమైన స్థాయిలో చూపిన ఓర్పు, చేసిన ప్రయత్నం, తీసుకున్న చర్యలను అపూర్వమైనవని ఓ రోజు చరిత్ర నమోదు చేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఎల్పీజీ లేదా వంట గ్యాస్. మన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకునేవాళ్లమని, అందులో 90 శాతం గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా వచ్చేదని మనందరికీ తెలుసు. అకస్మాత్తుగా యుద్ధ పరిస్థితుల వల్ల ఆ సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల మన దేశంలో ఎంతటి గందరగోళం జరిగేదో మనం ఊహించవచ్చు. కానీ సవాళ్లను సవాలు చేయటమే రాజస్థాన్ నేల మనకు నేర్పింది. అందుకే సంక్షోభం ప్రారంభం కాగానే మేం రిఫైనరీల సామర్థ్యంపై దృష్టి సారించాం. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ ఉత్పత్తిని ఎల్పీజీ ఉత్పత్తి వైపు మళ్లించాం. కేవలం ఏడు రోజుల్లోనే ఎల్పీజీ ఉత్పత్తి పెరిగింది. అంతకుముందున్న 35,000 మెట్రిక్ టన్నుల నుంచి సంక్షోభ సమయంలో 54,000 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి చేరింది. మునుపెన్నడూ ఎల్పీజీని ఉత్పత్తి చేయని రిఫైనరీలను కూడా ఉత్పత్తికి సిద్ధం చేశాం.

మిత్రులారా,

మొత్తం ఇంధన డిమాండ్ భారం కేవలం ఎల్పీజీ పైనే పడకుండా చూసేందుకు ప్రభుత్వం పీఎన్‌జీ కనెక్షన్లను కూడా విస్తరించింది. అంటే వంటశాలల కోసం పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేయటం. అతి తక్కువ సమయంలోనే భారత్‌లో 11 లక్షలకు పైగా ఇళ్లకు పీఎన్‌జీ కనెక్షన్లను అందించారు.

 

సోదరీసోదరులారా,

ఒకవైపు మేం సరఫరాను సజావుగా నిర్వహిస్తూనే... మరోవైపు దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చూశాం. ఆ పరిస్థితులలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.2000 వరకు పెరిగి పోవచ్చని ప్రముఖ మార్కెట్ నిపుణుల అంచనా వేశారు. కానీ ఇప్పుడు కూడా దేశీయ ఎల్పీజీ సిలిండర్లు రూ.950 కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందించే ఉజ్వల సిలిండర్ల ధర రూ.650 కన్నా తక్కువగా ఉంది. కేవలం రెండు రోజుల కిందటే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. మా ప్రభుత్వం ఎంత విచక్షణతో, బాధ్యతాయుతంగా పనిచేస్తుందో ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

మిత్రులారా,

ఆ యుద్ధం డీజిల్, పెట్రోల్ సంక్షోభాన్ని కూడా సృష్టించింది. మన దేశంలో పెద్ద పెద్ద చమురు బావులు లేవు. సంక్షోభం తీవ్రం కావటంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగాయి. దిగుమతి మార్గాలు నిలిచిపోయాయి. చాలా దేశాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. కొన్ని దేశాల్లో అయితే ఇంధనాన్ని పరిమితంగా పంపిణీ చేయాల్సి వచ్చింది. కానీ భారత్‌లో ఒక్క రోజు కూడా అలాంటి పరిస్థితులు తలెత్తలేదు. వదంతులు వ్యాప్తి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. రాజకీయం చేశారు. కానీ తప్పుడు ఉద్దేశాలు ఉన్నవారు విజయం సాధించలేకపోయారు. పల్లెల్లో సైతం చిన్నచిన్న అడ్డంకులు మినహాయిస్తే సరఫరాలో ఎలాంటి పెద్ద సవాళ్లు ఎదురుకాలేదు. కేవలం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనే చమురు కంపెనీలు డీజిల్, పెట్రోల్ విభాగంలో రూ.75,000 కోట్లకు పైగా నష్టాన్ని భరించాయి. ఇది ఒక కొత్త రిఫైనరీ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో సమానం. ప్రభుత్వ ఖజానా ఈ భారాన్ని మోసింది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు మేం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాం.

