ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభ సందర్భంగా హెలెనిక్ రిపబ్లిక్ (గ్రీస్) ప్రధానమంత్రి శ్రీ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ ఈ రోజు అయ్యారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో పాల్గొనడానికి గ్రీస్ ప్రధానమంత్రి ఈ నెల 18-19 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని గౌరవ శ్రీ మిత్సోటాకిస్‌ వెంట ఆ దేశ డిజిటల్ గవర్నెన్స్ మంత్రి శ్రీ డిమిట్రియోస్ పాపాస్టెర్గియో, సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిని ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమీక్షించారు. విభిన్న రంగాల్లో భాగస్వామ్యం స్థిరమైన వేగంతో పురోగమిస్తుందని వారు గుర్తించారు. ప్రాంతీయ, ప్రపంచ సంబంధిత అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న ఇరువురు నేతలు... పరస్పర ప్రయోజనకరమైన నూతన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగే మార్గాలను గురించి చర్చించారు. ఐఎమ్ఈసీ కింద ఇటీవల చేపట్టిన కనెక్టివిటీ కార్యక్రమాలను, వాటిని మరింత విస్తరించే సామర్థ్యాలను ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రశంసించారు.

 

ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చాయనీ... ఇటీవల ఖరారైన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త మార్గాలను తెరుస్తుందని ఇరువురు నేతలు అంగీకరించారు.

 

గ్రీస్ ప్రధానమంత్రి మిత్సోటాకిస్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఆయన గతంలో 2024 ఫిబ్రవరిలో భారత్‌లో అధికారిక పర్యటన నిర్వహించారు. 15 సంవత్సరాల తర్వాత గ్రీస్ ప్రభుత్వాధినేత భారత్‌లో పర్యటించడం అదే తొలిసారి. అంతకుముందు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న ఏథెన్స్‌ను సందర్శించారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI

Media Coverage

India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మే 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”