భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వయంచలిత పునరుపయోగ వాహకనౌక ప్రయోగం నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత వాయుసేన, ‘డిఆర్‌డిఒ’ల సహకారంతో కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఎయిరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్) నుంచి ఇస్రో ఈ పునరుపయోగ వాహకనౌక స్వయంచలితంగా తిరిగొచ్చే ప్రయోగాన్ని 2023 ఏప్రిల్ 2న ఉదయం నిర్వహించింది.
ఈ ప్రయోగంపై ఇస్రో ట్వీట్‌ల మీద స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇదొక గొప్ప సమష్టి విజయం... భారత పునరుపయోగ అంతరిక్ష వాహకనౌక తయారీ స్వప్న సాకారం దిశగా ఇది మరొక ముందడుగు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A great team effort. This achievement takes us one step closer to realising an Indian Reusable Launch Vehicle. https://t.co/GvBs2THWwK
— Narendra Modi (@narendramodi) April 2, 2023


