ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ సమిట్ తొమ్మిదో సంచిక ను 2019 వ సంవత్సరం జనవరి 18 వ తేదీ నాడు ప్రారంభించనున్నారు. దేశాధినేతలు, ప్రపంచ పరిశ్రమ రంగ సారథుల తో పాటు ప్రముఖ మేధావులు ఈ తొమ్మిదో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ కు హాజరు కానున్నారు.
ఒక ‘న్యూ ఇండియా’ కోసం సర్వతోముఖ ఆర్థిక అభివృద్ధి అనే అంశం పై ప్రత్యేక శ్రద్ధ తో ప్రపంచ స్థాయి, జాతీయ స్థాయి, ఇంకా రాష్ట్ర స్థాయి అంశాల కు ఒక చర్చా వేదిక ను తొమ్మిదో వైబ్రంట్ గుజరాత్ సమిట్ సమకూర్చనుంది.
వైబ్రంట్ గుజరాత్ లో భాగం గా నిర్వహించే ప్రధాన కార్యక్రమాల కు తోడు, శిఖర సమ్మేళనం లో వెలికి వచ్చే ఆలోచనల సారాంశాన్ని ప్రతిబింబించడంతో పాటు భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం స్థాయి ని ముమ్మరం చేసేందుకు ఒక కొత్త శ్రేణి వేదికల కు ఈ శిఖర సమ్మేళనం నాంది ని పలుకనుంది.
వైబ్రంట్ గుజరాత్ ఆలోచన శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో రూపుదిద్దుకొంది. 2003వ సంవత్సరం లో మొదలైన వైబ్రంట్ గుజరాత్ ప్రస్తుతం భారతదేశం లో అన్ని రాష్ట్రాల కు ప్రాతినిధ్యం కల్పిస్తూ, పెట్టుబడి ని ప్రోత్సహించేందుకు ఒక గ్లోబల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫారం గా మరింది. సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల పై చర్చ లు జరిపేందుకు ఒక వేదిక గాను, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం తో పాటు ప్రభావశీల భాగస్వామ్యాల ను ఏర్పరచుకొనేందుకు ఇది ఒక రంగ స్థలం గా రూపుదాల్చింది.
2017వ సంవత్సరం జనవరి లో జరిగిన ఎనిమిదో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ కు 100 కు పై చిలుకు దేశాల నుండి నలుగురు దేశాధినేతలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచ పారిశ్రామిక రంగ సారథులు సహా 25,000 మంది మంది పైగా ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.
వైబ్రంట్ గుజరాత్ 2019 ప్రధానాంశాలు:
భారతదేశం లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాపం, ఇంజినీరింగ్, ఇంకా గణిత (ఎస్‌టిఇఎమ్) విద్య & పరిశోధన రంగాల లో అవకాశాల కు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం.
ఈ సమావేశానికి భారత ప్రభుత్వంలోను, రాష్ట్ర ప్రభుత్వాల లో కీలకమైన విధాన రూపకర్తలు గా ఉన్న వారితో పాటు ప్రముఖ విద్యావేత్తలు కూడా హాజరు కానున్నారు. చర్చల ను ‘‘ఎస్‌టిఇఎమ్ ఎడ్యుకేశన్ & రిసర్చ్ సంబంధిత అవకాశాల మార్గసూచి’’ పేరిట సమన్వయం చేయనున్నారు.
భావి తరం సాంకేతిక విజ్ఞానం మరియు అంతరిక్ష అన్వేషణ అంశాల పైన ప్రదర్శన:
రానున్న కాలం లో అంతరిక్ష యానం ఏ విధం గా ఉండవచ్చన్న అంశాని కి సంబంధించిన ఒక దార్శనికత.
ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమెటిక్స్ (ఎస్‌టిఇఎమ్):
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ శో:
రెండు లక్షల చ.మీ. విస్తీర్ణం లో ఏర్పాటయ్యే ఈ ప్రధానమైన ట్రేడ్ శో భాగం గా 25 రంగాల కు చెందిన సామగ్రి ని ప్రదర్శన కు ఉంచుతారు.
