ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబిలో మెడికల్ వ్యాన్ లను ఉపయోగించడం ద్వారా ప్రజారోగ్య సేవలను బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా 25000 మందికి పైగా ప్రజలు నమోదు చేసుకున్న మెడికల్ వ్యాన్ సహాయంతో 2,47,500 మందికి పైగా పౌరులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లు, ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి పార్లమెంటు సభ్యుడు శ్రీ వినోద్ సోంకర్ సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ ను పంచుకుంటూ, ప్రధానమంత్రి ఈ విధంగా ట్వీట్ చేశారు:
“अद्भुत प्रयास! जन सेवा के ऐसे अभियान विकास को नई गति देने वाले हैं।”
"అద్భుతమైన ప్రయత్నం! ఇలాంటి ప్రజాసేవ ప్రచారాలు అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి."
अद्भुत प्रयास! जन सेवा के ऐसे अभियान विकास को नई गति देने वाले हैं। https://t.co/4iupUQQHk4
— Narendra Modi (@narendramodi) March 23, 2023


