QuoteKisan Suryodaya Yojana will be a new dawn for farmers in Gujarat: PM Modi
QuoteIn the last two decades, Gujarat has done unprecedented work in the field of health, says PM Modi
QuotePM Modi inaugurates ropeway service at Girnar, says more and more devotees and tourists will now visit the destination

నమస్కారం !

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ గారు, గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా రైతు సోదరులు, గుజరాత్ రాష్ట్ర సోదర, సోదరీమణులారా !

దుర్గా మాత (మా అంబే) ఆశీస్సులతో గుజరాత్ అభివృద్ధికి సంబంధించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు నేడు ప్రారంభించబడుతున్నాయి. నేడు కిసాన్ సూర్యోదయ యోజన, గిర్నార్ రోప్-వే తో పాటు దేశంలోనే అతి పెద్ద ,ఆధునిక కార్డియాక్ ఆసుపత్రి  గుజరాత్ రాష్ట్రానికి లభించాయి. ఈ మూడు ఒక విధంగా గుజరాత్ రాష్ట్ర శక్తి, భక్తి మరియు ఆరోగ్యానికి చిహ్నాలు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సోదర సోదరీమణులారా, గుజరాత్ ఎల్లప్పుడూ అసాధారణ శక్తితో కూడిన ప్రజలకు చెందిన భూమి. పూజ్య బాపు, సర్దార్ పటేల్ ల నుంచి గుజరాత్ కు చెందిన పలువురు కుమారులు దేశానికి సామాజిక, ఆర్థిక నాయకత్వాన్ని అందించారు. కిసాన్ సూర్యోదయ యోజన ద్వారా గుజరాత్ మళ్లీ ఓ కొత్త పథకం తో ముందుకు రావడం నాకు సంతోషంగా ఉంది. సుజలాం –సుఫలాం, సావునీ పథకం తర్వాత గుజరాత్ రైతులకు ఇప్పుడు సూర్యోదయ యోజన ఒక మైలురాయిగా నిలువనుంది.

కిసాన్ సూర్యోదయ యోజన లో గుజరాత్ రైతుల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. విద్యుత్ రంగంలో కొన్నేళ్లుగా గుజరాత్‌లో జరుగుతున్న పనులు ఈ పథకానికి అతిపెద్ద పునాదిగా మారాయి. ఒకప్పుడు గుజరాత్ లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉన్న సమయంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం పెద్ద సవాల్ గా ఉండేది. పిల్లల చదువులు, రైతులకు సాగునీరు, పరిశ్రమల ఆదాయాలు, ఇవన్నీ ప్రభావితం అయ్యేవి. అందువల్ల, విద్యుత్ ఉత్పత్తి నుండి ప్రసారం వరకు ప్రతి రంగంలో సామర్థ్యాన్ని పెంపొందించే పని మిషన్ మోడ్‌లో జరిగింది. 

దశాబ్దం క్రితం సౌరశక్తి కి సంబంధించి సమగ్ర విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. 2010లో పటాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించినప్పుడు, ఒక రోజు భారతదేశం వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ యొక్క మార్గాన్ని ప్రపంచానికి చూపించగలదని ఎవరూ ఊహించలేదు. నేడు, భారతదేశం సౌర శక్తి ఉత్పత్తి మరియు వినియోగం పరంగా ప్రపంచంలో అగ్రదేశాలలో ఒకటిగా ఉంది. గత ఆరు సంవత్సరాల్లో సౌర శక్తి ఉత్పత్తి పరంగా దేశం ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకుని వేగంగా ముందుకు సాగుతోంది.