మిత్రులారా,

ఇతర దేశాలతో భారత్‌కున్న స్నేహసంబంధాలు ఎంతో అమూల్యమైనవని ఈ యుద్ధ సమయంలో నిరూపితమైంది. ఈ సంక్షోభానికి ముందు దాదాపు 25, 26 దేశాల నుంచి భారత్ ఇంధనం, శక్తి వనరులను దిగుమతి చేసుకునేది. కానీ సంక్షోభ సమయంలో భారతదేశ దౌత్య సంబంధాలు అద్భుతమైన విజయం సాధించాయి. ఇతర దేశాలతో మనకున్న బలమైన స్నేహ సంబంధాలు ఎంతగానో సహకరించాయి. 40కి పైగా దేశాల నుంచి భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. భారతదేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. మాకు జాతీయ ప్రయోజనాలు, మా పౌరుల సంక్షేమమే అత్యంత కీలకం అని. నాగరిక్ దేవో భవ.. ఇదే మా మంత్రం.

 

మిత్రులారా,

దేశం ఎదుర్కొన్న అవాంఛనీయ సవాళ్లను భారత్ ఏదో అనుకోకుండా అధిగమించలేదు. దీని వెనుక గత దశాబ్ద కాలంగా అనుసరిస్తున్న దూరదృష్టి గల విధానాల విజయమే దాగి ఉంది. నేడు మనం రాజస్థాన్ రిఫైనరీని ప్రారంభిస్తున్నాం. రాజస్థాన్ రిఫైనరీకి సంబంధించిన ఒప్పందంపై మనం 2017లోనే సంతకాలు చేశాం. కానీ 2018 నుంచి 2023 వరకు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల, వారు సహకరించని కారణంగా ఇక్కడి పనులు దాదాపు నిలిచిపోయాయి. అయితే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాగానే పనులు శరవేగంగా పుంజుకున్నాయి. ఈ రోజు దానిని దేశానికి అంకితం చేస్తున్నాం. ఏ ప్రాజెక్టుకైతే నేను శంకుస్థాపన చేస్తానో, దానిని నేనే స్వయంగా ప్రారంభిస్తాను. ఇదే నా పనితీరు. ఒకవైపు గత 50 ఏళ్లలో అమెరికాలో ఒక్క కొత్త రిఫైనరీ కూడా నిర్మితమవ్వలేదు. యూరప్‌లో రిఫైనరీ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోంది. కానీ మన భారత్‌ మాత్రం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని నిరంతరం విస్తరిస్తూ ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రిఫైనరీ దేశంగా అవతరించింది. మేం ఇక్కడితో ఆగడం లేదు, రాబోయే సంవత్సరాల్లో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుతాం. ఈ నిరంతర కృషి వల్లే శతాబ్దంలోనే ఎదురైన అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించగలిగింది.

 

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, అశాంతి వల్ల మన దేశంలోని రైతులకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి.  ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం, గల్ఫ్ సంక్షోభం, అంతకు ముందు జరిగిన ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక యూరియా బస్తా ధర రూ. 3,000 దాటిపోయింది. కానీ, నా రైతు సోదరులపై ఆ భారం పడకుండా దేశంలో కేవలం రూ. 300లకే యూరియా బస్తాను అందించాం. దీని కోసం ప్రభుత్వం తన ఖజానా నుంచి లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీల రూపంలో భరించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్త దెబ్బతిన్నప్పటికీ మన రాయబార కార్యాలయాలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎరువులను సేకరించాం. దిగుమతులతో పాటు దేశీయంగా ఉత్పత్తిని పెంచాం. ప్రకృతి వ్యవసాయం వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తూనే, ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకున్నాం.

 

మిత్రులారా,

రైతులతో పాటు దేశంలోని పరిశ్రమలను, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను కూడా మేం కంటికి రెప్పలా కాపాడుకున్నాం. పెరుగుతున్న ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న ఎంఎస్‌ఎంఈల కోసం మేం అత్యవసర రుణ హామీ పథకంలో కొత్త దశను తెచ్చాం. ఈ పథకం కింద బ్యాంకులు చిన్న పరిశ్రమలకు 20 శాతం వరకు అదనపు రుణాలను అందించాయి. ఆ రుణాలకు ప్రభుత్వం 100 శాతం హామీ ఇచ్చింది.. ఇదే మోదీ గ్యారంటీ. ఈ నిర్ణయం వల్ల చిన్న, కుటీర పరిశ్రమలు ఎంతో లబ్ధి పొందాయి. మా ఇలాంటి నిర్ణయాల వల్లే ఈ రోజు దేశంలోని చిన్న, పెద్ద పరిశ్రమలన్నీ పూర్తి సురక్షితంగా ఉన్నాయనే నమ్మకంతో ముందుకు సాగుతున్నాయి.

