ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్న కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నీ భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఆయన 2026 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు భారత్‌లో అధికార పర్యటనలో ఉంటారు. ప్రధాని శ్రీ కార్నీ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటి సారి.

ప్రధాని శ్రీ కార్నీ ఫిబ్రవరి 27న ముంబయి చేరుకొంటారు. రెండు రోజుల పాటు, ఆయన వేర్వేరు వాణిజ్య ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారతీయ సీఈఓలు, కెనడా సీఈఓలు, పరిశ్రమ నిపుణులు, ఆర్థిక నిపుణులు, నూతన ఆవిష్కర్తలు, విద్యారంగ ప్రముఖులతో పాటు భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న కెనడా పెన్షన్ ఫండ్స్ విషయమై కూడా శ్రీ కార్నీ మాటామంతీ జరుపుతారు.

మార్చి నెల 1న ప్రధాని శ్రీ కార్నీ న్యూఢిల్లీకి వెళ్తారు. మార్చి 2వ తేదీన, ప్రధానమంత్రులు ఇద్దరూ హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలూ భారత్-కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న వివిధ రంగాల్లో ఇంతవరకు నమోదైన పురోగతిని సమీక్షిస్తారు. 2025 జూన్‌లో కనానస్కిస్‌లోనూ, 2025 నవంబరులో జోహాన్సెస్‌బర్గ్‌లోనూ ఉభయులూ నిర్వహించిన సమావేశాలకు కొనసాగింపుగా ప్రస్తుతం ఈ సమావేశాలు చోటు చేసుకోనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, నవకల్పన, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా కీలక రంగాల్లో ప్రస్తుత సహకారాన్ని కూడా వారు సమీక్షిస్తారు. నేతలిరువురూ ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై తమ అభిప్రాయాల్ని పంచుకుంటారు.

ప్రధానమంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ కార్నీ అదే రోజున జరగనున్న భారత్, కెనడా సీఈఓల వేదిక సమావేశంలోనూ పాల్గొంటారు.

భారత్, కెనడాల ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకుపోతున్న క్రమంలో ఒక ముఖ్య తరుణంలో ఈ పర్యటన చోటు చేసుకొంటోంది. ఇద్దరు ప్రధానులూ ఇదివరకే ఒక నిర్మాణాత్మక, సమతౌల్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలని సమ్మతిని వ్యక్తం చేశారు. ఆ భాగస్వామ్యం పరస్పర ఆందోళనకారకాలూ, సూక్ష్మగ్రాహ్యత ల విషయంలో పరస్పర గౌరవం, బలమైన ప్రజా సంబంధాలు, అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక పూరకత్వంపై ఆధారపడనుంది. నేతలిద్దరి మధ్య జరగబోయే సమావేశం సానుకూల గతిని వేగిరం చేయడానికే కాక భారత్, కెనడాల మధ్య భవిష్యోన్ముఖ భాగస్వామ్యాన్ని పటిష్ఠపరుచుకోవాలన్న ఉమ్మడి దృష్టికోణాన్ని అలవరుచుకొనేందుకు కూడా ఓ సదావకాశాన్ని అందిస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional