షేర్ చేయండి
 
Comments

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు నానాజీ దేశ్ ముఖ్ సమాజానికి చేసిన సేవను ప్రధాని కొనియాడారు. ‘‘గ్రామీణాభివృద్ధి కోసం నానాజీ దేశ్ ముఖ్ చేసిన కృషి అద్వితీయమైనది. గ్రామాల్లో నివసించే ప్రజల సాధికారతకు సరికొత్త దిశను చూపింది. అణగారినవర్గాలకు సేవకు అంకితమైన ఆయన- వినమ్రత, సహానుభూతికి నిలువెత్తు రూపం. అందువల్ల ఆయన రూపెత్తిన ‘భారతరత్నమే’ అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ప్రధాని అభివర్ణించారు.

‘‘భూపేన్ హజారికా గీతాలు, ఆయన సంగీత ప్రజ్ఞ తరతరాలవారి మన్ననలు అందుకున్నాయి. ఆ సంగీత, గానాలలో సౌభ్రాత్రం, సామరస్యం, సాంఘిక న్యాయం ప్రతిధ్వనిస్తూంటాయి. భారతీయ సంగీత సంప్రదాయాలను ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ దా భారతరత్న పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషం కలిగిస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగురించి మాట్లాడుతూ- ‘‘మన సమకాలీనులైన ప్రణబ్ అత్యుత్తమ రాజనీతిజ్ఞులు. కొన్ని దశాబ్దాలపాటు నిర్విరామంగా, నిస్వార్థంగా దేశానికి సేవలందించారు. తద్వారా దేశాభివృద్ధి సాధనలో బలమైన ముద్రవేశారు. ఆయన వివేకం, మేధస్సుకు సరితూగగలవారు అరుదే. ఆయనకు భారతరత్న పురస్కారం లభించడం నాకెంతో ముదావహం’’ అని హర్షం ప్రకటించారు.

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
All citizens will get digital health ID: PM Modi

Media Coverage

All citizens will get digital health ID: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 28, 2021
షేర్ చేయండి
 
Comments

శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘మా పార్టీ కి శ్రీ ఎస్. సెల్వగణపతి గారు పుదుచ్చేరి నుంచి ప్రప్రథమ రాజ్య సభ ఎంపి అవడం అనేది బిజెపి లో ప్రతి ఒక్క కార్యకర్త కు అపారమైన గౌరవాన్ని కలిగించేటటువంటి విషయం. పుదుచ్చేరి జనత మా యందు ఉంచిన నమ్మకానికి మేం కృత‌జ్ఞులం. పుదుచ్చేరి ప్రగతి కి మేం పాటుపడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.