దేశ ప్రజలు ఛఠ్ పర్వదినాన్ని త్వరలో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా భక్తిభావాన్నీ, సాంస్కృతిక ఐకమత్య భావననూ చాటాలనీ, ఛఠీ మాతకు అంకితమిచ్చిన పాటలను తనతో పంచుకోవాలనీ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఛఠ్‌కు ప్రకృతితో, సంస్కృతితో ప్రగాఢ బంధం ఉందనీ, బీహార్‌తో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ పండగకు సంబంధించిన సన్నాహాలను ఇప్పటికే మొదలుపెట్టారనీ అన్నారు.
ఛఠ్ తాలూకు ఉత్సాహాన్ని వెల్లడించే గేయాలను రూపొందించాల్సిందిగా పౌరులను శ్రీ మోదీ ప్రోత్సహించారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రకృతికీ, సంస్కృతికీ అంకితమైన మహాపర్వం ఛఠ్ త్వరలో రానుంది. బీహార్ సహా దేశమంతటా ఈ పండగకు సన్నాహాల్ని చేపట్టడంలో శ్రద్ధాళువులు ఎంతో భక్తిభావంతో నిమగ్నమయ్యారు. ఛఠీ మాతను ఉద్దేశించి రూపొందే గీతాలు ఈ పవిత్ర సందర్భం గొప్పతనాన్నీ, దివ్యత్వాన్నీ మరింత పెంచుతాయి. మీరు ఛఠ్ పూజకు సంబంధించిన గేయాల్ని నాతో పంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ గేయాలన్నిటినీ నేను రాబోయే కొన్ని రోజుల పాటు దేశ ప్రజలందరితో పంచుకుంటాను.’’
“प्रकृति और संस्कृति को समर्पित महापर्व छठ आने वाला है। बिहार सहित देशभर में इसकी तैयारियों में श्रद्धालु पूरे भक्ति-भाव से जुट चुके हैं। छठी मइया के गीत इस पावन अवसर की भव्यता और दिव्यता को और बढ़ाने वाले होते हैं। आपसे आग्रह है कि आप भी छठ पूजा से जुड़े गीत मेरे साथ शेयर करें। मैं अगले कुछ दिनों तक इन्हें सभी देशवासियों के साथ साझा करूंगा।”
प्रकृति और संस्कृति को समर्पित महापर्व छठ आने वाला है। बिहार सहित देशभर में इसकी तैयारियों में श्रद्धालु पूरे भक्ति-भाव से जुट चुके हैं। छठी मइया के गीत इस पावन अवसर की भव्यता और दिव्यता को और बढ़ाने वाले होते हैं। आपसे आग्रह है कि आप भी छठ पूजा से जुड़े गीत मेरे साथ शेयर करें।…
— Narendra Modi (@narendramodi) October 24, 2025


