‘‘మణిపుర్ చరిత్ర లో అనుకూలతలు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు కనబరచినఐకమత్యం మరియు సంయమనం అనేవి వారి యొక్క వాస్తవిక శక్తులు గా ఉన్నాయి’’
‘‘బందులుమరియు దిగ్బంధాల బారి నుంచి మణిపుర్ కు శాంతి ఎంతయినా అవసరం’’
‘‘మణిపుర్ ను దేశం లో క్రీడ ల పవర్ హౌస్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వంకంకణం కట్టుకొంది’’
‘‘యాక్ట్ఈస్ట్ పాలిసి కి ఈశాన్య ప్రాంతాన్ని కేంద్రం గా మార్చాలనే దృష్టికోణం లో మణిపుర్ కుఒక కీలకమైనటువంటి పాత్ర ఉంది’’
‘‘రాష్ట్రం వృద్ధియాత్ర లో అడ్డంకుల ను తొలగించడమైంది; రాబోయే 25 సంవత్సరాలు మణిపుర్ అభివృద్ధి లో అమృత కాలం’’

మణిపుర్ 50వ స్థాపన దినం సందర్భం లో మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, ఈ వైభవోపేతమైనటువంటి ప్రస్థానాని కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్క వ్యక్తి చేసిన ప్రయాసల కు మరియు త్యాగాల కు నమస్సుల ను సమర్పించారు. మణిపుర్ చరిత్ర లో అనుకూలత లు, ప్రతికూలత లు ఎదురైన వేళ ఆ రాష్ట్ర ప్రజలు కనబరచినటువంటి ఐకమత్యం, సంయమనం వారి నిజమైన శక్తి అని ఆయన అన్నారు. మణిపుర్ రాష్ట్ర ప్రజల ఆశల, ఆకాంక్షల గురించి స్వయం గా తెలుసుకొనే ప్రయత్నాల ను తాను కొనసాగిస్తూ ఉంటానని, ఈ ప్రయత్నాలు వారి భావనల ను, వారి ఆకాంక్షల ను ఉత్తమమైన పద్ధతి లో అర్థం చేసుకోవడాని కి, అలాగే రాష్ట్రం సమస్యల ను పరిష్కరించే మార్గాల ను అన్వేషించడానికి తోడ్పడ్డాయి అని ఆయన పునరుద్ఘాటించారు. శాంతి అనేటటువంటి వారి మహత్తర ఆశయాన్ని మణిపుర్ ప్రజలు నెరవేర్చుకోగలగడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మణిపుర్ కు బందుల బారి నుంచి, దిగ్బంధాల బారి నుంచి విముక్తిని పొంది శాంతి ని మరియు స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి అర్హత ఉన్నది’’ అని ఆయన అన్నారు.

మణిపుర్ ను దేశ క్రీడల రంగం లో పవర్ హౌస్ గా తీర్చిదిద్దడాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. మణిపుర్ యొక్క కుమారులు, మణిపుర్ యొక్క కుమార్తెలు క్రీడల రంగం లో దేశానికి అనేక కార్యసిద్ధుల ను తెచ్చిపెట్టారని, వారు కనబరచిన ఉద్వేగం మరియు వారి సామర్ధ్యాలు భారతదేశం లోని తొలి క్రీడా విశ్వవిద్యాలయం రాష్ట్రం లో ఏర్పాటయ్యేటట్టు చేశాయని ఆయన అన్నారు. స్టార్ట్-అప్స్ రంగం లో మణిపుర్ యువత యొక్క సాఫల్యాన్ని గురించి కూడా ఆయన ప్రత్యేకం గా చెప్పారు. స్థానిక హస్తకళల ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఈశాన్య ప్రాంతాల ను కేంద్ర బిందువు గా నిలిపే అంశం లో మణిపుర్ కు ఉన్న కీలకమైన పాత్ర ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. మణిపుర్ ఎంతో కాలం గా ఎదురు చూస్తూ వచ్చినటువంటి రైల్ వేల మాదిరి సదుపాయాల ను ‘జోడు ఇంజన్’ ప్రభుత్వం హయాం లో పొందుతోందని ఆయన అన్నారు. జిరిబమ్-తుపుల్-ఇంఫాల్ రైలు మార్గం సహా వేల కోట్ల రూపాయల విలువైన సంధాన పథకాలు రాష్ట్రం లో పురోగమిస్తున్నాయి అన్నారు. అదే విధంగా, ఇంఫాల్ విమానాశ్రయం అంతర్జాతీయ హోదా ను అందుకొంటోందని, దిల్లీ, కోల్ కాతా, బెంగళూరు లతో ఈశాన్య ప్రాంత రాష్ట్రాల సంధానం మెరుగైందని ఆయన వివరించారు. భారతదేశం-మ్యాంమార్-థాయీలాండ్ త్రైపాక్షిక రాజమార్గం, ఇంకా ఈ ప్రాంతం లో త్వరలో పూర్తి కాబోతున్న 9 వేల కోట్ల విలువైన సహజ వాయువు సరఫరా గొట్టపుమార్గం ల తాలూకు ప్రయోజనాల ను సైతం మణిపుర్ అందుకోగలుగుతుంది అని ఆయన అన్నారు.

 

రాష్ట్ర వృద్ధి ప్రస్థానం లో అవరోధాల ను తొలగించడమైంది, మరి రాబోయే పాతికేళ్ళ కాలం మణిపుర్ యొక్క అభివృద్ధి లో ఒక ‘అమృత కాలం’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో ‘జోడు ఇంజిన్’ల వేగం తో వృద్ధి జరగాలి అని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

Click here to read full text speech

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
'My fellow karyakarta ... ': PM Modi's Ram Navami surprise for Phase 1 NDA candidates

Media Coverage

'My fellow karyakarta ... ': PM Modi's Ram Navami surprise for Phase 1 NDA candidates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 ఏప్రిల్ 2024
April 18, 2024

From Red Tape to Red Carpet – PM Modi making India an attractive place to Invest