|

సోదర సోదరీమణులారా,

గ్రామాలతో సంబంధం లేని వారు, వ్యవసాయంతో సంబంధం లేని వారిలో, రైతులకు ఎక్కువగా రాత్రి సమయంలో సాగునీటి కోసం విద్యుత్ లభిస్తుందని చాలా కొద్ది మందికి తెలుసు.. పొలంలో సాగు అవసరాలకు నీటిని అందించే సమయంలో రైతులు రాత్రంతా మేల్కొనాల్సి ఉంటుంది. కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభమవుతోన్న జునాగఢ్, గిర్ సోమనాథ్ వంటి ప్రాంతాల్లో అడవి జంతువుల వల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉండేది. అందువల్ల, కిసాన్ సర్వోదయ యోజన రాష్ట్రంలోని రైతులను సంరక్షించడమే కాకుండా వారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో రైతులకు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగు అవసరాలకు నీటిని అందించేందుకు వీలుగా  మూడు దశలలో విద్యుత్ లభించనుంది. ఇది నూతన నవోదయమే కదా!

మిగిలిన వ్యవస్థను ప్రభావితం చేయకుండా పూర్తిగా సరికొత్త ప్రసార సామర్థ్యాన్ని సృష్టించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న పనికి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ పథకం కింద, రాబోయే 2-3 సంవత్సరాలలో సుమారు మూడున్నర వేల సర్క్యూట్ కిలోమీటర్ల కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో వెయ్యికి పైగా గ్రామాల్లో ఈ పథకం అమలు చేయబడుతుందని నాకు చెప్పబడింది. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ గ్రామాలు న్నాయి. ఈ పథకం గుజరాత్ అంతటా విస్తరించినప్పుడు, ఇది లక్షలాది మంది రైతుల జీవితాలను, వారి దైనందిన జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. 

మిత్రులారా ,

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, ఖర్చును తగ్గించడానికి, వారి కష్టాలను తగ్గించడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉంటుంది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛను కలిగి ఉండనివ్వండి, లేదా వేలాది మంది రైతు ఉత్పత్తి సంఘాలను నిర్మించడం, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి లేదా పంట బీమా పథకాన్ని మెరుగుపరచడానికి, నూరు శాతం యూరియా ను లేదా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు భూసార హెల్త్ కార్డు, దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం, రైతుకు సాగు చేయడం కష్టం కాకూడదు. ఇందు కోసం నూతన పథకాలు  నిరంతరం ప్రవేశపెడుతున్నారు.

నేడు దేశంలో,అన్నదాతను శక్తి దాతగా  శక్తివంతం చేసే పని కూడా జరుగుతోంది. కుసుం యోజన కింద రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు-ఎఫ్‌పిఓలు, సహకార సంస్థలు, పంచాయతీలు, ఇలాంటి సంస్థలన్నీ బంజరు భూమిలో చిన్న సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో సహకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సౌర పంపులను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను రైతులు అవసరానికి అనుగుణంగా సాగునీటికోసం వినియోగించి అదనపు విద్యుత్ ను కూడా అమ్ముకోగలుగుతారు.. దేశవ్యాప్తంగా సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి సుమారు 17.5 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. ఇది రైతులకు నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తుంది మరియు వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.

మిత్రులారా,

గుజరాత్ విద్యుత్ రంగంలో నే కాక నీటిపారుదల మరియు తాగునీటి రంగంలో కూడా గొప్ప కృషి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ గుజరాత్ నీటి పరిస్థితి ఏమిటో తెలుసు. సంవత్సరాలుగా బడ్జెట్ లో చాలా ఎక్కువ భాగం నీటి కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది… గుజరాత్‌పై ఆర్థిక భారం భారీగా ఉందని చాలామంది  హించి ఉండరు.   . ఇంతకు ముందు ఎవరూ ఊహించలేని విధంగా గత రెండు దశాబ్దాల కృషితో నేడు గుజరాత్ లోని జిల్లాలకు, ఆ గ్రామాలకు కూడా నీరు చేరింది.

