షేర్ చేయండి
 
Comments
Government committed to ensuring a house to the homeless by 2022: PM Modi
Perpetrators of Pulwama attack will be made to pay heavy price: PM Modi
Projects launched in Yavatmal will help generate new jobs as well as empower the poor: PM

ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్

యోజన కింద నిర్మించిన ఇళ్ల తాళాలను ఎంపిక చేసిన కొందరు లబ్ధిదారులకు అందజేశారు. “ఈ పథకం కింద యావత్మల్లో సుమారు 14,500 ఇళ్లు నిర్మించబడ్డాయి. ఈ నేపథ్యంలో 2022కల్లా అందరికీ ఇళ్లు

లక్ష్యాన్ని మేం సాధిస్తాం. ఈ కాంక్రీట్ ఇళ్లు వాటిలో నివసించే ప్రజల నిర్దిష్ట స్వప్నాలను సాకారం చేస్తాయి” అని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అలాగే మహారాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద స్వయం సహాయ సంఘాల మహిళలకు సర్టిఫికెట్లు/చెక్కులు అందజేశారు. పిల్లలందరికీ విద్య, యువతకు ఉపాధి, వృద్ధపౌరులకు మందులు, రైతులకు సాగునీరు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి ఐదు అంశాలపై పంచాధార ప్రగతి సూత్రం కింద తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి యావత్మల్లో నేడు నిర్వహించిన కార్యక్రమం ఒక

కొనసాగింపు మాత్రమేనని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

యావత్మల్లో రూ.500 కోట్ల విలువైన రోడ్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి ఒక బటన్ నొక్కడంద్వారా శంకుస్థాపన చేశారు. అదే సమయంలో హమ్సఫర్ అజ్ని(నాగ్పూర్)-పుణె రైలును వీడియో సంధానంద్వారా పచ్చజెండా ఊపి సాగనంపారు. అభివృద్ధికి అనుసంధానమే కీలకమని ఆయన నొక్కిచెప్పారు. ఆ మేరకు యావత్మల్, దాని పరిసర ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధికి రోడ్డు, రైలు మార్గాల ప్రాజెక్టులు

దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- “పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో మనమంతా తీవ్ర ఆవేదన, విషాదంలో మునిగి ఉన్నాం. ముష్కరుల దుశ్చర్య ఫలితంగా

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సాహసపుత్రులు కూడా దేశ సేవలో అమరులయ్యారు. వారి కుటుంబ విషాదంలో మేం పాలు పంచుకుంటున్నాం. వారి త్యాగాలు ఎన్నటికీ వృథాకావు. బదులు తీర్చుకునే దిశగా సమయం, సందర్భం, స్థలం, విధానాలను నిర్ణయించుకునే సంపూర్ణ స్వేచ్ఛను భద్రత దళాలకు కల్పించాం. మనం కన్న కలలను సాకారం చేసుకునే దిశగా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామంటే అది కేవలం మన సాహస సైనికుల త్యాగాల కారణంగానే!” అని పేర్కొన్నారు.

 

సికిల్ సెల్ (రక్తహీనత) వ్యాధిపై పరిశోధనల కోసం చంద్రాపూర్లో పరిశోధన కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా శాస్త్రకుండ్ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంగల ఈ పాఠశాల ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. గిరిజన బాలల ఆకాంక్షలను ఈ పాఠశాల నెరవేర్చగలదని ప్రధాని ఆశాభావం

వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో 1000 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న తన

 

లక్ష్యంలో భాగంగానే ఈ పాఠశాలను నిర్మించినట్లు ప్రధాని వివరించారు. “జన్ధన్ నుంచి వన్ధన్దాకా

గిరిజనుల సమగ్రాభివృద్ధికి మేం ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నాం. పేదలకు ఆర్థిక సార్వజనీనత కల్పనలో జన్ధన్ దోహదపడింది. అదేవిధంగా అటవీ చిరు ఉత్పత్తులద్వారా వన్ధన్ కూడా అదనపు ఆదాయం ఆర్జించడంలో పేదలకు తోడ్పడుతోంది. అటవీ చిరు ఉత్పత్తులకు అదనపు విలువను జోడించే దిశగా వన్ధన్ కేంద్రాలను మేం ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా గిరిజనులకు వారి ఉత్పత్తులపై గిట్టుబాటు ధర లభిస్తుంది. మేం వెదురును ఆంక్షల బంధం నుంచి విముక్తం చేశాం. ఆ మేరకు వెదురుతో, దాని ఉత్పత్తులతో గిరిజనులు తమ ఆదాయార్జనను వైవిధ్యీకరించుకోవచ్చు” అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు.

 

స్వాతంత్ర్యోద్యమంలో గిరిజన యోధుల త్యాగాలను స్మరిస్తూ- వారి స్మృతులను దేశవ్యాప్తంగా ప్రదర్శనశాలలు, జ్ఞాపికల రూపంలో భద్రపరుస్తున్నామని చెప్పారు.  

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Overjoyed by unanimous passage of Bill extending reservation for SCs, STs in legislatures: PM Modi

Media Coverage

Overjoyed by unanimous passage of Bill extending reservation for SCs, STs in legislatures: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Citizenship (Amendment) Bill will alleviate the suffering of many who faced persecution for years: PM
December 11, 2019
షేర్ చేయండి
 
Comments

Expressing happiness over passage of the Citizenship (Amendment) Bill, PM Narendra Modi said the Bill will alleviate the suffering of many who faced persecution for years.

Taking to Twitter, the PM said, "A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood! Glad that the Citizenship (Amendment) Bill 2019 has been passed in the Rajya Sabha. Gratitude to all the MPs who voted in favour of the Bill."