వైద్యుల దినోత్సవం సందర్బంగా వైద్యులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నైపుణ్యంతో, సేవాభావంతో మన వైద్యులు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొన్నారు. వారు కనబరిచే కరుణ కూడా అంతే విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘వృత్తి పట్ల అంకిత భావంతో విధులను నిర్వహిస్తున్న మన వైద్యులందరికీ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నైపుణ్యంతో, సేవాతత్పరతతో మన వైద్యులు ఒక గుర్తింపును తెచ్చుకొన్నారు. వారు కనబరిచే కరుణ కూడా అంతే విశిష్టమైంది. నిజానికి వారు ఆరోగ్య సంరక్షకులుగా, మానవ జాతి మనుగడకు మూలస్తంభంగా నిలుస్తున్నారు. మన దేశ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల వ్యవస్థను బలపరచడానికి వారు అందిస్తున్న తోడ్పాటు అసాధారణమైంది’’ అని పేర్కొన్నారు.
Best wishes to all hardworking doctors on #DoctorsDay. Our doctors have made a mark for their dexterity and diligence. Equally notable is their spirit of compassion. They are truly protectors of health and pillars of humanity. Their contribution in strengthening India’s…
— Narendra Modi (@narendramodi) July 1, 2025


