రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.

నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్పీకి అభినందనలు తెలిపారు. త్వరలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, ప్రజల శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

భారత్-నేపాల్ సంబంధాల భవిష్యత్తుపై విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేస్తూ.. రానున్న కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉమ్మడి ప్రయత్నాలతో నూతన శిఖరాలకు చేరుకుంటుందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో మాట్లాడాను.

నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్‌పీకీ అభినందనలు తెలియజేశాను. త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాను. అలాగే రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారత ప్రభుత్వ నిబద్దతను తెలియజేశాను.

మా ఉమ్మడి ప్రయత్నాలతో రానున్న కాలంలో భారత్-నేపాల్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని విశ్వసిస్తున్నాను.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From make in India to create in India: The next auto tech leap

Media Coverage

From make in India to create in India: The next auto tech leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 సెప్టెంబర్ 2026
September 09, 2026

Viksit Bharat Express: How PM Modi’s Reforms Are Supercharging India’s Economy and Infrastructure