దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైనవారికి ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ మేరకు నానాజీ దేశ్ ముఖ్ సమాజానికి చేసిన సేవను ప్రధాని కొనియాడారు. ‘‘గ్రామీణాభివృద్ధి కోసం నానాజీ దేశ్ ముఖ్ చేసిన కృషి అద్వితీయమైనది. గ్రామాల్లో నివసించే ప్రజల సాధికారతకు సరికొత్త దిశను చూపింది. అణగారినవర్గాలకు సేవకు అంకితమైన ఆయన- వినమ్రత, సహానుభూతికి నిలువెత్తు రూపం. అందువల్ల ఆయన రూపెత్తిన ‘భారతరత్నమే’ అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ప్రధాని అభివర్ణించారు.

‘‘భూపేన్ హజారికా గీతాలు, ఆయన సంగీత ప్రజ్ఞ తరతరాలవారి మన్ననలు అందుకున్నాయి. ఆ సంగీత, గానాలలో సౌభ్రాత్రం, సామరస్యం, సాంఘిక న్యాయం ప్రతిధ్వనిస్తూంటాయి. భారతీయ సంగీత సంప్రదాయాలను ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్ దా భారతరత్న పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషం కలిగిస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగురించి మాట్లాడుతూ- ‘‘మన సమకాలీనులైన ప్రణబ్ అత్యుత్తమ రాజనీతిజ్ఞులు. కొన్ని దశాబ్దాలపాటు నిర్విరామంగా, నిస్వార్థంగా దేశానికి సేవలందించారు. తద్వారా దేశాభివృద్ధి సాధనలో బలమైన ముద్రవేశారు. ఆయన వివేకం, మేధస్సుకు సరితూగగలవారు అరుదే. ఆయనకు భారతరత్న పురస్కారం లభించడం నాకెంతో ముదావహం’’ అని హర్షం ప్రకటించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The entrepreneurs building a self-reliant India

Media Coverage

The entrepreneurs building a self-reliant India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2026
July 21, 2026

Self-Reliance Is No Longer a Slogan — It’s Happening Across Engines, UPI, Vaccines & FDI Under the Leadership of PM Modi