విద్యార్థులు పరిశ్రమ నిపుణులను సంప్రదించి, వారు ఎలా పని చేస్తారో అర్థం చేసుకోవాలి
· చదువు, కళ వేర్వేరు అంశాలు కాదు
· చదువుల ఒత్తిడి, అలసట నుంచి కళల ద్వారా ఉపశమనం
· రోడ్లపై చెత్త వేయొద్దని, రోడ్లపై ఉమ్మవద్దని, రెడ్ లైట్ పడితే ఆగాలని, ఆహారాన్ని వృధా చేయొద్దని పౌరులను కోరిన ప్రధాని
· 2047 నాటికి వికసిత భారత నిర్మాణంలో ప్రతి చిన్న అడుగూ కీలకమే
· క్రమశిక్షణే కీలకం.. దానికి బలాన్నిచ్చేది ప్రేరణ
· సాంకేతికతకు బానిస కావొద్దు
· సాంకేతికత గొప్ప టీచర్.. సద్వినియోగం చేసుకోండి
· ప్రయాణించండి: ప్రదేశాలను చూడడమే కాదు.. విద్యార్థిలా వాటిని అర్థం చేసుకోండి
· భారత్ ఓ అద్భుతం – ప్రయాణించండి.. అన్వేషించండి
· మీరు చదివిందెప్పుడూ వృథా కాదు.. మీ మనోఫలకంపై అది నిలిచే ఉంటుంది
· చదువుల్లో ఇబ్బంది పడేవారితో స్నేహం చేసి, వారికి సహాయం చేయండి
· క్రీడలను జీవితంలో భాగం చేసుకోవడం ముఖ్యం
· ముందుండి నడిపించే మనస్తత్వాన్ని అలవరచుకుని నాయకుడిగా ఎదగండి
· ఆలోచనలను స్పష్టంగా, ప్రభావవంతంగా వ్యక్తపరిచేవాడే సమర్థుడైన నాయకుడు
· బలమైన మౌలిక సదుపాయాలే దీర్ఘకాలిక అభివృద్ధికి పునాదులు
· చదవడమే కాదు.. రాస్తూ కూడా సాధన చేయండి
· విజయాల్నే చూసి మురిసిపోకండి.. గొప్ప వాళ్లు కింది స్థాయి నుంచి ఎలా ఎదిగారో నేర్చుకోండి
· గిరిజన సమాజాలు భారత పురోగతిని సుసంపన్నం చేశాయి
· విశ్రమించకండి.. జీవితంలో మరింత ఉన్నతి కోసం కృషి చేయండి
· మన గురించి మనం విశ్లేషించుకోవడం ముఖ్యం
· రోజులో కనీసం ఒకసారైనా శ్వాస వ్యాయామాలు చేయాలి
· ఇతరులతో పోల్చుకుని ఒత్తడికి లోనవ్వొద్దు.. నేర్చుకోండి, మెరుగులు దిద్దుకోండి
· తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చి నిరుత్సాహపరచొద్దు
· మీ కన్నా మెరుగైన వ్యక్తుల నుంచి నేర్చుకునేందుకు సంశయించొద్దు
· మీపై మీరు నమ్మకముంచండి: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో  మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.

ప్రధానమంత్రి: వనక్కం!

విద్యార్థులు: వనక్కం సర్!

ప్రధానమంత్రి: మీరందరూ ఏదైనా తిన్నారా లేదా?

విద్యార్థులు: లేదు సర్. మేం ముందే తినేశాం. 

ప్రధానమంత్రి: ఏం తిన్నారు?

విద్యార్థులు: మేం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకున్నాం. 

ప్రధానమంత్రి: ఇంటి నుంచా!.. చాలా మంచిది.

విద్యార్థి: నేను ఆయన్ని చూడగానే నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.

విద్యార్థి: మొదట నేను ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఏదో ఒక ప్రత్యేకమైన, నాటకీయ ప్రవేశం ఉంటుందని ఊహించాను. కానీ ఆయన చాలా సాదాసీదాగా, వినమ్రంగా ఎంతో ఒదిగి ఉన్నారు. 

విద్యార్థి: ఆయన లోపలికి నడిచి వచ్చినప్పుడు నాకు రోమాలు నిలబడ్డాయి. ఆయన నిజంగా చాలా గొప్పగా ఉన్నారు.

ప్రధానమంత్రి: గత కొన్నేళ్లుగా నేను 'పరీక్షా పే చర్చ' ద్వారా 10, 12వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నాను. ఇది నేను మీకు నేర్పించడానికి కాదు మీ నుంచి నేర్చుకోవడానికి చేస్తున్నాను. నాకైతే ఇది ఒక గొప్ప అభ్యాస అనుభవం. అందుకే ఈ రోజు మీ నుంచి నేర్చుకోవడానికి తమిళనాడు యువతను కలుస్తున్నాను. కాబట్టి మీలో ఎవరైనా ఏదైనా పంచుకోవాలనుకుంటే వినటానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఎవరు మొదలుపెడతారు?

విద్యార్థి: నా పేరు ఛవి జైన్. నేను ఒక అంకురాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నేను ఏ విషయాల గురించి తెలుసుకోవాలి? విద్యానభ్యసించే స్థాయిలో నా అంకురానికి ఉపయోగపడేలా నేను ఏమి చేయాలి?

ప్రధానమంత్రి: నీవు చెప్పింది ముమ్మాటికీ నిజం. ఈ రోజుల్లో నేను ఎప్పుడు యువతను కలిసినా వారు వెంటనే అంకురాల గురించే మాట్లాడుతున్నారు. నీవు ఏమి చేయాలనుకుంటున్నావు అనేదానిపై మొదట దృష్టి పెట్టాలి. కొన్ని అంకురాలు సాంకేతిక ఆవిష్కరణల గురించి ఉంటాయి. కొందరు డ్రోన్‌లను తయారు చేయాలనుకోవచ్చు. మరి కొందరు ఇంట్లో విద్యుత్ కోసం కొత్త వ్యవస్థలను రూపొందించాలనుకోవచ్చు. నీకు సాంకేతికతలో ప్రావీణ్యం ఉన్న కొందరు స్నేహితులు ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో దిట్ట అయి ఉండే స్నేహితులు కూడా ఉండొచ్చు. నలుగురు స్నేహితులతో ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసి చదువుతో పాటుగా ఏదైనా ప్రారంభించండి. అంకురాన్ని ప్రారంభించడానికి 25 ఏళ్లు నిండాలనే వయోపరిమితి ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. చిన్న అంకురాలు కూడా పెద్దగా ఎదగగలవు. నీకు ఆసక్తి ఉండటం చాలా అద్భుతం. కొన్ని అంకురాలను సందర్శించు. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయి. వారికి నిజాయితీగా ‘నేను పాఠశాల విద్యార్థిని.. ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను’ అని చెప్పు. వారు ఏదీ దాచిపెట్టరు. విషయాలన్నీ పంచుకుంటారు. క్రమంగా దానిని ఎలా చేయవచ్చనే దానిపై నీకు అవగాహన వస్తుంది.

విద్యార్థి: సర్, నేను చదువుపై ఎక్కువ దృష్టి పెడితే నా అభిరుచిని నిర్లక్ష్యం చేస్తానేమోనని నాకు ఎప్పుడూ భయంగా ఉంటుంది. కానీ నా అభిరుచిపై ఎక్కువ దృష్టి పెడితే నా చదువు దెబ్బతింటుంది. నేను రెండింటినీ ఎలా సమతుల్యం చేసుకోవాలి?

ప్రధానమంత్రి: చూడండి.. మొదటగా ఇవి రెండు వేర్వేరు విషయాలు అని ఎందుకు అనుకుంటున్నారు? రెండూ ఉపయోగకరమైనవే. ఉదాహరణకు మీకు చిత్రలేఖనం అంటే ఇష్టమనుకుందాం. మీరు సైన్స్ సబ్జెక్టులో ప్రయోగశాల, రసాయనాల మిశ్రమాల గురించి చదువుతున్నారు. అప్పుడు మీరు ఒక కాగితం తీసుకుని ఆ ల్యాబ్‌ను గీసి రంగులు వేసి ఆ సీసాలపై రసాయనాల పేర్లను లేబుల్ చేయొచ్చు. ఆ పాఠంలో రెండు రసాయనాలను కలిపితే ఒక నిర్దిష్ట రంగు వస్తుందని ఉంటే ఆ రంగును మీరు పాత్రలో గీసి చూపించొచ్చు. ఈ విధంగా మీ చిత్రలేఖనం పూర్తవుతుంది.. మీ పాఠం కూడా గుర్తుండిపోతుంది. కాబట్టి రెండింటినీ అందంగా కలిపేయచ్చు. కళలు, చేతిపని పట్ల మీకున్న అభిరుచి చదువు వల్ల కలిగే అలసటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు రోజుకు అరగంట లేదా వారానికి రెండు సార్లు కేటాయించొచ్చు. సమాజం కోసం అవసరమైన విద్యను తప్పక అభ్యసించాలి.. కానీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే వాటిని కూడా దానితో పాటు కొనసాగించొచ్చు.

