త్వరలో ఛఠ్ మహాపర్వదినం..

Published By : Admin | October 24, 2025 | 10:39 IST

దేశ ప్రజలు ఛఠ్ పర్వదినాన్ని త్వరలో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా భక్తిభావాన్నీ, సాంస్కృతిక ఐకమత్య భావననూ చాటాలనీ, ఛఠీ మాతకు అంకితమిచ్చిన పాటలను తనతో పంచుకోవాలనీ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఛఠ్‌కు ప్రకృతితో, సంస్కృతితో ప్రగాఢ బంధం ఉందనీ, బీహార్‌తో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ పండగకు సంబంధించిన సన్నాహాలను ఇప్పటికే మొదలుపెట్టారనీ అన్నారు.

ఛఠ్ తాలూకు ఉత్సాహాన్ని వెల్లడించే గేయాలను రూపొందించాల్సిందిగా పౌరులను శ్రీ మోదీ ప్రోత్సహించారు.

‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రకృతికీ, సంస్కృతికీ అంకితమైన మహాపర్వం ఛఠ్ త్వరలో రానుంది. బీహార్ సహా దేశమంతటా ఈ పండగకు సన్నాహాల్ని చేపట్టడంలో శ్రద్ధాళువులు ఎంతో భక్తిభావంతో నిమగ్నమయ్యారు. ఛఠీ మాతను ఉద్దేశించి రూపొందే గీతాలు ఈ పవిత్ర సందర్భం గొప్పతనాన్నీ, దివ్యత్వాన్నీ మరింత పెంచుతాయి. మీరు ఛఠ్ పూజకు సంబంధించిన గేయాల్ని నాతో పంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ గేయాలన్నిటినీ నేను రాబోయే కొన్ని రోజుల పాటు దేశ ప్రజలందరితో పంచుకుంటాను.’’

“प्रकृति और संस्कृति को समर्पित महापर्व छठ आने वाला है। बिहार सहित देशभर में इसकी तैयारियों में श्रद्धालु पूरे भक्ति-भाव से जुट चुके हैं। छठी मइया के गीत इस पावन अवसर की भव्यता और दिव्यता को और बढ़ाने वाले होते हैं। आपसे आग्रह है कि आप भी छठ पूजा से जुड़े गीत मेरे साथ शेयर करें। मैं अगले कुछ दिनों तक इन्हें सभी देशवासियों के साथ साझा करूंगा।”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi