ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ ని ఈ రోజు న సందర్శించి, వివిధ కార్యక్రమాల లో ఆయన పాలుపంచుకొన్నారు.

వారాణసీ లోని లాల్ బహాదుర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం లో పూర్వ ప్రధాని శ్రీ లాల్ బహాదుర్ శాస్త్రి విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

ఆ తరువాత, వారాణసీ లో గల ఆనంద్ కానన్ వాటిక లో జరిగిన మొక్కల ను నాటే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు.




తదనంతరం, ప్రధాన మంత్రి మాన్ మహల్ లోని వర్చువల్ మ్యూజియమ్ ను సందర్శించారు.

దశాశ్వమేధ్ ఘాట్ సమీపం లో నెలకొన్న ఈ మ్యూజియమ్ వారాణసీ నగరం లోని సాంస్కృతిక కేంద్ర బిందువుల లో ఒకటి గా ఉంది. మన సాంస్కృతిక వారసత్వం తాలూకు వివిధ పార్శ్వాల ను ఈ మ్యూజియమ్ కళ్ల కు కడుతుంది.
Tribute to an exemplary leader admired by all sections of society.
— PMO India (@PMOIndia) July 6, 2019
On landing in Varanasi, PM @narendramodi unveiled a statue of former PM Shri Lal Bahadur Shastri Ji. This statue is located at the Varanasi airport. pic.twitter.com/MWFBDzDsnK


