అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దడంలో ఆత్మవిశ్వాసం పోషించగల పరివర్తనాత్మక పాత్రను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఆత్మవిశ్వాసం ఒక శక్తి.. దీని అండతో అన్నీ సాధ్యమవుతాయి. వికసిత్ భారత్ కలను పండించుకోవడంలో దేశ ప్రజలకు ఈ శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.
శ్రీర్మంగలాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే
దాక్ష్యాత్ తు కురుతే మూలం సంయమాత్ ప్రతితిష్ఠతి’’ అని పేర్కొన్నారు.
आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।
— Narendra Modi (@narendramodi) February 3, 2026
श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।
दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ pic.twitter.com/FcQqHbSvI9