విద్యార్థి: మన దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరబోతోంది. నా ప్రశ్న ఏంటంటే.. దీనిని సాధించడానికి యువత అయిన మేం ఏం చేయగలం?

ప్రధానమంత్రి: 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కావాలనే కల ఉండటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది నన్ను ఎంతో ఉత్సాహపరుస్తోంది! 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం అంటే ఏమిటి? మీరు సింగపూర్ గురించి విన్నారా? ఒకప్పుడు అది కేవలం ఒక చిన్న మత్స్యకార గ్రామం. ఈ రోజు అది ఎంతో అభివృద్ధి చెందింది. ‘మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అభివృద్ధి చెందిన దేశాల అలవాట్లను మనం అలవర్చుకోవాలి’ అని లీ క్వాన్ యూ అనేవారు. మనం ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తూ ఒక వెనుకబడిన దేశంలా ప్రవర్తించకూడదు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు రెడ్ లైట్ పడినప్పుడు మీ స్కూటర్‌ను సరిగ్గా ఆపండి. ఇంట్లో భోజనం తర్వాత అన్నం వృథా చేయకూడదని నిర్ణయించుకోండి. అందరూ ఇలా చేస్తే ఎంత ఆహారం ఆదా అవుతుందో, ఎంత ప్రయోజనం కలుగుతుందో ఊహించండి! పౌరులుగా మనం ఇటువంటి పద్ధతులను పాటిస్తే మనం అభివృద్ధి చెందిన భారతదేశానికి సహకరిస్తున్నట్లే. ఇప్పుడు 'వోకల్ ఫర్ లోకల్' తీసుకోండి. నేను భారతదేశంలో తయారైన వస్తువులనే కొంటాను. 'భారత్‌లో తయారీ'కి మద్దతు ఇస్తాను. నేను 'భారత్‌లో పెళ్లి చేసుకోండి' అని ఇంతకుముందు చెప్పాను. కొంతమంది ధనవంతులు పెళ్లిళ్ల కోసం దుబాయ్ వెళ్లాలని ఆలోచిస్తారు. ఎందుకు? భారతదేశానికి ఏ లోటు ఉంది? పౌరులుగా మనం చిన్న చిన్న విషయాల్లో బాధ్యత తీసుకుంటే అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మనం ఖచ్చితంగా తోడ్పడగలం.

 

విద్యార్థి: మేం ఆశ్చర్యపోయాం. దేవుడా.. ప్రధానమంత్రి నిజంగా దీని గురించి పట్టించుకున్నారు. పెద్ద అడుగులు కాదు.. చిన్న చిన్న అడుగులే ముఖ్యమని మాకు చెప్పారు.

విద్యార్థి: నా ప్రశ్న ఏంటంటే.. ఎవరైనా విద్యార్థి లేదా వ్యక్తి తమ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. పరిస్థితులు కష్టంగా మారినప్పుడు ముందుకు సాగాలనే ప్రేరణ తరచుగా తగ్గిపోతుంది. అటువంటప్పుడు విజయం సాధించడానికి మనకు ప్రేరణ అవసరమా లేక క్రమశిక్షణ అవసరమా?

ప్రధానమంత్రి: జీవితంలో రెండూ ముఖ్యమే. క్రమశిక్షణ లేకపోతే మీకు ఎంత స్ఫూర్తి ఉన్నా అది ఉపయోగపడదు. తన పొరుగు రైతు ఎక్కువ పంట పండించాడని చూసి స్ఫూర్తి పొందిన ఒక రైతును ఊహించుకోండి. ‘నా భూమి ఇంకా పెద్దది.. నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి’ అని ఆ రైతు అనుకుంటాడు. దీని నుంచి ఆయన స్ఫూర్తి పొందుతాడు. కానీ వర్షాలు పడకముందే పొలాన్ని దున్నాల్సి వచ్చినప్పుడు.. ‘వచ్చే వారం చేద్దాంలే’ అని వాయిదా వేస్తాడు. వర్షాలకు ముందే పొలాన్ని దున్నకపోతే ఆ తర్వాత ఆయన ఏమి చేసినా పరిస్థితి బాగుండదు. ఆయనకు స్ఫూర్తి ఉంది కానీ క్రమశిక్షణ లేదు. జీవితంలో క్రమశిక్షణ అనేది అత్యవసరం. స్ఫూర్తి దానికి విలువనిస్తుంది. క్రమశిక్షణ లేకపోతే ఎంత గొప్ప స్ఫూర్తి అయినా సరే ఒక భారంగా మారి చివరికి నిరాశకు దారితీస్తుంది.

విద్యార్థి: చాలా ఏళ్లుగా నా మనసులో ఉండిపోయిన సందేహమే నేను ప్రశ్నగా అడిగాను. ఇప్పుడు చివరకు నేను ఎంతో గౌరవించే వ్యక్తి నుంచి దానికి స్పష్టత రావడం నాకు చాలా గొప్పగా, గర్వంగా అనిపిస్తోంది.

విద్యార్థి: సర్.. ఈ రోజుల్లో ఏఐ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. చాలా కంపెనీలలో కేవలం మనుషులే కాకుండా ఏఐ ఉద్యోగులు కూడా ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే.. మేం ఏఐ గురించి గురించి భయపడాలా? మా భవిష్యత్తు జీవన మార్గాలను ఎంచుకునేటప్పుడు మేం వేటిని మనసులో ఉంచుకోవాలి?

ప్రధానమంత్రి: చూడండి.. ప్రతి యుగంలోనూ కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుందో అని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది ఎప్పుడూ ఉండేదే. మనం దేనికీ భయపడకూడదు. మన ప్రయత్నం ఎలా ఉండాలంటే.. మనం దానికి బానిసలుగా మారకూడదు. నా జీవితంలో నిర్ణయాధికారిగా నేనే ఉండాలి. సాంకేతికత నాకు యజమాని కాకూడదు. ఉదాహరణకు కొంతమంది పిల్లలు తమ మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. ఫోన్ లేనిదే వారు తినలేరు… టీవీ లేనిదే ఉండలేరు. అంటే వారు బానిసలుగా మారారని అర్థం. ‘నేను దేనికీ బానిసను కాను’ అని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. సాంకేతికతను మన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి. నేను ఏఐని అడిగి.. ‘ఈ సబ్జెక్టుపై అత్యుత్తమ పుస్తకం ఏది?’ అని తెలుసుకుంటే అది ఉపయోగకరం. కానీ నేను ‘నేను చదవను.. నువ్వే అందులో ఏముందో చెప్పు’ అని అంటే అది తప్పు. ఉద్యోగాల స్వభావం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పూర్వం ప్రజలు ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగాలు మారాయి కానీ జీవితం కొనసాగుతూనే ఉంది. మనం సాంకేతికతను అర్థం చేసుకోవాలి. మన పరిధిని విస్తరించుకోవాలి. దాని సహాయంతో మన పనికి అదనపు విలువను జోడించాలి. మనం ఇలా చేస్తే సాంకేతికత ఎంత పురోగమించినా అది మనకు ఎప్పుడూ ఉపయోగకరంగానే ఉంటుంది. మనం దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు.

 

విద్యార్థి: మన ప్రధానమంత్రితో కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంపిక అవుతానని నేను ఎప్పుడూ నమ్మలేదు.

విద్యార్థి: ఇది నిజంగా ఒక గొప్ప అనుభవం. నేను పూర్తిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఇది ఎంతో సహజంగా అనిపించింది.

విద్యార్థి: ఆయన ప్రధానమంత్రి కంటే మన కుటుంబ సభ్యుడిలాగే అనిపించారు.

ప్రధానమంత్రి: మిత్రులారా.. కోయంబత్తూరులోని మన యువ మిత్రులు తమ చదువుతో పాటు ఏఐ, అంకురాలు, భవిష్యత్తు సాంకేతికతలపై చాలా అవగాహన కలిగి ఉన్నారు. ఇది నవ భారత యువ ఆలోచన అని నేను చెప్పగలను. ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పానికి సరికొత్త బలాన్ని ఇస్తోంది.

