ఎక్స్‌లెన్సీ,

మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేం చాలా స్నేహపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. దక్షిణ అమెరికాలో పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చు, కానీ మనం ఒకే తరహా ప్రజాస్వామిక విలువలను పంచుకొంటున్నాం. అంతేకాక మన దేశాల ప్రజల అభ్యున్నతి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొంటున్నాం.

ఎక్స్‌లెన్సీ,

మీ పర్యటన నిజంగానే చరిత్రాత్మకం. పరాగ్వే అధ్యక్షుడు భారత్‌ను సందర్శించడం ఇది రెండో సారి.

ఎక్స్‌లెన్సీ,

సీనియర్ మంత్రులతో పాటు ఒక బలమైన ప్రతినిధి వర్గంతో కలసి మీరు ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. మీరు ఒక్క ఢిల్లీలోనే కాకుండా ముంబయిలోనూ పర్యటిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య పటిష్ఠ సంబంధాలను నిర్మించుకోవాలనే మీ నిబద్ధతను చాటి చెబుతోంది. కలసి పనిచేయడం ద్వారా, మనం ఉమ్మడి వృద్ధితో పాటు సమృద్ధిని సాధించుకోవడం కోసం బాట వేయగలమని నేను నమ్ముతున్నా.

ఎక్స్‌లెన్సీ,

డిజిటల్ సాంకేతికత, కీలక ఖనిజాలు, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రక్షణ, రైల్వేలు, అంతరిక్షంతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం.. ఈ తరహా రంగాల్లో సహకారానికి కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయని మనం భావిస్తున్నాం.

ఎంఈఆర్‌సీఓఎస్‌యూఆర్ (MERCOSUR)తో మనం ఒక ప్రాధాన్యపూర్వక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. దానిని మరింత విస్తరించడానికి మనం కలసి పనిచేసే వీలు ఉంది.

ఎక్స్‌లెన్సీ,

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంలో భారత్, పరాగ్వేలు ఏకతాటి మీద నిలిచాయి. సైబర్‌ నేరాలు, వ్యవస్థీకృ‌త నేరాలతో పాటు మత్తుమందులను అక్రమంగా తరలించడం వంటి ఉమ్మడి సవాళ్లకు ఎదురొడ్డి పోరాడడంలో సహకరించుకోవడానికి ఎన్నో సంభావ్యతలు ఉన్నాయి.

ఎక్స్‌లెన్సీ,

గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల్లో) విడదీయలేని అంతర్భాగాలుగా భారత్, పరాగ్వేలు ఉన్నాయి. మన ఆశలు, ఆకాంక్షలే కాకుండా సవాళ్లు కూడా ఒకటే. మరి ఈ కారణంగానే మనం ఈ సవాళ్లతో దీటుగా వ్యవహరించడానికి పరస్పర అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోగలుగుతాం. 

కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండియా తన టీకా మందులను పంచుకోవడం ద్వారా పరాగ్వేకు మద్దతును అందించగలిగినందుకు మేం సంతోషిస్తున్నాం. మాకున్న మరిన్ని సామర్థ్యాలను పంచుకొంటూ ఇదే సహకార స్ఫూర్తిని ఇక ముందూ కొనసాగించాలని మేం భావిస్తున్నాం.

ఎక్స్‌లెన్సీ,

మీ పర్యటన మన సంబంధాల్లో సన్నిహిత సంబంధాలతో పాటుగా నమ్మకం, వాణిజ్యం అనే స్తంభాలకు కొత్త బలాన్ని జోడించగలదని నేను విశ్వసిస్తున్నా. ఇది భారత్-లాటిన్ అమెరికా సంబంధాలకు కూడా సరికొత్త పార్శ్వాలను జత చేయగలుగుతుంది.

కిందటి ఏడాదిలో గయానాలో క్యారికామ్ శిఖరాగ్ర సదస్సుకు నేను హాజరయ్యా. మనం అనేక విషయాల్లో సహకారాన్ని పెంచుకోవడం గురించి చర్చించాం. ఈ రంగాలన్నింటిలో పరాగ్వేతో పాటు లాటిన్ అమెరికా దేశాలతో మనం కలసి పనిచేయవచ్చని నేను అనుకుంటున్నా.

మరోసారి భారత్‌ తరఫున మీకు స్నేహపూర్వక స్వాగతం పలుకుతున్నా.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s healthcare sector seeing a fundamental digital transformation: Report

Media Coverage

India’s healthcare sector seeing a fundamental digital transformation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 ఫెబ్రవరి 2026
February 11, 2026

Empowering India: PM Modi's Policies Fueling Innovation, Jobs, and Sustainability