వన మహోత్సవ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తులు ఉత్సాహంగా పాల్గొనడం ప్రశంసనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పర్యావరణ బాధ్యత పట్ల పౌరులను ప్రేరేపించడంలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు.
తమ మాతృమూర్తికి నివాళిగా మొక్కలు నాటేలా పౌరులను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన "ఏక్ పేడ్ మా కే నామ్" కార్యక్రమానికి వారి భాగస్వామ్యం కొత్త ఊపునిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఢిల్లీ-ఎన్‌సీటీ మంత్రి శ్రీ మంజిందర్ సింగ్ సిర్సా ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టుకు ప్రతిస్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"వన మహోత్సవంలో గౌరవ న్యాయమూర్తులు పాల్గొనడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇది 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారానికి కచ్చితంగా కొత్త ఊపునిస్తుందని నేను భావిస్తున్నాను."
#EkPedMaaKeNaam”
सर्वोच्च न्यायालय के माननीय न्यायाधीशों की गरिमामयी उपस्थित में आज वन महोत्सव का कार्यक्रम संपन्न हुआ।
— Manjinder Singh Sirsa (@mssirsa) July 19, 2025
कार्यक्रम में चीफ जस्टिस ऑफ इंडिया, माननीय जस्टिस भूषण रामकृष्ण गंवई जी, जस्टिस सूर्यकांत शर्मा जी, जस्टिस विक्रमनाथ जी, जस्टिस एम.एम. सुंदरेश जी, जस्टिस पी. श्री. नरसिम्हा… pic.twitter.com/uRCXVoHxxR


