కోల్ కతాలో ఈ రోజు జరిగిన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ సమావేశాన్ని సాయుధ దళాల అత్యున్నత స్థాయి మేధోమథన వేదికగా పరిగణిస్తారు. ఇది దేశంలోని అగ్రశ్రేణి పౌర, సైనిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుంది. పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. భారత సైనిక సన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణను అందిస్తుంది. సాయుధ దళాల ప్రస్తుత ఆధునికీకరణ, మార్పులకు అనుగుణంగా 'సంస్కరణల సంవత్సరం - భవిష్యత్తు కోసం మార్పు‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో పాటు దేశ నిర్మాణం, పైరసీ నిరోధం, సంఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో పాటు మిత్ర దేశాలకు మానవతా సహాయం, విపత్తు ఉపశమన (హెచ్ఏడీఆర్) సహాయాన్ని అందించడంలో సాయుధ దళాలు పోషించిన సమగ్ర పాత్రను ప్రధానమంత్రి అభినందించారు. 2025వ సంవత్సరాన్ని రక్షణ రంగంలో 'సంస్కరణల సంవత్సరం' గా పరిగణిస్తున్న సందర్భంలో, భవిష్యత్తు సవాళ్ళను, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మరింత కలసికట్టుతనం, ఆత్మనిర్భరత, ఆవిష్కరణల సాధనలో స్పష్టమైన చర్యలను వేగంగా అమలు చేయాలని రక్షణ మంత్రిత్వశాఖను ప్రధానమంత్రి ఆదేశించారు.

ఆపరేషన్ సిందూర్ సృష్టించిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో బలగాల కార్యాచరణ సంసిద్ధత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వ్యూహాల నేపథ్యంలో భవిష్యత్ యుద్ధ రంగం గురించి ఈ సందర్భంగా అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. గడచిన రెండేళ్ళలో అమలు పరచిన సంస్కరణలను, రాబోయే రెండేళ్ల ప్రణాళికను కూడా ప్రధానమంత్రి సమీక్షించారు.

వివిధ బలగాల నుంచి వచ్చిన సమాచారం, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో సాయుధ దళాలకు సంసిద్ధత అవసరం అన్న ఆధారంగా వివిధ నిర్మాణాత్మక, పరిపాలన, కార్యాచరణ అంశాలపై రాబోయే రెండు రోజులలో ఈ సమావేశం సమగ్ర సమీక్షను నిర్వహిస్తుంది. అలాగే ప్రధానమంత్రి దార్శనికతను అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించే చర్చలు కూడా జరుగుతాయి.
Addressed the Combined Commanders’ Conference in Kolkata. In line with this year’s theme ‘Year of Reforms – Transformation for the Future’, discussed the steps being taken to further self-reliance in the sector and encourage modernisation. Appreciated the role of the armed forces… pic.twitter.com/6EFEg7f643
— Narendra Modi (@narendramodi) September 15, 2025




