నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తుందనీ... సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందిస్తూ, కీలక సంస్కరణలను ముందుకు నడిపిస్తూ, పౌరుల 'జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ అన్ని రంగాల్లో ఆవిష్కరణలకు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా సేవలందిస్తూనే ఉందన్నారు.

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా... ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ అశోక్ కుమార్ లాహిరికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తికాల సభ్యులుగా నియమితులైన శ్రీ రాజీవ్ గౌబా, ప్రొఫెసర్ కె. వి. రాజు, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, ప్రొఫెసర్ అభయ్ కరండికర్, డాక్టర్ ఎం. శ్రీనివాస్‌లకు ఆయన అభినందనలు తెలియజేశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“నీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది. ఇది సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహిస్తూ, సంస్కరణలను ముందుకు తీసుకువెళుతూ, పౌరుల 'జీవన సౌలభ్యాన్ని' పెంపొందిస్తోంది. అన్ని రంగాల్లో ఆవిష్కరణలకు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా నీతి ఆయోగ్ పనిచేస్తోంది.

ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పునర్‌వ్యవస్థీకరించింది. ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ అశోక్ కుమార్ లాహిరి గారికి నా శుభాకాంక్షలు. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా నియమితులైన శ్రీ రాజీవ్ గౌబా గారు, ప్రొఫెసర్ కె. వి. రాజు గారు, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ గారు, ప్రొఫెసర్ అభయ్ కరండికర్ గారు, డాక్టర్ ఎం. శ్రీనివాస్ గార్లకు నా శుభాకాంక్షలు.

వీరంతా ఫలవంతంగా, ప్రభావవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను”

@NITIAayog

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design

Media Coverage

India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 సెప్టెంబర్ 2026
September 08, 2026

Viksit Bharat, Many Engines: Defence, Diplomacy, Growth & Green Power Under PM Modi