ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణ‌సీ లో గల రెండు ముఖ్య‌మైన జాతీయ ర‌హ‌దారుల‌ ను దేశ ప్ర‌జ‌ల‌ కు 2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 12 వ తేదీ సోమ‌వారం నాడు అంకితం చేయ‌నున్నారు. మొత్తం 34 కిలో మీట‌ర్ల పొడ‌వైన ఈ జాతీయ ర‌హ‌దారుల‌ ను నిర్మించడానికి 1571.95 కోట్ల రూపాయ‌ల ను వెచ్చించడం జ‌రిగింది. ప్ర‌ధాన మంత్రి వెంట ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ రామ్ నాయీక్‌, ర‌హ‌దారి ర‌వాణా & రాజమార్గాలు, శిప్పింగ్‌, జ‌ల వ‌న‌రులు, న‌దీ వికాసం, ఇంకా గంగా సంరక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గ‌డ్ కరీ తో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోనున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో గ‌ల హ‌ర్‌దువా లోని రింగ్ రోడ్డు తిరాహా వద్ద మ‌ధ్యాహ్నం తరువాత ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

వారాణ‌సీ రింగు రోడ్డు ఒక‌టో ద‌శ ను 759.36 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో 16.55 కిలో మీట‌ర్ల పొడవైన రాదారి నిర్మాణం పూర్తవగా, 812.59 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో జాతీయ రాజమార్గం (ఎన్ హెచ్)- 56 లో భాగంగా ఉన్న‌టువంటి బాబ‌త్‌పుర్- వారాణ‌సీ రాజమార్గాన్ని నాలుగు దోవలు కలిగింది గా విస్తరించడం తో పాటు 17.25 కిలో మీట‌ర్ల మార్గాన్ని సైతం నిర్మించడమైంది.

బాబ‌త్‌పుర్ విమానాశ్రయ రాజమార్గం వారాణ‌సీ ని విమానాశ్ర‌యం తో క‌లపనుంది. అలాగే ఇది జౌన్ పుర్‌, సుల్తాన్‌పుర్, ఇంకా ల‌ఖ్‌న‌వూ వరకు సాగనుంది. ఈ రాజమార్గం లో హ‌ర్‌దువా లో ఓ ఫ్లయ్ ఓవ‌ర్ తో పాటు తర్నా లో ఓ ఆర్ ఓబీ ని నిర్మించడంతో వారాణ‌సీ నుండి విమానాశ్ర‌యానికి ప్ర‌యాణించడానికి పట్టే స‌మ‌యం త‌గ్గిపోనుంది. త‌త్ఫ‌లితంగా వారాణ‌సీ ప్ర‌జ‌ల‌కు, న‌గ‌ర పర్యటకులకు, ఇతర ఆగంతుకుల‌కు భారీ ఉప‌శ‌మ‌నం లభించగలదు.

రెండు ఆర్ఒబి ల తోపాటు, ఒక ఫ్లయ్ ఓవ‌ర్ భాగంగా ఉండే ఈ రింగు రోడ్డు ఎన్‌హెచ్ 56 (ల‌ఖ్‌న‌వూ- వారాణ‌సీ) ఎన్‌హెచ్ 233 (ఆజంగ‌ఢ్‌- వారాణ‌సీ) ఎన్‌హెచ్ 29 (గోర‌ఖ్‌పుర్‌-వారాణ‌సీ) మ‌రియు అయోధ్య- వారాణ‌సీ రాజమార్గాల పై రాకపోకలు జరిపే వాహ‌నాలకు వారాణసీ నగరానికి రెండోదారి గా ఒక మార్గం అందుబాటు లోకి రానుంది. దీనితో న‌గ‌రం లో వాహ‌నాల ర‌ద్దీ కూడా త‌గ్గిపోగలదు. ఈ రింగ్ రోడ్డు ప్ర‌యాణ స‌మ‌యాన్ని, ఇంధ‌న వినియోగాన్ని, కాలుష్యాన్ని సైతం త‌గ్గించ‌గ‌లుగుతుంది. ప్రముఖ బౌద్ధ తీర్థయాత్ర స్థ‌లం సార్ నాథ్ వరకు వెళ్ళేందుకు సుల‌భ‌త‌ర‌మైన, సౌక‌ర్య‌వంత‌మైన దారి కూడా ఏర్పడనుంది.

ఈ ప‌థ‌కాలతో ఉపాధి అవ‌కాశాలు పెంపొందగలవు. ఈ ప్రాంతం లో చిన్న మ‌రియు మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల వికాసం ద్వారా ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించగలదు. ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రం లోని తూర్పు దిక్కున ఇతర ప్రాంతాలను వారాణ‌సీ తో జోడించడం కోసం 63,885 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో మొత్తం 2833 కిలోమీట‌ర్ల పొడ‌వైన జాతీయ రాజమార్గ పథకాలు నిర్మాణ దశ లో ఉన్నాయి.

వారాణ‌సీ లో గంగా న‌ది మీద ఒక ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ టర్మిన‌ల్ ను కూడా దేశ ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి అదే రోజు న అంకితం చేయనున్నారు. వరల్డ్ బ్యాంకు స‌హాయం తో ఇన్‌లాండ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలుపరుస్తున్నటువంటి జ‌ల మార్గ వికాస ప‌థ‌కం లో ఒక భాగమైనటువంటి ఎన్‌డ‌బ్ల్యు- ఐ (గంగా న‌ది) నాలుగు బ‌హుళ విధ ట‌ర్మిన‌ల్స్ లో ఇది ఒక‌టోది. మిగిలిన మూడు ట‌ర్మిన‌ల్స్ సాహిబ్‌గంజ్‌, హల్దియా, ఇంకా గాజీపుర్ ల‌లో నిర్మాణ దశ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల గంగా న‌ది మీద 1500-2000 డిబ్ల్యుటి సామ‌ర్ధ్యం క‌లిగిన నౌక‌ ల వాణిజ్య స‌ర‌ళి యానం అందుబాటు లోకి వస్తుంది.

స్వాతంత్య్రం అనంత‌ర కాలం లో అంతర్ దేశీల జల మార్గ నౌక పైన పంపిన తొలి కంటేన‌ర్ సరకును కూడా ప్ర‌ధాన మంత్రి అందుకోనున్నారు. ఈ కంటేనర్ లో ఆహారం మ‌రియు పానీయాల త‌యారీ సంస్థ పెప్సికో యొక్క సరకు ను నింపడమైంది. అక్టోబ‌ర్ చివ‌రి వారం లో కోల్‌కాతా నుండి ఈ కంటెనర్ బ‌య‌లుదేరింది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Exports may hit $1 Tn in FY27 on new trade deals, tariff cuts

Media Coverage

Exports may hit $1 Tn in FY27 on new trade deals, tariff cuts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 ఫెబ్రవరి 2026
February 10, 2026

Stable Banks, Soaring Growth, Sectoral Wins: Celebrating India's Unstoppable Rise in 2026 Under PM Modi