హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ దినం సందర్భం గా ఆ రాష్ట్ర ప్రజల కు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ప్రాకృతిక శోభ తో విలసిల్లిన ఈ రాష్ట్రం లోని శ్రమజీవులు ఎల్లప్పుడూ దేశ సేవ కు అంకితమై ఉంటారు. రాబోయే కాలం లో ఈ రాష్ట్ర ప్రజలు నూతన శిఖరాల ను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
सभी हिमाचलवासियों को पूर्ण राज्यत्व दिवस की हार्दिक शुभकामनाएं। नैसर्गिक सौंदर्य से समृद्ध इस प्रदेश के परिश्रमी लोग हमेशा देशसेवा में समर्पित रहे हैं। आने वाले समय में वे सफलताओं की नई ऊंचाइयों को प्राप्त करें, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 25, 2023