ప్రధానమంత్రి: మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’ అంటే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవడం. ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ కోయంబత్తూరు తర్వాత కొన్ని వారాలకు మన చర్చ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చేరుకుంది. అక్కడ కూడా నేను పిల్లలతో చాలా ఆసక్తికరమైన సంభాషణలు చేశాను. నేను ఒక మాట చెప్పాలి. అక్కడ కేవలం చర్చలే జరగలేదు. నేను అక్కడి రుచికరమైన స్థానిక ఆహారాన్ని కూడా రుచి చూశాను. మీరు కూడా దీన్ని ఆస్వాదించొచ్చు.

విద్యార్థి: జై జోహార్ సర్.

ప్రధానమంత్రి: జై జోహార్.

ప్రధానమంత్రి: మీకు తినడానికి ఏదైనా ఇచ్చారా?

విద్యార్థులు: ఇచ్చారు సర్.

విద్యార్థి: సర్, మీరు ఎన్నో సమావేశాలకు హాజరవుతుంటారు కదా. ఇక్కడ మాతో కలిసి మీరు ఏదైనా తినాలనుకుంటున్నారా?

ప్రధానమంత్రి: దీనిని ఎలా తయారు చేస్తారు?

విద్యార్థి: సర్, మేం శనగపిండిని చిన్న చిన్న బిళ్ళలుగా చేసి వేయిస్తాం. 

ప్రధానమంత్రి: ఓహో ఇంకా?

విద్యార్థి: ఇది రుచిగా ఉంటుంది.

ప్రధానమంత్రి: దీనిని ఎప్పుడు తింటారు?

విద్యార్థి: సర్, ఎక్కువగా దీపావళి సమయంలో తింటారు.

ప్రధానమంత్రి: దీపావళి అప్పుడా.. ఐతే సరే.

విద్యార్థి: అవును సర్.. ఎక్కువగా దీపావళి సమయంలోనే.

ప్రధానమంత్రి: దీనిని మహారాష్ట్రలో ఏమంటారో మీకు తెలుసా? దీనిని 'చక్లీ' అని పిలుస్తారు.

విద్యార్థులు: తెలియదు సర్.

ప్రధానమంత్రి: మహారాష్ట్రలో దీనిని చక్లీ అంటారు.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మరి ఇది ఏంటి?

విద్యార్థి: సర్, ఇది 'ఖుర్మీ'.

ప్రధానమంత్రి: ఆహా..

విద్యార్థి: ఇది బెల్లం, పిండి, రవ్వతో తయారవుతుంది. 

ప్రధానమంత్రి: ఇంత అద్భుతమైన ఆహారాన్ని అందించినందుకు ధన్యవాదాలు బిడ్డా.

విద్యార్థి: ఆయనకు ఖుర్మీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన స్వయంగా మాలో ప్రతి ఒక్కరికీ ఒక్కో ముక్క తినిపించారు. అది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది.

ప్రధానమంత్రి: మీ మనసులో కూడా కొన్ని ప్రశ్నలు ఉండే ఉంటాయి. ఈ రోజు వాటిని అడిగే అవకాశం మీకు ఉంది.

విద్యార్థులు: అవును సర్.

ప్రధానమంత్రి: అడగండి.

విద్యార్థి: మేం విద్యార్థులం పరీక్షల తర్వాత విహారయాత్రలకు వెళ్లాలనుకుంటాం. మేం వెళ్లడానికి భారతదేశంలో ఏవైనా ఐదు ప్రదేశాలను మీరు సూచించగలరా?

ప్రధానమంత్రి: నీవు ఏ ప్రాంతం నుంచి వచ్చావు?

విద్యార్థి: సర్, నేను రాయ్‌పూర్ నుంచి వచ్చాను.

ప్రధానమంత్రి: రాయ్‌పూర్ నుంచా. అయితే మీ ప్రాంతంలో ఏయే ప్రదేశాలు ఉన్నాయో ఒక జాబితా తయారు చేయి. దానికి ఒక గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత మీ జిల్లాలో నీవు ఇంకా చూడని ప్రదేశాల జాబితా తయారు చేయి. ఆ పైన మీ రాష్ట్రంలో అంటే ఛత్తీస్‌గఢ్‌లో నీవు ఇంకా సందర్శించని ప్రదేశాల గురించి ఆలోచించు. నీవు ఎక్కడికి వెళ్లినా ఒక విద్యార్థిలా వెళ్లు అప్పుడే పర్యాటకం ఆనందదాయకంగా మారుతుంది. రైలు కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించు. నీతో పాటు ఆహారాన్ని తీసుకెళ్లు. ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడు. జనం ఎలా ప్రవర్తిస్తారో.. ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో గమనించు. ఇది జీవితంలో ఒక ఆనందం, గొప్ప అభ్యాస అనుభవం. భారతదేశం ఎంతటి వైవిధ్యంతో నిండి ఉందంటే.. దానిని పూర్తిగా చూడటానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు.

విద్యార్థి: సర్, నా ప్రశ్న ఏంటంటే.. కొన్నిసార్లు పరీక్షల సమయంలో మేం పునఃసమీక్ష చేయలేకపోతున్నాం. దీనివల్ల మా మనస్సు అశాంతికి లోనవుతోంది. పరీక్షల సమయం, పరీక్షా హాలులోకి వెళ్లే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా?

ప్రధానమంత్రి: పరీక్షకు వారం ముందు సమయాన్ని ఒకసారి గమనించండి. మీరు ఇప్పటికే అన్ని విషయాలను క్షుణ్ణంగా చదివి ఉంటారు. మీరు విన్నది, మీరు చదివింది ఏదీ వృథా కాలేదని నమ్మండి. అది ఎక్కడో ఒకచోట మీ మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోండి.. ఆందోళన పడకండి. పరీక్షా పత్రం వచ్చినప్పుడు దానిని ప్రశాంతంగా చూడండి. మరొక విషయం.. మీరు మంచి విద్యార్థి కావాలంటే మీకు ఆ సబ్జెక్టుపై పట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి విద్యార్థి అవుతారు. ఒక సబ్జెక్టుపై పట్టు ఎలా వస్తుంది? ఒక మంచి ఆటగాడు ఎలా మంచి ఆటగాడు అవుతాడు?

విద్యార్థి: నిరంతర అభ్యాసం, స్థిరత్వం, క్రమశిక్షణ, క్రమబద్ధమైన దినచర్య ద్వారా.

ప్రధానమంత్రి: అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతను నిరంతరం పోటీ పడుతూనే ఉంటాడు. అతను కింద పడతాడు.. దెబ్బలు తింటాడు.. ఓడిపోతాడు.. గెలుస్తాడు కానీ ముందుకు సాగుతూనే ఉంటాడు. అలా అతను ఒక గొప్ప ఆటగాడిగా మారతాడు. నేను మీకు ఒక సూచన ఇస్తాను. మీ తరగతిలో చదువులో కొంచెం వెనుకబడిన విద్యార్థులు కొందరు ఉండే ఉంటారు. వారిలో ఒకరిని మీ స్నేహితుడిగా చేసుకోండి. ఈ పద్ధతి మీకు చాలా సహాయపడుతుంది. ‘ఈ రోజు నేను నీకు గణితం నేర్పించాలనుకుంటున్నాను’ అని అతనికి చెప్పండి. అతనికి లెక్కలు నేర్పించడానికి మీరు పెట్టే శ్రమ, ఏకాగ్రత వల్ల మీ సొంత గణితం ఇంకా మెరుగవుతుంది… అవునా కాదా?

విద్యార్థి: అవును సర్, ఖచ్చితంగా అవుతుంది.

విద్యార్థి: నేను టైక్వాండో ఆడతాను. భవిష్యత్తులో క్రీడాకారిణిని కావాలనుకుంటున్నాను. నేను నా చదువు, క్రీడలను ఎలా సమతుల్యం చేసుకోవాలి?

ప్రధానమంత్రి: జీవితంలో విద్య అవసరం. సమాజానికి కూడా అది అవసరం. దానిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ‘నేను క్రీడల్లో రాణిస్తున్నాను కదా ఇక చదువు అవసరం లేదు” అనే పొరపాటు ఎప్పుడూ చేయకండి. అలాగే కేవలం విద్య మాత్రమే అంతా చేస్తుంది అని కూడా అనుకోవద్దు. నీలో ప్రతిభ ఉంది.. ఏదైనప్పటికీ దానిని వృద్ధి చేసుకోవాలి. క్రీడాకారుడిగా మారడానికి ఆడటం ఒక ఎత్తైతే.. జీవితంలో 'ఆట' అనేది ఉండటం కూడా చాలా ముఖ్యం. జీవితాన్ని కాపాడుకోవడానికి జీవితంలో ఆట ఉండాలి. ప్రాణం ఉండాలంటే ఆట ఉండాలి. మీరు తప్పక ఆడాలి.. ఆడితేనే మీరు ఎదుగుతారు. అలాగే మీరు చదువుకోవాలి కూడా. లేదంటే ప్రజలు ‘వీడికి ఏమీ తెలియదు.. అందుకే మైదానంలోనే ఉండిపోతాడు’ అని అంటారు. అలా కాకుండా మీరు చదువులోనూ, క్రీడల్లోనూ రెండింటిలోనూ శక్తిమంతంగా ఉండాలి.

