ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ గొప్ప పండుగ ఈ ఉదయం భగవాన్ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటంతో ముగిసిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, ఛఠ్ పూజ సంప్రదాయంతో భారతదేశంలో దివ్య వైభవం కనిపించిందని ఆయన అన్నారు.
భక్తులు, ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛఠీ మాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటంతో ఛఠ్ మహాపర్వం శుభప్రదంగా ముగిసింది. ఈ నాలుగు రోజుల ఛఠ్ పూజ సందర్భంగా దివ్య వైభవాన్ని మనం చూశాము. ఈ పవిత్ర పండుగలో పాల్గొన్న భక్తులందరికీ, వ్రతం ఆచరించిన వారికి, మా కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! ఛఠీ మాతా అనంతమైన ఆశీర్వాదాలతో మీ జీవితాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"
भगवान सूर्यदेव को प्रात:कालीन अर्घ्य के साथ आज महापर्व छठ का शुभ समापन हुआ। चार दिवसीय इस अनुष्ठान के दौरान छठ पूजा की हमारी भव्य परंपरा के दिव्य दर्शन हुए। समस्त व्रतियों और श्रद्धालुओं सहित पावन पर्व का हिस्सा बने अपने सभी परिवारजनों का हृदय से अभिनंदन! छठी मइया की असीम कृपा से…
— Narendra Modi (@narendramodi) October 28, 2025


