హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “రాష్ట్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు కొనసాగిస్తోంది” అని శ్రీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొన్నది:
"హర్యానాలోని నూహ్‌లో జరిగిన ప్రమాదం చాలా హృదయ విదారకమైనది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి మనోబలాన్ని ప్రసాదించుగాక. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు కొనసాగిస్తోంది: ప్రధానమంత్రి @narendramodi"
हरियाणा के नूंह में हुआ हादसा अत्यंत हृदयविदारक है। मेरी संवेदनाएं शोक-संतप्त परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार राहत और बचाव के हरसंभव प्रयास में जुटी है: PM…
— PMO India (@PMOIndia) April 26, 2025