విద్యార్థి: ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని నేను నా జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు జరిగిన దానిని నేను మాటల్లో వర్ణించలేను.

విద్యార్థి: సర్, నా ప్రశ్న ఏంటంటే.. కొన్ని సంవత్సరాల క్రితం మీరు 'స్వచ్ఛ భారత్' ప్రారంభించారు. మా నవ-రాయ్‌పూర్ కూడా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. విద్యార్థులుగా మేం అభివృద్ధికి ఎలా సహకరించగలం లేదా మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోగలం?

ప్రధానమంత్రి: సహజ వనరులను రక్షించడం అనేది మన స్వభావంలో భాగం కావాలి. క్రమంగా మనం ప్రజలను భాగస్వాములను చేయాలి. అప్పుడే మార్పు వస్తుంది. మన సొంత జీవితంలో కొన్ని నియమాలను పాటిస్తే.. నీటిని ఉదారహణగా తీసుకోండి. చెప్పండి.. ‘నేను పళ్ళు తోముకుంటున్నప్పుడు నీరు వృథాగా పోతుంటే దానిని ఆపేయాలి’. నోరు కడుక్కునేటప్పుడు మాత్రమే నీటిని ఉపయోగించాలి. ఇవి చాలా చిన్న విషయాలు. ఒకసారి నేను ఒక గ్రామాన్ని సందర్శించాను. దూరం నుంచి నాకు ఒక ప్రదేశం అడవిలా ఎంతో పచ్చగా కనిపించింది. నేను ‘ఇది ఏంటి?’ అని అడిగాను. వారు.. ‘ఇదొక పాఠశాల’ అని చెప్పారు. ఆ ప్రాంతం అంతా ఎండిపోయి ఉన్నా ఈ పాఠశాల మాత్రం పచ్చగా ఉందని వారు చెప్పారు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన పెట్రోల్ బంకుల నుంచి ఆయిల్ క్యాన్లను సేకరించి పిల్లలకు ‘ప్రతిరోజూ మీ ఇంటి నుంచి మిగిలిన ఆహారం కలిసిన నీటిని ఈ బాటిళ్లలో తీసుకురండి’ అని చెప్పారు. పిల్లలు ఆ నీటితో నింపిన బాటిళ్లను తెచ్చేవారు. ఆయన ప్రతి బిడ్డకు ఒక చెట్టును ఇచ్చి దానికి నీరు పోయమన్నారు. ఆ నీటిలోని ఆహార కణాలు ఎరువుగా పనిచేశాయి. దీనివల్ల పాఠశాల మొత్తం పచ్చగా మారిపోయింది. ఒక ఉపాధ్యాయుడు అంతటి పెద్ద మార్పును తీసుకువచ్చారు. మనం మానవత్వంతో వ్యవహరించినప్పుడు మార్పు మొదలవుతుంది. ఇవి మనం సులభంగా చేయగలిగే చిన్న విషయాలు. సమాజం పట్ల పర్యావరణ స్పృహ మన స్వభావంలో భాగం కావాలి.

 

విద్యార్థి:  మీరు ఇన్ని సంవత్సరాలుగా దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. దేశ నాయకుడిగా, భవిష్యత్ తరమైన మాలో నాయకులుగా ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు ఆశిస్తున్నారు?

ప్రధానమంత్రి: మీరు నాయకుడు కావాలనుకుంటున్నారా లేదా నిర్భయులుగా ఉండాలనుకుంటున్నారా?

విద్యార్థి: రెండూనూ.

ప్రధానమంత్రి: మొదట, నిర్భయులుగా మారండి.

విద్యార్థి: సరే, సర్.

ప్రధానమంత్రి: మీ మనసులో నిర్ణయించుకోండి: ఇతరులెవరూ చేసినా, చేయకపోయినా నేను మాత్రం చేస్తాను. ఈ భావన మీ మనస్సులోకి వచ్చినప్పుడు... మీరే స్వయంగా ప్రారంభించినప్పుడు... మీలోని నాయకత్వం వెలుగులోకి రావడం మొదలవుతుంది. ఉదాహరణకు, చుట్టూ పడి ఉన్న చెత్తను మీరు తీసి శుభ్రం చేస్తుంటే... మీతో నడుస్తున్న నలుగురికీ దాన్ని తీయాలని అనిపిస్తుంది. అంటే మీరు నాయకుడయ్యారు కదా? అది మంచి విషయం. మనం ఎల్లప్పుడూ నాయకుడి పాత్ర కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అది ఒక మంచి నమ్మకం, మంచి ఆలోచన. కానీ నాయకత్వం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం, రాజకీయ పార్టీని స్థాపించడం, ఆకర్షణీయ ప్రసంగాలు చేయడం కాదు. నాయకత్వం అంటే పది మందికి మీ అభిప్రాయాన్ని వివరించే గుణం కలిగి ఉండటం – అంటే దానిని వారిపై రుద్దడం కాదు, వారికి స్పష్టంగా వివరించడం. మరి వారికి వివరించాలంటే... మీరు ముందుగా దానిని బాగా అర్థం చేసుకోవాలి. ఇతరులను అర్థం చేసుకున్న వారే వారికి ఏదైనా వివరించగలరు. ఇతరులను అర్థం చేసుకోలేని వారు ఏమీ వివరించలేరు. అందుకే ఇతరులను అర్థం చేసుకోవడం మన ప్రయత్నంగా ఉండాలి.

విద్యార్థి: ఒక వ్యక్తి ఏదైనా పని కోసం బాధ్యత తీసుకుంటే... అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు అర్థమని వారు చాలా చక్కగా వివరించారు. ఈ మొత్తం అనుభవాన్ని నేను వర్ణించాలంటే అది ఒక అద్భుతమైన కల అని చెబుతాను.

విద్యార్థి: నేను ప్రధానమంత్రి గారిని కలిశాను.

విద్యార్థి: నేను చాలా అదృష్టవంతుడిని.

విద్యార్థి: ఇది చాలా అద్భుతంగా ఉంది, జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే లభించే అనుభవం ఇది.

ప్రధానమంత్రి: పరీక్షల సన్నద్ధత అనుభవాలు... పరీక్షల సమయంలో వచ్చే ఆలోచనలు, ఒత్తిడి, ప్రజల అంచనాలు... ఈ ప్రశ్నలన్నీ నిరంతరం మన చర్చల్లో భాగమవుతున్నాయి. పరీక్షా పే చర్చ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే... మన యువ మిత్రులు ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడాలి. పరీక్షా పే చర్చ కేవలం బోర్డు పరీక్షల కోసం సన్నద్ధత గురించే కాదు. మీరు అడిగే ప్రశ్నలు విన్నప్పుడు... సహజంగానే అవి నా హృదయాన్ని తాకుతాయి. జీవితంలోని అనేక అంశాలు మన యువ మిత్రుల మనస్సులో నిరంతరం మెదులుతున్నాయని నేను గ్రహిస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని గుజరాత్‌కు తీసుకెళ్తాను... అక్కడ పిల్లలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి చెందిన నా గిరిజన పిల్లలు అడిగిన ప్రశ్నలు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచాయి.

విద్యార్థి: నమస్కారం, సర్. దేవ్‌మోగ్రా గ్రామానికి మీకు స్వాగతం.

ప్రధానమంత్రి: అద్భుతం. ఈరోజు అందరూ హిందీలోనే మాట్లాడాలని నాకు చెప్పారు...

విద్యార్థి: అవును, సర్.

ప్రధానమంత్రి: సరే.

విద్యార్థి: సర్ వచ్చినప్పుడు, వార్లీ కళతో అలంకరించిన కోటు ధరించి ఉండటం మేం చూశాం. మా గిరిజన సమాజంలో వార్లీ కళకు గొప్ప ప్రాముఖ్యం ఉంది. అందుకే అది చూసి మేం చాలా సంతోషించాం.

విద్యార్థి: వారిని కలవబోతున్నందుకు మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. చాలా మంది పిల్లలకి ఆయనను అడగడానికి చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే ఆయనతో మాట్లాడే అవకాశం మాకు లభించడం మా అదృష్టం.

ప్రధానమంత్రి: మీరు ఎంత దూరం నుంచి వచ్చారు?

విద్యార్థి: మేం దేదియాపాద నుంచి ఇక్కడికి వచ్చాం.

