హిందీ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతికంగానూ, భావోద్వేగపరంగానే కాకుండా, సజీవ వారసత్వంగా భారతదేశపు వ్యక్తిత్వానికీ, విలువలకూ ప్రతీకగా ఉంది. భారతీయ భాషలన్నింటినీ సుసంపన్నం చేయడంతో పాటు వాటిని సగర్వంగా భావి తరాల వారి చెంతకు చేర్చడానికి కలిసికట్టుగా కృషి చేద్దామంటూ దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘హిందీ దినోత్సవం సందర్బంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సాంస్కృతికంగానూ, భావోద్వేగపరంగానే కాకుండా, సజీవ వారసత్వంగా భారతదేశపు వ్యక్తిత్వానికీ, విలువలకూ ప్రతీకగా ఉంది. రండి.. మనమంతా కలిసికట్టుగా హిందీ సహా భారతీయ భాషలన్నింటినీ సుసంపన్నం చేస్తూ, వాటిని రాబోయే తరాల వారి చెంతకు సగర్వంగా తీసుకుపోదామనే సంకల్పం చెప్పుకుందాం. ప్రపంచ వేదికపై హిందీకి ఆదరణ అంతకంతకూ పెరుగుతూ ఉండటం మన అందరికీ గర్వకారణమే కాక స్ఫూర్తిదాయకం కూడా’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
आप सभी को हिंदी दिवस की अनंत शुभकामनाएँ। हिंदी केवल संवाद का माध्यम नहीं, बल्कि हमारी पहचान और संस्कारों की जीवंत धरोहर है। इस अवसर पर आइए, हम सब मिलकर हिंदी सहित सभी भारतीय भाषाओं को समृद्ध बनाने और उन्हें आने वाली पीढ़ियों तक गर्व के साथ पहुँचाने का संकल्प लें। विश्व पटल पर…
— Narendra Modi (@narendramodi) September 14, 2025


