ఆసియా క్రీడల మహిళల 1500 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్న హర్‌మిలన్ బెయిస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“మహిళల 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించినందుకు అభినందనలు. క్రీడలపై ఎనలేని మక్కువ, ఉత్సాహం, దీక్షతో ఆమె ఈ అద్భుత విజయం సాధించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations @HarmilanBains on bringing home the Silver Medal in Women's 1500m event. A spectacular performance marked by unmatched zeal, passion and love for the sport. pic.twitter.com/l565q5dVva
— Narendra Modi (@narendramodi) October 1, 2023


