ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

లోతైన అవగాహనతో, భవిష్యత్ అవసరాలపై దృష్టిని సారిస్తూ ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ సేవల్ని బాధ్యతాయుత విధానంలో విస్తరింప చేయడం, ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి ప్రధాన అవకాశాలను సద్వినియోగపరచడంపైన కూడా ఈ చర్చల్లో దృష్టి సారించారు.
మానవ ప్రగతితో పాటు సుస్థిర అభివృద్ధి సాధనకు కృత్రిమ మేధను ఉపయోగించే విషయంలో ఉమ్మడి నిబద్ధతను వ్యక్తం చేయడం సంతోషదాయకమని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ సమావేశంలో కృత్రిమ మేధ, సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు పాలుపంచుకున్నారు. లోతైన అవగాహనతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు సాగాయి.. ముఖ్యంగా కృత్రిమ మేధ సేవల్ని బాధ్యతాయుత విధానంలో విస్తరింపచేయడం, ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని దృఢతరం చేసుకోవడంతో పాటు అభివృద్ధికి గల అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంపై ఈ చర్చలలో శ్రద్ధ తీసుకున్నారు.

మానవ ప్రగతి సాధనతో పాటు సుస్థిర అభివృద్ధి దిశగా కృత్రిమ మేధను ఉపయోగించుకొనే అంశంలో సమష్టి నిబద్ధతను వ్యక్తం చేయడం ఉత్సాహపరిచింది’’ అని పేర్కొన్నారు.
The CEO Roundtable at the AI Impact Summit brought together various stakeholders from the world of AI, technology and innovation. The discussions were insightful and forward-looking, focused on scaling AI responsibly, strengthening global collaboration and unlocking opportunities… pic.twitter.com/ZFbrfksL86
— Narendra Modi (@narendramodi) February 19, 2026


