ఆసియా పారాగేమ్స్ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో రజత పతక విజేత లలిత కిల్లాకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె పట్టుదల, ప్రదర్శించిన అద్భుత విన్యాసం అబ్బురపరిచాయని ఆయన అభివర్ణించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో లలిత కిల్లాక రజతం సాధించడం మనమంతా గర్వించాల్సిన సందర్భం. మొక్కవోని ఆమె దీక్ష, అసమాన ప్రతిభ ఎంతో ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A moment of pride for India as Lalitha Killaka secures the Silver Medal in the Women's 1500m-T11. Her exceptional performance and steadfast determination are truly commendable. May she keep scaling new heights and achieving more! pic.twitter.com/4YVNH20mRI
— Narendra Modi (@narendramodi) October 25, 2023