ఈ రోజు మనం సర్దార్ సరోవర్‌ను చూసినప్పుడు, నర్మదా నీటిని గుజరాత్‌లోని కరువు ప్రాంతాలకు, వాటర్ గ్రిడ్లకు రవాణా చేసే కాలువల నెట్వర్క్ ను చూడండి, వాటర్ గ్రిడ్లు చూడండి, గుజరాత్ ప్రజల కృషికి గర్వంగా ఉంది. నేడు, గుజరాత్‌లోని 80 శాతం కుటుంబాలకు నేడు కుళాయి నీరు చేరుకున్నాయి. త్వరలో గుజరాత్ దేశంలోని ప్రతి ఇంటికీ నీటి పైపు లను అందించే రాష్ట్రాల్లో ఉంటుంది. నేడు గుజరాత్ లో కిసాన్ సర్వోదయ యోజన ప్రారంభం అవుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ తన స్వంత మంత్రాన్ని మళ్లీ పునరావృతం చేయాల్సి ఉంటుంది.. ఇది మంత్రం – ప్రతి చుక్క- ఎక్కువ పంట (పర్ డ్రాప్, మోర్ క్రాప్). రైతులకు పగటిపూట విద్యుత్ వచ్చినప్పుడు, ఎక్కువ నీరు ఆదా చేయడానికి మనం సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే సోదరా విద్యుత్ వస్తోంది, నీరు ప్రవహిస్తోంది, మనం హాయిగా కూర్చుందాం అనే భావనలో ఉంటే, అప్పుడు గుజరాత్ నాశనమవుతుంది, నీరు అయిపోతుంది, జీవితం కష్టమవుతుంది. పగటిపూట విద్యుత్ లభ్యత కారణంగా, రైతులకు సూక్ష్మ సేద్యం కోసం ఏర్పాట్లు చేయడం సులభం అవుతుంది. సూక్ష్మ సేద్యం రంగంలో గుజరాత్ గొప్ప పురోగతి సాధించింది – అది బిందు సేద్యం లేదా స్ప్రింక్లర్ అయినా, కిసాన్ సర్వోదయ యోజన దాని మరింత విస్తరణకు సహాయపడుతుంది.

సోదరసోదరీమణులారా,

ఈ రోజు గుజరాత్‌లో "సర్వోదయ" తో పాటు "ఆరోగ్యోదయ" జరుగుతోంది. ఈ "ఆరోగ్యోదయ" ఒక కొత్త విధానం. నేడు, భారతదేశపు అతిపెద్ద కార్డియాక్ ఆసుపత్రిగా, యుఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించబడింది. ఇది ఎంపిక చేయబడ్డ ఆసుపత్రులలో ఒకటి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఆధునిక ఆరోగ్య సదుపాయాన్ని కలిగి ఉన్న దేశంలోని అతికొద్ది ఆసుపత్రులలో ఇది ఒకటి.  మారుతున్న జీవనశైలి కారణంగా గుండె సమస్యలు, రోజురోజుకు పెరిగి, చిన్న పిల్లల్లో కి చేరుతుండటం చూస్తున్నాం. అందుకని, ఈ ఆసుపత్రి గుజరాత్‌కు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా గొప్ప సౌకర్యం.

సోదర సోదరీమణులారా,

గత రెండు దశాబ్దాల్లో, గుజరాత్ ఆరోగ్య రంగంలో కూడా అపూర్వమైన కృషి చేసింది. ఆధునిక ఆసుపత్రులు, వైద్య కళాశాలలు లేదా ఆరోగ్య కేంద్రాల నెట్ వర్క్ అయినా, గ్రామాలను మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో అనుసంధానించడానికి భారీ కృషి జరిగింది.  గత 6 సంవత్సరాల్లో, దేశంలో ఆరోగ్య సంరక్షణ పథకాలు ప్రారంభమయ్యాయి, గుజరాత్ కూడా వాటి నుండి లబ్ది పొందుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గుజరాత్ లోని 21 లక్షల మందికి ఉచిత చికిత్స లభించింది.గుజరాత్ లో చౌకైన ఔషధాలను అందించడం కొరకు 500 కి పైగా జన ఔషద కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఇందులో గుజరాత్ లోని సాధారణ రోగులకు దాదాపు రూ.100 కోట్లు ఆదా అయ్యాయి.

