భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమక్షించనున్న ఇద్దరు నేతలు..
ప్రాంతీయంగానూ, ప్రపంచ స్థాయిలోనూ ప్రాధాన్యం కలిగిన అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్న శ్రీ మేక్రోన్, శ్రీ మోదీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 17న ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌తో సమావేశమవుతారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌ అందుకొని, 2026 ఫిబ్రవరి 17వ తేదీ మొదలు 19వ తేదీ వరకూ భారత్‌లో అధికారిక పర్యటనకు వస్తున్నారు. ఆయన భారత్‌లో జరుగుతున్న ‘కృత్రిమ మేధ ప్రభావ శిఖరాగ్ర సదస్సు’లో పాల్గొంటారు. ముంబయిలో ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సులోనూ పాలుపంచుకోనున్నారు. అధ్యక్షుడు శ్రీ మేక్రోన్‌ భారత్‌కు రావడం ఇది నాలుగో సారి. ముంబయిలో ఆయన పర్యటించనుండడం ఇది మొదటి సారి.

 

ఫిబ్రవరి 17న మధ్యాహ్నం దాదాపు 3:15 గంటలకు, ఇద్దరు నేతలూ ముంబయిలోని లోక్ భవన్‌లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో చోటుచేసుకున్న పురోగతిని ఈ సమావేశాలలో వారు సమీక్షిస్తారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేసుకోవడానికీ, దీంతో పాటు సరికొత్త రంగాల్లోకి విస్తరించడానికి గల అవకాశాలపై వారు తమ చర్చలలో శ్రద్ధ తీసుకొంటారు. ప్రాంతీయంగానూ, ప్రపంచ స్థాయిలోనూ ప్రాధాన్యం కలిగిన అంశాలపై ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ అభిప్రాయాల్ని పంచుకుంటారు.

 

సాయంత్రం సుమారు 5:15 గంటలకు, నేతలిద్దరూ ‘భారత్-ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం-2026’ను ప్రారంభిస్తారు. రెండు దేశాలకూ చెందిన వాణిజ్య రంగ ప్రముఖులు, అంకుర సంస్థలు, పరిశోధకులతో పాటు నూతన ఆవిష్కర్తలతో ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How GST 2.0 changed India’s car market and boosted small car sales

Media Coverage

How GST 2.0 changed India’s car market and boosted small car sales
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 మే 2026
May 19, 2026

Exports Up, Economy Strong, World Collaborating: PM Modi's Reforms Delivering Jobs, Growth & Green Future