 

 మిత్రులారా, 

మన దేశ బలంపై, మన పౌరుల సామర్థ్యాలు, వివేకంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే మా ప్రభుత్వం నిరంతరం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగింది. కష్టకాలంలో దేశానికి అండగా నిలిచినందుకు,  వదంతులు, భయాందోళనలు, గందరగోళాన్ని ఎదిరించినందుకు, అలాగే దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయాలనే కుట్రలను తిప్పికొట్టినందుకు నేను 140 కోట్ల మంది భారతీయులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. ఈ నమ్మకమే దేశాన్ని ముందుకు నడిపించింది. భారతదేశం విఫలమవ్వాలని కోరుకుంటూ, దేశ పతనంపై అంచనాలు వేసిన వారు ఈ రోజు పూర్తిగా నిరాశలో మునిగిపోయి ఉంటారు.

 

మిత్రులారా, 

ఈ రోజు ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు, ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ కార్యక్రమంలో భాగంగా ఒక ఖేజ్రీ (జామి చెట్టు) మొక్కను నాటే భాగ్యం నాకు దక్కింది. రాజస్థాన్‌లో ఖేజ్రీ చెట్టుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఎడారి విస్తరించకుండా ఆపడంలో అది ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో నాకు తెలుసు. ఈ మొక్కల పెంపకం మన పని సంస్కృతికి ఒక ఉదాహరణ. పర్యావరణాన్ని సంరక్షిస్తూనే మనం ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహించాలి. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పనిచేస్తోంది. ముఖ్యంగా సూర్య భగవానుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న ఈ రాజస్థాన్‌లో ప్రపంచ స్థాయి సౌర పార్కులు అభివృద్ధి చెందుతున్నాయి. పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రాజస్థాన్‌లోని 1.50 లక్షలకు పైగా గృహాలకు ఇప్పటికే సౌర విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. అలాగే పీఎం కుసుమ్ పథకం కింద ఇక్కడి రైతులకు 65,000 కంటే ఎక్కువ సోలార్ పంపులను అందించాం.

 

మిత్రులారా, 

సంకల్పంలో స్పష్టత ఉంటే ఎంతటి కఠినమైన నిర్ణయాలనైనా సాకారం చేయవచ్చు. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఉన్న పెద్ద తేడా ఇదే.

 

మిత్రులారా, 

రాజస్థాన్ నీటి సమస్యను పరిష్కరించడమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. రాజస్థాన్ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. కానీ బీజేపీ విభజన రాజకీయాలు చేయదు. దేశమే ప్రథమం అనే భావనతో పనిచేస్తుంది. మేం గుజరాత్‌లో నీటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నప్పుడు, రాజస్థాన్‌తో నీటిని పంచుకునే ప్రశ్న వచ్చినప్పుడు జరిగిన విషయాలు నాకు బాగా గుర్తున్నాయి. సాధారణంగా దేశంలో రాష్ట్రాలు దశాబ్దాలుగా నీటి కోసం కొట్టుకుంటుంటాయి. గుజరాత్ తమకు నర్మదా జలాలను ఇస్తుందా లేదా అని రాజస్థాన్ ప్రజలు ఆందోళన చెందారు. కానీ రాజస్థాన్, గుజరాత్ రెండింటిలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉండటం మా అదృష్టం. ఆ సమయంలో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇక్కడ సోదరి వసుంధర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరం కలిసి ఎలాంటి ఘర్షణలు, వివాదాలు, ఆందోళనలు, గొడవలు లేకుండా నర్మదా నది నీటిని రాజస్థాన్‌తో పంచుకున్నాం. ఈ రోజు రాజస్థాన్‌లోని అనేక గ్రామాలకు నర్మదా మాత జలాలు అందుతున్నాయి. ఇప్పుడే ముఖ్యమంత్రి భజన్‌లాల్ గారు ఈ విజయం గురించి మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 

