ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో రెండు రోజుల పాటు జరుగుతుంది
శ్రమ కు సంబంధించిన అంశాలు మరియు శ్రామికుల సంక్షేమం తో జతపడ్డ అంశాల లో కేంద్రాని కి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకుమధ్య పరస్పర సమన్వయాన్ని ఏర్పరచడం లో ఈ సమావేశం తోడ్పడనుంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా 2022వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీ నాడు సాయంత్రం 4:30 గంటల కు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాన్ని కేంద్ర శ్రమ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ 2022వ సంవత్సరం ఆగస్టు 25వ, 26వ తేదీల లో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో నిర్వహించనున్నది.

సహకారాత్మక సమాఖ్య విధానం అనే భావన తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది. శ్రమ కు సంబంధించిన వివిధ మహత్వపూర్ణమైనటువంటి అంశాల ను ఈ సమావేశం లో చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశం ద్వారా శ్రామికుల సంక్షేమం కోసం పథకాల ను ప్రభావవంతమైన విధం గా అమలు చేయడానికి పూచీపడడం లో మరియు మెరుగైన విధానాల ను రూపొందించడం లో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య మరింత క్రియాశీల సమన్వయాన్ని ఏర్పరచడం లో తోడ్పాటు లభించనుంది.

సమావేశం లో భాగం గా అంశాల పై ఆధారపడిన నాలుగు సదస్సుల ను ఏర్పాటు చేయడమైంది. వాటి లో - సామాజిక పరిరక్షణ ను సార్వజనీకరించేందుకు సంబంధించి సామాజిక సురక్ష పథకాల తాలూకు ప్రక్రియల ను ఒకచోటు కు తీసుకురావడానికని ‘ఇ-శ్రమ్ పోర్టల్’ ను ఏకీకరించడం; ‘స్వాస్థ్య సే సమృద్ధి’ కి గాను రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న ఇఎస్ఐ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న వైద్య సంరక్షణ సదుపాయాల ను మెరుగు పరచడంమరియు ఆ విధమైనటువంటి సేవల ను పిఎమ్ జెఎవై లతో కలిపివేయడం; నాలుగు లేబర్ కోడ్ లలో భాగం గా నియమాల ను రూపొందించడం, మరి వాటి ని అమలు పరచేందుకు విధి విధానాల ను ఏర్పరచడం; క్రమంగాని ఉద్యోగం చేసే/ తాత్కాలిక కంట్రాక్టు లపై పని చేసే/ స్వల్పకాలిక సేవ లేదా పాక్షిక కాలసేవ అందించేటటువంటి వారు/ చేసిన పని కి బదులు గా చెల్లింపు ప్రాతిపదిక న అట్టిపెట్టుకొన్న శ్రామికులు (గిగ్ వర్కర్స్), ఏదైనా ప్లాట్ ఫార్మ్ తో జతపడ్డ శ్రామికులందరి కోసం శ్రమ మరియు సామాజిక సురక్ష, పని ప్రదేశం లో మహిళల కు మరియు పురుషులకు మధ్య సమానత్వం, ఇంకా ఇతర అంశాలు సహా శ్రమ సంబంధి న్యాయ సమ్మతమైన మరియు అందరికీ సమాన పరిస్థితులు ఉండేటటువంటి విధం గా శ్రద్ధ ను తీసుకొంటూ ‘విజన్ శ్రమేవ జయతే @ 2047’ - వంటి అంశాల ను చేర్చడం జరిగింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Record demand for made-in-India cars

Media Coverage

Record demand for made-in-India cars
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology