ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భారతదేశంలో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ నారీశక్తి ఆత్మ-విశ్వాసమే వారి విజయాలకు కారణమని అన్నారు. అమృత కాలంలో కలలు సాకారం చేసుకోగలమనే హామీని ఈ విజయాలు అందిస్తాయని పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలి మహిళా లోకో పైలట్ శ్రీమతి సురేఖా యాదవ్ గురించి కేంద్రమంత్రి శ్రీ రావు సాహెబ్ పాటిల్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ
‘‘ఇదే నవభారత నారీశక్తి ఆత్మవిశ్వాసం. ప్రజాజీవనంలోని అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధించి తమ పేరు చిరస్థాయిగా లిఖించుకుంటున్నారు. అమృత కాలం సంకల్పాలు నెరవేర్చుకోగలమనే విశ్వాసాన్ని ఇది అందిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
यह नए भारत की नारीशक्ति का आत्मविश्वास है! जीवन के हर क्षेत्र में आज महिलाएं जिन उपलब्धियों को अपने नाम दर्ज करा रही हैं, वो अमृतकाल में देश के संकल्पों के साकार होने का विश्वास दिलाती हैं। https://t.co/cyFvpubnsl
— Narendra Modi (@narendramodi) March 15, 2023


