రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. తొలి
స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆమె చూపిన శౌర్య సాహసాల కథ ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్ని, తపనను పెంచుతుంది. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాలు, పోరాటాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"భారతమాత అమర యోధురాలు రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు గౌరవపూర్వక నివాళులు. తొలి స్వాతంత్య్ర పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాన్నీ, పోరాటాన్నీ కృతజ్ఞత గల భారత్ ఎన్నటికీ మర్చిపోదు"
मां भारती की अमर वीरांगना रानी लक्ष्मीबाई को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। आजादी के पहले संग्राम में उनकी वीरता और पराक्रम की कहानी आज भी देशवासियों को जोश और जुनून से भर देती है। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उनके त्याग और संघर्ष को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं…
— Narendra Modi (@narendramodi) November 19, 2025


