దియోఘ‌ర్‌లో 16,000 కోట్ల రూపాయలకు పైగా విలువ‌గ‌ల అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
ఈ ప్రాజెక్టులు మౌలిక స‌దుపాయాల అభివృద్ధి, అనుసంధాన‌త పెంపు, ఈ ప్రాంతంలో సుల‌భ‌త‌ర జీవ‌నాన్ని గ‌ణ‌నీయంగా వృద్ధి చేయ‌డానికి ఉప‌క‌రించ‌నుంది.
దియోఘ‌ర్ విమానాశ్ర‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు. ఇది బాబా వైద్యనాథ్‌ధామ్ తో నేరుగా విమాన సేవ‌ల‌కు వీలు క‌ల్పిస్తుంది.
దియోఘ‌ర్ ఎయిమ్స్ లో ఇన్ పేషెంట్ డిపార్ట‌మెంట్‌, ఆప‌రేష‌న్ థియేట‌ర్ స‌ర్వీసును దేశానికి అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి
​​​​​​​బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ‌త‌వార్షికోత్స‌వాల ముగింపు స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ 2022 జూలై 12న దియోఘ‌ర్‌, పాట్నాల‌ను సంద‌ర్శించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి 16,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువ‌గ‌ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు దియోఘ‌ర్ లో శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం 12.40 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి బాబావైద్య‌నాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించి పూజ‌లు చేయ‌నున్నారు. బాబా వైద్య‌నాథ ఆల‌యం 12  జ్యోతిర్లింగాల‌లో ఒక‌టి. సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి పాట్నాలో బీహార్ శాస‌న‌స‌భ శ‌త‌వార్షికోత్స‌వాల‌లో ప్ర‌సంగిస్తారు.
దియోఘ‌ర్ లో ప్ర‌ధాన‌మంత్రి :

మౌలిక స‌దుపాయాల ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయ‌డంలో భాగంగా, అలాగే అనుసంధాన‌త పెంపుకు వీలుగా, ఈ ప్రాంతంలో సుల‌భ‌త‌ర జీవ‌నానికి వీలు క‌ల్పిస్తూ ప్ర‌ధాన‌మంత్రి దియోఘ‌ర్ లో 16,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువ‌గ‌ల వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ  ప్రాజెక్టులు ఈ ప్రాంత సామాజిక‌, ఆర్థిక సుసంప‌న్న‌త‌ను చెప్పుకోద‌గిన రీతిలో మెరుగుప‌రిచేందుకు ఉప‌క‌రించ‌నున్నాయి.

బాబా బైద్య‌నాథ్ ధామ్‌కు నేరుగా అనుసంధాన‌త క‌ల్పించ‌డం కీల‌క‌మైన ముంద‌డుగు. ఇది దేశ‌వ్యాప్తంగా ఉన్న  భ‌క్తుల‌కు ఆథ్యాత్మిక కేంద్రం. ప్ర‌ధాన‌మంత్రి  ఈ సంద‌ర్భంగా దియోఘ‌ర్ విమానాశ్ర‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. దీనిని 400 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించారు. ఎయిర్ పోర్టు టెర్మిన‌ల్ బిల్డింగ్ ఏటా 5 ల‌క్ష‌ల‌మంది ప్ర‌యాణికుల రాక‌పోక‌ల ర‌ద్దీని త‌ట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

దియోఘ‌ర్‌లోని ఎయిమ్స్ వైద్య‌శాల ఈ మొత్తం ప్రాంతానికి వైద్య సేవ‌లకు ఎంతో కీల‌క‌మైన‌ది. ఎయిమ్స్ దియోఘ‌ర్ సేవ‌లను మ‌రింత విస్తృత‌ప‌రిచేందుకు ప్ర‌ధాన‌మంత్రి ఇన్ పేషెంట్ డిపార్ట‌మెంట్ (ఐపిడి ) , దియోఘ‌ర్ ఎయిమ్స్ ఆప‌రేష‌న్ థియేట‌ర్ స‌ర్వీసుల‌ను జాతికి అంకితం చేయ‌నున్నారు. ఇది ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌, దేశంలోని అన్ని ప్రాంతాల‌కు ఆరోగ్య సంరక్ష‌ణ చ‌ర్య‌లు అందుబాటులోకి తీసుకురావాల‌న్న దానికి అనుగుణంగా దీన‌ని చేప‌డుతున్నారు.