 

సోదర సోదరీలారా, 

ఇప్పుడు రాజస్థాన్, హర్యానా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉండటం వల్ల చరిత్రలో మొదటిసారిగా ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాయి. రాజస్థాన్, హర్యానా రెండు రాష్ట్రాలు కలిసి ఇప్పుడు షెఖావతి ప్రాంతానికి నీటిని తీసుకురానున్నాయి. దీని కోసం ఇటీవలే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భూగర్భ పైప్‌లైన్ల ద్వారా రాజస్థాన్‌కు నీటిని తరలిస్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల సీకార్, చురు, ఝున్‌ఝును, మొత్తం షెఖావతి ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలకు భారీ లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 34,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాం. 

 

మిత్రులారా, 

భవిష్యత్తులో ఎగువ యమునా బేసిన్‌లో రేణుక, లఖ్వార్, కిషౌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తయిన తర్వాత, రాజస్థాన్‌కు మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రామాలకు కుళాయి నీటిని అందించే పని కూడా వేగంగా ముందుకు సాగింది. రామ్‌జల్ సేతు ప్రాజెక్ట్ ఈ దార్శనికత ఫలితమే. దీనితో పాటు ‘జల్ సంచయ్, జన్ భాగీదారీ’ ప్రచారంలో రాజస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఇంకుడు గుంతలను నిర్మించారు. ఒక్క రాజస్థాన్‌లోనే 1,25,000కు పైగా ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇవి నీటిని సంరక్షిస్తూ, భూగర్భ జల మట్టాలను మెరుగుపరుస్తున్నాయి. ఈ కృషికి గాను కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు, షెఖావతి ప్రజలకు నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

  

మిత్రులారా,

 

ఈ రోజు దేశం ఏ సంకల్పం తీసుకున్నా, ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా... అందులో రాజస్థాన్ కేంద్ర స్థానంలో ఉంటోంది. ఇక్కడ ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్న జైపూర్ మెట్రో రెండో దశ, అలాగే ప్రారంభించుకున్న జోధ్‌పూర్ విమానాశ్రయ కొత్త టెర్మినల్ రాజస్థాన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేసి, దానికి కొత్త రెక్కలను అందిస్తాయి. జైపూర్ మెట్రో రెండో దశ పూర్తయిన తర్వాత జైపూర్ మొత్తం మెట్రో వ్యవస్థ 50 కిలోమీటర్లు దాటుతుంది. తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ మెట్రో వ్యవస్థలో ఒకదానితో ఒకటి అనుసంధానమవుతాయి. ఇది స్థానిక నివాసితుల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది.

 

మిత్రులారా, 

రాబోయే కాలంలో మనం అభివృద్ధిలో సరికొత్త శిఖరాలను అందుకోవాలి. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై మీరు మీ ఆశీస్సులను ఇలాగే కొనసాగిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మనమంతా కలిసి రాజస్థాన్ కోసం ఒక సరికొత్త భవిష్యత్తును నిర్మిస్తాం. ఈ నమ్మకంతో రిఫైనరీ, ఇతర అభివృద్ధి పనుల సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు, దేశ ప్రజలకు నేను మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

నాతో కలిసి గట్టిగా చెప్పండి.

 

భారత్ మాతా కీ జై.

 

రాజస్థాన్ బలాన్ని చాటుతూ రెండు పిడికిళ్ళనూ పైకెత్తి చెప్పండి

 

భారత్ మాతా కీ జై.

 

భారత్ మాతా కీ జై.

 

భారత్ మాతా కీ జై.

 

మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of self-respect, courage and steadfastness
August 18, 2026

The Prime Minister, Shri Narendra Modi has shared a Sanskrit Subhashitam highlighting the importance of living with self-respect, courage and dignity. He emphasised that true valour and strength lie in remaining steadfast in one’s principles and values, without compromising them under any circumstances.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।
अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”

The Subhashitam conveys that a person should always live with self-respect, courage and dignity. True valor and strength lie in never compromising one's principles and values under any circumstances, but remaining steadfast in one's ideals with truth, patience and self-pride.

The Prime Minister wrote on X;

“उद्यच्छेदेव न नमेदुद्यमो ह्येव पौरुषम्।

अप्यपर्वणि भज्येत न नमत्वेव कस्यचित्॥”