నేడు, విశ్వాసం మరియు పర్యాటకం రెండూ గుజరాత్ అందుకున్న మూడవ బహుమతితో ముడిపడి ఉన్నాయి. 'గిర్నార్ పర్వతంపై దేవీ అంబ ఉంది. గోరఖ్‌నాథ్ పీక్‌, గురు దత్తాత్రేయ పీక్, జైన్ ఆలయం కూడా గిర్నార్ కొండలపై ఉన్నాయి. పర్వత ప్రాంతంపైకి చేరాలంటే మెట్లు ఎక్కి వెళ్లాలి. అక్కడకు వెళ్లిన వారిలో ఒకరకమైన శక్తి, ప్రశాంతత ద్యోతకమవుతాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి రోప్‌-వేతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వత ప్రాంతాలను చూడవచ్చు'. ఇప్పటి వరకు, ఆలయానికి చేరుకోవడానికి 5-7 గంటలు పట్టే దూరం, ఇప్పుడు రోప్‌వే నుండి 7-8 నిమిషాల్లో కవర్ చేయబడుతుంది. రోప్‌వే రైడింగ్ కూడా సాహసాన్ని పెంచుతుంది, ఉత్సుకతను పెంచుతుంది. గిర్నార్ పర్వతం చట్టుపక్కల ఉన్న ఆకుపచ్చని అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. రోప్‌వే సౌకర్యంతో ఎక్కువ మంది భక్తులు ఇక్కడకు వస్తారు, పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.

మిత్రులారా, నేడు ప్రారంభమైన రోప్ వే  గుజరాత్ లో నాలుగో రోప్ వే. బనస్క౦తలో మా అంబా దర్శన౦ కోస౦, పావ్ గఢ్లో, సత్పూడాలో మరో మూడు రోప్ వేలు  ఇప్పటికే పనిచేస్తున్నాయి. గిర్నార్ రోప్ వే  రోప్ లో ఇరుక్కుపోయి ఉంటే, అది చాలా సంవత్సరాల పాటు నిలిచి ఉండేది కాదు, ప్రజలు, పర్యాటకులు చాలా కాలం క్రితమే ప్రయోజనం పొందుతూ ఉండేవారు. ఒక దేశంగా, ఇంత పెద్ద సదుపాయాన్ని నిర్మించడం ద్వారా ప్రజలు ఇంత సుదీర్ఘకాలం గా ఇరుక్కుపోయినప్పుడు ప్రజలు నష్టపోయామని కూడా మనం ఆలోచించాలి. దేశానికి నష్టం ఏమిటి? ఇప్పుడు, ఈ గిర్నార్ రోప్ వే -వారు ప్రారంభించినప్పుడు, ఇక్కడ ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేను సంతోషిస్తున్నాను. గిర్నార్ రోప్-పే ప్రారంభంతో మెరుగైన సౌకర్యాల కల్పన జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి.

మిత్రులారా

ప్రపంచంలోఅతిపెద్ద పర్యాటక కేంద్రం విశ్వాస సంబంధిత కేంద్రాలు, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించినప్పుడే ఎక్కువ మంది మన వద్దకు వస్తారని అంగీకరిస్తున్నారు. నేడు, పర్యాటకుడు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు, అతడు కూడా తేలికగా జీవించాల్సి ఉంటుంది మరియు నేను ప్రయాణించాల్సి ఉంటుంది. గుజరాత్ లో అనేక ప్రదేశాలు ఉన్నాయి, ఇవి భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక గమ్యస్థానంగా మారే సంభావ్యత ఉంది. అమ్మ వారి  ఆలయాల గురించి మాట్లాడితే గుజరాత్ లో భక్తుల కోసం సంపూర్ణ ప్రదక్షిణం ఉంటుంది. నేను అన్నీ స్థలాలు పేర్కొనలేదు… గుజరాత్ లోని అన్ని మూలల్లో, ఈ శక్తి గల అమ్మ వారు  గుజరాత్ కు నిరంతరం ఆశీస్సులు ఇస్తారు. అంబ జీ, పావ్ గఢ్, ఛోటిలా చాముండా మాతా జీ, ఉమియా మాతాజీ, కచ్ లో మాతా నో-మధ్, ఎన్ని, అంటే, గుజరాత్ ఒక రకమైన శక్తి ఉందని మనం అనుభూతి చెందవచ్చు. ఇక్కడ అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.

