మహిళ ల గౌరవాన్ని పరిరక్షించడానికి మరియు వారి సశక్తీకరణ కు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దీనికి ఇండియా పోస్ట్ ప్రారంభించిన ‘‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర’’ అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ గా ఉంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మహిళా సమ్మాన్ పొదుపు ధ్రువపత్రాలు, 2023 తాలూకు రాజపత్ర ప్రకటనల ను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఆ ధ్రువపత్రాల ను 1.59 లక్షల తపాలా కార్యాలయాల లో వెనువెంటనే అందుబాటు లోకి తీసుకు రావడమైంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు గుర్తు గా ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 2023-24 బడ్జెటు లో ప్రకటించారు. మరి ఇది ఆర్థిక సేవల ను అందరి కి అందుబాటులోకి తీసుకురావడం తో పాటు గా బాలిక లు సహా మహిళ ల సశక్తీకరణ దిశ లో ఒక ముఖ్యమైనటువంటి చర్య గా కూడాను ఉంది.
ఇండియా పోస్ట్ యొక్క పలు ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘’మహిళ ల సమ్మానం మరియు సశక్తీకరణ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి ‘‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర్’’ దీనికి అతి ఉత్తమం అయినటువంటి ఉదాహరణ గా ఉంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1912742”
महिलाओं के सम्मान और सशक्तिकरण के लिए हमारी सरकार प्रतिबद्ध है और ‘‘महिला सम्मान बचत पत्र’’ इसका बेहतरीन उदाहरण है। https://t.co/ixzvvBIkfi https://t.co/xTbrNQdv6P
— Narendra Modi (@narendramodi) April 3, 2023