ప్రధానమంత్రి: దేదియాపాద నుంచి వచ్చారా. మంచిది.

విద్యార్థి: నేను మాండవి నుంచి వచ్చాను సర్.

ప్రధానమంత్రి: మాండవి... మంచిది. మీ పేరేంటి?

విద్యార్థి: జై.

ప్రధానమంత్రి: జై, అభీ. మీరు ఎంతగా ఎదిగిపోయారు! మీతో నా పరిచయం ఏమిటో మీరు వారికి చెప్పారా?

విద్యార్థి: చెప్పాం సర్.

ప్రధానమంత్రి: వారి నుంచి మీరంతా ధైర్యం పొందారా లేదా?

విద్యార్థి: అవును సర్, మాకు చాలా ధైర్యం కలిగింది.

ప్రధానమంత్రి: వారు ఇంతకుముందు కూడా ఒకసారి నన్ను కలవడానికి వచ్చారు.

ప్రధానమంత్రి: సరే, మరి చెప్పండి... మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా, ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?

విద్యార్థి: సర్, గతంలో కొన్ని గిరిజన ప్రాంతాలు చాలా వెనుకబడి ఉండేవని మా తల్లిదండ్రులు మాకు చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాలపై మీకు చాలా ప్రేమ ఉందనీ, మీరు అక్కడ మార్పు తీసుకువచ్చారనీ వారు చెప్పారు. దీనికి మీకు స్ఫూర్తినిచ్చినది ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి: పాల్-చిటారియా సంఘటన గురించి మీకు తెలుసా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: అక్కడి గిరిజనులు స్వాతంత్య్రం కోసం గొప్ప పోరాటం చేశారు. ఒకప్పుడు అక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. ఆ సమయంలో నేను చాలా రోజులు ఆ ప్రాంతంలో ఉండి పనిచేశాను. అప్పుడే విద్యపై దృష్టి పెట్టాలని నాకు అనిపించింది. తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు... నేను ముఖ్యమంత్రి అయినప్పుడు... దానిపై దృష్టి పెట్టడం ప్రారంభించాను. మీరు ఆశ్చర్యపోతారు... ఒకప్పుడు ఉమర్‌గామ్ నుంచి అంబాజీ వరకు ఒక్క సైన్స్ పాఠశాల కూడా లేని పరిస్థితి ఉండేది. తర్వాత మీరు చూశారు కదా! ఇప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు, సైన్స్ పాఠశాలలు, ఇంజనీరింగ్ ఐటీఐలు అక్కడ ఉన్నాయి. చాలా మార్పు వచ్చింది. ఇది గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చింది.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: ఈ రోజు కూడా, పీఎం జన్‌మన్ యోజనను నేను ప్రారంభించానని మీకు తెలిసి ఉండాలి. గిరిజనుల్లో ఇంకా కొన్ని ప్రాంతాలు, కొంతమంది ప్రజలు వెనుకబడి ఉన్నారు. అందుకే నేను వారి కోసం ఒక ప్రత్యేక పథకాన్ని, ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించాల్సి వచ్చింది. అప్పటి నుంచే మనం విద్యపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే... అభివృద్ధి అంత వేగంగా జరుగుతుందని నేను గ్రహించాను. నేను ఉమర్‌గామ్ నుంచి అంబాజీ వరకు ఒక జాతీయ రహదారిని నిర్మించాను. అభివృద్ధికి మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ప్రజలు ప్రయాణించడం ప్రారంభిస్తారు. కాబట్టి నేను ఆ దిశగా దృష్టి సారించాను.

విద్యార్థి: నా ప్రశ్న ఏమిటంటే: పహల్గామ్ దాడి తర్వాత, మా కుటుంబం తరువాత ఏమి జరుగుతుందో అని చర్చించుకుంటోంది. దేశమంతా మీ వైపే చూస్తోంది. అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. మన సైన్యం విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అంత ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారు? మేం కేవలం పరీక్షల ఒత్తిడిని మాత్రమే ఎదుర్కొంటాం.

ప్రధానమంత్రి: మీరు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవుతారు కదా.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మీ పాత పరీక్షల రోజులను గుర్తు చేసుకున్నప్పుడు, ఆ పాత పరీక్షల గురించి తలచుకున్నప్పుడు మీకు ఇలా అనిపిస్తుంది... అవును, ఆ సమయంలో ఆందోళన ఉండేది. అయితే పరీక్షలు పూర్తవగానే ఇంకేమీ ఉండేది కాదు.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: అంతే కదా?

విద్యార్థి: అవును సర్, అలాగే అనిపించేది.

ప్రధానమంత్రి: పరీక్షలకు సిద్ధమయ్యే అత్యుత్తమ మార్గం ఏమిటంటే... ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను పరిష్కరించే, సమాధానాలు రాసే అలవాటును పెంపొందించుకోవడం. అయితే చాలా మంది కేవలం చదవడం మాత్రమే చేస్తారు.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మీరు కూడా ఈ విధంగా సాధన చేస్తే, మీకు ఎప్పటికీ ఒత్తిడి అనిపించదని నేను కచ్చితంగా చెప్పగలను.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మనం రోజంతా పుస్తకాలు చదువుతాం. ఓహ్, కొన్నిసార్లు నవ్వుతాం కూడా. ఈ రోజుల్లో ప్రజలు గ్రహించని మరో అత్యంత ముఖ్యమైన విషయం నిద్ర. మీరు తప్పకుండా బాగా నిద్ర పోవాలి. మీరు ఇలా అనుకోవచ్చు, “మేం పరీక్షల గురించి అడిగితే ఈయన నిద్ర గురించి మాట్లాడుతున్నారు... ఈయన ఏం ప్రధానమంత్రి అని?” అయితే మీరు తగినంత సమయం చక్కగా నిద్రపోతే... మిగిలిన సమయంలో మీరు ఉత్సాహంగా, కొత్త ఆలోచనలతో, కొత్త భావాలతో ఉంటారు. మీ మనస్సూ ఉల్లాసంగా ఉంటుంది.

విద్యార్థి: అవును సర్. మేం డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా కావాలనుకుంటున్నాం. మేం మా వృత్తిని ఎలా ఎంచుకోవాలి?

ప్రధానమంత్రి: ఒక నెలలో మీరు పది రకాల విషయాలు చెబితే... మీ కుటుంబం ఏమంటుంది? "వీడికి ఏ దారీ తెన్నూ లేదు" అంటుంది. మీరు ఎవరినైనా చూసి స్ఫూర్తి పొంది... "నేను కూడా అలా అయితే ఎలా ఉంటుంది?" అని ఆలోచించడం మంచిదే. గొప్పవారిగా కావాలని ఆశించడం తప్పు కాదు. అయితే ఇప్పటికే గొప్పవారైన వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. వారు ఎక్కడ నుంచి ప్రారంభించారో దానిపై దృష్టి పెట్టండి. మీ దృష్టి అక్కడ ఉన్నప్పుడు మీరు... "అవును, నేను ఇక్కడ నుంచి ప్రారంభిస్తాను" అని అంటారు. ఎవరో ఒకరు, "నేను క్రికెటర్ అయ్యాను" అని చెప్పవచ్చు. అయితే అతను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే ఉదయం 4:00 గంటలకు నిద్రలేచి, సైకిల్‌పై స్టేడియానికి వెళ్లి, రెండు గంటల పాటు సాధన చేసేవారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, "ఓహో, దీనికి ఇంత కృషి అవసరమా అని." అప్పుడు మీరు అక్కడ నుంచి ప్రారంభిస్తారు. ప్రస్తుతం మీరు... "అతను సెంచరీ కొట్టాడు, అతని ఫోటో పేపర్‌లో వచ్చింది" అని మాత్రమే చూస్తున్నారు. కలల కోసం జీవించడం నేర్చుకోండి, కలలకు అనుగుణంగా జీవితాన్ని నిర్మించుకోండి. మీరు నిజాయితీగా కష్టపడితే విజయం తప్పకుండా లభిస్తుంది.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మీరు నంబర్ వన్ అయిన వెంటనే, విజయం తనంతట తానుగా మీ గురించి అందరికీ తెలియజేస్తుంది కదా?

విద్యార్థి: అవును సర్, అది నిజమే.

ప్రధానమంత్రి: ఈ విషయం పాఠశాల అంతటికీ తెలిసిపోతుంది, కదా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మొత్తం ఊరికి మీ గురించి తెలుస్తుంది, కదా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: కాబట్టి అదే మన ప్రయత్నంగా ఉండాలి.

విద్యార్థి: సర్ చెప్పినదంతా, నేను విన్నదంతా, నా జీవితాంతం నేను ముందుకు సాగడానికి, జీవితంలో ఏదైనా సాధించడానికి... నేను దానిని గుర్తుచేసుకుంటాను.