దేశ‌వ్యాప్తంగా మ‌త‌ప‌ర‌మైన ప్రాధాన్య‌త‌గల ప్రాంతాల‌లో ప్ర‌పంచ‌శ్రేణి మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రిచేందుకు, ఆయా ప్రాంతాల‌లో ప‌ర్యాట‌కుల‌కు స‌దుపాయాల‌ను మెరుగుప‌రిచేందుకు  ప్ర‌ధాన‌మంత్రి క‌ట్టుబ‌డి ఉన్నారు. దియోఘ‌ర్ బైద్య‌నాథ్ ధామ్ అభివృద్ధి ప‌థ‌కాన్ని ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ  వారి  ప్ర‌సాద్ ప‌థ‌కం కింద ఆమోదించారు. దీనిని ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. దీనితోపాటు ఒక్కోటి 2000 మంది యాత్రికుల‌కు సదుపాయం క‌ల్పించేలా అభివృద్ధి చేసిన  హాళ్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు. అలాగే జ‌ల్సార్ లేక్ ఫ్రంట్ అభివృద్ధి, శివ‌గంగా చెరువు అభివృద్ధి వంటివి కూడా ఇందులో ఉన్నారు. బాబా బైద్య‌నాధ్ ధామ్ ద‌ర్శించే ల‌క్ష‌లాది మంది కి మెరుగైన అనుభ‌వాన్ని ఇచ్చేందుకు నూత‌న స‌దుపాయాలు మ‌రింత వీలు క‌ల్పించ‌నున్నాయి.

ప్ర‌ధాన‌మంత్రి 10,000 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో చేప‌ట్టే ప‌లు రోడ్ఉ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుల‌లో ఆరు లైన్ల గోర్‌హార్ నుంచి బార్వాడా సెక్ష‌న్ ఎన్ హెచ్ -2, రాజ్‌గంజ్‌-చాస్ రోడ్డును ఎన్‌హెచ్ 3 2మీద ప‌శ్చిమ‌బెంగాల్ స‌రిహ‌ద్దు వ‌ర‌కు వెడ‌ల్పు చేయ‌డం వంటి ప‌నులు ఉన్నాయి.

ఎన్ హెచ 80 లో మీర్జాచౌకి- ఫ‌ర‌క్కా సెక్ష‌న్ లో నాలుగులేన్ల ర‌హ‌దారి ప‌నుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేస్తారు. అలాగే ఎన్ హెచ్ 98 లో హరిహ‌ర గంజ్ నుంచి పార్వా మోరే వ‌ర‌కు, ఎన్ హెచ్ 23 సెక్ష‌న్‌లో  పాల్మా నుంచి గుల్మా వ‌ర‌కు , ఎన్ హెచ్ 75 లో పిస్కా మోరె సెక్ష‌న్ నుంచి  కుచెరిచౌక్  వ‌ర‌కు రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి మ‌రింత అనుసంధాన‌త‌ను పెంచుతాయి. అలాగే సామాన్య ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తాయి.

