ఝార్ ఖండ్ లోని పత్ రాతూ లో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే దిశ లో జరుగుతున్న ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
ఝార్ ఖండ్ లోని పత్ రాతూ లో 50 కోట్ల రూపాయల ఖర్చు తో వాటర్ ఫిల్టర్ ప్లాంటు మరియు వాటర్ టవర్ పూర్తి అయిన సంగతి ని హజారీబాగ్ ఎంపి శ్రీ జయంత్ సిన్హా ఒక ట్వీట్ లో తెలియజేయగా ప్రధాన మంత్రి ఆ ట్వీట్ ను శేర్ చేస్తూ,
‘‘ఎంతో అభినందనీయం అయినటువంటి ప్రయాస. స్వచ్ఛమైన నీటి సదుపాయం ఝార్ ఖండ్ లోని పత్ రాతూ లో మన మహిళల మరియు సోదరీమణుల జీవనాన్ని చాలా సులభతరం గా మార్చివేయనుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
बहुत ही सराहनीय प्रयास! स्वच्छ पानी की यह सुविधा झारखंड में पतरातू की हमारी माताओं और बहनों के जीवन को बहुत आसान बनाने वाली है। https://t.co/NKZw7Inymi
— Narendra Modi (@narendramodi) May 17, 2023