ప్రధానమంత్రి: రండి.

విద్యార్థి: సర్, ఇప్పుడు మేం మీకు మా సంస్కృతికి సంబంధించిన కొన్ని వస్తువులను చూపిస్తాం. సర్, ఇవి కార్డ్‌బోర్డ్‌పై వేసిన వార్లీ చిత్రాలు. ఇవన్నీ మా సంస్కృతికి సంబంధించిన వస్తువులు. సర్, మేం మా గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన కళాకృతులను అంటే చిత్రాలను తీసుకువచ్చాం. ఇది లిప్పన్ ఆర్ట్, ఇదేమో నేను వేసిన పిథోరా ఆర్ట్.

ప్రధానమంత్రి: ఇది నువ్వు స్వయంగా వేశావా?

విద్యార్థి: అవును సర్, నేను ఇది మీ కోసమే వేశాను.

ప్రధానమంత్రి: మీ పేరేంటి?

విద్యార్థి: కిషన్.

ప్రధానమంత్రి: ఇది నీ చేతిరాతేనా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: ఓహ్, చాలా అందంగా ఉంది.

విద్యార్థి: ధన్యవాదాలు సర్.

ప్రధానమంత్రి: ఎంత బాగుంది,

విద్యార్థి: మేం వీటిని మా ఇంటి గోడలపై వేస్తాం, మేం వాటికి పూజ కూడా చేస్తాం.

 

ప్రధానమంత్రి: అవునా, అంటే మీరు గొప్ప కళాకారులయ్యారు!

విద్యార్థి: అవును సర్. మా దేశ ప్రధానమంత్రి నేను వేసిన చిత్రాలను తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సర్ మాతో స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటే... మా సొంత స్నేహితులతో మాట్లాడుతున్నట్లు అనిపించింది.

విద్యార్థి: నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే: మీ జీవితంలో మీ ఉపాధ్యాయులు ఎలాంటి పాత్ర పోషించారు?

ప్రధానమంత్రి: చాలా పెద్ద పాత్ర, చాలా కీలక పాత్ర. నేను చెప్పినట్లుగా మా ఉపాధ్యాయుడు ప్రతిరోజూ మమ్మల్ని లైబ్రరీకి వెళ్లి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలోని సంపాదకీయాల నుంచి ఒక వ్యాసాన్ని ఎంచుకుని, దాన్ని రాసుకుని, మరుసటి రోజు దాని గురించి చర్చించమని చెప్పేవారు. అలాంటివి చాలా ఉండేవి. ఉదాహరణకు, ఫిట్‌నెస్ విషయం చూస్తే... నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు పర్మార్ అనే ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన శారీరక దృఢత్వంపై చాలా పట్టుదలగా ఉండేవారు. ఆయన మాకు యోగా నేర్పించారు, మల్లఖంబం నేర్పించారు. మేం క్రీడాకారులుగా మారలేదు, కానీ శరీరానికి ఫిట్‌నెస్ చాలా అవసరమని మేం అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. మీరు ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తిని కలిసినా, వారి జీవితంలో మీకు ఎప్పుడూ రెండు విషయాలు కనిపిస్తాయి: ఒకటి, వారి జీవితంలో వారి తల్లి పాత్ర చాలా పెద్దదని వారు చెబుతారు.

విద్యార్థి: అవును.

ప్రధానమంత్రి: అలాగే రెండోది, వారి జీవితంలో వారి ఉపాధ్యాయుల పాత్ర చాలా పెద్దదని వారు చెబుతారు.

విద్యార్థి: ప్రతి రంగంలోనూ మన దేశం పురోగమిస్తోంది. అయితే, మన దేశం మరింత పురోగమించడానికి గిరిజన సమాజం ఎలాంటి తోడ్పాటును అందించగలదో మీరు మాకు చెప్పగలరా?

ప్రధానమంత్రి: చాలా! చూడండి... గిరిజన సమాజం వల్లే ఈ రోజు దేశం పురోగతి సాధించింది. ఈ రోజు దేశంలో పర్యావరణ పరిరక్షణకు మూల కారణం గిరిజన సమాజమే. వారు ప్రకృతిని పూజిస్తారు, ప్రకృతిని రక్షిస్తారు. ఈ రోజు మన దేశ సైన్యంలోని ఎక్కువ మంది స్త్రీ, పురుషులూ గిరిజన సమాజం నుంచే వస్తున్నారు. ఈ రోజు దేశంలోని ప్రతి రంగంలోనూ ఎలాంటి భేదభావం లేదు. మాకు ఎలాంటి భేదం లేదు. మన దగ్గర క్రీడాకారులూ ఉన్నారు, మన గిరిజన పిల్లలు ఎంతో సాధించగలరు. వారి అభివృద్ధి దేశానికి కీర్తిని తెచ్చింది. మీకు తెలుసు కదా, ఇటీవల మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది, అవునా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ అనే అమ్మాయి ఉంది. ఆమె ఒక గిరిజన యువతి.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: ఆమె క్రీడల్లో రాణించడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: నిజానికి, మన దేశంలోని చాలా మంది క్రీడాకారులు గిరిజన సమాజానికి చెందినవారే. దేశానికి వారు గొప్ప కీర్తిని తీసుకువచ్చారు. అలాంటిదే మీ ప్రతిభ! మీలో ఇంత గొప్ప కళ ఉంది. మీరు సాంకేతికతను నేర్చుకుంటే, ఈ సామర్థ్యం మరింత ముందుకు వెళ్తుంది.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: కాబట్టి జీవితం కేవలం ఉద్యోగం సాధించడం కోసమే కారాదు..

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: నా కల ఏమిటంటే, నేను ఒక నిర్దిష్టమైన జీవితాన్ని గడపాలి. దాని కోసం నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాను. మనం ఇలా చేస్తే, మనకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఒక పాట పాడు, పద, పాడు.

విద్యార్థి: జంగలూ రేనరీ తూ పహాడీ రేనరీ, జంగలూ రేనరీ తూ పహాడీ రేనరీ... (పాట పూర్తి స్పష్టంగా లేదు)

విద్యార్థి: మేమంతా వారి కోసం ఒక పాట పాడాం. అది మోగి మాత గురించినది. ఆమె ఎక్కడ నివసిస్తుంది, ఎలా నివసిస్తుంది అనే విషయాలన్నీ ఆ పాటలో ఉన్నాయి.

విద్యార్థి: మేం సర్‌తో చాలా విషయాల గురించి మాట్లాడాం. జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండాలి... ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి... మన సమయాన్ని ఎలా నిర్వహించుకోవాలి... పరీక్షలకు భయపడకుండా ఎలా చదువుకోవాలి అనే విషయాలను చర్చించాం.

విద్యార్థి: మొదటగా, ప్రధానమంత్రి మా కళ్ల ముందే ఉన్నారని నేను నమ్మలేకపోయాను. సమయం ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలియలేదు.

ప్రధానమంత్రి: పరీక్షా పే చర్చ యాత్ర అష్టలక్ష్మిగా పిలిచే ఈశాన్య ప్రాంతానికీ చేరుకుంది. గౌహతిలో ఉరకలు వేస్తున్న బ్రహ్మపుత్ర నదిపై ఆనందంగా ప్రయాణిస్తూనే పరీక్షా పే చర్చ కార్యక్రమం కొనసాగింది.

విద్యార్థి: నమస్కారం సర్.

ప్రధానమంత్రి: దయచేసి కూర్చోండి.

విద్యార్థి: ప్రణామం, గౌరవనీయ ప్రధానమంత్రి గారు. మేమంతా మీకు ఒక గమోచాను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం.

ప్రధానమంత్రి: కచ్చితంగా. అస్సాంలో గమోచా లేకుండా ఎలా ఉంటుంది! అద్భుతం.

విద్యార్థి: వారితో ఉండడం చాలా ప్రశాంతంగా, సరదాగా ఉంది. ఆందోళన అంతా మాయమైపోయింది. మేమంతా కలిసి వారితో చాలాసేపు మాట్లాడాం.

ప్రధానమంత్రి: మీరు ఇంతకు ముందు టీవీలో 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని ఎప్పుడైనా చూశారా?

విద్యార్థులు: అవును సర్, మేం చూశాం.

ప్రధానమంత్రి: మంచిది. మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చూశారా?

విద్యార్థులు: అవును సర్, ఎగ్జామ్ వారియర్.

ప్రధానమంత్రి: కాబట్టి, దానిని చదివిన తర్వాత లేదా ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత, గతంలో పరీక్షలకు ముందు మీరు అనుకున్నదానితో పోలిస్తే ఇప్పుడు మీ ఆలోచనలో ఏమైనా తేడా వచ్చిందా? మీకు ఎలాంటి ప్రయోజనం కలిగింది?