సుమారు 3000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల‌, వివిధ ఇంధ‌న మౌలిక‌స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేస్తారు.  ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభోత్స‌వం చేయ‌నున్న ప్రాజెక్టుల‌లో  గెయిల్ కు చెందిన   బోకారో-అన్‌గుల్ సెక్ష‌న్‌లోని జ‌గ‌దీష్‌పూర్ - హాల్దియా- బోకారో- ధ‌మ‌ర పైప్ లైన్ , హ‌జారీబాగ్‌లోని బ‌ర్హి వ‌ద్ద హెచ్‌పిసిఎల్ కొత్త బాట్లింగ్ ప్లాంటు, బిపిసిఎల్ వారి బొకారో ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్ ఉన్నాయి. జ‌రియా బ్లాక్‌,కోల్ బెడ్ మీథేన్ (సిబిఎం)  ప‌ర్‌బ‌త్‌పూర్ గ్యాస్ సేక‌ర‌ణ స్టేష‌న్‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి త‌మ ప‌ర్య‌ట‌న‌లో గొడ్డ‌-హ‌న్సిదిహ విద్యుదీక‌ర‌ణ సెక్ష‌న్‌, గ‌ర్హ్వ‌- మ‌హురియా డ‌బ్లింగ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టులు వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు, విద్యుత్ కేంద్రాల‌కు నిరంత‌రాయంగా స‌ర‌కు ర‌వాణా చేయ‌డానికి ప‌నికివ‌స్తాయి.  అలాగే దుమ్ కానుంచి అస‌న్ సోల్‌కు రైళ్ల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తాయి. ప్ర‌ధాన‌మంత్రి మూడు రైల్వే ప్రాజెక్టుల‌కు కూడా శంకుస్థాప‌న చేస్తారు. ఇవి రాంచీ రైల్వే స్టేష‌న్ పున‌ర్ అభివృద్ధి, ప్రాజెక్టు, జ‌సిదిహ బైపాస్ లేను, గొడ్డ‌ ఎల్‌.హెచ్‌బి కోచ్ మెయింటినెన్స్ డిపో . ప్ర‌తిపాదిత‌ రాంచీ స్టేష‌న్ పునర్ అభివృద్ధి ద్వారా ఈ స్టేష‌న్ లో ప్ర‌పంచ శ్రేణి సదుపాయాలు క‌ల్పిస్తారు ఇందులో ఫుడ్ కోర్టు, ఎగ్జిక్యుటివ్ లాంజ్‌, కెఫ‌టేరియా, ఎయిర్ కండిష‌న్డ్ వెయిటింగ్ హాల్ వంటి వి ఉంటాయి. ఇది ప్ర‌యాణికుల‌కు మెరుగైన సదుపాయాలు క‌ల్పించ‌డ‌మే కాకుండా ప్ర‌యాణికుల సుల‌భ‌త‌ర ప్ర‌యాణాల‌కు ఉప‌క‌రిస్తుంది.

పాట్నాలో ప్ర‌ధాన‌మంత్రి
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ‌త‌వార్షికోత్స‌వాల ముగింపు స‌మావేశంలో ప్ర‌సంగిస్తారు. బీహార్ విధాన‌స‌భ శ‌త వ‌సంతాల ఉత్స‌వాల సంద‌ర్భంగా నిర్మించిన శ‌తాబ్ది స్మృతి స్తంభాన్ని ప్ర‌ధాన‌మంత్రి ఆవిష్క‌రిస్తారు.  అలాగే ప్ర‌ధాన‌మంత్రి విధాన‌స‌భ మ్యూజియంకు శంకు స్థాప‌న చేస్తారు. మ్యూజియంలోని వివిధ గ్యాలరీలు బీహార్‌లో ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌ను ప్ర‌తిబింబిస్తాయి. అలాగే ప్ర‌స్తుత పౌర పాల‌నా వ్య‌వ‌స్థ‌ల నేప‌థ్యాన్ని తెలియ‌జేస్తుంది. 250 మందికిపైగా కూర్చునే సామ‌ర్ధ్యంగ‌ల  కాన్ఫ‌రెన్స్ హాల్ కూడా ఇందులో ఉంటుంది. ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా విధాన స‌భ అతిథిగృహానికి కూడా శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
With growing economy, India has 4th largest forex reserves after China, Japan, Switzerland

Media Coverage

With growing economy, India has 4th largest forex reserves after China, Japan, Switzerland
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 నవంబర్ 2024
November 02, 2024

Leadership that Inspires: PM Modi’s Vision towards Viksit Bharat