భారతదేశాన్ని ఆసియా యొక్క ట్రాన్స్-శిప్‌మెంట్ హబ్ గా నిలబెట్టేందుకు ఓడ రేవుల నేతృత్వం లో అభివృద్ధి సాధన, ఇంకా వ్యూహాల పైన చర్చాసభ ఉంటుంది.
ఈ సెమినార్ లో భాగం గా గుజరాత్ లోను, భారతదేశం లోను రవాణా రంగం భవిష్యద్వికాసాని కి సంబంధించిన కోణాల పైన చర్చ ను చేపడుతారు.
‘మేక్ ఇన్ ఇండియా’ పై చర్చాసభ:
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం తాలూకు విజయ గాథ లను ఈ సెమినార్ కళ్ళకు కడుతుంది. అంతేకాక ఈ కార్యక్రమం సఫలం అయ్యేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన కార్యక్రమాల పైన కూడా ఈ సభ దృష్టి ని సారిస్తుంది.
రక్షణ రంగం లో మరియు ఏరోస్పేస్ రంగం లో పరిశ్రమ కు అవకాశాల పైన చర్చాసభ:
గుజరాత్ లో రక్షణ, ఇంకా ఏరోనాటిక్స్ రంగాల లో గల అవకాశాల ను గురించి ఆహుతుల కు వివరించే ధ్యేయం తో ఈ సెమినార్ ను నిర్వహించాలని సంకల్పించారు. అలాగే రక్షణ, ఏరోనాటిక్స్ లో తయారీ కేంద్రాలు గా గుజరాత్, భారతదేశం ఆవిర్భవించేందుకు అనుసరించవలసిన మార్గం అంశం పైన సైతం చర్చ ను చేపడుతారు.
మొబిలిటీ నేతృత్వం లో పట్టణాభివృద్ధి:
పట్టణాభివృద్ధి కి మొబిలిటీ ని ఒక చోదక శక్తి గా ఉపయోగించుకొంటూ, మనుగడ సాగించగల నగరాల ను తీర్చిదిద్దడం పై చర్చోపచర్చల ను ఈ కార్యక్రమం లో చేపట్టనున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం, వాహనాల ను నిలిపి వుంచేందుకు తీసుకోవలసిన ప్రత్యేక శ్రద్ధ, విద్యుత్తు తో నడిచే వాహనాలు మరియు బిగ్ డాటా లను పరిగణన లోకి తీసుకోనున్నారు.
‘న్యూ ఇండియా’ కోసం సస్‌టైనబుల్ టెక్నాలజీ డ్రివన్ అగ్రికల్చర్:
టెక్స్‌టైల్ కాన్‌క్లేవ్ – ‘న్యూ ఇండియా’ నిర్మాణం కోసం జౌళి రంగం లో వృద్ధి అవకాశాల ను అన్వేషించడం:
ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించాలన్న మాన్య ప్రధాన మంత్రి దార్శనికత ను ఆచరణ లోకి తీసుకు రావడం కోసం నిర్వహిస్తున్న టెక్స్‌టైల్ కాన్‌క్లేవ్ లో భారతదేశం లోని వస్త్ర పరిశ్రమ లో వృద్ధి ని నిలదొక్కుకొనేటట్లుగా చూడటం కోసం ఒక మార్గాన్ని చేరుకోవడం ఎలాగన్న అంశాన్ని చర్చించి ఆ పంథా ను ఖరారు చేయడం కోసం పరిశ్రమ రంగ సారథులు, ప్రభుత్వ నేత లు, విధాన రూపకర్త లు, మేధావులు పాలుపంచుకోనున్నారు. అంతేకాక ఒక ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం తీసుకోవలసిన చొరవ ను ఏ యే రీతుల లో బలపరచాలనే అంశం కూడా ఈ సందర్భం గా చర్చ కు రానుంది.