విద్యార్థి: ఇప్పుడు మాకు పరీక్షలంటే అంత భయం అనిపించడం లేదు. పరీక్షలను పండుగలా జరుపుకోవాలనే మీ సూచనలు, పరీక్షల పట్ల మా భయాన్ని తగ్గించాయి.

ప్రధానమంత్రి: కానీ మిమ్మల్ని భయపెట్టేది మీ కుటుంబ సభ్యులే కదా?

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: అవును.

విద్యార్థి: వారు ఇలా అడుగుతారు, “మీరు ఒక మార్కు ఎందుకు కోల్పోయారు? ఆ ఒక్క మార్కు ఎక్కడికి పోయింది?”

ప్రధానమంత్రి: జీవితంలో మనం సంతృప్తి చెంది, “ఇక చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి?” అని అనుకుంటే, మన పురోగతి ఆగిపోతుంది.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: గెలవాలనే కోరిక మన మనసులో ఉండాలి. దాని కోసం నేను ఒక మంత్రాన్ని ఇచ్చాను.

విద్యార్థి: సర్, మనం ఇతరులతో పోటీ పడకూడదు.

ప్రధానమంత్రి: శభాష్! అవును. మనం నిరంతరం మనతోనే పోటీ పడాలని నేను చెప్పాను. ఎవరో ఇలా అనవచ్చు, “నీకు 99 వచ్చాయి, 100 ఎందుకు రాలేదు?”అని... అయితే కేవలం అది వారి దృష్టికోణం మాత్రమే. కానీ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి... “నా జీవితంలో ఈ మార్పు ఎందుకు జరిగింది? ఈ లోపం ఎందుకు ఉంది? దానికి కారణం ఏమిటి?” అని. మంచిది... మీ మనసులో ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి అడగండి.

విద్యార్థి: నా ప్రశ్న ఏమిటంటే: మీ దైనందిన జీవితంలో మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన ఆహారపు అలవాటును అనుసరిస్తారని నేను విన్నాను. కాబట్టి విద్యార్థులుగా మేం ఉత్సాహంగా, ఏకాగ్రతతో, పరీక్షల్లో మా ఉత్తమ పనితీరును కనబరచడానికి ఏ మ్యాజికల్ ఆహారపు అలవాటును మేం అనుసరించాలి?

ప్రధానమంత్రి: నిజం చెప్పాలంటే, నాకు ప్రత్యేకంగా ఎలాంటి ఆహార నియమావళి లేదు. ఎందుకంటే గతంలో నేను వేర్వేరు కుటుంబాల ఇళ్లలో తినేవాడిని. ఒక్క విషయం ఏమిటంటే... నేను శాకాహారిని అయినందువల్ల శాకాహారమే తినేవాడిని. ఆ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది తినేవాడిని. కొన్నిసార్లు నేనే వంట చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడప్పుడు నేను కిచిడీ వండుకునేవాడిని. మీరు కిచిడీ తింటారా?

విద్యార్థి: తింటాం సర్.

ప్రధానమంత్రి: మీరు తీసుకునే ఆహారం మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. అది మీరు బలవంతంగా తినే మందులా ఉండకూడదు. మీరు కడుపు నింపుకోవడానికి తినాలనుకుంటున్నారా లేక మనసుకు తృప్తి కలగడానికి తినాలనుకుంటున్నారా అనేది మీరే నిర్ణయించుకోండి.

విద్యార్థి: మనసుకు తృప్తి కోసం సర్.

ప్రధానమంత్రి: సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఆపమని చెప్పే వరకు కొందరు తింటూనే ఉంటారు. కడుపు నిండే వరకు ఆహారం తింటారు. కానీ ఛాతీ వరకు ఆహారం నిండిపోయేదాకా కనీసం శ్వాసైనా తీసుకోరు. ఇక్కడ దీనికి విరుద్ధంగా జరగాలి. పగటిపూట మీకు అవకాశం దొరికినప్పుడల్లా, మీ శరీరం పూర్తిగా నిండే వరకు సుదీర్ఘ శ్వాస తీసుకోండి. వీలైతే, కొన్ని క్షణాలు దాన్ని ఆపి... ఆపై నెమ్మదిగా వదలండి. మనం ఆహారం తింటాం, కానీ మిగతా యాభై పనుల మధ్య మనం మన శరీరానికి చివరి ప్రాధాన్యం ఇస్తాం. చివరి ప్రాధాన్యం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది రోజూ సూర్యోదయాన్ని చూస్తామని ఒక నియమం పెట్టుకున్నారు? ఎంతమంది?

ప్రధానమంత్రి: సూర్యోదయం.

విద్యార్థులు: మేం చూస్తాం సర్!

ప్రధానమంత్రి: ఇది శరీరానికి తాజాదనాన్ని, శక్తినీ ఇస్తుంది. మనం దీనిని అలవాటుగా చేసుకోవాలి. శరీరానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

విద్యార్థి: సర్, తరచుగా మా తల్లిదండ్రులు మమ్మల్ని మా స్నేహితులతో పోలుస్తుంటారు. కానీ వారు మమ్మల్ని మా సొంత తోబుట్టువులతో పోల్చినప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఏమి చేయాలి?

ప్రధానమంత్రి: “మీ చెల్లి చేతిరాతను చూడు, అది ఎంత అందంగా ఉందో” అని మీ నాన్న అంటాడని అనుకుందాం. అప్పుడు ఒక మంచి వ్యక్తి అయితే ఏం చేస్తాడు? అతను తన చెల్లితో, “నా చేతిరాతను ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్పించవా” అని అడుగుతాడు. మరొక వ్యక్తి ఇలా అనుకుంటాడు... “నా తల్లిదండ్రులు నా చెల్లిని మాత్రమే ఇష్టపడతారు. వారు ఆమె చేతిరాతను మెచ్చుకుంటారు. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో వారు చూడరు” అని. కుటుంబంలోని ఎవరిదైనా మంచి గుణం గురించి ప్రస్తావిస్తే, ఆ గుణాన్ని మన సోదరుడు లేదా సోదరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మన తల్లిదండ్రులతో, “మీరు మంచి విషయాన్ని ఎత్తి చూపారు. నా దగ్గర ఈ గుణం లేదు. నేను దానిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెప్పండి” అని అడగాలి. అప్పుడు తల్లిదండ్రులు మీరు బాధపడటం లేదనీ... బదులుగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారనీ గుర్తిస్తారు. తల్లిదండ్రులూ పోల్చడం నివారించాలి. నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు చెబుతుంటాను: దయచేసి ఒక బిడ్డను ఇతరుల ముందు ఎక్కువగా ప్రశంసించకండి... తద్వారా మరొక బిడ్డ తనను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తాడు. మనకు దగ్గరగా ఉన్న ఎవరిలోనైనా, ఏదైనా మంచిగా ఉంటే... మనం వారిని నిశ్శబ్దంగా మన గురువుగా పరిగణించాలి. మీరు వారిని మీ గురువుగా భావిస్తున్నారని వారికి తెలియకూడదు. ఉదాహరణకు, “నువ్వు బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడతావు. నేను ఏ తప్పు చేస్తున్నాను? దయచేసి నాకు నేర్పించు” అని అడగండి. అప్పుడు వారు గొప్పవారమని భావించరు. వారు అనుకుంటారు, "అతను నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాడు" అని. అప్పుడు వారు మిమ్మల్ని వారితో సమానంగా చూస్తారు.

విద్యార్థి: కొద్దిగా ఆందోళనగా అనిపించినా, అదే సమయంలో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మోదీ గారిని కలవబోతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది జరిగినప్పుడు నేను చెప్పలేనంత సంతోషపడ్డాను.

విద్యార్థి: సర్, విద్యార్థులు తరచుగా వేదికపై లేదా ప్రజల ముందు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. మా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీరు మాకు ఎలాంటి సలహా ఇస్తారు?

ప్రధానమంత్రి: మీరే వారికి సలహా ఇవ్వాల్సి వస్తే, మీరు ఏమి చెబుతారు? రండి, అందరూ ముందుకు రండి. ఎవరైనా ఒకటి, రెండు, మూడు అని చెప్పాల్సి వస్తే… అది ఎలా ఉంటుంది?

విద్యార్థి: సర్, మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. అవును.

ప్రధానమంత్రి: ఆత్మవిశ్వాసంలో రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాలు ఏమిటి?

విద్యార్థి: ఆత్మ, విశ్వాసం (నమ్మకం).

ప్రధానమంత్రి: తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఎప్పుడూ భయపడరు. మీకు మీపై నమ్మకం ఉందా?