విశ్వాస ప్రదేశాలతో పాటు, గుజరాత్‌లో అద్భుతమైన సామర్థ్యాలున్న అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇటీవల ద్వారకలోని శివరాజ్‌పూర్ మెరైన్ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ లభించిందని మీరు చూశారు. అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల మరింత మంది పర్యాటకులు  పెరిగి, ఆదాయంతో పాటు, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరుగాం చుకున్న సర్దార్ సాహెబ్ కు అంకితం చేసిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం) ఇప్పుడు పెద్ద పర్యాటక ఆకర్షణగా మారుతోంది.

'కోవిడ్ మహమ్మారి ప్రారంభం కాక ముందు స్టాట్యూ ఆఫ్ యూనిటీని 45 లక్షల మందికి పైగా దర్శించారు. ఇంత తక్కువ కాలంలో 45 లక్షల మంది చాలా పెద్ద విషయం.ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది. పర్యాటకుల తాకిడి కూడా గణనీయంగా పెరుగుతోంది. అదేవిధంగా, నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను – అహ్మదాబాద్ లోని కంకరియా సరస్సు. ఒకానొక సమయంలో అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు , వేరే మార్గంలో వెళ్ళేవారు. ఆ మార్గాన్ని కొంచెం పునరుద్ధరించారు, కొద్దిగా పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు, మరియు ఈ రోజు పరిస్థితి ఏమిటి – అక్కడ సందర్శకుల సంఖ్య ఇప్పుడు ఏటా 75 లక్షలకు చేరుకుంటుంది. అహ్మదాబాద్ నగరం మధ్యలో, ఈ ప్రదేశం 75 లక్షల, మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకు గొప్ప ఆకర్షణకు కారణమైంది మరియు చాలా మంది ప్రజల ఆహారం మరియు జీవనోపాధికి కూడా ఒక కారణం అయ్యింది. ఈ మార్పులు పర్యాటకుల సంఖ్యను పెంచడానికి మరియు స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. పర్యాటకం అంటే కనీసం మూలధనం ఉన్న ప్రాంతం మరియు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది.

మన గుజరాతీ సహచరులు… మరియు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన గుజరాతీ సోదరులు మరియు సోదరీమణులకు నేను చెప్పాలనుకుంటున్నాను, గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్‌గా, గుజరాత్ ప్రజలు ఈ రోజు ప్రపంచం లో  ఆధిపత్యం చేస్తున్నారు. గుజరాత్ తన స్వంత ప్రదేశంలో కొత్త ఆకర్షణ కేంద్రాన్ని తయారుచేస్తున్నప్పుడు, భవిష్యత్తులో కూడా ఇది నిర్మించబోతోంది, అప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మా గుజ్జు సోదరులకు చెప్తాను, మన సహచరులందరూ, వారి మాటలను ప్రపంచమంతటా స్వయంగా తీసుకోండి. వెళ్ళండి, ప్రపంచాన్ని ఆకర్షించండి. పర్యాటక కేంద్రమైన గుజరాత్‌తో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మనం ఈ దిశగా ముందుకు వెళ్లాం, మనం ముందుకు సాగాల్సి ఉంది.

ఈ ఆధునిక సౌకర్యాలు పొందినందుకు గుజరాత్ సోదర సోదరీమణులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మా ఆంబే (దుర్గా మాత  ఆశీస్సులతో గుజరాత్ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. .  గుజరాత్ ఆరోగ్యంగా ఉండాలి ,  గుజరాత్ బలంగా ఉండాలి . ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ  ధన్యవాదాలు. చాలా అభినందనలు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor

Media Coverage

‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu meets Prime Minister
May 24, 2025

The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri Praful K Patel met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office handle posted on X:

“The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri @prafulkpatel, met PM @narendramodi.”