గౌరవనీయ ప్రెసిడెంట్ గారు,
‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ను ఇచ్చినందుకు మీకు, సైప్రస్ ప్రభుత్వానికి, సైప్రస్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానం. ఇది వారి బలానికీ, ఆకాంక్షలకూ గుర్తింపు. ఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.

దీనిని భారత్, సైప్రస్ మైత్రీ సంబంధాలకు, మన ఉమ్మడి విలువలతో పాటు మన పరస్పర అవగాహనకూ నేను అంకితం చేస్తున్నాను.
ఈ పురస్కారాన్ని భారతీయులందరి పక్షాన సవినయంగాను, కృతజ్ఞతతోను అందుకొంటున్నాను.
శాంతి, భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలతో పాటు మా ప్రజల సమృద్ధికి ఒక ప్రతీక ఈ అవార్డు.
గౌరవనీయా,
భారత్, సైప్రస్ మైత్రీ బంధాలను బలపరచడంలో ఒక బాధ్యతగా ఈ గౌరవాన్ని నేను స్వీకరిస్తున్నాను.

రాబోయే కాలంలో మన భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకొంటుందని నేను నమ్ముతున్నాను. మరి, మనం కలసికట్టుగా, మన దేశాల అభివృద్ధికే కాకుండా ప్రపంచ శాంతి- భద్రతల కోసం కూడా కృషి చేద్దాం.
ఈ సత్కారాకిగాను మరోసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీకు అనేకానేక ధన్యవాదాలు.


