షేర్ చేయండి
 
Comments
అంతర్జాతీయ సౌర అలయన్స్ (ఐఎస్ఎ) వాతావరణాన్ని నిర్థారిస్తూ ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసింది
ఈరోజు చమురు బావులు పోషించే పాత్రను సూర్య కిరణాలు పోషించనున్నాయి: ఐఎస్ఎ యొక్క మొదటి అసెంబ్లీలో ప్రధాని మోదీ
2030 నాటికి కాని శిలాజ ఇంధన ఆధారిత వనరులను ఉపయోగించి మా విద్యుత్లో 40% ఉత్పత్తి చేయాలని నిర్ణయించాము: ప్రధాని మోదీ
పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి, పునరుత్పాదక ఇంధనం యొక్క విస్తరణ కోసం కార్యాచరణ ప్రణాళికపై మనము పని ప్రారంభించాము: ప్రధాని మోదీ
సోలార్ అండ్ విండ్ పవర్తో పాటు మేము 3 బిలు: బయోమాస్-బయో ఫ్యూయెల్-బయోఎర్జీర్:

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఒక‌టో స‌భ ను విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఈ రోజు ప్రారంభించారు. రెండో ఐఒఆర్ఎ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ మినిస్టీరియ‌ల్ మీటింగ్ రెండో గ్లోబ‌ల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ఇన్వెస్ట‌ర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) ల ప్రారంభం కూడా ఇదే కార్య‌క్ర‌మం లో చోటు చేసుకొంది. ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, మాన‌వాళి గ‌త 150-200 సంవ‌త్స‌రాలు గా శ‌క్తి అవ‌సరాల కోసం శిలాజ జ‌నిత ఇంధ‌నాల పై ఆధార ప‌డింద‌న్నారు. సౌర‌ శక్తి, ప‌వ‌న‌ శక్తి, ఇంకా జ‌ల శక్తి ల వంటి ఐచ్ఛికాల‌ను మ‌రింత నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి శ‌క్తి సంబంధ ప‌రిష్కార మార్గాలు గా ప్రకృతి ప్ర‌స్తుతం సంకేతీకరిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా, భ‌విష్య‌త్తు లో మాన‌వాళి సంక్షేమం కోసం 21వ శ‌తాబ్దం లో ఏర్పాటు చేసిన సంస్థ‌ ల‌ను గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకొన్న‌ప్పుడ‌ల్లా, ఆ సంస్థ‌ ల జాబితా లో ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ సోల‌ర్ అల‌య‌న్స్ అగ్ర‌ స్థానం లో నిలుస్తుంద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. జ‌ల‌, వాయు సంబంధ న్యాయం ప‌ట్ల కృషి చేసే దిశ‌ గా ఇది ఒక గొప్ప వేదిక అని ఆయ‌న చెప్పారు. రానున్న కాలం లో కీల‌క‌మైన ప్ర‌పంచ శ‌క్తి స‌ర‌ఫ‌రాదారు గా ఒపిఇసి స్థానాన్ని ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ స్వీక‌రించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి ని ఇదివ‌ర‌క‌టి క‌న్నా ఎక్కువ‌ గా వినియోగిస్తున్న తీరు యొక్క ప్రభావం భార‌త‌దేశం లో ప్ర‌స్తుతం ద్యోతకం అవుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పారిస్ ఒప్పందం ల‌క్ష్యాల దిశ‌గా ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక కోసం భార‌త‌దేశం కృషి చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. 2030వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం యొక్క మొత్తం శ‌క్తి అవ‌స‌రాల లో 40 శాతం వ‌ర‌కు శిలాజ జనితం కానటువంటి ఇంధ‌న వ‌న‌రుల ద్వారా ఉత్ప‌త్తి చేయాల‌నేది ల‌క్ష్య‌ం అని ఆయ‌న చెప్పారు. ‘‘పేద‌రికం నుండి విద్యుత్తు’’ కు సంబంధించినటువంటి ఒక కొత్త ఆత్మ విశ్వాసాన్ని భార‌త‌దేశం అల‌వ‌ర‌చుకొంటోంద‌ని ఆయ‌న తెలిపారు.

విద్యుత్తు ఉత్ప‌త్తి తో పాటు, విద్యుత్తు నిలవ కూడా ముఖ్య‌మేన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా నేశ‌న‌ల్ ఎన‌ర్జీ స్టోరేజ్ మిశ‌న్ ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ మిశ‌న్ లో భాగంగా ప్ర‌భుత్వం డిమాండు ను సృష్టించ‌డం, దేశీయంగా త‌యారు చేయ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ లు, ఇంకా శ‌క్తి నిలవ చేయ‌డం అంశాల పై శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌న్నారు.

భార‌త‌దేశం సౌర విద్యుత్తు కు, ప‌వ‌న విద్యుత్తు కు తోడు బ‌యోమాస్‌, బ‌యో ఫ్యూయ‌ల్‌, ఇంకా బ‌యో-ఎన‌ర్జీ ల‌పై క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. భార‌త‌దేశ ర‌వాణా వ్య‌వ‌స్థ ను స్వ‌చ్ఛ ఇంధ‌న ఆధారిత‌మైంది గా మ‌ల‌చేందుకు ప్ర‌యత్నాలు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. బ‌యో-వేస్ట్ ను బ‌యో ఫ్యూయ‌ల్ గా మార్చ‌డం ద్వారా భార‌త‌దేశం ఒక స‌వాలు ను ఒక అవ‌కాశం గా తీసుకొంటోంద‌ని ఆయ‌న చెప్పారు.

 

 

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
9 admissions a minute, Ayushman Bharat completes 50 lakh treatments

Media Coverage

9 admissions a minute, Ayushman Bharat completes 50 lakh treatments
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Over 50 Lakh Benefit under Ayushman Bharat
October 15, 2019
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi lauded the efforts made in the health sector as India achieved a major milestone of providing benefit to over 50 Lakh people under the Ayushman Bharat Scheme.

He said “An important milestone in the journey of creating a healthy India!It would make every Indian proud that in a year, over 50 lakh citizens have benefited from free of cost treatment thanks to Ayushman Bharat. Apart from curing, this scheme is empowering several Indians.”