విద్యార్థి: ఉంది సర్.

ప్రధానమంత్రి: నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు దేనినైనా అధిగమించగలవు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన తన మనస్సులోనే మొత్తం పరిస్థితిని అధ్యయనం చేస్తారు. చికాగోలో తన ప్రసిద్ధ ప్రసంగం తర్వాత స్వామి వివేకానంద ఒకసారి తన శిష్యునికి ఒక లేఖ రాశారు.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: వివేకానందుడికి ఎన్నో ప్రశంసలు లభించాయి.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: అయితే చికాగోలో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు తాను చాలా భయపడ్డానని ఆయన తన శిష్యుడికి లేఖలో తెలిపారు. "ఎంతమంది గొప్ప పండితులు, ఎందరో పెద్దలు, ఎందరో సన్యాసులు - నేను ఏమి చెప్పాలి?" అని చాలా భయపడ్డానని రాశారు. అప్పుడు ఆయన తల్లి సరస్వతిని గుర్తుచేసుకుని "అమ్మా, నాలోని అన్ని శక్తులనూ మేల్కొల్పండి. నేను నేర్చుకున్నవన్నీ ఒకేసారి నా నాలుకపైకి రావాలి." అని ప్రార్థించి ఆయన వేదికపైకి వెళ్ళినట్లు రాశారు. "అమెరికా సోదరీసోదరులారా," అని ఆయన చెప్పినప్పుడు ప్రేక్షకులు రెండు నిమిషాలు నిరంతరాయంగా చప్పట్లు కొట్టారు. అది ఒక కీలక మలుపు. "లేదు, నేను అనుకున్నట్లుగా కాదు. నాలో ఏదో ఉంది" అని ఆయన గ్రహించారు. ఆత్మవిశ్వాసం వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో, గొప్ప వక్తలు, ఎందరో ఆటగాళ్ళ విషయంలో కూడా ఇలా జరిగి ఉంటుంది - సచిన్ టెండూల్కర్ సున్నాకి అవుట్ అవడం మీరు చూడలేదా?

విద్యార్థి: అవును అయ్యారు.

ప్రధానమంత్రి: మరి అప్పుడు అతను నిరాశతో తల పట్టుకుని కూర్చున్నాడా?

విద్యార్థి: లేదు సర్.

ప్రధానమంత్రి: అంటే మనం పరిస్థితిని గమనించి, అంచనా వేసి, "అవును, నేను చేయగలను" అని ఆలోచించాలి. నిజానికి ఆత్మవిశ్వాసం అనే పదానికి మనపై మనకు గల నమ్మకం అని అర్థం. మన కోసం మరెవరూ దీన్ని చేయరు. మనమే దీన్ని చేయాలి.

విద్యార్థి: మీ ముందు ఒక పాటను ప్రస్తావించాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి: అవును, ఒక పాట పాడండి.

విద్యార్థి: సరే, భూపేన్ హజారికా గారి పాట.

ప్రధానమంత్రి: అద్భుతం, దయచేసి పాడండి.

విద్యార్థి: (అస్సామీ భాషలో గల పాట)

ప్రధానమంత్రి: అద్భుతం.

విద్యార్థి: మా ఊరిలో, మా ఇంటి దగ్గరే ఒక టీ ఎస్టేట్ ఉంది. మా అమ్మ ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ తేయాకులు కోసే పనిని పర్యవేక్షిస్తోంది.

ప్రధానమంత్రి: ఓహ్, అంటే మీరు టీ తోటల నుంచి వచ్చినవారా.

విద్యార్థి: అవును సర్.

ప్రధానమంత్రి: మీరు బాగా చదువుతారు, మీ అమ్మ మీకు చదువు చెబుతుంది... ఆమె టీ తోటలోనూ పనిచేస్తుంది. ఇంతకీ మీరు ఏమి తెచ్చారు?

విద్యార్థి: నేను మీ కోసం తేయాకులు తెచ్చాను.

ప్రధానమంత్రి: అప్పుడు నేను టీ తయారు చేయాల్సి ఉంటుంది. చాలా ధన్యవాదాలు. దయచేసి మీ అమ్మ గారికి నా గౌరవపూర్వక కృతజ్ఞతలు తెలియజేయండి.

విద్యార్థి: టీ తోట అబ్బాయిని అయిన నాకు ప్రధానమంత్రిని కలిసే అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నిజంగా ఆయనను కలిశానంటే నమ్మలేకపోతున్నాను.

విద్యార్థి: ఇన్ని తరాల అంతరం ఉన్నప్పటికీ... వారు మా మాటలను అర్థం చేసుకోవడం చాలా బాగుంది.

ప్రధానమంత్రి: మనం పరీక్షల గురించి, స్థానిక సంగీతం, అస్సాం టీ గురించీ ఎలా మాట్లాడుకున్నామో మీరు చూశారు - ఇవి కూడా పరీక్షా పే చర్చలో చిరస్మరణీయ భాగాలుగా మారాయి. పరీక్షలు ఒక అవకాశం. ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని మన సన్నద్ధత మరింత మెరుగ్గా చేస్తుంది. ఈ చర్చలన్నింటిలోనూ విభిన్న ప్రదేశాల నుంచి, విభిన్న రకాల విద్యార్థులు, వారి విభిన్నమైన అనుభవాలు ఉంటాయి. కానీ ప్రతి చర్చ ఉద్దేశం మాత్రం ఒకటే: ప్రతి విద్యార్థీ తమ గురువులు చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం, కలిసికట్టుగా అన్నీ నేర్చుకోవడం. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

చాలా ధన్యవాదాలు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India Inc's $3.4-trillion club: AI, IPL, defence are new wealth creators

Media Coverage

India Inc's $3.4-trillion club: AI, IPL, defence are new wealth creators
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM chairs 52nd PRAGATI Meeting
June 24, 2026
PM reviews four key infrastructure projects worth around ₹30,000 crore spanning four states across Road, Power, Industrial Corridor and Metro Rail sectors
PM emphasises use of PM GatiShakti National Master Plan and timely updation of project, utility and infrastructure data on the portal for efficient planning
PM asks Ministries and State Governments to resolve pending issues in a mission-mode manner and ensure close monitoring
PM reviews TB Mukt Bharat Abhiyan and emphasizes need to leverage latest digital technologies including AI
PM reviews grievances related to Cyber Crime and Digital Arrest and stresses timely action, coordinated response and e-Zero FIR registration mechanism

Prime Minister Shri Narendra Modi chaired the 52nd meeting of PRAGATI, the ICT-enabled, multi-modal platform aimed at fostering Pro-Active Governance and Timely Implementation, by seamlessly integrating efforts of the Central and State Governments, earlier today at Seva Teerth.

During the meeting, the Prime Minister reviewed four critical infrastructure projects across the Road, Power, Industrial Corridor and Metro Rail sectors, covering four States and costing around ₹30,000 crore. These projects, important for economic growth, regional connectivity, industrial development and public welfare, were reviewed with focus on timelines, inter-agency coordination, issue resolution and timely completion.

Prime Minister underlined that delays in infrastructure projects not only lead to cost escalation, but also deprive people and industries of timely benefits. He asked the concerned Ministries and State Governments to resolve pending issues in a mission-mode manner and ensure close monitoring at the highest level.

Prime Minister emphasised the use of PM GatiShakti National Master Plan for efficient planning and timely implementation of infrastructure projects. He also underlined the need for regular and timely updation of project details, utilities, infrastructure layers, clearances and other field-level information on the portal. He further emphasised that the platform must reflect the latest ground situation so that bottlenecks can be identified in advance, inter-agency coordination can be improved and decisions can be taken on the basis of reliable, real-time data.

Prime Minister reviewed TB Mukt Bharat Abhiyan and emphasised the need to leverage latest digital technologies including Artificial Intelligence. He suggested a team of NCC cadets and MY Bharat volunteers, for awareness, patient follow-up and community mobilisation.

Prime Minister also reviewed grievances related to Cyber Crime and Digital Arrest. He expressed concern over the rising misuse of digital platforms to defraud citizens and stressed that such matters require coordinated, sensitive and time-bound handling by all concerned agencies. He noted that citizens should not be made to run from one department or agency to another. He also emphasized the need for clear ownership, faster response, better coordination among law enforcement agencies, banks and digital platforms, and stronger public awareness campaigns.

Prime Minister observed that in cases involving cyber fraud, timely action is crucial to prevent financial loss and restore public confidence. He asked all stakeholders to work in close coordination to strengthen prevention, reporting, investigation and grievance redressal mechanisms. He also emphasised that States should work towards enabling e-Zero FIR mechanisms for faster registration and response in cyber fraud cases.