PM to inaugurate the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar
Conclave aims to position Odisha as the anchor of Purvodaya vision, leading investment destination and industrial hub in India
PM to inaugurate the 38th National Games in Dehradun
Theme for National Games: Green Games

 

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జనవరి 28న ఒడిశాలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11 గంటలకు ఆయన ‘ఉత్కర్ష్ ఒడిశా-మేక్ ఇన్ ఒడిశా కాన్‌క్లేవ్- 2025’ను భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు 38వ నేషనల్ గేమ్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
ఒడిశాలో ప్రధాని
ప్ర‌ధానమంత్రి భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా-మేక్ ఇన్ ఒడిశా కాన్‌క్లేవ్ 2025’ను ప్రారంభించనున్నారు. ఒడిశా ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ‘పూర్వోదయ విజన్’కు కేంద్ర స్థానంలో ఒడిశాను నిలబెట్టడంతోపాటు, భారత్‌లో పెట్టుబడికి ప్రధాన నిలయాల్లో ఒకటిగానే కాకుండా పారిశ్రామిక కూడలిగా ఆ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం ఈ సమిట్ లక్ష్యాలలో భాగంగా ఉన్నాయి.

ప్రధాని ‘మేక్ ఇన్ ఒడిశా ఎగ్జిబిషన్’ను కూడా ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన ఒడిశాలో చైతన్యభరిత పారిశ్రామిక విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్)ను అభివృద్ధిపరచడంలో రాష్ట్రం సాధించిన విజయాలను కళ్లకు కడుతుంది. సదస్సును జనవరి 28, 29 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఇది పెట్టుబడులు పెట్టడానికి ఒడిశాను ఎంపిక చేసుకోవడానికి ఆ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను గురించి చర్చించడానికి పరిశ్రమ రంగ ప్రముఖులకు, పెట్టుబడిదారులకు, విధాన రూపకర్తలకు ఒక వేదికగా ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఈ కాన్‌క్లేవ్‌లో ముఖ్య కార్యనిర్వహణ అధికారులతోపాటు ప్రముఖులు పాల్గొనే రౌండ్‌ టేబుల్ సమావేశాలు, రంగాలవారీ కార్యక్రమాలు, బిజినెస్ టు బిజినెస్ (బి2బి) సమావేశాలు, విధానపరమైన చర్చలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లతో కీలక సంభాషణలకు చోటివ్వాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశంగా ఉంది.
ఉత్తరాఖండ్‌లో ప్రధాని

ప్రధానమంత్రి 38వ జాతీయ క్రీడలను డెహ్రాడూన్‌లో ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్ ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ క్రీడలను అక్కడ నిర్వహిస్తున్నారు. నేషనల్ గేమ్స్‌కు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్‌లో 8 జిల్లాల్లోని 11 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి.

జాతీయ క్రీడల్లో 36 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పాలుపంచుకొంటున్నాయి. 17 రోజుల పాటు 35 క్రీడల్లో విభాగాల్లో పోటీలను నిర్వహిస్తారు. వీటిలో 33 క్రీడల్లో పతకాలను ప్రదానం చేయనున్నారు. మరో 2 క్రీడలను ఎగ్జిబిషన్ స్పోర్ట్స్ కేటగిరీలో నిర్వహించనున్నారు. యోగ, మల్లఖంబ్‌ను జాతీయ క్రీడల్లో మొట్టమొదటిసారిగా చేర్చారు. ఈ క్రీడల కార్యక్రమంలో 10,000 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ‘‘హరిత క్రీడల’’ను ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్‌‌కు ఇతివ‌ృత్తంగా ఎంపిక చేశారు. స్పోర్ట్స్ ఫారెస్ట్ పేరుతో పిలిచే ఒక ప్రత్యేక పార్కును కార్యక్రమ స్థలికి సమీపంలో అభివృద్ధిపరచనున్నారు. అక్కడ 10,000కన్నా ఎక్కువ మొక్కలను క్రీడాకారులు, అతిథులు కలసి నాటుతారు. ఆటగాళ్లకు అందజేసే పతకాలను, ధ్రువపత్రాలను పర్యావరణ స్నేహపూర్వక పదార్థాలతోనూ, మళ్లీ ప్రకృతిలో విలీన పరచడానికి అనువుగా ఉండే (బయోడిగ్రేడబుల్) పదార్థాలతోనూ రూపొందించనున్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 డిసెంబర్ 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity