ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రామ్‌దరశ్ మిశ్రా జీ మరణం హిందీ, భోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి అన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రాందరశ్ మిశ్రా మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన మరణం హిందీ, భోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!"
जाने-माने साहित्यकार और शिक्षाविद रामदरश मिश्र जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना हिंदी और भोजपुरी साहित्य के लिए अपूरणीय क्षति है। अपनी लोकप्रिय रचनाओं के लिए वे सदैव याद किए जाएंगे। शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) November 1, 2025


